సేవ్ శక్తి అంటున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ | Actor Varalaxmi launches 'Save Shakti' campaign for women | Sakshi
Sakshi News home page

సేవ్ శక్తి అంటున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Published Fri, Mar 3 2017 2:11 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

సేవ్ శక్తి అంటున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ - Sakshi

సేవ్ శక్తి అంటున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌

నటి భావనపై అత్యాచారయత్న సంఘటన చిత్ర వర్గాలో్లనూ, మహిళలపై ప్రభావం చూపిందనే చెప్పాలి. ముఖ్యంగా కథానాయికల్లో చాలా మంది  అలాంటి అరాచకాలను ఇకపై సాగనీయరాదన్న ధృడ నిర్ణయానికి వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నడుం బిగించారు. అందులో భాగంగా సేవ్‌ శక్తి నినాదంతో మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారికి భద్రత కలిగించే విధంగా అడుగులు వేస్తున్నారు. సేవ్‌శక్తి పేరుతో ఒక సంఘాన్ని ప్రారంభించనున్నారు.

మహిళా దినోత్సవం(మార్చి 8)న స్త్రీల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చెనై్నలో చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ తాను ఇటీవల ఒక ట్వీట్‌ చేశానన్నారు. అందులో ఒక మహిళగా తన భావాన్ని వ్యక్తం చేశానని పేర్కొన్నారు. అందుకు కారణం సమాజంలో మార్పు రావాలన్న ఆకాంక్షేనని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా సమాజంలో మార్పు తీసుకురాకపోతే, ఇక అది కలగానే మిగిలిపోతుందన్నారు. దీనికి తన వంతు ప్రయత్నంగా సేవ్‌శక్తి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళల సంతకాలను సేకరించి వాటిని ప్రభుత్వానికి విన్నపంగా అందించనున్నట్టు తెలిపారు.

దీంతో పాటు రెండు అంశాలతో కూడిన డిమాండ్‌లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నామని చెప్పారు. ప్రతి తాలుకాలో మహిళా కోరు్టను ఏర్పాటు చేసి బాధిత మహిళలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో ఆరు నెలలో్లగా తీర్పు రావాలన్నారు. అప్పుడే లైంగిక వేధింపులకు గురైనవారు ఆ గాయాలను మరచి నూతన భవిష్యతు్తకు బాటలు వేసుకోగలరు. ఈ అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ నెల 8న స్థానిక రాజరత్నం హాలులో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.

అదేం ఘనత కాదు : ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో  మహిళలకు రక్షణ ఎకు్కవే. మహిళలపై అత్యాచారాలు అరుదుగానే జరుగుతున్నాయి. అంతమాత్రాన దీన్ని ఘనతగా చెప్పుకోలేం అన్నారు. అలాంటి దుస్సంఘటనలే జరగకుండా చూసుకోవాలి.

న్యాయవాదులతో చర్చించా : మహిళలపై లైంగిక వేధింపులకు తగిన శిక్షల గురించి ప్రముఖ న్యాయవాదులతో చర్చించా. చట్టంలో లోపాలేమీ లేవు, వాటిని అమలు పరచడంలోనే ఉంది చిక్కంతా అన్నారు.

అన్యాయాన్ని చెప్పుకోలేని పరిస్థితి :   వేధింపులకు గురైన మహిళలు దాని గురించి మాట్లాడకూడదు అనే సమాజంలో మార్పు రావాలి.  అన్యాయాన్ని ఎదిరించి గొంతు విప్పాలి. లేకుంటే స్త్రీలు ఎప్పటికీ ఆట వస్తువుగానే మిగిలిపోతారు. నేను ఈ పోరాటానికి సిద్ధం కావడానికి ఒక ప్రముఖ నటి బాధింపునకు గురవడం కారణం కాదు. ఆమెకు మద్దతుగా నిలవడంతో పాటు, ఇకపై ఏ మహిళ లైంగిక వేధింపులకు గురి కాకూడదు. అప్పటివరకు తన పోరాటం చేస్తా.

స్త్రీ సంఘం ఏర్పాటు : ఇక సినిమాకు చెందిన మహిళల కోసం ఏమి చేయనున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని, ఈ విషయంపై ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య)కు విజ్ఞప్తి చేయనున్నాం. స్త్రీల కోసం ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఆ విన్నపం. అందులో సినీ నటీమణుల నుంచి ఏ శాఖకు చెందిన మహిళలైనా సభ్యులుగా చేరవచ్చు. వారి సమస్యలను ఆ సంఘానికి చెప్పుకుని వెంటనే పరిష్కారం పొందవచ్చు. అయితే ఆ సంఘానికి సినిమాకు చెందిన వారు కాకుండా ఒక విశ్రాంత న్యాయమూర్తి, ఐపీఎస్‌ అధికారి లాంటి వారిని అ«ధ్యక్షుడిగా నియమించాలనుకున్నాం. అప్పుడే బాధితులకు  న్యాయం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement