Hollywood movies
-
ఉత్కంఠ రేపుతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైనల్ ట్రైలర్
‘మ్యాడ్ మ్యాక్స్, ది రెవినాంట్, ఇన్సెప్షన్’ వంటి సినిమాల్లో నటించిన టామ్ హార్డీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డాన్స్’. కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మార్వెల్ సంయుక్తంగా నిర్మించాయి. సోనీ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఇండియాలో ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనుంది. 3డితో పాటు ఐమాక్స్ 3డి వెర్షన్లో అక్టోబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో మహేశ్-రాజమౌళి సినిమా)ఈ సందర్భంగా ఈ చిత్రం ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘‘ఇది నీకు నచ్చకపోవచ్చు... నచ్చదు... నాకు కచ్చితంగా నచ్చదని గ్యారెంటీ ఇస్తున్నాను’, ‘ఆ గ్రహవాసులు మనల్ని కనిపెట్టారు’, ‘దాన్ని ఎవరు పంపించారు... ఆ సృష్టిక్తర’, ‘మీరు కలిసుంటే ఈ ప్రపంచం మనుగడ సాగించలేదు’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘టామ్ హార్డీ నటనతో ΄ాటు వెనమ్ క్యారెక్ట్ చేసే యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ‘వెనమ్’ మొదటి భాగం, రెండవ భాగం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘వెనమ్: ది లాస్ట్ డాన్స్’ పై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆ సినిమా చూడు రూ.82000 గెలుచుకో.. కానీ ఓ ట్విస్ట్
సాధారణంగా మనం వినోదం కోసం డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చూస్తుంటాం. కానీ ఈ సినిమా చూస్తే వాళ్లే డబ్బులు రివర్స్ ఇస్తారట. అది కూడా ఏ వందో.. రెండొందలో కాదు. ఏకంగా 82 వేల రూపాయలు. ఇదేంటి.. సినిమా చూస్తేనే అంత డబ్బు ఎలా ఇస్తారు? అనుకుంటున్నారా?. నిజమే ఊరికే వెళ్లి సినిమా చూస్తే ఇవ్వరు.. వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానం ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటి వరకు తొమ్మిది భాగాల్లో విడుదలై బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక మే 19న ఈ సిరీస్ లో 10వ సినిమాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ X’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ బజ్ అనే ఓ ఇంటర్నేషనల్ వెబ్సైట్ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. (చదవండి: ‘బలగం’వేణుకి బంపరాఫర్.. బాలయ్యతో సినిమా!) ఈ మూవీ చూసి ఓ విషయంలో వాళ్లకు సాయం చేస్తే ఏకంగా 1000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 82,000) ఇస్తామని ప్రకటించింది. ఇంతకీ ప్రైజ్ మనీ గెలవాలంటే ఏం చేయాలంటే.. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ కు సంబంధించి ఇప్పటి వచ్చిన 10 భాగాలను చూడాలి. అందులో ఏ కారు డ్యామేజ్ అయ్యిందో నోట్ చేసి వెబ్‌సైట్‌కు అందజేయాలి. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కంపెనీకి ఎంత ఇన్స్యూరెన్స్ భారం పడుతుందనేది ఆ వెబ్ సైట్ వాళ్లే అంచనా వేస్తారు. (చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్) వారి అంచనాలకు ఎవరు దగ్గరగా ఉంటారో, వారికి 1000 డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. అంతేకాదు, సినిమా టికెట్స్, స్నాక్స్ కోసం మరో 100 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం యూఎస్‌లో ఉన్నవారికే.. అది కూడా 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది. సినిమా విడుదల తేదీ అంటే మే 19 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. విజేతలను మే 26 లోగా ప్రకటించనున్నట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది. -
అది సల్మాన్ రేంజ్ అంటే.. హాలీవుడ్ కూడా సల్లూ భాయ్ ను వాడాల్సిందే
కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. సల్లూ భాయ్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే ఈ మధ్యనే కిసీకా భాయ్.. కిసీకా జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్. కానీ, అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం సల్లూ భాయ్ టైగర్ 3 పనుల్లో బిజీగా ఉన్నాడు. సరే ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ, నిన్నటి నుంచి సల్మాన్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏంటి అంటే.. మార్వెల్ వరల్డ్ లోకి సల్మాన్ ఎంట్రీ ఇస్తున్నాడట.. ఏంటి నిజమా.. హాలీవుడ్ లో సల్మాన్ కనిపిస్తున్నాడా..? అంటే.. అబ్బే కాదండీ.. మార్వెల్ సినిమాకు ప్రమోషన్స్ ఇస్తున్నాడు. (చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు ) ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ కూడా ఇండియన్ సినిమాలపై మక్కువ పెంచేసుకుంది. మన సినిమాలను వాళ్లు ప్రమోట్ చేసినట్టే.. వాళ్ల సినిమాలను మనం ప్రమోట్ చేస్తున్నాం. మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన హిట్ సినిమాల్లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఒకటి. అందులో గ్రూట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఇప్పటికే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ నుంచి రెండు వాల్యూమ్స్ రిలీజ్ అవ్వడం, హిట్ అందుకోవడం జరిగింది. ఇక ముచ్చటగా మూడో వాల్యూమ్ మే 5 న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసమే ఈ సినిమా ప్రమోషన్స్ లోకి సల్మాన్ ఖాన్ ను దింపేశారు. (చదవండి: ‘ది కేరళ స్టోరీ’ వివాదం ఏంటి? సీఎం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ) ప్రమోషన్స్ అంటే.. ఏదో అల్లాటప్పా అనుకునేరు. ఏకంగా ఒక యాడ్ షూట్ నే ప్లాన్ చేశారు. తాజాగా ఈ యాడ్ రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ గా మారింది. ఐ యామ్ గ్రూట్.. ఐ యామ్ గ్రూట్..ఐ యామ్ గ్రూట్.. అంటూ సల్మాన్ గ్రూట్ మాయలో పడి ప్రెస్ మీట్ లో కూడా అలానే మాట్లాడుతూ కనిపించాడు. తన నెక్స్ట్ సినిమా ఏంటీ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఐ యామ్ గ్రూట్.. లాగా ఐ యామ్ సల్మాన్ అని చెప్పుకొచ్చాడు. ఆ ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నలు అన్నింటికి కూడా ఐ యామ్ సల్మాన్ అని చెప్పుకొచ్చాడు. దీంతో సల్మాన్ కు ఏమైంది అని రిపోర్టర్లు అడుగుతుండగా.. మే 5 వరకు ఆగండి .. తెలుస్తుంది అంటూ సల్మాన్ టీ షర్ట్ పై గ్రూట్ బొమ్మను చూపించారు. ఇక ఈ యాడ్ ను చూసిన అభిమానులు.. అది సల్లూ భాయ్ రేంజ్ అంటే.. బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా సల్లూ భాయ్ ను వాడకపోతే పని ఎవ్వడు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కండల వీరుడు చేసిన ప్రమోషన్స్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. View this post on Instagram A post shared by Marvel India (@marvel_india) -
చెర్రీకి పోటీగా ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మారింది!
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇమేజ్ మారిపోయింది. ఇద్దరు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను దాటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నారు. ఇక హాలీవుడ్ లో వీరిద్దరి క్రేజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అయింది. వీళ్లిద్దరి తో హాలీవుడ్ సినిమాలు తీసేందుకు అక్కడ మేకర్స్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నట్లు రామ్ చరణ్ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఎన్టీఆర్ కూడా ఓ పాన్ వరల్డ్ మూవీ స్కేచ్ వేసినట్లు తెలిసింది. రామ్ చరణ్, తారక్ ఇద్దరు మంచి ప్రెండ్స్...ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అయితే కెరీర్ విషయంలో మాత్రం ఇద్దరు పోటీపడుతున్నట్లుగానే అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ఫినిషింగ్ లో ఉన్నప్పుడే శంకర్ తో ఆర్.సి.15 అనౌన్స్ చేశాడు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్.సి.16 లైన్ లో ఉంది. అలాగే కన్నడ డైరెక్టర్ నర్తన్, లోకేష్ కనగరాజ్, సుకుమార్ రామ్ చరణ్ కి టచ్ లోనే ఉన్నారు. తన చేతిలోని సినిమాలు పూర్తి చేసి హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రామ్ చరణ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడు . ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏది సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక మార్చి 23న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ జరగనుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సంవత్సర కాలం ఎదురుచూస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా వాటర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టి ఉంచాడు. ప్రశాంత్ సలార్ కంప్లీట్ కాగానే...అక్టోబర్ లో ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించిన తర్వాత...ప్రశాంత్ నీల్ ప్లాన్ మారింది. ఎన్టీఆర్ తో తెరకెక్కించాలనుకున్న పాన్ ఇండియా మూవీని...పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడట. ఎన్టీఆర్ అమెరికా టూర్ లో ఉన్నప్పుడు హాలీవుడ్ ఎంట్రీ గురించి న్యూస్ వచ్చినా..ఆ తర్వాత ఎన్టీఆర్ ఎక్కడా హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడలేదు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం భారీ యాక్షన్ డ్రామా ప్లాన్ చేసిన ఎన్టీఆర్ మూవీని హాలీవుడ్ టార్గెట్ గా ఇంగ్లీష్ లో కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఎన్టీఆర్ 31 కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని, హాలీవుడ్ యాక్టర్స్‌ని రంగంలోకి దింపుతాడనే మాట పిల్మ్ సర్కిల్స్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. తన కెరీర్ లోనే ఎన్టీఆర్ తో బెస్ట్ మూవీ తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్ కి వచ్చిన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ రేంజ్ లో కూడా సత్తా చాటే విధంగా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేలా స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాడట. ఈ విషయం తెలియటంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నారు. -
హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే
సియోల్: హాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కఠిన చర్యలను ప్రకటించారు. పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని ఆరు నెలలపాటు నిర్బంధ లేబర్ క్యాపులకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సదరు పిల్లలు ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవాల్సి ఉంటుందని కూడా ప్రకటించారని మిర్రర్ పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వారిని గట్టి హెచ్చరికలతో వదిలేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇన్మిబన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్ తెలిపింది. అంటే ప్రతి ఒక్కరూ తమ పక్క ఇళ్లలో ఏం జరిగే వాటిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. డ్యాన్సులు, పాటలు పాడటం, మాట్లాడటంపైనా కిమ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. -
Children's Day 2022: పిల్లలు తప్పక చూడాల్సిన సినిమాలివే
పిల్లలు చదవాల్సిన కథలే కాదు.. చూడాల్సిన సినిమాలూ ఉన్నాయి. ప్రపంచంలోని పలు భాషల్లో అవి తెరకెక్కుతూనే ఉన్నాయి. అలాంటి వాటిల్లో కాలం, భాషా భేదం లేని.. తప్పక చూడాల్సిన కొన్ని సినిమాల గురించి ఇక్కడ బ్రీఫ్‌గా.. (బాలల దినోత్సవం(నంవబర్ 14) సందర్భంగా) బ్యాగ్ ఆఫ్ రైస్ (ఇరాన్ మూవీ) విడుదలైన సంవత్సరం: 1996, నిడివి: 80 ని.లు. దర్శకుడు: మహ్మద్ అలీ తలేబీ కథా రచయితలు: హోషంగ్ మొరాదీ కెర్మానీ, మహ్మద్ అలీ తలేబీ జైరాన్ అనే ఆరేళ్లపాప.. వాళ్లింటికి ఎదురుగా ఉండే ఓ డెబ్బై ఏళ్ల మామ్మ చుట్టూ తిరిగే కథ ఇది. చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయాలనేది ఈ సినిమా సారాంశం. చేయూతను అందించాలనే మనసు.. కలిమి– లేమి, కష్టం – సుఖం, బాల్యం – వృద్ధాప్యం వంటి మిషలేమీ పెట్టుకోదని.. సేవే మనిషి గుణమని చూపిస్తుందీ చిత్రం. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. బారీ థేకే పాలియే (బెంగాలీ) విడుదలైన సంవత్సరం: 1958, నిడివి: 113ని.లు. కథ: శివరామ్ చక్రవర్తి దర్శకత్వం: రిత్విక్ ఘటక్ ప్రిన్సిపల్ అయిన తండ్రి కఠిన క్రమశిక్షణకు భయపడి ఎనిమిదేళ్ల కంచన్ అనే పిల్లాడు.. తనుంటున్న పల్లెటూరు నుంచి మహానగరమైన కలకత్తాకు పారిపోతాడు. అక్కడ రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులతో కలకత్తా నగర జీవితం అతనికి అనుభవంలోకి రావడమే బారీ థేకే పాలియే! కథా కాలం 1958. నాటి కలకత్తాను కళ్లకు కడుతుందీ చిత్రం. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. లునానా ఎ యాక్ ఇన్ ద క్లాస్రూమ్ (భూటాన్) విడుదలైన సంవత్సరం: 2019, నిడివి: 109ని.లు. కథ, దర్శకత్వం: పావో చోయినింగ్ దోర్జీ ఉగ్యాన్ అనే కాంట్రాక్ట్ టీచర్.. ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ సింగర్‌గా స్థిరపడాలను కుంటాడు. అయిదేళ్ల ఆ కంట్రాక్ట్లోని చివరి సంవత్సరం అతనికి భూటాన్‌లోని కుగ్రామమైన ‘లునానా’కు బదిలీ అవుతుంది. కనీసం కరెంట్ కూడా లేని ఆ ఊళ్లో ఒక్క క్షణం కూడా ఉండలేనని మూడు రోజుల్లోనే తిరుగు టపా కావాలనుకుంటాడు. కానీ అక్కడి విద్యార్థుల శ్రద్ధాసక్తులు, ఆ గ్రామప్రజల గౌరవభక్తులు అతణ్ణి కట్టిపడేస్తాయి. ఆ ఏడాదీ పూర్తిచేసుకుని తాను కోరుకున్నట్టే ఆస్ట్రేలియా వెళ్లి సింగర్‌గా స్థిరపడ్తాడు. అక్కడ లునానా జ్ఞాపకాలే వెంటాడుతుంటాయి. ఆ ఊళ్లో నేర్చుకున్న జానపద గీతాలతోనే శ్రోతలను అలరిస్తుంటాడు. మాతృభూమి మట్టి పరిమళాలను పంచుతుంటాడు. ఇదీ ఈ సినిమా కథ క్లుప్తంగా! ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ది బాయ్ ఇన్ ది స్ట్రైప్డ్ పైజామాస్ (అమెరికా) విడుదలైన సంవత్సరం: 2008, నిడివి: 94ని.లు. కథ: జాన్ బాయ్నే, దర్శకత్వం: మార్క్ హెర్మన్ హిట్లర్ జాత్యహంకారానికి సమిధలైన ఇద్దరు చిన్నారి స్నేహితుల కథ ఇది. నాజీ సైనికాధికారి కొడుకు బ్రూనో, యూదు బానిస కొడుకు షూమెల్ల మధ్య స్నేహం కుదురుతుంది. మంచి స్నేహితులుగా మారుతారు. ఉన్నట్టుండి ఒకసారి షూమెల్ తండ్రి కనిపించకుండా పోతాడు. అతడిని వెదికే క్రమంలో బ్రూనో, షూమేల్ ఇద్దరూ నాజీలు నిర్వహిస్తున్న యూదుల కాన్సన్ట్రేషన్ క్యాంప్‌కి వెళ్తారు. అక్కడ విషవాయువుకి ఇద్దరూ బలి అవుతారు. మనసు పిండేసే ఈ సినిమా కథా కాలం రెండవ ప్రపంచ యుద్ధం నాటిది. జాన్ బాయ్నే రాసిన ‘ద బాయ్ ఇన్ ద స్ట్రైప్డ్ పైజామాస్’ ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. బెకాస్ (ఇరాక్) విడుదలైన సంవత్సరం : 2012, నిడివి : 90 నిమిషాలు కథ, దర్శకత్వం: కర్జాన్ కాదర్ యుద్ధంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ధన, జన అనే ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. కథాకాలం 1990. బూట్ పాలిష్ చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఈ ఇద్దరు తోబుట్టువులు ఒకసారి సూపర్‌మ్యాన్ సినిమా చూస్తారు. ఆ సూపర్మ్యాన్కి వీరాభిమానులైపోతారు. ఎలాగైనా ఆ సూపర్‌మ్యాన్‌ని కలవాలని ఆరాటపడ్తారు. అతను అమెరికాలో ఉంటాడని తెలుసుకుని అమెరికా వెళ్లాలనుకుంటారు. ఆ ప్రయాణం కోసం వాళ్లు చేసే ప్రయత్నాలే ఈ సినిమా. చివరకు వాళ్ల సాహసాన్ని వాళ్లే గ్రహించి సూపర్‌మ్యాన్ ఎక్కడో లేడు.. తమలోనే ఉన్నాడని తెలుసుకుంటారు. సమస్యలకు ఎదురీది బతుకున్న ధైర్యమే ఎవరినైనా సూపర్‌మ్యాన్‌గా నిలబెడుతుందని అర్థం చేసుకుంటారు. అమెరికా ప్రయాణం రద్దుచేసుకుంటారు. కుర్దిష్ భాషలో తీసిన ఈ సినిమాకు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. పైవాటితోపాటు వీలైనప్పుడు ‘వై వజ్ ఐ బార్న్’ , ‘ది స్పిరిట్ ఆఫ్ ది బీహైవ్’, ‘ది బ్లాక్ స్టాలియన్’, ‘సన్ చిల్డ్రన్’, ‘ఐ వజ్ బార్న్’, ‘బట్’, ‘సడాకో అండ్ ది థౌజెండ్ పేపర్ క్రేన్స్’, ‘పోస్ట్‌మెన్ ఇన్ ది మౌంటెన్స్’, ‘రన్ బాయ్ రన్’, ‘చూరీ’ వంటి చిత్రాలనూ చూడండి. -
మళ్లీ రానున్న 'జోకర్'.. అతనికి ప్రేయసిగా పాపులర్ సింగర్!
Lady Gaga As Harley Quinn In Joaquin Phoenix Joker 2: జోకర్.. 2008లో వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ 'బ్యాట్‌మేన్: ది డార్క్ నైట్' సినిమాతో ఎంతో పాపులర్ అయ్యాడు. అందులో విలన్‌గా అలరించిన జోకర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ పాత్రకున్న క్రేజ్ చూసిన దర్శకనిర్మాతలు 2019లో 'జోకర్' సినిమా తెరకెక్కించారు. జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో అలరించిన ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా 1.07 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా అనేక ఇంటర్నేషన్ల్ అవార్డులను కూడా అందుకుంది. ఈ మూవీలో జోకర్‌గా నటించిన జోక్విన్ ఫీనిక్స్కు ఉత్తమ నటుడిగా ఆస్కార్ రావడం విశేషం. అయితే ఈ జోకర్ మళ్లీ రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్' తెరకెక్కుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన టాడ్ ఫిలిప్స్ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను 2024 అక్టోబర్ 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అయితే 'జోకర్'కు పూర్తి భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సీక్వెల్లో హార్లే క్విన్ అనే కీలక పాత్రలో అమెరికన్ పాపులర్ సింగర్ లేడీ గాగా అలరించనుంది. Joker: Folie à Deux 10.04.24 pic.twitter.com/obp7T9lBFL — Lady Gaga (@ladygaga) August 4, 2022 కాగా 2016లో వచ్చిన డిస్నీ సినిమాటిక్ ఎక్స్టెండ్ యూనివర్స్ (డీసీఈయూ) మూవీ 'సూసైడ్ స్క్వాడ్'లో హార్లే క్విన్‌గా మార్గోట్ రోబీ పరిచయమైంది. ఇందులో జోకర్‌కు ప్రేయసిగా హార్లే క్వీన్ పాత్ర ఉంటుంది. తర్వాత వచ్చిన డీసీ సిరీస్‌లోని బర్డ్స్ ఆఫ్ ప్రే, ది సూసైడ్ స్క్వాడ్ చిత్రాల్లో హార్లే క్వీన్‌గా మార్గోట్ రోబీ అదరగొట్టింది. మరీ ఇప్పుడు వస్తున్న సీక్వెల్ మూవీ 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్'లో లేడీ గాగాను జోకర్‌కు ప్రేయసిగా చూపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్
Samantha Reacts To Christian Bale Gorr Look In Thor Love And Thunder: స్టార్ హీరోయిన్ సమంత ఓ పక్క చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. మరోపక్క సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్ చేస్తూ మోటివేషనల్ కొటేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సామ్ పెట్టిన స్టోరీ ఆసక్తి కలిగించింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 'థోర్' సిరీస్ నాలుగో మూవీ 'థోర్: లవ్ అండ్ థండర్' సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తైకా వైటిటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన సామ్ తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో 'డెడ్' అని రాస్తూ ఫైర్ ఎమోజీస్ను పెట్టి థోర్ సినిమా పోస్టర్‌ను షేర్ చేసింది. అయితే తర్వాత కొద్దిసేపటికి సామ్ స్టోరీలో ఆ పోస్టర్ కనిపించట్లేదు. దానికి బదులు 'థోర్: లవ్ అండ్ థండర్'లో సూపర్ విలన్‌గా నటిస్తున్న క్రిస్టియన్ బాలే లుక్‌ను షేర్ చేస్తూ 'ది గాడ్ ఆఫ్ యాక్టింగ్' అని రాసింది. ఈ పోస్ట్‌లు చూస్తుంటే సమంత కూడా ఈ సూపర్ హీరో సినిమాలకు విపరీతమైన అభిమానిగా తెలుస్తోంది. అయితే ఇందులో విలన్‌గా నటిస్తున్న క్రిస్టియన్ బాలే 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్' చిత్రాల్లో బ్యాట్ మ్యాన్‌గా అదరగొట్టాడు. ప్రస్తుతం థోర్లో బాలే విలన్‌గా చేయడం, నటాలియా పోర్ట్మన్ లేడీ థోర్‌గా మారడంతో మూవీపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక ఈ మూవీ గురించి డైరెక్టర్ తైకా వైటిటి 'నేను చేసిన అత్యంత క్రేజీ థింగ్' అని చెప్పుకొచ్చాడు. -
ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా !
James Cameron Avatar 2 Movie Release: అవతార్.. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ ఈ సినిమా. హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ఒక సరికొత్త ఊహ ప్రపంచంలో విహరించేలా చేసింది ఈ మూవీ. పండోరా లోకం, అక్కడి మనుషులు, ఆ వింత గుర్రాలు, వాటితో హీరో చేసే సాహసాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ సినిమా అనేక అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అవతార్ 2' తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ను 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' సినిమా ప్రదర్శించే థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఆడియెన్స్ వరల్డ్‌ను ఆశ్చర్యపరిచేలా ఉంది. అవతార్ 2 డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా ఏకంగా 160 భాషల్లో (Avatar 2 Movie Release In 160 Languages). అవును. అవతార్ 2 సినిమాను సుమారు 160 భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఒకవేళ ఇదే జరిగితే సినీ చరిత్రలోనే ఇది రికార్డ్‌గా నెలకొల్పనుంది. అలాగే త్రీడీ, 4కె, 5కె, 8కె వీడియో ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా బుధవారం (ఏప్రిల్ 27) ఈ సినిమా గ్లింప్స్‌ను 'సినిమా కాన్'లో ప్రీమియర్‌గా ప్రదర్శించానున్నారని టాక్. చదవండి: ప్రేక్షకులకు కనువిందు.. ఆ సినిమాతో 'అవతార్ 2' ట్రైలర్ ! ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'లేడీ థోర్' వచ్చేసింది.. ఆసక్తిగా 'థోర్: లవ్ అండ్ థండర్' టీజర్
Chris HemsworthThor Love And Thunder Teaser Released: మార్వెల్ సినిమాటిక్ యూనివర్సిటీ (ఎమ్‌సీయూ) నుంచి వచ్చిన చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. మార్వెల్ నుంచి వచ్చిన సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ ఎదురుచూపులను పటాపంచలు చేస్తూ క్రిస్ హేమ్స్‌వర్త్ నటించిన 'థోర్: లవ్ అండ్ థండర్' సినిమా అప్డేట్ను ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. థోర్ సిరీస్‌లో నాలుగో చిత్రంగా ఈ మూవీ రానుంది. టీజర్ విడుదల చేసి మూవీ ప్రియులకు మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రానికి అంతకుముందు వచ్చిన 'థోర్: రాగ్నరోక్' డైరెక్టర్, ఆస్కార్ విజేత తైకా వైటిటి దర్శకత్వ వహించారు. ఈ మూవీ కథ 'ది అవేంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత నుంచి కొనసాగడం టీజర్లో చూపించారు. థోర్ (క్రిస్ హేమ్స్‌వర్త్) గార్డియన్స్ అయిన పీటర్ క్విల్ (క్రిస్ ప్రాట్), అతని బృందంతో నివసిస్తుంటాడు. గాడ్ ఆఫ్ థండర్ కవచాన్ని వదిలేసి మళ్లీ ఎప్పటిలా తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. తర్వాత థోర్ ఎప్పుడూ ఎదుర్కోలేని సంఘటనలు ఫేస్ చేసినట్లు చూపించారు. అలాగే ఇందులో థోర్ మాజీ ప్రేయసీ జేన్ ఫోస్టర్ (నటాలీ పోర్ట్మన్) లేడీ థోర్‌గా అలరించనుంది. ఇందులో 'ది డార్క్ నైట్' హీరో క్రిస్టియన్ బాలే కూడా ఉండటం విశేషం. టీజర్లో మూవీకి సంబంధించిన క్లూలను వదిలి చిత్రంపై అనేక అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ మూవీ ఇండియాలో జూలై 8న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హాలీవుడ్‌కి హాయ్
-
హాలీవుడ్‌కు హాయ్ చెబుతున్న ఇండియన్ తారలు
భారతదేశ సినిమా రేంజ్ మాత్రమే కాదు.. ఇండియన్ తారల స్థాయి కూడా హాలీవుడ్ రేంజ్‌కు చేరుతోంది. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న భారతీయ తారల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకొణె, ఈ మధ్య హ్యూమా ఖురేషీ, డింపుల్ కపాడియా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, అలీ ఫాజల్ తదితరులు హాలీవుడ్ తెరపై కనిపించారు. ఇక ఇండియన్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హాలీవుడ్ కోడలయ్యాక వరుసగా అక్కడి సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. తాజాగా ‘హాలీవుడ్‌కి హాయ్’ చెబుతున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ఇండియాలో యాక్టర్‌గా ధనుష్ రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఉత్తమ నటుడిగా ధనుష్ ఖాతాలో జాతీయ అవార్డులు ఉన్నాయి. ఇప్పుడు ధనుష్ ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో కనబడనుంది. ‘ది గ్రే మ్యాన్’ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీసును షేక్ చేసిన ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి సినిమాలను తెరకెక్కించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ‘ది గ్రే మ్యాన్’కు దర్శకులు. ఇంగ్లీష్ యాక్టర్స్ ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్లతో కలిసి ధనుష్ ఈ చిత్రంలో నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో ధనుష్ పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందనే వార్తలు వచ్చాయి. మరి.. ఈ వార్తలు నిజమైతే ధనుష్ ఎంట్రీ హాలీవుడ్లో విలన్‌గానే ఉంటుందా? చూడాలి. ఈ చిత్రం ఈ ఏడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత ఓ సినిమా కోసం ఆ మధ్య ఆడిషన్స్ ఇచ్చారు. పైగా ‘ఇది చాలా ప్రత్యేకమైన ఆడిషన్స్’ అని ఆమె పేర్కొన్నారు కూడా. ఈ సమ్‌థింగ్ స్పెషల్ ఆడిషన్స్ హాలీవుడ్ ఎంట్రీ కోసమే అని ఊహించవచ్చు. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో రూపొందనున్న ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’లో సమంత ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాకు సునీత తాటి ఓ నిర్మాత. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానున్నట్లు తెలిసింది. ఇక సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీస్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు శోభితా దూళిపాళ్ల. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ తన ప్రతిభను చాటుకోవాలనుకున్నారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ నటుడు దేవ్ పటేల్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఇంగ్లీష్ ఫిల్మ్ ‘మంకీ మ్యాన్’లో ఓ లీడ్ క్యారెక్టర్ చేశారు శోభిత. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌కు ఈ ఏడాది బాగా కలిసి వస్తున్నట్లుగా ఉంది. తెలుగులో ఆలియా చేసిన తొలి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఏడాదే విడుదల కానుంది. అలాగే ఆలియా నిర్మాతగా మారి హిందీలో నిర్మించిన ‘డార్లింగ్’ చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటికి తోడు ఆలియా హాలీవుడ్ ఎంట్రీ కూడా ఈ ఏడాదే ఖరారయింది. టామ్ హార్పర్ దర్శకత్వంలో రూపొందనున్న ఇంటర్నేషనల్ స్పై డ్రామా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో ఆలియా ప్రధాన పాత్రలో నటించనున్నారు. హాలీ వుడ్ నటీనటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య తారలు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే ఇప్పటివరకూ హాలీవుడ్ తెరపై అతిథి పాత్రల్లో కనిపించిన సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి ఇప్పుడు పూర్తి స్థాయి పాత్రల్లో హాలీవుడ్లో సినిమాలు చేస్తున్నారు. మరి.. భవిష్యత్‌లో ఇంకెంతమంది ఇండియన్ స్టార్స్ హాలీవుడ్‌కి వెళతారో చూడాలి. -
ఫిబ్రవరి చివరి వారంలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే!
కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో సినిమాలు ఆడక సినీప్రియులు తీవ్ర నిరాశ చెందారు. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చిన్నాపెద్ద సినిమాలన్నీ వరుసపెట్టి రిలీజవుతున్నాయి. సినీప్రియుల దాహాన్ని తీర్చేందుకు సిద్ధమంటున్నాయి. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమా కూడా హిట్ అవుతుండగా పస లేకుంటే పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్‌కు వెళ్లడం కష్టం అనుకునేవాళ్లకోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉండనే ఉంది. మరి ఫిబ్రవరి నాలుగో వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజవుతున్నాయో చూసేయండి.. థియేటర్లో విడుదలవుతున్న చిత్రాలు ► వలిమై - ఫిబ్రవరి 24 ► భీమ్లా నాయక్ - ఫిబ్రవరి 25 ► గంగూబాయి కథియావాడి - ఫిబ్రవరి 25 ఓటీటీలో వస్తున్న మూవీస్.. ఆహా ► సెహరి - ఫిబ్రవరి 25 అమెజాన్ ప్రైమ్ వీడియో ► ద ప్రోటేష్ - ఫిబ్రవరి 25 జీ 5 ► లవ్ హాస్టల్- ఫిబ్రవరి 25 నెట్‌ఫ్లిక్స్ ► సోషల్ మ్యాన్ - ఫిబ్రవరి 24 ► ద ఫేమ్ గేమ్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 25 ► జువైనల్ జస్టిస్ (కొరియన్ వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25 ► ఎ మాడియా హోమ్ కమింగ్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25 ► వైకింగ్స్: వాల్హాల (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25 ► బ్యాక్ టు 15 - ఫిబ్రవరి 25 హాట్‌స్టార్ ► స్టార్స్ వార్స్ ఒబీ- వాన్ కెనోబి (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25 సోని లివ్ ► అజగజాంతరం - ఫిబ్రవరి 25 ► ఎ డిస్కవరీ ఆఫ్ విచెస్ - ఫిబ్రవరి 25 ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ ► లాకప్ షో- ఫిబ్రవరి 27 వూట్ ► సూపర్ పంప్డ్ - ఫిబ్రవరి 28 -
రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు..
Top 10 Most Viewed Netflix Movies In One Month: విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను చూడాలనుకునే మూవీ లవర్స్‌కు, ఆడియెన్స్‌కు ఓటీటీలు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకున్న ఓటీటీ దిగ్గజ సంస్థలు డిఫరెంట్ కథలతో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చిత్రీకరిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. ఈ సంస్థ విభిన్నమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఎప్పుడూ సరికొత్త హంగులతో ఆడియెన్స్‌కు బోర్ కొట్టించకుండా కొత్తదనంలో ఆకట్టుకుంటోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ రూపొందించిన అనేక చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రేమికులను అలరించాయి. అందులో విడుదలైన మొదటి నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఈ టాప్ 10 మూవీస్ సినీ లవర్స్ కోసం అందిస్తున్నాం. ఇక ఒక్కో చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి మరి. 1. రెడ్ నోటీస్- 129 మిలియన్ వ్యూస్ (4 నవంబర్ 2021) 2. ఎక్స్ట్రాక్షన్- 99 మిలియన్ వ్యూస్ (24 ఏప్రిల్ 2020) 3. బర్డ్ బాక్స్- 89 మిలియన్ వ్యూస్ (14 డిసెంబర్ 2018) 4. స్పెన్సర్ కాన్ఫిడెన్షియల్- 85 మిలియన్ వ్యూస్ (6 మార్చి 2020) 5. 6 అండర్ గ్రౌండ్- 83 మిలియన్ వ్యూస్ (10 డిసెంబర్ 2019) 6. మర్డర్ మిస్టరీ- 83 మిలియన్ వ్యూస్ (14 జూన్ 2019) 7. ది ఓల్డ్ గార్డ్- 78 మిలియన్ వ్యూస్ (10 జూలై 2020) 8. ఎనోలా హోమ్స్- 76 మిలియన్ వ్యూస్ (23 సెప్టెంబర్ 2020) 9. ప్రాజెక్ట్ పవర్- 75 మిలియన్ వ్యూస్ (14 ఆగస్టు 2020) 10. ఆర్మీ ఆఫ్ ది డెడ్- 75 మిలియన్ వ్యూస్ (21 మార్చి 2021) -
ఆ యాక్షన్ చిత్రాల ఫ్యాన్స్‌కు నిరాశే.. మళ్లీ వాయిదా
ప్రేక్షకులను అద్భుతంగా అలరించే హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఒకటి. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ హీరోగా నటించే ఈ ఫ్రాంచైజీకి క్రేజ్ ఎక్కువే. ఈ సినిమాల్లో టామ్ చేసే యాక్షన్ సీక్వెన్స్, సాహసాలు ఆడియెన్స్‌ను సీటుకు కట్టిపడేస్తాయి. ఇక ఈథన్ హంట్ (సిరీస్‌లో టామ్ క్రూజ్ పాత్ర పేరు) తరచుగా మార్చే గెటప్పులు ఆహా అనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఫ్రాంచైజీలోని ప్రతినాయకుల విలనిజం, హీరోయిన్లు గ్లామర్ అదనపు ఆకర్షణ. అయితే ఇంతగా అలరించే ఈ సిరీస్‌లో వచ్చే సినిమాలు మళ్లీ వాయిదా పడి అభిమానులకు నిరాశకు గురిచేశారు. (చదవండి: అత్యధిక నిడివి ఉన్న చిత్రం ఇదేనట !.. భారీగా అంచనాలు) ఈ సిరీస్‌లో ఇదివరకు 6 సినిమాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇప్పుడు కొత్తగా 7, 8 సినిమాలు వరుస పెట్టి రానున్న సంగతి తెలిసిందే. మిషన్ ఇంపాజిబుల్ 7వ సినిమాను సెప్టెంబర్ 2022లో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత జూలై 2023లో ఎనిమిదవ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కొవిడ్ కారణంగా ఈ సినిమాలు మరింత ఆలస్యం కానున్నాయి. ఈ విషయాన్ని పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ నిర్మాణ సంస్థలు శుక్రవారం (జనవరి 21) ఒక ప్రకటనలో తెలిపాయి. (చదవండి: 'స్క్విడ్ గేమ్' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్ ?) అనేక పరిశీలనల తర్వాత ఆలోచించుకుని కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సినిమాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సిరీస్‌లోని 7వ చిత్రాన్ని జూలై 14, 2023న, 8వ మూవీని జూన్ 28, 2024న విడుదల చేయనున్నట్లు వెల్లడించాయి. ఇక ఈ సినిమాలు ఆ తేదీల్లో విడుదలవుతాయో లేదా కరోనా కారణంగా ఇంకా వాయిదా పడతాయో చూడాలి. (చదవండి: ఆస్కార్ బరిలో 'నో టైమ్ టు డై'.. 4 విభాగాలకు నామినేట్) -
రీమేక్‌గా హాలీవుడ్ క్లాసిక్ చిత్రం.. విడుదల ఎప్పుడంటే ?
The Ten Commandments Movie Released on December 31: ప్రపంచ సినీ చరిత్రలో ది టెన్ కమాండ్మెంట్స్ చిత్రానిది ప్రత్యేక స్థానం (క్లాసిక్ చిత్రం). 1956లో విడుదలై ఈ చిత్రం ఒక విజువల్ వండర్. సెసిల్ బి డెమిల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిడివి 220 నిమిషాలు. ఈ చిత్రం అప్పుడు ఇండియాలోని ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్. బెంగళూరు, చైన్నై వంటి నగరాల్లో 50 వారాలకు పైగా ప్రదర్శితమైంది. సుమారు 65 సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని అదే పేరుతో రీమెక్ చేయనున్నారు. ఈ చిత్రంలో మిషన్ ఇంపాజిబుల్ 2, బాట్ ఉమెన్ సినిమాలతో గుర్తింపు పొందిన డౌగ్రే స్కాట్ ఇందులో మోసెస్ పాత్రలో నటించారు. ఇంకా ఇందులో ఆరోన్‌గా లినస్ రోచ్, మెనెరిత్‌గా నవీన్ ఆండ్రూస్, జిప్పోరాగా మియా మాస్ట్రో, రామ్ సెస్‌గా పాల్ రైస్, ఆనందర్గా రిచర్డ్ ఓబ్రెయిన్ యాక్ట్ చేశారు. రాబర్ట్ డోర్న్ హెల్మ్, జెఫ్రీ మడేజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు
4 MCU Movies In Oscar Shortlist Under Visual Effects Category: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) హాలీవుడల్ చిత్రాల నిర్మాణ సంస్థ అంటే అంతగా అందరికి తెలియకపోవచ్చు. కానీ ఐరన్ మ్యాన్ సిరీస్, కెప్టెన్ అమెరికా, ది అవెంజర్స్, ఎండ్ గేమ్ చిత్రాలంటే మాత్రం తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి ఈ సినిమాలు. అయితే ఈ సినిమాలన్నింటిన్నీ నిర్మించిందే మార్వెల్ సంస్థ. హై బడ్జెట్లో విజువల్ వండర్స్‌తో అద్భుతాలు సృష్టించడంలో ఎక్కడా రాజీ పడలేదు ఈ సంస్థ. తాజాగా ఈ సంస్థ నిర్మించిన సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' డిసెంబర్ 16 (ఇండియాలో)న విడుదలై కలెక్షెన్లతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఆ జాబితాలో విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి. ఈ జాబితా ప్రకారం మార్వెల్ చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉన్న 4 సినిమాలు మార్వెల్ సంస్థ నిర్మించినవే. ఈ కేటగిరీలో మొత్తంగా షార్ట్ లిస్ట్ చేసిన 10 చిత్రాల్లో ఏకంగా 4 సినిమాలు మార్వెల్ సంస్థకు సంబంధించినవి ఉండటం విశేషం. అవి 1. బ్లాక్ విడో 2. ఎటర్నల్స్ 3. షాంగ్ చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ 4. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో తనకు తానే పోటీ పడనుంది మార్వెల్ సంస్థ. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 అయితే ఇప్పటివరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆస్కార్ పొందిన చిత్రం 'బ్లాక్ పాంథర్' ఒక్కటే. 2018లో వచ్చిన ఈ సినిమా మూడు ఆస్కార్లను గెలుచుకుంది. రేన్ కూగ్లర్ తెరకెక్కించిన ఈ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్‌ను చేజిక్కిచ్చుకుంది. సాంకేతిక విభాగంలో 2010 సంవత్సరానికి గాను ఐరన్ మ్యాన్ 2, 2012కు గాను ది అవేంజర్స్ సినిమాలు అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 2014కు సంవత్సరానికి గాను ఎంసీయూ చిత్రం 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ', 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్' సినిమాలు చివరిసారిగా నామినేట్ అయ్యాయి. మరీ ఈసారి విజువల్ ఎఫెక్ట్స్‌కు నామినేట్ అయిన మార్వెల్ 4 చిత్రాలు ఆస్కార్‌ను సాధిస్తాయో చూడాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ఇదీ చదవండి: ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే.. -
ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే..
94th Oscar Awards Announced Shortlists Of 10 Categories: సినిమాల్లో నటీనటులకు మంచి గుర్తింపు వచ్చేది వారి యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయినప్పుడు. లేదా సినిమాలు భారీగా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు. వీటితోపాటు నటీనటులను పలు అవార్డులు వరించినప్పుడు. అలా సినిమా అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది 'ఆస్కార్'. ప్రతీ నటుడు, నటికి ఈ అవార్డు ఒక కలగా ఉంటుంది. అలాంటి ఆస్కార్ అవార్డుల మహోత్సవం త్వరలో జరగనుంది. ఈసారి నిర్వహించే 94వ అకాడమీ అవార్డులను ఫిబ్రవరి 1, 2022న ప్రకటించనున్నారు. అయితే ఈ అవార్డుల కోసం 10 విభాగాల వరకు కుదించారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తుది జాబితాను ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఈ తుది జాబితా ఎంపికైన చిత్రాలకు జనవరి 27, 2022 గురువారం నుంచి ఫిబ్రవరి 1, 2022 మంగళవారం వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. 1. ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) 94వ అకాడమీ అవార్డుల కోసం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో 15 సినిమాలు తుది జాబితాలో ఉన్నాయి. ఈ కేటగిరీలో 138 సినిమాలు అర్హత సాధించాయి. ఈ షార్ట్ లిస్ట్, నామినీలను డాక్యుమెంటరీకి సంబంధించిన బ్రాంచ్ సభ్యులు నిర్ణయిస్తారు. 2. ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) ఈ కేటగిరీలో మొత్తం 82 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 3. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఈ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 92 దేశాలకు చెందిన సినిమాలు అర్హత సాధించాయి. అందులో భారతదేశం నుంచి ఎంపికైన హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి నిర్మించిన కూళాంగల్ (అంతర్జాతీయంగా సినిమా పేరు 'పెబుల్స్') ఒకటి. తుదిజాబితాకు 15 సినిమాలు వెళ్లగా.. అందులో కూళాంగల్కు స్థానం దక్కలేదు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలు చూశాక ఓటింగ్ నిర్వహిస్తారు. 4. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఈ విభాగంలో 10 సినిమాలు తుదిజాబితాలో స్థానం సంపాదించాయి. అకాడమీ మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ స్టైలిస్ట్‌ల బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 30, 2022 ఆదివారం షార్ట్ లిస్ట్ చేసిన ప్రతి సినిమాను వీక్షించి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చివరి ఐదు చిత్రాలను నామినేట్ చేయడానికి బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. 5. మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) ఇందులో 136 ఒరిజినల్ స్కోర్లు అర్హత సాధిచగా 15 షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఈ విభాగంలో కూడా బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. 6. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) ఇందులో 84 పాటలు అర్హత సాధించగా 15 పాటలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 7. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ ఈ కేటగిరీలో 82 సినిమాలకు 15 చిత్రాలు తుది జాబితాకు వెళ్లాయి. 8. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ ఈ ఉత్త లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో 145 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు షార్ట్ లిస్ట్‌లోకి వెళ్లాయి. షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ యానిమేషన్ సభ్యులు, దర్శకులు, నిర్మాతలు, రచయితల శాఖల సభ్యులు షార్ట్‌లిస్ట్, నామినీలను నిర్ణయించడానికి ఓటు వేస్తారు. 9. సౌండ్ ఈ విభాగంలో 94వ అకాడమీ అవార్డుల కోసం 10 సినిమాలు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ జాబితాలోని చిత్రాలను బ్రాంచ్ సభ్యులు జనవరి 28, 2022 శుక్రవారం వీక్షించి చివరిగా 5 సినిమాలను నామినేట్ చేసేందుకు ఓటు వేస్తారు. 10. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 10 చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ షార్ట్‌లిస్ట్‌ను నిర్ణయించింది. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 29, 2022 శనివారం నాడు షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రతి సినిమా నుంచి 10 నిమిషాల సారాంశాన్ని వీక్షిస్తారు. అనంతరం ఆస్కార్ నామినేషన్‌కు 5 సినిమాలను ఎంపిక చేసేందుకు ఓటు వేస్తారు. -
నెట్‌ఫ్లిక్స్ కొత్త వెబ్సైట్.. ఎందుకో తెలుసా ?
Netflix Launched New Website For Most Watched Movies: ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మూవీస్, వెబ్ సిరీస్, యాప్ అప్డేట్ ఫీచర్స్‌తో ఎప్పుడూ ముందుంటుంది. ఈ ఓటీటీలో ఎప్పుడూ కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతాయి. అయితే వీటిలో ఎక్కువ ప్రేక్షకాధరణ పొందినవి, హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకోవండ కష్టమైన పని. దీంతో ఏ సినిమా బాగుంది ? ఏ వెబ్ సిరీస్ చూడాలి ? అని తోటి స్నేహితుల్ని, సినిమా పిచ్చి ఉన్నవారిని అడుగుతుంటారు. అయితే ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ కొత్తగా ఆలోచించింది. తమ యూజర్లు ఇంకొకరిపై ఆధారపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం తాజాగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది నెట్‌ఫ్లిక్స్. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ 'టాప్10.నెట్‌ఫ్లిక్స్(https://top10.netflix.com/)' పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో ఇంగ్లీష్ (మూవీస్, టీవీ సిరీస్), నాన్ ఇంగ్లీష్ (మూవీస్, టీవీ సిరీస్) కేటగిరీల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులో ఉంచుతోంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రేక్షకులు వీక్షించిన సమయం ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. ప్రతి మంగళవారం ఈ టాప్ 10 జాబితాను విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఒక సినిమా, వెబ్ సిరీస్ వేర్వేరు దేశాల్లో ఎంత వరకు ప్రేక్షకాధరణ ఉందనేది కూడా ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ ఇంగ్లీష్, స్పానిష్, భాషల్లో ఉండగా, వచ్చే సంవత్సరం నుంచి మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురానుందట. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్.. మొబైల్ గేమ్స్.. ఆడటం ఎలా? -
మళ్లీ థియేటర్లలోకి హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ 'ది మ్యాట్రిక్స్'.. కారణం ?
Hollywood Film The Matrix Re Releasing On December 3: హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ చిత్రం 'ది మ్యాట్రిక్స్'. స్కై-ఫై, యాక్షన్ తరహాలో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. 1999లో వచ్చిన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందులోని నియో (కీను రీవ్స్), ట్రినిటీ (క్యారీ-అన్నె మోస్), మార్ఫస్ (లారెన్స్ ఫిష్‌బర్న్) పాత్రలు ఇప్పటికీ గుర్తిండిపోతాయి. అంతలా ఆకట్టుకుంటాయి ఆ పాత్రలు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్. ఈ చిత్రాన్ని మళ్లీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది నిర్మాణ సంస్థ. అయితే మ్యాట్రిక్స్ సిరీస్‌లోని నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సిరీస్‌లో కథానాయకుడి గతానికి సంబంధించిన కథతో వస్తోంది 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. మొదటి చిత్రం విడుదలకు నాలుగో సినిమా విడుదలకు మధ్య 12 ఏళ్లు గ్యాప్ ఉంది. అయితే నాలుగో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికే ఈ ఫ్రాంచైజీలోని మొదటి చిత్రమైన 'ది మ్యాట్రిక్స్' రిలీజ్ చేయనున్నారో తెలియాల్సి ఉంది. మ్యాట్రిక్స్ చిత్రానికి లానా వాచోస్కీ, లిల్లీ వాచోస్కీ దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ నాలుగో చిత్రానికి మాత్రం లానా వాచోస్కీ ఒక్కరే రచన, దర్శకత్వం వహించారు. 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' చిత్రంలో గ్లొబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్ -
Spider Man No Way Home : నలుగురు విలన్లతో హీరో స్పైడీ పోరాటం
హాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ స్పైడర్ మ్యాన్- నో వే హోమ్ అధికారిక పోస్టర్‌ను సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంస్థలు విడుదల చేశాయి. స్పైడర్ మ్యాన్‌గా టామ్ హోలాండ్, డాక్టర్ ఆక్టోపస్‌గా ఆల్ఫ్రెడ్ నటిస్తున్నారు. ఈ పోస్టర్లో డాక్టర్ ఆక్టోపస్‌ను చూపించకున్న తన మెటల్ అవయవాలు పీటర్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ పోస్టర్ విడుదల స్పైడర్ మ్యాన్ అభిమానులను పెద్దగా ఆశ్చర్యపర్చకున్నా.. అందులోని కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్ గాబ్లిన్ (విలియమ్ డాఫో) తన ఐకానిక్ గ్లైడర్‌పై రైడ్ చేయడం చూడొచ్చు. పోస్టర్‌లోని మెరుపులు ‘ఎలక్ట్రో’ కు సూచనగా కనిపిస్తున్నాయి. అలాగే మేఘం లాంటి ధూళి రేణువులను బట్టి చూస్తే 'సాండ్ మ్యాన్' కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు ఊహించినట్లేం ‘సినిస్టర్ సిక్స్’ విలన్లు ఈ స్పైడీ మూవీలో ఉంటారనడానికి ఇది సాక్ష్యంగా మారింది. The Multiverse unleashed. #SpiderManNoWayHome is exclusively in movie theaters December 17. pic.twitter.com/DchHdpKKFy — Spider-Man: No Way Home (@SpiderManMovie) November 8, 2021 అత్యంత శక్తివంతమైన నలుగురు విలన్లు మూవీలో ఉన్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. అయితే కామిక్ పుస్తకాల నుంచి తీసుకొని అయిన నో వే హోమ్ చిత్రంలో ‘సినిస్టర్ సిక్స్’ విలన్లను చూపిస్తారో లేదో వేచి చూడాలి. -
అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్ముడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్
సినిమాల ప్రభావం మిగతావాళ్ల మీద ఎలా ఉంటుందో తెలియదుగానీ.. ఆ కుర్రాడి మీద మాత్రం భలేగా చూపించింది. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఆ పేదింటి బిడ్డ ఆవిష్కరణలకు ప్రయత్నించాడు. కన్నతల్లి అందించిన ప్రొత్సాహంతో ఐదేళ్లు కష్టపడి రియల్ ఐరన్‌మ్యాన్ సూట్ తయారు చేశాడు. ఆ కష్టమే అతని చెల్లి చదువుకు సాయపడింది. ఇప్పుడు తన కల నెరవేర్చుకునేందుకు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. నింగోంబమ్ ప్రేమ్.. వయసు 20. ఉండేది మణిపూర్ రాష్ట్రం థౌబల్ జిల్లా హెయిరోక్(2) గ్రామం. చదివేది ఇంఫాల్‌లో ఫైన్ ఆర్ట్స్ కోర్స్. ఆరేళ్ల క్రితం.. ఓరోజు స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఫోన్లో ఐరన్ మ్యాన్ సినిమా చూశాడట. మనోడికి ఆ సినిమా తెగ నచ్చేసింది. అప్పటి నుంచి వరుసగా హాలీవుడ్ సినిమాలు చూస్తూ.. మైండ్‌లో ప్రింట్ అయిన ‘ఐరన్‌మ్యాన్ సూట్’ బొమ్మను పేపర్‌పై గీసుకున్నాడు. ఎలాగైనా ఆ సూట్‌ను తయారు చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు ఆ కుర్రాడు. టెక్నికల్ నాలెడ్జ్ లేదు. అందుకోసం హాలీవుడ్ సినిమాలు, ఇంటర్నెట్ను ఆశ్రయించాడు. ఈ రెండూ అతని బుర్రను రాటుదేల్చాయి. Move over Tony Stark. Make way for the REAL Iron Man. And it would be a privilege to assist him & his siblings in their education. If someone can connect me to him, it will be a privilege for me & @KCMahindraEduc1 to support him. (🙏🏽 @jaavedjaaferi for forwarding the video) pic.twitter.com/sKs8V3H8xQ — anand mahindra (@anandmahindra) September 20, 2021 తల్లి అండ.. చెల్లికి దన్ను సూట్ తయారు చేయాలనే ఆత్మ విశ్వాసం ప్రేమ్‌లో నిండింది. కానీ, మెటీరియల్ కోసం డబ్బులు లేవు. మగదిక్కులేని ఆ కుటుంబానికి ప్రేమ్ తల్లి సంపాదనే ఆధారం. కానీ, ఆమె కొడుకును ‘ఏదో ఒకటి సాధించాలంటూ’ వెన్నుతట్టి ప్రోత్సహించింది. చెత్త కుప్పల వెంట తిరిగి ఎలక్ట్రానిక్ వేస్టేజ్‌ను సేకరించాడు. కార్డ్బోర్డ్ సాయంతో ఐదేళ్లు కష్టపడి ఐరన్‌మ్యాన్ సూట్‌కి ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. ఈ సూట్‌తో పాటు మధ్య మధ్యలో కొన్ని ఆవిష్కరణలు చేశాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో చెల్లిని సైతం చదివిస్తున్నాడు. తన ఆవిష్కరణలు మరికొందరిలో స్ఫూర్తి ఇస్తే చాలంటున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు చేయాలని ఉందట. కానీ, డబ్బుల్లేక ఆగిపోయాడు. ఈ విషయం రీసెంట్గా ఓ వీడియో ద్వారా వ్యాపారదిగ్గజం ఆనంద్ మహీంద్రాకు చేరింది. టోనీ స్టార్క్(మార్వెల్ ఐరన్‌మ్యాన్)ను పక్కకి తప్పుకోమంటూ.. ప్రేమ్‌ను రియల్ ఐరన్ మ్యాన్‌గా పొడిగారు ఆనంద్ మహీంద్రా. అంతేకాదు అతనికి, అతని సోదరికి సాయం అందిస్తానని మాటిచ్చారు. వాళ్లను సంప్రదించేందుకు సాయం చేయాలని ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..! -
హాలీవుడ్ బాక్సాఫీస్‌పై కరోనా ఎఫెక్ట్
హాలీవుడ్ బాక్సాఫీస్‌పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో సినిమాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్: మ్యావరిక్’, ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ చిత్రాల రిలీజ్లు వాయిదా పడ్డాయి. 1986లో టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్’కు సీక్వెల్‌గా ‘టాప్ గన్: మ్యావరిక్’ చిత్రం రూపొందింది. ఈ సినిమాను తొలుత ఈ ఏడాది జూలై 2న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు నవంబరు 19కి వాయిదా వేశారు. అలాగే ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ చిత్రం 2022 నవంబరు 4 నుంచి 2023 జూలై 7కి వాయిదా పడింది. వీటితో పాటుగా ఈ ఏడాది జూలై 23న విడుదలకు షెడ్యూల్ అయిన ‘స్నేక్ ఐస్’ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 22కి పోస్ట్‌పోన్ అయ్యింది. వీటితో పాటు మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు వాయిదా పడుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఇప్పటికే ఇండియన్ మూవీస్ రిలీజ్లు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. తాజాగా హాలీవుడ్ సినిమాలు కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా కారణంగా మరోసారి కుదేలయ్యే అవకాశం ఉన్నట్లుగా కనబడుతోంది. చదవండి: ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్.. చిరంజీవి, రానా మూవీలకు బిగ్ షాక్! -
ఫిబ్రవరి 5న ‘మాన్స్టర్ హంటర్’
మిలా జొవోవిచ్, టోనీ జా ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘మాన్స్టర్ హంటర్’. పాల్ డబ్ల్యూఎస్ అండర్సన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగులో ఫిబ్రవరి 5న విడుదల చేస్తున్నట్లు పంపిణీదారులు సోనీ పిక్చర్స్ తెలిపింది. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ణాని మాట్లాడుతూ– ‘‘విజువల్ వండర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. ప్రఖ్యాత వీడియో గేమ్ ‘మాన్స్టర్ హంటర్’ ఆధారంగా ఈ సినిమాను అదే పేరుతో రూపొందించారు క్లిఫోర్డ్ టీఐ హ్యారిస్. అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన మాన్‌స్టర్స్‌ను ఎదుర్కొనేందుకు ఇద్దరు వీరులు చేసిన పోరాటమే ఈ చిత్రకథ. ఇలాంటి చిత్రాలను తెరపైనే చూడాలి. త్రీడీ సాంకేతికత ప్రేక్షకులకు మరింత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మా ఎగ్జిబిటర్స్ థియేటర్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇండియా అంతటా ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది’’అన్నారు. జూనియర్ మీగాన్ గుడ్, డియాగో బోనెట, జోష్ హెల్ మ్యాన్, జిన్ ఉ యూంగ్ మెక్ జిన్, రాన్ పెర్ల్ మ్యాన్ ఇతర పాత్రల్లో నటించారు. -
తేదీలు తారుమారు
కరోనా వల్ల ఏర్పడ్డ అయోమయం ఇంకా కొనసాగుతూనే ఉంది. థియేటర్ల తాళం ఎప్పుడు తీస్తారో తెలియదు. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేకొద్దీ సినిమాలు మరింత దూరం జరుగుతున్నాయి. ఈ ఏడాది రెండో భాగం కళకళలాడుతుంది అనుకున్న హాలీవుడ్ వెలవెలబోయింది. భారీ సినిమాలన్నీ మరోసారి విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. అంతరాయాల అవతార్ 2009లో వచ్చిన ప్రపంచ బ్లాక్ బస్టర్‘అవతార్’కి ఒకటి కాదు నాలుగు సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్ కేమరూన్. 2020, 2021, 2022.. ఇలా ఒక్కో సీక్వెల్‌ని ఒక్కో ఏడాది విడుదల చేయాలనుకున్నారు. సీక్వెల్స్ చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుంచి విడుదల ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూనే ఉంది. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన మొదటి భారీ చిత్రం కూడా ఇదే. అనుకున్న సమయానికే వస్తాం అని నమ్మకం కూడా వ్యక్తం చేశారు. అయితే లాస్ ఏంజెల్స్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పని కుదిరేలా లేదని, వాయిదా అనివార్యం అయిందని చిత్రబృందం తెలిపింది. దీంతో ముందుగా అనుకున్న సీక్వెల్స్ విడుదల తేదీలన్నీ ఓ ఏడాదికి వాయిదా పడ్డాయి. స్టార్‌వార్స్ ఇప్పట్లో లేనట్టే బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్ స్టార్ వార్స్ ఫ్రాంచైజీలో మరో మూడు సినిమాలను ప్రకటించింది నిర్మాణ సంస్థ డిస్నీ. అయితే ఈ చిత్రాలు కుడా అనుకున్న తేదీ కంటే ఓ ఏడాది వెనక్కి వెళ్లాయి. స్టార్ వార్స్ కొత్త సిరీస్ చిత్రాలకు పేర్లు ఇంకా ప్రకటించలేదు. వాయిదాల జాబితాలో... ఈ ఏడాది వేసవిలో టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్ – మావరిక్’ విడుదల కావాల్సింది. కానీ కాలేదు. ఇంకా ‘ఏ క్వైట్ ప్లేస్’ సీక్వెల్ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడింది. యాక్షన్ చిత్రం ‘మూలాన్’, క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘టెనెట్’, వెస్ యాండర్ సన్ తెరకెక్కించిన ‘ఫ్రెంచ్ డిస్పాచ్’ చిత్రాలు వాయిదా పడ్డాయి. చెప్పిన తేదీకి రావడం లేదంటున్న ఈ చిత్రాల నిర్మాతలు వాయిదా వేసిన తేదీని మాత్రం చెప్పలేదు. మరి.. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయో తెలియదు.. తెరిచాక ప్రేక్షకులు వస్తారా? లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇక విడుదల తేదీ విషయంలో ఏం క్లారిటీ ఇవ్వగలం అంటున్నారు. జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’ని గత ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. వాయిదా పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుకున్నారు టైమ్ కి రాలేదు. ఫిబ్రవరిలోనే ఏప్రిల్ కి వచ్చేస్తాం అన్నారు.. అప్పటికి థియేటర్లు మూతపడ్డాయి. ఈ ఏడాది నవంబర్‌కి వస్తాం అంటున్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే మళ్లీ టైమ్ తప్పేట్లు ఉంది. -
హాలీవుడ్ రివ్యూ 2019
-
ఏడు దేశాల్లో సినిమా షూటింగ్
బాలీవుడ్ తారలు హాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంటారు. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడి అక్కడికే మకాం మార్చేసింది. ఇక ఐశ్వర్యరాయ్, దీపికా పదుకోన్‌లు హాలీవుడ్లో సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా సీనియర్ నటి డింపుల్ కపాడియా, హాలీవుడ్ క్రేజీ దర్శకుడైన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అకాడమీ అవార్డు గ్రహిత క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో డింపుల్ కపాడియా నటిస్తున్న చిత్రం ‘టెనిట్’. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో సినిమానికి సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డింపుల్, క్రిస్టోఫర్‌లు సెట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ‘టెనిట్’ను దాదాపు ఏడు దేశాల్లో షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆస్కార్ విజేత డేవిడ్ వాషింగ్టన్ హీరోగా నటిస్తున్నారు. బాబీ(1973), సాగర్(1985) సినిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న డింపుల్ కపాడియా...‘లీలా’(2000) తో హాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. Christopher Nolan & Dimple Kapadia on set todayhttps://t.co/97zmLc9nxd #TENET pic.twitter.com/pN9qeGSi7f — ibabysky (@Ibabysky) July 27, 2019 -
సిసలైన సమ్మర్ సీజన్!
‘బ్లాక్‌పాంథర్’ వచ్చి సూపర్ హిట్ అయింది. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ రిలీజయి బ్లాక్‌బస్టర్ అయింది. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. జూన్ వచ్చేసింది. తొలకరి పలకరించేసింది. ఇంకేం.. హాలీవుడ్ సినిమాల జోరు తగ్గిపోతుంది అనుకుంటే పొరపాటే! హాలీవుడ్ అసలు సిసలు హంగామా ఇప్పుడే మొదలవుతుంది. జూన్ నెల్లోనే. అమెరికాలో సమ్మర్ సీజన్ జూన్‌లో మొదలై ఆగష్టు చివరి వారం వరకూ ఉంటుంది. సమ్మర్లో మొదటి నెలైన జూన్‌లో సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలు హంగామా చేస్తాయి. ఈ జూన్‌లో ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’, ‘ఇంక్రెడిబుల్స్ 2’, ‘ఓషన్స్ 8’ లాంటి భారీ అంచనాలున్న సినిమాలు విడుదలవుతున్నాయి.. జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్ 2001తో ‘జురాసిక్ పార్క్’ కథ ముగిసింది. అప్పటికి ఇండియన్ సినిమాకు హాలీవుడ్ వచ్చిందంటే అది ‘జురాసిక్ పార్క్’ సిరీస్ వల్లనే! జురాసిక్ పార్క్ కథ ముగిశాక మళ్లీ దాన్ని కొత్తగా పరిచయం చేయాలన్న ఆలోచనతో పుట్టిందే ‘జురాసిక్ వరల్డ్’. 2015లో జురాసిక్ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మొదటి సినిమా వచ్చింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు సినిమాలు ప్లాన్ చేశారు. ఇప్పుడు జూన్ 7న మన ముందుకు వస్తోంది రెండో భాగం. పేరు ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’. అమెరికా కంటే రెండు వారాల ముందు ఇండియాలో విడుదలవుతోంది. ‘‘మీరిప్పటి వరకూ చూసిన డైనోసర్లు ఒక ఎత్తు. ఈ సినిమాలో చూసే డైనోసర్లు మరో ఎత్తు’’ అంటున్నాడు చిత్రదర్శకుడు జె.ఎ.బయోనా. భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ భావిస్తోంది. ఇండియాలో హాలీవుడ్ సినిమా రికార్డులను ఫాలెన్ కింగ్డమ్ తిరగరాస్తుందని అందరూ భావిస్తున్నారు. పిల్లలకు ఈ సినిమా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లస్ హోవార్డ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇన్‌క్రెడిబుల్స్ 2 2004లో వచ్చిన ‘ది ఇన్‌క్రెడిబుల్స్’ గుర్తుంది కదా. ఈ కంప్యూటర్ యానిమేటెడ్ సూపర్ హీరో ఫిల్మ్‌కు అప్పట్లో కాసుల వర్షం కురిసింది. సూపర్ హీరో జానర్లో ఈ ప్రయోగానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ‘ఇన్‌క్రెడిబుల్స్ 2’. మన సూపర్ హీరోలు మిష్టర్ ఇన్క్రెడిబుల్, ఎలాస్టిగర్ల్ చేసే హంగామా ఈ సీక్వెల్లో మామూలుగా ఉండదట. ట్రైలర్ ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. జూన్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఓషన్స్ 8 స్టీవెన్ సోడర్బర్గ్ ‘ఓషన్స్’ సిరీస్‌కు రీబూట్ ఈ ‘ఓషన్స్ 8’. జూన్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గ్యారీ రోస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై కూడా హాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. ఆద్యంతం అదిరిపోయే థ్రిల్స్‌తో సాగుతుందట. జైలు నుంచి బయటికొచ్చాక సింపుల్ లైఫ్ బతుకుతానని చెప్పి, ఓషన్ అతిపెద్ద రాబరీలు చేస్తూ ఉంటుంది. ఈ కథ ఏయే మలుపులు తిరుగుతుందన్నది సినిమా. ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా సాగిపోయే ఈ సినిమాలో సాండ్రా బుల్లక్ రోల్, ఆమె యాక్టింగ్ మేజర్ హైలైట్స్‌గా నిలుస్తాయని టాక్. ఈ మూడు సినిమాలూ హాలీవుడ్ సమ్మర్‌కు గ్రాండ్ ఓపెనింగ్ ఇస్తాయని ట్రేడ్ భావిస్తోంది. ఏయే సినిమాలు ఎలా ఆడతాయో చూడాలి మరి!! . -
ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ
సమ్మర్ వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయ్.. పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు చక్కగా సినిమాలు చూసే టైమ్. సాయంకాలాలు అలా థియేటర్లలో వాలిపోయి సినిమాలను ఎంజాయ్ చేసే టైమ్. మరి మనకు సమ్మర్ అప్పుడే వచ్చేసింది కానీ యూఎస్‌లో ఇంకో రెండు నెలలు వెయిట్ చెయ్యాలి సమ్మర్‌కు. మనకైతే సమ్మర్ వేడిని పుట్టించేందుకు వాళ్ల స్ప్రింగ్ సీజ్న్లోనే భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ మొదలుకొని ‘డెడ్‌పూల్ 2’ వరకు ఇండియన్ అభిమానులను అలరించేందుకు హాలీవుడ్ రెడీ అయిపోయింది. ఆ సినిమాలను ఒకసారి పలకరించుకొద్దాం.. అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’.. సమ్మర్లో ఈ ఒక్క సినిమా కోసం యాక్షన్ సినిమా అభిమానులందరూ పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. అది అలాంటి ఇలాంటి సినిమా కాదు కాబట్టి ఓపెనింగ్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది. సూపర్‌మేన్, స్పైడర్ మేన్, ఐరన్ మేన్.. ఇలా మనల్ని మెప్పించిన సూపర్ హీరోలంతా ఒక దగ్గర చేరి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే? అంతమంది సూపర్‌హీరోలు ఒకేసారి ఫైట్స్ చేస్తూ ఉంటే? అవెంజర్స్ అందుకు స్పెషల్. మార్వెల్ కామిక్స్ క్రియేట్ చేసిన సూపర్హీరోలంతా ఉంటారు ఈ సినిమాలో. వాళ్లు చేసే యాక్షన్, అడ్వెంచర్సే ఈ సినిమాకు హైలైట్. ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది అవెంజర్స్. ఈ సమ్మర్లో ఇదే అతిపెద్ద సినిమా. డెడ్‌పూల్ 2 అవెంజర్స్ రిలీజైన సరిగ్గా మూడు వారాలకు వస్తుంది ‘డెడ్‌పూల్ 2’. 2016లో వచ్చిన ‘డెడ్‌పూల్’కు సీక్వెల్ ఇది. అవెంజర్స్‌లో ఒక క్యారెక్టర్ అయిన డెడ్‌పూల్‌ను ఫుల్‌లెంగ్త్ రోల్లో ఎంజాయ్ చేయడానికి ‘డెడ్‌పూల్ 2’ చూడాల్సిందే మరి! సూపర్‌హీరో జానర్లో ఒక కొత్త ప్రయోగమైన డెడ్‌పూల్ తరహాలోనే సీక్వెల్ కూడా ఉంటుందట. ట్రైలర్ అయితే సినిమా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని స్పష్టం చేసేసింది. మే 18న విడుదలవుతోన్న ఈ సినిమాకు ఇండియాలోనూ భారీ క్రేజ్ ఉండడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్ మనకు సమ్మర్ అప్పుడప్పుడే పూర్తవుతూ, చిరుజల్లులు పలకరించే సమయానికి సీజన్‌ను గ్రాండ్‌గా ఎండ్ చేసేందుకు ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’ సినిమా వచ్చేస్తోంది. జురాసిక్ పార్క్ నుంచి మొదలుపెడితే జురాసిక్ వరల్డ్ వరకూ ఈ సిరీస్ గురించి చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద చరిత్ర. సాధారణంగానే జురాసిక్ పార్క్ సిరీస్‌కు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకు ఏమాత్రం తక్కువ లేకుండా ఈ కొత్త సినిమా వస్తోంది. 2015లో వచ్చిన జురాసిక్ వరల్డ్‌తో పోల్చితే ఎన్నోరెట్లు ఎక్కువ అడ్వెంచర్లు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ ఇప్పటికే అభిమానులకు ఇవ్వాల్సిన కిక్ అంతా ఇచ్చేస్తోంది. జూన్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. హాలీవుడ్ రికార్డులను తిరగరాసే సినిమాగా ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’కు ప్రచారం కల్పిస్తోంది యూనివర్సల్ పిక్చర్స్. పసిఫిక్ రిమ్ అప్రైజింగ్ మొన్నీమధ్యే బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అందుకున్న గెలెర్మో డెల్తోరో గుర్తున్నాడు కదా? ఆయన దర్శకత్వంలో 2013లో వచ్చిన ‘పసిఫిక్ రిమ్’ సినిమాకు సీక్వెలే ఈ ‘పసిఫిక్ రిమ్ అప్రైజింగ్’. గెలెర్మో ఈసారి నిర్మాతగానే వ్యవహరించగా, స్టీవెన్ ఎస్ డెనైట్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ ఆన్ అడ్వెంచర్లు, యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. గత వారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇండియాలోనూ భారీ ఎత్తునే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా దర్శకుడికి ఇది డెబ్యూట్. డెబ్యూట్‌తోనే ఇంత భారీ బడ్జెట్ సినిమాతో స్టీవెన్మెప్పించడం విశేషం. రెడీ ప్లేయర్ వన్ సూపర్‌స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కొత్త సినిమా ‘రెడీ ప్లేయర్ వన్’ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2045లో జరిగే సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మాస్టర్ స్టోరీటెల్లర్ అన్న తన స్థాయికి తగ్గట్టే స్పీల్బర్గ్ చేసిన ఈ ప్రయోగానికి ఇండియాలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్‌ను సూపర్ కూల్ గా మొదలుపెట్టిన సినిమా ‘రెడీ ప్లేయర్ వన్’ అనే చెప్పుకోవాలి. ర్యాంపేజ్ ర్యాంపేజ్ కూడా సైన్స్ ఫిక్షన్ జానర్ కథే! ఒక విచిత్రమైన ప్రయోగంతో చిన్నపాటి గొరిల్లా భయంకరమైన మృగంలా మారిపోతుంది. ఆ తర్వాత అది చేసే విధ్వంసం, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. దాన్నుంచి ఈ ప్రపంచాన్ని హీరో ఎలా కాపాడాడన్నదే సినిమా. భారీ యాక్షన్ అడ్వెంచర్స్‌తో సినిమా నడుస్తుంది. ట్రైలర్ ఇప్పటికే అడ్వెంచర్ సినిమా అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తోంది. డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు బ్రాడ్ పేటోన్ దర్శకత్వం వహించారు.ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. పిల్లలే టార్గెట్‌గా సమ్మర్లో ఈ సినిమామంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ భావిస్తోంది. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో మనకు సమ్మర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఏదో, ఏ సినిమా ఎంతెంత వసూళ్లు రాబడుతుందో ఎదురుచూడాలి. -
సినిమా పండగ వచ్చేసిందోచ్!!
ఒకటి పక్కా మాస్ సినిమా.. ఇంకోటేమో క్లాస్ ఫ్యామిలీ డ్రామా.. మరో సినిమా ప్యూర్ కామెడీ.. ఇలా అన్నీ ఒక్కసారే వచ్చి పడితే ఎలా ఉంటుంది? సినిమా పండగ అయిపోదూ? అదే.. మన సంక్రాంతి, దసరాలాగే.. హాలీవుడ్‌కు అసలైన పండగ సీజన్ అంటే క్రిస్మస్. ఈ నెలంతా క్రిస్మస్ పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు సినీ అభిమానులకు ఉన్న ఒక మంచి ఆప్షన్ సినిమా. క్రిస్మస్కు ముందు, ఆ తర్వాత న్యూ ఇయర్ వరకూ హాలీవుడ్ సినిమాల హడావిడి మామూలుగా ఉండదు. ఈ ఏడాది క్రిస్మస్ సినిమా పండగ జోరు ఇంకాస్త ఎక్కువే ఉంది. డిసెంబర్ 1 నుంచే ఈ హంగామా మొదలైపోయింది. 2017 క్రిస్మస్ సీజన్లో హాలీవుడ్‌ను కవ్విస్తోన్న సినిమాలు కొన్ని... ది షేప్ ఆఫ్ వాటర్ ఈ సీజన్లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను మూటగట్టుకున్న సినిమా ‘ది షేప్ ఆఫ్ వాటర్’. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 8న థియేటర్లకు రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గులెర్మొ డెల్టొరొ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా యూఎస్‌లో ఇండియా కంటే వారం ముందే (డిసెంబర్ 1) విడుదలైంది. స్టార్ వార్స్ – ది లాస్ట్ జేడి స్టార్ వార్స్ అభిమానులకు ఈ ఏడాది క్రిస్మస్ పండగ పదిరోజుల ముందే మొదలైపోతోంది. డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్టార్‌వార్స్ – ది లాస్ట్ జేడీ’ విడుదలవుతోంది. స్టార్ వార్స్ సీక్వెల్ ట్రయాలజీలో ఇది రెండో సినిమా. సాధారణంగానే స్టార్ వార్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదీ పండగ సీజన్లో వస్తోందంటే ఇక చెప్పక్కర్లేదు. ఫస్ట్ వీకెండ్‌కే ఈ సినిమా 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1250 కోట్లు) వసూలు చేయొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక సినిమా బాగుంటే, న్యూ ఇయర్ వరకూ కాసుల వర్షమే!! రియాన్ జాన్సన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జుమాంజి – వెల్కమ్ టు ది జంగిల్ పండగ సీజన్లో యాక్షన్ సినిమా అభిమానులకు పండగలా రాబోతోన్న సినిమా ‘జుమాంజి’. 1995లో వచ్చిన ‘జుమాంజి’కి ఇది సీక్వెల్. జేక్ కస్దాన్ దర్శకత్వం వహించారు. డ్వెయన్ జాన్సన్, జాక్ బ్లాక్, కెవిన్ హార్ట్ తదితర స్టార్స్ నటించిన ఈ సినిమా కోసం ఇండియన్ మూవీ ఫ్యాన్స్ కూడా బాగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్‌తో యాక్షన్ సినిమా అభిమానులకు కావాల్సిన అన్ని హంగులూ ఈ సినిమాలో ఉన్నాయని తెలియడంతో ఇక సినిమాకు క్రేజ్ అలా పెరుగుతూనే పోతోంది. డిసెంబర్ 20న అమెరికాలో విడుదలవుతోన్న ఈ సినిమా ఇండియాలో డిసెంబర్ 29న విడుదల కానుంది. పిచ్ పర్ఫెక్ట్ 3 ‘పిచ్ పర్ఫెక్ట్’ ట్రయాలజీలో వస్తోన్న మూడో సినిమాయే ‘పిచ్ పర్ఫెక్ట్ 3’. కామెడీ సినిమా అభిమానులకు ఈ సీజన్లో బెస్ట్ అప్షన్ ఈ సినిమా. అన్నా కెండ్రిక్, రెబెల్ విల్సన్, హైలీ స్టీన్ఫీల్డ్ తదితర భారీ తారాగణం నటించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ నవ్వులు పూయిస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది. డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. పైన చెప్పిన సినిమాలే కాకుండా హాలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ వచ్చిన రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రఖ్యాత దర్శకుడు స్పీల్బర్గ్ తెరకెక్కించిన ‘ది పోస్ట్’ అయితే, మరొకటి రొమాన్స్ జానర్ సినిమాల స్పెషలిస్ట్ ఉడీ అలెన్ తెరకెక్కించిన ‘వండర్ వీల్’. వండర్ వీల్.. రొమాన్స్ జానర్లో పలు క్లాసిక్ సినిమాలను అందించిన ఉడీ అలెన్ తెరకెక్కించిన ‘వండర్ వీల్’ యూఎస్‌లో డిసెంబర్ 1నే విడుదలైంది. ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. దర్శకుడి స్టైల్లో రొమాన్స్ జానర్లో ఓ మంచి సినిమాగా ‘వండర్ వీల్’కు పేరొస్తోంది. కేట్ విన్స్లెట్ ప్రధాన పాత్రలో నటించడం ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్. ది పోస్ట్ స్పీల్బర్గ్ సినిమాల కోసం ప్రపంచమంతా ఎంతలా ఎదురు చూస్తుందో చెప్పక్కర్లేదు. అయితే ఆయన గత రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీంతో ఇప్పుడు ఆయన అభిమానుల ఆశలన్నీ ‘ది పోస్ట్’ పైనే ఉన్నాయి. ఈ సినిమాకు సూపర్‌స్టార్ టామ్ హ్యాంక్స్ హీరో కావడం కూడా అంచనాలను పెంచింది. హిస్టారికల్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మెరిల్ స్ట్రీప్ రోల్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందట. యూఎస్‌లో కొన్ని చోట్ల డిసెంబర్ 22నే ఈ సినిమా విడుదలవుతున్నా, పూర్తి స్థాయిలో మాత్రం 2018 జనవరి 12న విడుదల కానుంది. అంటే స్పీల్బర్గ్ ఇండియన్ అభిమానులకు ‘ది పోస్ట్’ చూడాలంటే ఎదురుచూపులు తప్పవు. -
ట్రంప్ గురించి పెద్దగా తెలియని మరో అంశం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఊహించని రీతిలో విజయాన్ని సాధించి అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న బడా బిజినెస్ మేన్ డోనాల్డ్ ట్రంప్. ఆయన మాటలు, ఆలోచనలే కాదు చేతలు కూడా ఆసక్తికరమే. ఆయన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించినప్పుడు ఈ అంశం తెలుస్తోంది. ఆయన ఓ మొండివాడని ఎదుటివారికి నచ్చినా నచ్చకపోయినా అనుకుంది చేసుకుంటూ పోయేతత్వం అని మరోసారి స్పష్టం అవుతుంది. 1946 జూన్ 14న న్యూయార్క్ శివారులోని క్వీన్స్‌లో జన్మించిన ట్రంప్ పుట్టుకతోనే శ్రీమంతుడు. తండ్రి వ్యాపారాన్ని చేతిలోకి తీసుకొని అందులో దూకుడుగా వ్యవహరిస్తూనే వ్యక్తిగత అభిరుచులు కూడా కొనసాగించాడు. కాస్తంత గందరగోళ వ్యక్తిగా కనిపించే ట్రంప్‌కు నటనపై అమితమైన ఆసక్తి అని ఆయన చరిత్ర గమనిస్తే తెలుస్తోంది. ఆయన ఇప్పటి వరకు పలు సినిమాల్లో టీవీ షోల్లో నటించారు. అయితే, అన్నింటిలో కూడా దాదాపు బిజినెస్‌మేన్‌గా.. సంపన్న తండ్రిగా నటించాడు. ఇప్పట వరకు ఆయన 14 టీవీ షోల్లో, 12 సినిమాల్లో నటించారు. మొట్టమొదటిసారి ది జెఫర్ సన్స్ అనే టీవీ షోలో 1985లో నటించిన ట్రంప్.. సినిమాల్లోకి మాత్రం 1989లో గోస్ట్ కాంట్ డు ఇట్ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టారు. 2010లో వచ్చిన వాల్ స్ట్రీట్:మనీ నెవర్ స్లీప్స్ అనే చిత్రంలో ట్రంప్ నటించినప్పటికీ థియేటర్ వర్షన్లో ఆయన నటించిన విభాగాన్ని తొలగించారు. అయితే, డీవీడిలో మాత్రం అలాగే ఉంచారు. సినిమాల్లో నటనపై ఆసక్తి కనబరిచిన ట్రంప్ తన నటనను మాత్రం వృద్ధి చేసుకోలేకపోయారని.. ప్రేక్షకులను మెప్పించలేకపోయారని పలు మేగిజిన్లు వెల్లడించాయి. ఒక చిత్రంలో ట్రంప్ మాంత్రికుడిగా కూడా నటించారట. ట్రంప్‌కు ఒక్క అవార్డుగానీ, గుర్తింపుగానీ రాకపోవడం గమనార్హం. -
హారర్ నేపథ్యంగా లైట్స్అవుట్
ఈ ఏడాది భారతీయ సినీపరిశ్రమలో హాలీవుడ్ చిత్రాలదే హవా అని సినీ పండితులంటున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ది జంగిల్‌బుక్, కంజూరింగ్-2 చిత్రాలు ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కంజూరింగ్, కంజూరింగ్-2 వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్స్ బ్రదర్స్ తాజా చిత్రం లైట్స్ అవుట్. హారర్, థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని డేవిడ్.ఎఫ్.శాండ్‌బెర్గ్ తెరకెక్కించారు. చిత్ర కథ విషయానికి వస్తే చిన్న తనంలోనే భయాందోళనలతో ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఒక యువతి పెద్ద అయిన తరువాత తనకు ఎదురైన సమస్యలే తన తమ్ముడికి ఏర్పడతాయని తెలిసి ఎలాగైనా ఆ సమస్య నుంచి తన తమ్ముడిని కాపాడుకోవాలని ప్రయతిస్తుంది. అయితే ఈ సమస్యలకు కారణం తన తల్లి శరీరంలో ప్రవేశించిన ఒక ఆత్మనేనని తెలియడంతో తను ఏమి చేసింది? చివరకు వారు రక్షించబడ్డారా? లేదా? ఇలాంటి పలు భయబ్రాంతులకు గురిచేసే సన్నివేశాల సమాహారమే లైట్స్ అవుట్ చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు. ఇది పూర్తిగా చీకటిలో జరిగే భయోత్పాదక సన్నివేశాలతో కూడిన చిత్రం అని పేర్కొన్నారు. చిత్రాన్ని త్వరలో తమిళం, ఆంగ్గ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. -
ఇలా జరుగుతుందని ముందే ఊహించా!
‘‘హాలీవుడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఆ చిత్రాల కారణంగా మన చిత్రాల వసూళ్లు తగ్గుతున్నాయి. ఈ మధ్య కొన్ని హిందీ చిత్రాలతో పాటు హాలీవుడ్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఫలితంగా మన చిత్రాల వసూళ్లు దెబ్బ తిన్నాయ్. ఇదే కొనసాగితే ‘మన సినిమా’ మనుగడ కష్టమవుతుంది’’ అని అమితాబ్ బచ్చన్ అన్నారు. హాలీవుడ్ చిత్రాలు ఏ దేశంలో విడుదలైతే అక్కడి చిత్రాలకు నష్టం ఖాయం అని ఈ బిగ్ బి పేర్కొన్నారు. మన ఇండియా అనే కాదు.. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, జపాన్.. ఎక్కడైనా కానివ్వండి... హాలీవుడ్ చిత్రాలు గట్టి పోటీనిస్తున్నాయని ఆయన అన్నారు. ఇంకా అమితాబ్ మాట్లాడుతూ - ‘‘నాకెప్పట్నుంచో యూఎస్ వెళ్లడం అలవాటు. హాలిడేస్ అంటే అక్కడకు వెళ్లాల్సిందే. అలా వెళ్లిన ప్రతిసారీ వార్నర్ బ్రదర్స్, సోనీ, ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ వంటి అక్కడి అగ్రనిర్మాణ సంస్థల అధినేతలు నన్ను కలవమని కోరేవారు. కానీ, నేను ఆసక్తి కనబర్చేవాణ్ణి కాదు. వాళ్లు ఆహ్వానించడం, నేను వెళ్లకపోవడం ఇలా జరుగుతుండేది. చివరకు ఓసారి వెళ్లాను. అప్పుడొక నిర్మాత మన ఇండియన్ సినిమాల నిర్మాణం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడి మార్కెట్ గురించి ఆయన చెప్పడం నన్నాశ్చర్యపరిచింది. 1995లో ఇది జరిగింది. భవిష్యత్తులో మన ఇండియన్ మార్కెట్‌ని హాలీవుడ్ చిత్రాలు శాసిస్తాయని అప్పుడే ఊహించా. మెల్లి మెల్లిగా అది జరుగుతోంది. ఈ పోటీని తట్టుకోవాలంటే మనం కూడా హాలీవుడ్ చిత్రాలకు దీటుగా సినిమాలు చేయాలి. అప్పుడే తట్టుకోగలుగుతాం’’ అన్నారు. -
సమ్మర్... దీపావళి... హాలీవుడ్ రిలీజ్
ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు ఇండియాలో ఇప్పటిలా డబ్బులు తెచ్చేవి కావు. కానీ, ఇప్పుడు పాశ్చాత్య సినిమాకు ఇండియాలో ప్రేక్షకులు పెరిగారు. పెరుగుతున్న మధ్యతరగతి వర్గం, ఇంగ్లీష్ మీడియమ్ చదువులు, మల్టీప్లెక్స్‌లు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా హాలీవుడ్ చిత్రాల పట్ల ఆసక్తి పెరగడానికి కారణాలు. అలాగే ప్రాంతీయ భాషల్లో ఈ ఇంగ్లీష్ సినిమాల అనువాదాల విడుదల వల్ల కూడా మార్కెట్ సమూలంగా మారిపోయింది. 2014లో భారత్‌లో ‘టాప్ 10 హాలీవుడ్ రిలీజ్లు’ 6.47 కోట్ల డాలర్లు (సుమారు రూ. 430 కోట్లు)వసూలు చేస్తే, గత ఏడాది ఆ వసూళ్ళు దాదాపు 9.8 కోట్ల డాలర్లకు (రూ. 651 కోట్లు) పెరిగాయి. అంటే, మునుపటి వసూళ్ళ కన్నా దాదాపు 34 శాతం ఎక్కువ. ఇది ఇంతకు మునుపెన్నడూ లేనంత అత్యధిక పెరుగుదల. ప్రపంచం మొత్తం మీద చూస్తే, హాలీవుడ్ సినిమాల భారతీయ మార్కెట్ వాటా 6 శాతం నుంచి 8-9 శాతానికి పెరిగిందని కన్సల్టింగ్ సంస్థ ‘కె.పి.ఎం.జి. ఇండియా’ తేల్చింది. ఇండియాలో ఇలా తమ సినిమాల మార్కెట్ పెరగడంతో హాలీవుడ్ స్టూడియోల చూపంతా ఇప్పుడు ఇటు వైపు పడింది. ఇలా భారత్‌లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతుండడంతో, హాలీవుడ్ సంస్థలు తమ రిలీజ్ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్త విడుదల కోసం పెట్టుకున్న తేదీ కన్నా ముందుగానే భారతీయుల స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా తమ సినిమాను ఇండియాలో రిలీజ్ చేసేస్తున్నాయి. -
అదొక అద్భుతమైన అనుభూతి!
హాలీవుడ్ చిత్రాలను చూసినప్పుడు ఇలాంటి చిత్రాలు మన దేశంలో కూడా వస్తే బాగుండు అని కోరుకోనివారుండరు. ఆ స్థాయి చిత్రాలు తీయాలంటే వేల కోట్లు కావాలి కాబట్టి, అది సాధ్యం కాదని అనుకోనివారూ ఉండరు. అయితే మనం కూడా ఎందులోనూ తీసిపోమనీ, హాలీవుడ్ చిత్రాలను తలపించే రీతిలో తీయగలమనీ నిరూపించిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం జాతీయ అవార్డు సాధించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరుల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ‘బాహుబలి 2’ నిర్మాణంలో ఉంది. వచ్చే ఏడాది ఈ రెండో భాగం విడుదల అవుతుంది. కాగా, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విడుదలైన తొలి భాగం ఇంకా అక్కడక్కడా కొన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. మ్యాట్నీ షోలో ఈ చిత్రాన్ని చూపిస్తున్నారు. మరో మూడు నెలలైతే ఈ చిత్రం విడుదలై ఏడాది అవుతుంది. ఇప్పటికీ ఆడుతోంది కాబట్టి, ఏయే థియేటర్లో ఈ చిత్రం ఆడుతోందో వాటిని ప్రభాస్ సందర్శిస్తే బాగుంటుందని ఆ థియేటర్ అధినేతలు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రభాస్‌కు పంపించారని సమాచారం. ఎగ్జిబిటర్ల ఆకాంక్షను స్వయంగా చదివిన ప్రభాస్ సానుకూలంగా స్పందించారట. ‘‘సినిమా పరిశ్రమలో థియేటర్ ఓనర్స్ పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ల అభిప్రాయాలు ఎంతో విలువైనవి. ‘బాహుబలి’ విడుదలై ఏడాది కావస్తున్నా, ఇంకా ఈ చిత్రానికి అభినందనలు లభించడం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది’’ అని సన్నిహితులతో ప్రభాస్ అన్నారట. ఇదిలా ఉంటే.. ‘బాహుబలి’ తొలి భాగం అప్పుడు ఆ షూటింగ్ బిజీ వల్ల, ఇప్పుడు మలి భాగంతో బిజీగా ఉండటంవల్ల ప్రభాస్ పెద్దగా బయటకు రావడంలేదు. అప్పుడప్పుడూ ఏదైనా ఆడియో వేడుకలో కనిపించడం మినహా అభిమానులకు వేరే వేడుకల్లో కనిపించడంలేదు. అందుకని రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను కలవాలనుకున్నారట. కొంతమంది అభిమానులకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. అభిమానులందర్నీ ఒకేసారి కలవడం కుదరదు కాబట్టి, ఒక టీమ్‌ని ఏర్పాటు చేశారట. ఆ టీమ్ నిర్ణయించిన సమయాల్లో ఒక్కో గ్రూప్‌గా అభిమానులు విడిపోయి, ప్రభాస్‌ను ఆయన ఇంట్లోనే కలుస్తున్నారట. -
చైనాలో హాలీవుడ్ చిత్రాల హవా
బీజింగ్: హాలీవుడ్ సినిమా మార్కెట్లో అమెరికాకన్నా చైనానే ముందుకు దూసుకెళుతోంది. చైనా కొత్త సంవత్సరం సందర్భంగా ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి 14వ తేదీ వరకు చైనాలో టిక్కెట్ల అమ్మకం ద్వారా ఏకంగా 3,820 కోట్ల రూపాయలను హాలీవుడ్ సినిమాలు కొల్లగొట్టాయి. కేవలం పది సినిమాల ద్వారానే ఇంతటి వసూళ్లు వచ్చాయంటే హాలీవుడ్ సినిమాల మార్కెట్ చైనాలో ఎంతగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2005 నుంచి 2015 నాటికి హాలీవుడ్ సినిమాలకు చైనా మార్కెట్ 30 శాతం పెరిగిందని చైనా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వసూలైన కలెక్షన్లను విశ్లేషిస్తే హాలివుడ్ కామెడీ చిత్రం ‘మెర్మేడ్’ అన్నింటికన్నా ముందున్నది. ఈ సినిమా 1910 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తర్వాత స్థానాల్లో మాన్స్టర్ హంట్, ఫ్యూరియస్, ట్రాన్స్ఫార్మర్స్:ఏజ్ ఆఫ్ ఎక్సిటింక్షన్, మోజిన్: ది లాస్ట్ లెజెండ్, లాస్ట్ ఇన్ హాంకాంగ్, అవెంజర్స్:ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, గుడ్‌బై మిస్టర్ లాసర్, జురాసిక్ వరల్డ్, అవతార్ సినిమాలు ఉన్నాయి. అమెరికాలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ‘స్టార్‌వార్స్:ది ఫోర్స్ అవేకన్స్’ చిత్రం ఈ జాబితాలోకి రాకపోవడం గమనార్హం. చైనాలో హాలీవుడ్ సినిమాల హవా పెరుగుతుండడంతో చైనాకు చెందిన నటీనటులను ఎక్కువగా తీసుకునేందుకు హాలీవుడ్ నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటీ నటులు పలు ప్రాజెక్టులకు సంతకాలు చేశారు. అలాగే హాలీవుడ్ సినిమాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనా నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లో 1740 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు చైనాకు చెందిన ‘పర్ఫెక్ట్ వరల్డ్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ అమెరికాకు చెందిన ‘యూనివర్సల్ స్టూడియో’తో ఫిబ్రవరి 19వ తేదీన ఒప్పందం కుదుర్చుకుంది. చైనా ప్రేక్షకులు ఆదరించిన మొట్టమొదటి హాలీవుడ్ సినిమా హారిసన్ ఫోర్డ్, టామ్మీ లీ జోన్స్ నటించిన ‘ది ఫుజిటివ్’ చిత్రం. ఈ చిత్రం 1993లో విడుదలైంది. -
నా చివరి కోరిక ఇదే!
హాలీవుడ్ సినిమాలను అమితంగా ఇష్టపడే షారుక్‌ఖాన్‌కు ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘జేమ్స్ బాండ్’ సిరీస్‌లంటే చాలా ఇష్టం. ఈ సిరీస్ సినిమాలను ఆయన లెక్కలేనన్ని సార్లు వీక్షించారట! ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ హీరో ఈథెన్ హంట్, జేమ్స్ బాండ్లు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే చూడాలనేది షారుక్ చిరకాల వాంఛ. ఈ విషయమై షారుక్ మాట్లాడుతూ ‘‘నా సీక్రెట్ ఫాంటసీ ఏంటంటే... ఈ రెండు పాత్రలను ఒకే సినిమాలో చూడాలని ఉంది. అలాంటి సినిమా వస్తే నా ఆనందానికి హద్దే ఉండదు. నా చివరి కోరిక కూడా ఇదే. ఎప్పటికైనా నెరవేరుతుందని అనుకుంటున్నాను’’ అని చెప్పారు. మరి ఆయన కోరిక తీరుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. -
కాపీ కొట్టడానికి హాలీవుడ్‌నిచ్చావ్!
ఆ సీన్ - ఈ సీన్ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై హాలీవుడ్ ప్రభావం ఎక్కువ. ‘చిరునవ్వుతో’ సినిమా దగ్గర నుంచి మొన్నటి ‘జులాయి’ వరకూ చాలా సినిమాలపై హాలీవుడ్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా సీన్లను తెచ్చు కోవడం త్రివిక్రమ్‌కు ఉన్న అలవాటు. పేరు పొందిన హాలీవుడ్ సినిమాల నుంచి తన మనసుకు నచ్చిన సీన్లను తెచ్చి మన మనసులకు నచ్చేలా తీర్చిదిద్ది తన సినిమాల్లో ప్లేస్ చేస్తుంటాడు త్రివిక్రమ్. ఇలా త్రివిక్రమ్ కలం విన్యాసం చేసిన సినిమాల్లో ఒకటి ‘నువ్వు నాకు నచ్చావ్’. ఇందులో ఎంతో పాపులర్ అయిన ఒక సీన్‌కు మూలం హాలీవుడ్ సినిమాలో ఉంది. హీరో అతిథిగా వచ్చిన ఆ ఇంట్లో అంతా మిలటరీ డిసిప్లిన్. ఇంటి పెద్ద అన్నీ నియమానుసారం జరగాలంటాడు. ఇంటి నుంచి బయటకు వెళ్తే చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకు వెళ్లాలి లాంటివి ఆయన నియమాలు. అలాగే భోజనానికి ముందు కచ్చితంగా ప్రార్థన చేసి తీరాలి. ఈ విషయం తెలియక లేటుగా వస్తాడు హీరో. డైనింగ్ టేబుల్ వద్దకు వస్తూనే భోజనం మీద పడ్డ హీరో వైపు ఇంట్లో వాళ్లంతా విచిత్రంగా చూస్తారు. భోంచేసే ముందు దణ్ణం పెట్టుకునే అలవాటు లేదా అన్న ఆ ఇంటి పెద్ద ప్రశ్నతో ఇబ్బంది పడిపోయిన హీరో దాన్ని కవర్ చేసుకునేందుకు చిత్ర విచిత్రమైన ప్రార్థన ఒకటి చేస్తాడు. అప్పటికప్పుడు ఆశువుగా తనకు తోచిన ప్రార్థన చేసేసి ఇంట్లో వాళ్లకి కన్ఫ్యూజన్ను, జనాలకు కామెడీని క్రియేట్ చేస్తాడు. ‘దేవుడా ఓ మంచి దేవుడా... నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావ్, బంగాళాదుంప ఫ్రై ఇచ్చావ్, చారు కూడా ఇచ్చావ్, అదే చేత్తో స్టేట్‌లో ఉన్న ఏడు కోట్ల మందికి, కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, ప్రపంచంలో ఉన్న... నంబర్ కరెక్ట్‌గా తెలీదు, ఎంతమంది ఉంటారో అంతమందికీ ఇవ్వు. యాజిటీజ్‌గా ఇదే మెనూ కాదు, బ్రెడ్డు, బటర్.. వారు ఏం తింటారో అది. అలా ఇస్తావని కోరు కుంటున్నా. నువ్వు ఇస్తావ్. ఎందుకంటే బేసికల్లీ యు ఆర్ గాడ్, ఎ వెరీ గుడ్ గాడ్’ అంటూ సాగుతుంది హీరో ప్రార్థన. ఈ సీన్ చూసి పడీ పడీ నవ్వని ప్రేక్షకుడు లేడన్నది అందరికీ తెలిసిందే. ఇంతగా పండిన ఈ సీన్‌కు మూలం ‘మీట్ ద పేరెంట్స్’ అనే హాలీవుడ్ సినిమాలోని ఓ సన్నివేశం. 2000లో వచ్చిన ‘మీట్ ద పేరెంట్స్’ హాలీవుడ్లో నవ్వులు పూయించింది. ప్రకాశ్‌రాజ్ పాత్రలో ప్రముఖ నటుడు రాబర్ట డి నీరో, వెంకటేష్ పాత్రలో బెన్ స్టిల్లర్ కనిపిస్తారా సినిమాలో. నీరోని ఇంప్రెస్ చేయడానికి డైనింగ్ టేబుల్ వద్ద బెన్ ప్రార్థన చేస్తాడు. వెంకీ ప్రార్థనలోని కొన్ని లైన్లు.. బెన్ ప్రార్థనలోని కొన్ని లైన్లకు అచ్చంగా మ్యాచ్ అవుతాయి. రెండూ చిత్ర విచిత్రమైన ప్రార్థనలే! నిజానికి హీరో ప్రార్థన మాత్రమే కాదు... ఆ తర్వాత కొనసాగింపుగా సాగే ప్రకాష్‌రాజ్ కవిత్వ ప్రహసనం కూడా హాలీవుడ్ సినిమాలోనిదే! హీరో అన్నం తినబోయే ముందు చేసే చిత్ర విచిత్రమైన ప్రార్థన విన్నాక... ప్రకాష్‌రాజ్ పాత్రలో కూడా భావుకత్వం తన్నుకొస్తుంది. తను తన తల్లిమీద రాసుకున్న కవిత్వాన్ని వినిపిస్తాడతను. ‘‘అమ్మా అడక్కుండానే జన్మనిచ్చావ్.. ఏడిస్తే పాలిచ్చావ్.. రాసు కోవడానికి పలకనిచ్చావ్.. గీసుకోవడానికి గడ్డం ఇచ్చావ్...’’ అంటూ సాగే ఆ కవిత మామూలుగా నవ్వించలేదు. ‘మీట్ ద పేరెంట్స్’ సినిమాలోని ఇంటిపెద్ద కూడా తన తల్లి గురించి కూడా ఇలాంటి కవితే వినిపిస్తాడు. ఆ కవితలోని లైన్లు, ప్రకాష్‌రాజ్ చెప్పే కవితలోని లైన్లు కూడా బాగా మ్యాచ్ అవుతాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ప్రకాష్‌రాజ్ కవిత విన్న వెంకటేష్ ‘మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్’ అంటాడు విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ. ఆంగ్ల చిత్రంలో హీరో బెన్ కూడా నీరో కవిత విని సేమ్ డైలాగ్ వల్లిస్తాడు. దాన్ని బట్టి ఈ సీన్ మీద ‘మీట్ ద పేరెంట్స్’ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ‘నువ్వు నాకు నచ్చావ్’లోని డైనింగ్ టేబుల్ సీన్‌కు ఎన్ని పేరడీలు వచ్చాయో చెప్పలేం. ప్రత్యేకించి ప్రకాష్‌రాజ్ తల్లి గురించి చెప్పే కవితపై ఫేస్బుక్లో అనేక పేరడీలు కనిపిస్తూ ఉంటాయి. త్రివిక్రమ్ రచనా ప్రావీణ్యంతో ఈ కవిత అంతగా మనవాళ్లలోకి చొచ్చుకుపోయింది. అయితే త్రివిక్రమ్‌కు ఆ సీన్‌ని రాసేందుకు స్ఫూర్తినిచ్చింది మాత్ర ం నిస్సందేహంగా హాలీవుడ్ చిత్రం ‘మీట్ ద పేరెంట్సే’! -
రాశిఖన్నా హాలీవుడ్ సినిమాలు ఎందుకు చూస్తోంది ?
-
ఎదురుచూపులన్నీ... ఈ అయిదింటి మీదే!
డైనోసార్ విధ్వంసాలు (‘జురాసిక్ పార్క్’)... ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు (‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో ఈథెన్ హంట్ గుర్తున్నాడుగా)... జేమ్స్ బాండ్ సినిమాల్లోని యాక్షన్ ఘట్టాలు.... రోబోల మధ్య యుద్ధం (‘టెర్మినేటర్’)... గగన వీధుల్లో మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాలు.... హాలీవుడ్ సినిమాను తలుచుకోగానే సగటు ప్రేక్షకుల మనోఫలకాల్లో కదలాడే సన్నివేశాలు ఇవన్నీ. ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు మళ్లీ మళ్లీ ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు కొన్ని హాలీవుడ్లో ఈ ఏడాది వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళూ ఆ సినిమాల మీదే. ఈ చిత్రాల మీద ఎన్నెన్నో ఆశలు, అంచనాలు ఉన్నాయి. వాటి గురించి ఓ సారి...! రానున్న కొద్ది నెలల్లో రానున్న అలాంటి అయిదు సినిమాల గురించి...! జురాసిక్ వరల్డ్ ‘జురాసిక్ పార్క్’... హాలీవుడ్ సినీ చరిత్రలో ఓ సంచలనం. స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత మరో రెండు భాగాలు వచ్చాయి. వీటికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు స్పీల్బర్గ్ నిర్మాణ సారథ్యంలో ‘జురాసిక్ వరల్డ్’ సినిమా రానుంది. చిత్ర కథ ప్రకారం... 22 ఏళ్ల తర్వాత జురాసిక్ వరల్డ్ థీమ్ పార్క్ ఓపెన్ చేస్తారు. శాస్త్రవేత్తల సృష్టితో తయారైన ఓ డైనోసార్ ఆ పార్క్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించిందన్న దానికి తెరరూపం ఇచ్చారు. ఈ చిత్రం ‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్ అని దర్శకుడు కొలిన్ ట్రెవెర్రో చెప్పారు. ఇందులో మరో విశేషం ఏంటంటే మన హిందీ సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జురాసిక్ పార్క్ సీఈవోగా కీలక పాత్రను పోషిస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్ టామ్ క్రూజ్ హీరోగా నటించిన ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా వచ్చిన నాలుగు భాగాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా నాలుగో భాగం ‘ఘోస్ట్ ప్రొటోకాల్’ కనకవర్షం కురిపించింది. త్వరలో ఐదో భాగం రాబోతోంది. ‘రోగ్ నేషన్’ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని టామ్‌క్రూజ్, జె.జె. అబ్రమ్స్, బ్రియాన్ బర్క్ కలిసి నిర్మిస్తున్నారు. క్రిస్టొఫర్ మెక్‌క్వారీ దర్శకుడు. రెబెకా ఫెర్గూసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఎప్పటి లాగే ఈ చిత్రం కోసం ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్లో టామ్ క్రూజ్ నటించారు. విమానం మీద చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రం రానున్న జూలై 31న విడుదల కానుంది. స్పెక్టర్ ‘‘మై నేమ్ ఈజ్ బాండ్... జేమ్స్ బాండ్’’...అనగానే ప్రతినాయకులతో బాండ్ చేసే పోరాటాలు, గాళ్స్‌తో రొమాన్స్ గుర్తొస్తాయి. బాండ్ ఎవరైనా ఈ బ్రాండ్ డైలాగ్, ఆ సినిమాలకున్న బ్రాండ్ ఎప్పటికీ మారదు. అంత కొత్తగా తీస్తారు. ఇప్పటిదాకా 23 బాండ్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా 24వ సినిమా ‘స్పెక్టర్’ రానుంది. డేనియల్ క్రెగ్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రంలో మోనికా బెలూసీ, లీ సీడక్స్ బాండ్ గాళ్స్గా నటిస్తున్నారు. శామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 6న విడుదల కానుంది. టెర్మినేటర్ జెనిసిస్ హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రాలలో టెర్మినేటర్ ఒకటి. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటిదాకా వచ్చిన రోబో చిత్రాలకు మార్గదర్శి. ఇప్పటిదాకా నాలుగు భాగాలు విడుదలయ్యాయి. వాటిలో మూడు భాగాలకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ఈ ఐదో భాగానికి ‘థోర్’ చిత్ర ఫేమ్ అలెన్ టేలర్ దర్శకుడు. ఎమీలియా క్లార్క్, జై కోర్టినీ, క్రిస్టియన్ బేల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. స్టార్ వార్స్- ద ఫోర్స్ ఎవేకెన్స్ దర్శక, రచయిత జార్జ్ లూకాస్ 1977లో అనుకుని ఉండరేమో... తన ఊహాసృష్టి ‘స్టార్ వార్స్’ పెను మార్పుకు దారితీస్తుందని! ఆయన దర్శకత్వం వహించిన ‘స్టార్ వార్స్’ ఫస్ట్‌పార్ట్ అప్పట్లో పెను సంచలనం. అది ఓ ఫ్రాంచైజ్‌గా మారిపోయింది. తర్వాత వరుసగా ఏడు వచ్చాయి. ఇప్పుడు ఎనిమిదో సినిమా కూడా రానుంది. హ్యారిసన్ ఫోర్డ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జె.జె. అబ్రమ్స్ దర్శకుడు. రానున్న డిసెంబర్ 18న ఈ చిత్రం రిలీజవుతోంది. -
హిందీలో... హాలీవుడ్ తార
నికోల్ కిడ్మాన్ భారతీయ సినిమా తారలు అడపా దడపా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంటారు. అలాగే, అక్కడి తారలు కూడా ఇక్కడి చిత్రాల్లో అడపాదడపా నటిస్తుంటారు. ఇప్పటివరకు హిందీ చిత్రాల్లో నటించిన హాలీవుడ్ తారల జాబితా డజను పైగానే ఉంటుంది. ‘కంబక్త్ ఇష్క్’లో సిల్వెస్టర్ స్టాలెన్ నటించారు. అదే చిత్రంలో నటి డినైస్ రిచర్డ్స్ కూడా నటించారు. ‘రంగ్ దే బసంతి’లో నటుడు స్టీవెన్ మాకింటోష్, ‘లగాన్’లో నటి రాచెల్ షెల్లీ.. ఇలా కొంతమంది హాలీవుడ్ తారలు కనువిందు చేశారు. ఇప్పుడీ జాబితాలో నటి నికోల్ కిడ్మాన్ చేరనున్నారని సమాచారం. అజయ్ దేవగణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తూ, నటిస్తున్న హిందీ చిత్రం ‘శివాయ్’లో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రకు నికోల్ అయితేనే నప్పుతారని అజయ్ అనుకోవడం, ఆమెను సంప్రతించడం జరిగిందని బాలీవుడ్లో టాక్. ఈ చిత్రంలో నటించడానికి నికోల్ సుముఖంగానే ఉన్నారట. -
స్పీల్బర్గ్ దర్శకత్వంలో?
ది వారియర్, ఎ మైటీ హార్ట్, ది నేమ్‌సేక్, ది అమేజింగ్ స్పైడర్మాన్, లైఫ్ ఆఫ్ పై... ఇలా పలు హాలీవుడ్ చిత్రాల్లో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించారు. త్వరలో విడుదల కానున్న ‘జురాసిక్ వరల్డ్’ చిత్రంలో కూడా ఇర్ఫాన్ కీలక పాత్ర చేశారు. ఇది ‘జురాసిక్ పార్క్’కి నాలుగో సీక్వెల్. తొలి భాగానికి దర్శకత్వం వహించిన స్పీల్బర్గ్ ఈ సీక్వెల్‌కి మాత్రం ఓ నిర్మాతగా వ్యవహరించారు. త్వరలో మరో చిత్రం చేయడానికి స్పీల్బర్గ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తారా? లేక నిర్మిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు బాధ్యతల్లో ఏది నిర్వహించినా.. ఈ చిత్రంలో మాత్రం ఇర్ఫాన్‌ఖాన్‌తో ఓ కీలక పాత్ర చేయించాలని స్పీల్బర్గ్ అనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఇర్ఫానే తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని ఇర్ఫాన్ చెప్పారు. -
హాలీవుడ్లో మనవాళ్లు..!
పంచామృతం: అమెరికా కేంద్రంగా ఉండే హాలీవుడ్ చిత్ర పరిశ్రమపై ప్రపంచంలోని అనేక దేశాల నటీనటులు, దర్శకులు తమదైన ప్రభావాన్ని చూపుతున్నారు. మరి హాలీవుడ్‌పై భారతీయుల ప్రభావం ఎంత? హాలీవుడ్ సినిమాలను అమితంగా ఆదరించే భారతీయుల్లో ఎంతమంది అక్కడ ప్రముఖ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు అంటే అలాంటి వారి సంఖ్య స్వల్పమేనని చెప్పాలి. అలా హాలీవుడ్ సినీ పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న భారతీయుల్లో ముఖ్యమైన వాళ్లు... ఏఆర్ రెహమాన్ ‘ఇండియాస్ ఫస్ట్ డబుల్-ఆస్కార్ విన్నర్’ గుర్తింపు ఉన్న ఏఆర్ రెహమాన్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కు ముందు, తర్వాత కూడా కొన్ని హాలీవుడ్ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. ‘ఎలిజబెత్: ది గోల్డెన్ఏజ్’తో రెహమాన్ హాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనేక సినిమాలకు నేపథ్య సంగీతాన్ని, స్వరాలను సమకూర్చారు. ఆస్కార్ అవార్డులను కూడా అందుకుని హాలీవుడ్‌పై భారతీయ ముద్రను వేశారు. ఇర్ఫాన్ ఖాన్ హాలీవుడ్ సినిమాల్లో నటుడిగా భారతదేశం ఆవల మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఇర్ఫాన్‌ఖాన్. ప్రత్యేకించి భారతనేపథ్యంలో నడిచే హాలీవుడ్ సినిమాల్లో ఇర్ఫాన్‌ఖాన్ తప్పనిసరి పాత్రధారి. అకాడమీ అవార్డులు పొందిన స్లమ్డాగ్మిలియనీర్, లైఫ్ ఆఫ్ పైలలో ఈ నటుడు కీలక పాత్రలు వేశారు. ఇంకా ‘ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్’ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. అనిల్ కపూర్ బాలీవుడ్లో అనిల్ కపూర్‌కు హీరోగా కాలం చెల్లిపోయిందేమో కానీ... హాలీవుడ్లో మాత్రం ఈ హీరోగారి ప్రభ క్రమంగా పెరుగుతోంది. స్లమ్‌డాగ్ మిలియనీర్‌తో అనిల్ కపూర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడిప్పుడే భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా అనిల్‌కు ప్రముఖపాత్రలు దక్కుతున్నాయి. టామ్క్రూజ్తో కలిసి ‘మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రొటోకాల్’ సినిమాలో అనిల్ కపూర్ నటించారు. అశోక్ అమృత్‌రాజ్ హాలీవుడ్లో దాదాపు వంద సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు అశోక్అమృత్రాజ్. ఒకనాడు భారతదేశం తరపున వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో పాల్గొన్న ఈ టెన్నిస్ ఆటగాడు ఆ తర్వాత హాలీవుడ్ సినీ నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. అనేక హిట్స్‌ను సాధించారు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన ‘ఘోస్ట్‌రైడర్’ వంటి సినిమాలు ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఎమ్.నైట్ శ్యామలన్ స్క్రీన్‌రైటర్, డెరైక్టర్, ప్రొడ్యూసర్‌గా హాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న భారతీయుడు మనోజ్ నైట్ శ్యామలన్. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు. హాలీవుడ్లో ‘ద సిక్త్‌సెన్స్’ ‘అన్బ్రేకబుల్’ ‘లేడీ ఇన్ ద వాటర్’ ‘ఆఫ్టర్ ఎర్త్’వంటి సినిమాలతో శ్యామలన్ తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. -
వసూళ్లతో వావ్ అనిపించాయి!
పంచామృతం: తుపానుతో పోల్చాలో, దబాయించి కురిసే జడివానగా అభివర్ణించాలో కానీ ఆ సినిమాలు విడుదల అయినప్పుడు థియేటర్ల బాక్సాఫీసుల్లో కాసుల కుంభవృష్టి కురిసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొన్నాయి. దశాబ్దాల హాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలయ్యాయి. నిర్మాతలకు కలెక్షన్ల పంట పండించాయి. ప్రపంచ రికార్డులను సృష్టించాయి. ఆ రికార్డుల పుటల్లోని తొలి ఐదు సినిమాలివి. స్టార్‌వార్స్-1(1999): హాలీవుడ్లో స్థాయిని రెండు వేల కోట్ల రూపాయలకు చేర్చిన రెండో సినిమా ఇది. ఒక దశలో టైటానిక్ తర్వాతి స్థానంలో ఉండేది.ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చింది. 47,45,44,677డాలర్ల వసూళ్లను సాధించిన ఈ సినిమా రేంజ్‌ను రూపాయల్లో చెప్పాలంటే రెండు వేల కోట్ల రూపాయలు. అవతార్(2009) సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో ‘ఎపిక్’ అనదగ్గ అవతార్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా. ఈ సినిమా వసూళ్ల మొత్తం మన రూపాయి ల్లో చెప్పాలంటే దాదాపు 4,500 కోట్లు. పాత రికార్డులను తుడిచిపెట్టేస్తూ ఇది ఈ మొత్తంతో కొత్త రికార్డును సృష్టించింది. దర్శకుడు జేమ్స్ కామెరున్. విశేషం ఏమిటంటే ఈ సినిమా కన్నా ముందు అత్యధిక స్థాయి వసూళ్లు చేసిన సినిమాల్లో తొలి స్థానంలో ఉన్న టైటానిక్‌ను కూడా కామెరూనే రూపొందించాడు. ది డార్క్‌నైట్ (2008) ఈ బ్రిటిష్-అమెరికన్ సూపర్‌హీరో సినిమాకు 53,31,60,671కోట్ల డాలర్లు కలెక్షన్లుగా వచ్చాయి. 2005లో విడుదల అయిన‘బ్యాట్మన్ బిగిన్స్’కు సీక్వెల్‌గా వచ్చింది ఈ సినిమా. దాదాపు మూడు వేల రెండువందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. టైటానిక్ (1997): 1997 నాటికి ‘నభూతో నభవిష్యతి’ అనిపించిన సినిమా టైటానిక్. టైటానిక్ షిప్ ప్రమాదానికి కాల్పనికతను జోడించి జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సినిమా 65,86,72,302 డాలర్ల సొమ్మును వసూలు చేసింది. లియొనార్డో డికాప్రియో, కేట్విన్సేట్లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వసూళ్ల స్థాయి రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 4,000 కోట్లు. ది అవేంజర్స్(2012) ఎన్నో యేళ్లుగా కొలువైన సినిమాల రికార్డులను తుడిచేస్తూ అత్యధిక స్థాయి వసూళ్లను సాధించిన వాటిల్లో మూడో స్థానంలో నిలిచిన సినిమా ‘ది అవేంజర్స్’. ఇది వస్తూనే థియేటర్లను కళకలాడించింది. ఈ సినిమాకు దాదాపు 62,32,79,547డాలర్ల డబ్బు వచ్చింది. ఆ మొత్తాన్ని భారతీయ మారకంలో చెప్పాలంటే మూడువేల ఎనిమిదివందల కోట్ల రూపాయలు. -
హాలీవుడ్లో భారతీయ తేజం!
సినిమాల్లో అవకాశం రావడం అంటే మాటలు కాదు...ఇక హాలీవుడ్ సినిమాలు సరేసరి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అయినా ఏదైనా హాలీవుడ్ సినిమాలో చేయబోతున్నాడంటే అది అత్యంత ప్రముఖమైన వార్తగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో కరణ్బ్రార్ అనే ఒక టీనేజర్ హాలీవుడ్లో స్టార్‌గా వెలుగొందుతున్నాడు. డిస్నీ, ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ వంటి సంస్థల సినిమాల్లో చేస్తున్నాడు. అమెరికన్ టీనేజ్ సినీస్టార్లతో సమానమైన గుర్తింపును తెచ్చుకొన్నాడు. పుట్టి పెరిగింది అమెరికాలోనే అయినా భారతీయ మూలాలు కలిగిన కరణ్ బ్రార్ గురించి... కరణ్ తల్లిదండ్రులు భారతీయులు. చాలా సంవత్సరాల కిందట అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే పుట్టి పెరిగిన కరణ్ హైపర్ యాక్టివ్. ఇతడిలోని చురుకుదనాన్ని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు. తమ పిల్లాడిలోని యాక్టివ్నెస్ యాక్టింగ్‌కు బాగా పనికొస్తుందని వారు భావించారు. అందుకే కరణ్‌ను ఆ దిశగా ప్రోత్సహించారు. నట శిక్షణ విషయంలో జరిగే వివిధ వర్క్‌షాప్‌లకు తీసుకెళ్లేవారు. అలా ఏడెనిమిదేళ్ల వయసు నుంచే కరణ్‌కు నటనతో పరిచయం ఏర్పడింది. అనుకోని అవకాశం... అమెరికాలో నివసించే ఒక భారతీయ బాలుడి అగచాట్ల నేపథ్యమే ‘డైరీ ఆఫ్ ఏ వింపీకిడ్’ సినిమా నేపథ్యం. ఇదే పేరుతో వచ్చిన ఒక నవలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. సినిమాలో టైటిల్ రోల్ కోసం ఒక భారతీయ బాలుడి అన్వేషణలో ఉన్న దర్శకుడు థార్‌కు ‘కరణ్’ తగిలాడు. నటన మీద ఆసక్తి ఉన్న కరణ్‌ను తన సినిమాలో ప్రధానపాత్ర కోసం ఎంచుకొన్నాడు ఆ దర్శకుడు. తొలి సినిమా కోసం హోమ్ వర్క్... కథ ప్రకారం కరణ్ భారతీయ శైలిలో ఇంగ్లిష్‌ను మాట్లాడాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో పుట్టి పెరిగిన కరణ్‌కు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్ అలవాటయింది. దీంతో తప్పనిసరిగా తన భాషను మార్చుకోవాల్సి వచ్చింది. ఒక శిక్షకుడిని పెట్టుకొని మరీ భారతీయ శైలిలో ఇంగ్లిష్ భాషను మాట్లాడటం ప్రాక్టీస్ చేశాడు కరణ్. కరణ్ కష్టం ఊరికే పోలేదు. 2010లో విడుదల అయిన ‘డైరీ ఆఫ్ ఏ వింపీకిడ్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఒకటిన్నర కోటి డాలర్లతో రూపొందించిన ఈ సినిమా దాదాపు 12 కోట్ల డాలర్ల సొమ్మును వసూలు చేసింది. ఇందులో కరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. 2011లో వివిధ అవార్డుల విషయంలో కరణ్ నామినేట్ అయ్యాడు. యంగ్ ఆర్టిస్ట్ అవార్డును కూడా అందుకొన్నాడు. సీక్వెల్ మీద సీక్వెల్... కరణ్ తొలి సినిమా బాగా ఆడటంతో దీనికి సీక్వెల్స్ రూపొందాయి. ‘డైరీ ఆఫ్ ఏ వింపీకిడ్’కు 2011లో ఒక సీక్వెల్, 2012లో మరో సీక్వెల్ వచ్చాయి. ఈ సినిమాల్లో కథాంశం, పాత్రధారులు మారినా... కరణ్మాత్రం ‘చిరాగ్ గుప్తా’ అనే తన ముఖ్యపాత్రను సొంతం చేసుకొన్నాడు. ఈ మూడు సినిమాలూ కలిసి కోట్ల డాలర్లను వసూలు చేశాయి. దీంతో కరణ్‌కు స్టార్‌హోదా వచ్చింది. ఇప్పుడు హాలీవుడ్‌లోని టీన్ ఆర్టిస్టుల్లో పద్నాలుగు సంవత్సరాల కరణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వింపీకిడ్ సినిమా తర్వాత... ఈ యేడాదిలో కరణ్ సినిమాలు రెండు విడుదల అయ్యాయి. కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్‌లో కూడా నటిస్తున్నాడు. కరణ్ నటనను చూసి ‘‘ ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది, హాలీవుడ్లో నటుడిగా ఉన్నతస్థాయికి చేరుతాడు’’ అని సినీ పండితులు అంటున్నారు.