Netflix Launched New Website For Most Watched Movies: ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మూవీస్, వెబ్ సిరీస్, యాప్ అప్‌డేట్ ఫీచర్స్‌తో ఎప్పుడూ ముందుంటుంది. ఈ ఓటీటీలో ఎప్పుడూ కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతాయి. అయితే వీటిలో ఎక్కువ ప్రేక్షకాధరణ పొందినవి, హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకోవండ కష్టమైన పని. దీంతో ఏ సినిమా బాగుంది ? ఏ వెబ్ సిరీస్ చూడాలి ? అని తోటి స్నేహితుల్ని, సినిమా పిచ్చి ఉన్నవారిని అడుగుతుంటారు. అయితే ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ కొత్తగా ఆలోచించింది. తమ యూజర్‌లు ఇంకొకరిపై ఆధారపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం తాజాగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది నెట్‌ఫ్లిక్స్.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ 'టాప్10.నెట్‌ఫ్లిక్స్(https://top10.netflix.com/)' పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో ఇంగ్లీష్ (మూవీస్, టీవీ సిరీస్), నాన్ ఇంగ్లీష్ (మూవీస్, టీవీ సిరీస్) కేటగిరీల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులో ఉంచుతోంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రేక్షకులు వీక్షించిన సమయం ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. ప్రతి మంగళవారం ఈ టాప్ 10 జాబితాను విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఒక సినిమా, వెబ్ సిరీస్ వేర్వేరు దేశాల్లో ఎంత వరకు ప్రేక్షకాధరణ ఉందనేది కూడా ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ ఇంగ్లీష్, స్పానిష్, భాషల్లో ఉండగా, వచ్చే సంవత్సరం నుంచి మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురానుందట.
చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్.. మొబైల్ గేమ్స్.. ఆడటం ఎలా?
Comments
Please login to add a commentAdd a comment