సర్‌ప్రైజ్‌.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది! | Malayalam actress Kavya madhavan, Dileep tied knock | Sakshi
Sakshi News home page

సర్‌ప్రైజ్‌.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!

Published Fri, Nov 25 2016 12:12 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

సర్‌ప్రైజ్‌.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది! - Sakshi

సర్‌ప్రైజ్‌.. ఆ హీరోహీరోయిన్ల పెళ్లైపోయింది!

అంతులేని ప్రేమకథకు ఎట్టకేలకు శుభంకార్డు పడింది. లివింగ్‌ ‘లైలా- మజ్నూ’లుగా ఇటీవలి కాలంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన హీరోహీరోయిన్లు కావ్యా మాధవన్‌- దిలిప్‌లు ఒక్కఇంటివాళ్లయ్యారు. మలయాళంలో నంబర్‌ వన్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కావ్యా.. అదే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతోన్న దిలిప్‌లు శుక్రవారం వివాహబంధంలోకి ప్రవేశించారు. అతికొద్దిమంది ఆంతరంగికుల సమక్షంలో శుక్రవారం కొచిలోని ఓ హోటల్‌లో ఈ ఇద్దరూ మనువాడారు. కాగా, కావ్యా, దిలిప్‌లు ఇద్దరిరీ ఇది రెండో పెళ్లేకావడం గమనార్హం.

మలయాళ నటి మంజూ వారియర్‌ను 1998లో పెళ్లాడిన దిలిప్‌.. కొన్నేళ్ల కిందటే ఆమెకు విడాకులిచ్చాడు. ఇటు కావ్య.. కెరీర్‌ జోరుమీదున్న సమయంలోనే(2009లో) కువైట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడి.. సంవత్సరం తిరిగేలోపే విడాకులిచ్చింది. గడిచిన కొద్దికాలంగా కావ్యా, దిలిప్‌ల ప్రణయగాథపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వీటిని ఏ దశలోనూ ఖండించని ఆ ఇద్దరూ.. అందరికి సర్‌ప్రైజ్‌ ఇస్తూ పెళ్లిపీటలెక్కారు. కావ్యతో పెళ్లికి దిలీప్‌ కుమార్తె మీనాక్షి కూడా అభ్యంతరపెట్టలేదని, ఆ ఇద్దరూ(కావ్యా, దిలీప్‌లు) కలిసి ఉండటం కంటే సంతోషకరమైన విషయం ఏదీ లేదని నటి మనేకా(నిర్మాత సురేశ్ భార్య) మీడియాతో అన్నారు. కావ్యా దిలిప్‌లు కలిసి ఇప్పటిదాకా 21 సినిమాల్లో జతకట్టారు. వాటిలో మీసమాధవన్, కాసిపట్టణం, పిన్నెయుమ్ తదితర సినిమాలు సూపర్‌హిట్లుగా నిలిచాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement