సాక్షి, తిరువనంతపురం : నటి భావన లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కున్న నటుడు దిలీప్ పేరును దర్యాప్తు బృందం మార్చేసింది. తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో దిలీప్‌ను 8వ నిందితుడిగా పేర్కొనటం విశేషం.
ఫిబ్రవరి 17న కొయంబత్తూరులో భావనపై లైంగిక దాడి జరిగిన అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పల్సర్ సునీ, మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరకు వారిచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా నటుడు దిలీప్‌ను జూలై 10న అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. ఆ సమయంలో దిలీప్‌ను ప్రథమ నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.
దాదాపు 80 రోజుల తర్వాత అక్టోబర్ 3న బెయిల్‌పై బయటకు వచ్చిన దిలీప్ షరతులపై సడలింపు కోరుతూ కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దర్యాప్తులో ఈ స్టార్ హీరోకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలేవీ లభించకపోవటంతో ఆయన పేరును 8వ నిందితుడిగా ఇప్పుడు మార్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దిలీప్ పాత్రపై ప్రాధాన్యం తగ్గుతున్న వేళ నెమ్మదిగా కేసు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని భావన తరపు న్యాయవాదులు చెబుతున్నారు.
దిలీప్‌కు అదే పెద్ద సమస్య...
నిందితులు పల్సర్ సునీ, విజీశ్‌లు దిలీప్ పాత్ర గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా.. ఛార్లీ మాత్రం దిలీప్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తుండటంతో పోలీసులు దిలీప్ పేరును ఇప్పట్లో ఛార్జ్ షీట్ నుంచి తొలగించే ఆస్కారం లేకుండా పోయింది. కాగా, ఛార్లీ ఘటన తర్వాత సునీ, విజీశ్‌లకు ఆశ్రయం కల్పించాడు. అంతేకాదు భావనపై జరిపిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను నిందితులు తనకు చూపించారంటూ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment