రేవతి
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీ సమానత్వం కోసం, సురక్షితంగా పనిచేసే వాతావరణం ఏర్పాటు కోసం ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టీవ్ (డబ్లు్యసీసీ)’ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో రేవతి, పార్వతి, రమ్య నింబసేన్, పద్మ ప్రియా ముఖ్య సభ్యులు. తాజాగా ఈ కమిటీ ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)’ అధ్యక్షుడు మోహన్‌లాల్ వైఖరిని ఖండిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. లైంగిక వేధింపుల కేస్ ఉన్న దిలీప్‌ను ఎందుకు కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మలయాళ నటి భావనపై లైంగిక దాడి కేసులో దిలీప్‌ను అరెస్ట్ చేశారు. అప్పుడు అతనికి ‘అమ్మ’ సభ్యత్వం తొలగించారు. మళ్లీ బెయిల్ మీద బయటకు రాగానే ఆ సభ్యత్వం పునరుద్ధరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. బాధితులను సపోర్ట్ చేయకుండా అసోసియేషన్ నిందితులవైపు ఉండటమేంటి? అని ప్రశ్నించారు రేవతి. స్త్రీలను ఇండస్త్రీలో సమానంగా ట్రీట్ చేయాలని ఈ మీటింగ్‌లో కోరారు. ‘‘ఈ పోరాటమంతా భవిష్యత్తులో మహిళలు ఫిల్మ్ ఇండస్ట్రీలో సురక్షితంగా పని చేసుకోవడం కోసం’’ అని పేర్కొన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment