new website
-
టీటీడీ ఆలయాల సమాచారంతో అందుబాటులోకి ఆధునీకరించిన వెబ్సైట్
-
ఓటర్ల నమోదుకు కొత్త వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న నేషనల్ ఓటర్ పోర్టల్ సర్వీస్(ఎన్వీపీఎస్) వెబ్‌సైట్‌కి బదులు ‘ఓటర్స్’పేరుతో కొత్త వెబ్సైట్ ( https:// www.voters.eci.gov.in )ను అందుబాటులోకి తెచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, జాబితా నుంచి పేరు తొలగింపు, చిరునామా మార్పు వంటి అవసరాలకు 6, 6ఏ, 7, 8 వంటి ఫారాలను వినియోగిస్తూ ఇకపై కొత్త వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, పాత వెబ్సైట్ ఇక పనిచేయదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత విశిష్ట రిఫరెన్స్ నంబర్‌ను ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా దరఖాస్తుదారులకు పంపిస్తామన్నారు. ఈ నంబర్ ద్వారా దరఖాస్తు స్థితిగతులను తెలుసుకోవచ్చు అన్నారు. కొత్త పోర్టల్ ద్వారా ఓటర్ల జాబితాను పరిశీలించవచ్చని, ఓటరుగుర్తింపు కార్డుకోసం, ఓటరు కార్డులో మార్పులకోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు ఏ పోలింగ్ బూత్, శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాడు అన్న వివరాలు సైతం తెలుసుకోవచ్చు అని వెల్లడించారు. పోలింగ్ బూత్ స్థాయి అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)ల వివరాలను సైతం తెలుసుకోవచ్చని తెలిపారు. -
నెట్‌ఫ్లిక్స్ కొత్త వెబ్సైట్.. ఎందుకో తెలుసా ?
Netflix Launched New Website For Most Watched Movies: ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మూవీస్, వెబ్ సిరీస్, యాప్ అప్డేట్ ఫీచర్స్‌తో ఎప్పుడూ ముందుంటుంది. ఈ ఓటీటీలో ఎప్పుడూ కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతాయి. అయితే వీటిలో ఎక్కువ ప్రేక్షకాధరణ పొందినవి, హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకోవండ కష్టమైన పని. దీంతో ఏ సినిమా బాగుంది ? ఏ వెబ్ సిరీస్ చూడాలి ? అని తోటి స్నేహితుల్ని, సినిమా పిచ్చి ఉన్నవారిని అడుగుతుంటారు. అయితే ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ కొత్తగా ఆలోచించింది. తమ యూజర్లు ఇంకొకరిపై ఆధారపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం తాజాగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది నెట్‌ఫ్లిక్స్. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ 'టాప్10.నెట్‌ఫ్లిక్స్(https://top10.netflix.com/)' పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో ఇంగ్లీష్ (మూవీస్, టీవీ సిరీస్), నాన్ ఇంగ్లీష్ (మూవీస్, టీవీ సిరీస్) కేటగిరీల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందుబాటులో ఉంచుతోంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రేక్షకులు వీక్షించిన సమయం ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. ప్రతి మంగళవారం ఈ టాప్ 10 జాబితాను విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఒక సినిమా, వెబ్ సిరీస్ వేర్వేరు దేశాల్లో ఎంత వరకు ప్రేక్షకాధరణ ఉందనేది కూడా ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ ఇంగ్లీష్, స్పానిష్, భాషల్లో ఉండగా, వచ్చే సంవత్సరం నుంచి మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురానుందట. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్.. మొబైల్ గేమ్స్.. ఆడటం ఎలా? -
కొత్త ఇన్‌కంటాక్స్ పోర్టల్ మరీ ఇంత ఖరీదా?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) జూన్ 7న కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫిల్లింగ్ పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులకు చిరాకు లేని, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ను ప్రారంభించింది. అయితే, ఈ పోర్టల్ రూపకల్పన పనిని కేంద్ర ప్రభుత్వం రూ.4,242 కోట్లకు ఇన్ఫోసిస్ కు అప్పజెప్పింది. ఇప్పుడు ఈ కొత్త పోర్టల్ లో అనేక బగ్స్ బయట పడుతున్నాయి. దీంతో చాలా మంది కొత్త పోర్టల్ సేవల విషయంలో అసౌకర్యానికి గురి అవుతున్నారు. మరికొందరు తమ కోపాన్ని మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఆదాయపు పన్ను పోర్టల్ ఇప్పుడు కొత్త జీఎస్ టీ పోర్టల్ గా మారిందని సీఎ రీతు గుప్తా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మరికొందరు పాత ఆదాయపు పన్ను వెబ్ సైట్ ను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. @casansaar అనే వ్యక్తి ఎందుకు టెస్టింగ్ చేయకుండా తీసుకొచ్చారు, అంత అత్యవసరంగా లాంచ్ చేయాల్సిన అవసరం ఏమి ఉంది అని అన్నారు. పాత పోర్టల్ బాగానే పనిచేస్తున్నప్పటికి కొత్త పోర్టల్ అనవసరమని కామెంట్ చేశారు. ఈ పోర్టల్ కి రూ.4200 కోట్లు ఖర్చు చేశారా? అని ఎగతాళి చేశారు. అయితే, ఈ సమస్యలపై కేంద్రం స్పందించింది. జూన్ 22 వీటి విషయంలో ఇన్ఫోసిస్, కేంద్రం మరో సారి సమావేశం కానుంది. After hearing about the 4200 cr new site, I have ordered 20 men to come and change a light bulb. P.S. The light was working just fine. But I had too much time at hand. #4200cr #incometaxnewportal — Rakshita Khanna (@Raxita) June 10, 2021 FM @nsitharaman Ji, Why No testing of the new income tax portal before its launched? Why so hurry in launching the new portal? Any penalty clause on developers / officers?@Infosys @NandanNilekani @FinMinIndia @IncomeTaxIndia @ianuragthakur @PMOIndia #incometaxportal #harassment — CA Sansaar (@casansaar) June 9, 2021 చదవండి: జనవరి నుంచి భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు -
ఆన్లైన్ సోల్
వస్తువులు, పుస్తకాలు, దుస్తులు, నగదు రూపేణా ఎవరికైనా సాయం చేయాలనుకున్న దాతలు వారి కోసం సదరు స్వచ్ఛంద సంస్థలను వెతుకుతుంటారు. ఆ వెతుకులాటలో తమ సాయం సరైన వారికి చేరుతుందా లేదా అనే సందేహమూ ఉంటుంది. బెంగళూరు వాసి సోనికా గహ్లోట్ నాయక్ ఈ పరిస్థితిని గమనించి దేశంలోని అన్ని ఎన్జీవోలను అనుసంధానిస్తూ ‘హ్యాపీ సోల్’ పేరుతో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్‌ఫాం ఎవరికైనా సరే అవసరమైన ఎన్జీఓలకు దానం చేయడానికి సహాయపడుతుంది. దీని రూపకర్త సోనికా గహ్లోట్ నాయక్. 2017 సంవత్సరంలో వారాంతాల్లో ఓ రోజు బట్టలు, పుస్తకాలను దానం చేయడానికి స్వచ్ఛంద సంస్థల గురించి ఆన్ లైన్ జాబితా వెతకడం మొదలుపెట్టింది. భారతదేశం అంతటా ధృవీకరించిన స్వచ్ఛంద సంస్థల జాబితా గల ప్లాట్‌ఫారమ్ ఏదీ లేవని తెలిసి ఆశ్చర్యపోయింది. ఎన్జీఓల అనుసంధానం ఈ అంతరాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్జీఓలను అనుసంధానించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది సోనికా. వ్యక్తులు, కార్పొరేట్లు, ఎన్జీఓలను కలిపే ఒక వేదిక అయిన హ్యాపీ సోల్‌ను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఈ పోర్టల్ ద్వారా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, జంతువుల ఆశ్రయాలు, నిరుపేద పాఠశాలల జాబితా చేసింది. ఆమె మొదట దీనిని ప్రారంభించినప్పుడు సమాచార సేకరణకు వ్యక్తిగతంగా బెంగళూరులోని ప్రతి ఎన్జీఓలను కలిసింది. కొన్ని చిన్న సంస్థలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను కూడా గుర్తించింది. ధృవీకరించిన చట్టపరమైన పత్రాలతో పారదర్శకత, జియోట్యాగ్ చేయబడిన ఎన్జీఓలను నమోదు చేసే వెబ్సైట్ ప్రారంచింది. ఈ ప్లాట్‌ఫాంపై తమ ప్రొఫైల్స్‌ను రూపొందించడానికి ఎన్జీఓల నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయదు. ఇది ఎన్జీఓల కార్యకలాపాలు, ఫోకస్, ప్రాంతాలు, లక్ష్యం, ప్రేక్షకుల వివరాలతో మినీ వెబ్‌సైట్‌గా పనిచేస్తుంది. వనరుల సద్వినియోగం ఈ పోర్టల్ ద్వారా కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రజలు తమ ఇంటి నుండి సరుకులను నేరుగా స్వచ్ఛంద సంస్థలకు పంపించటానికి వీలుగా సేవలను పొందారు. ఈ ప్లాట్‌ఫామ్ వినియోగదారులు ఎంపిక చేసిన ఎన్జీఓలకు పికప్–డ్రాపింగ్ సేవలను కూడా అందించింది. కస్టమర్ల రియల్ టైమ్ అప్డేట్స్, వారి వస్తువులు సరైన ఆశ్రమాలకు చేరడం నిర్ధారణతోపాటు, పర్యావరణానికి వారు ఎలా వైవిధ్యం చూపించారనే వివరాలను కూడా ఇందులో జత చేశారు. హ్యాపీ సోల్ నమూనా ఒక సరళమైన రెండుదశల ప్రక్రియ. కస్టమర్ మొదట ఒక ఎన్జీఓ పోస్ట్ చేసిన వాంటెడ్ ఐటమ్స్ జాబితాను తీసుకొని, దానిద్వారా వెళతారు, తరువాత వారు దానం చేయదలిచిన వస్తువుల పరిమాణాన్ని జోడించి, బ్యాగులు లేదా డబ్బాల్లో వాటిని సిద్ధం చేస్తారు. వస్తువుల డెలివరీ కోసం రూ. 200 నుండి రూ .5000 వరకు సౌలభ్య రుసుము వసూలు ఉంటుంది. ఎన్ని వస్తువులు పంపబడుతున్నాయి, డెలివరీ మోడ్ ద్విచక్ర వాహనమా, త్రీవీలరా లేదా మినీ ట్రక్కా... వంటి ఎంపికలు కూడా ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే, దేశమంతటా మిగులు, వస్తువుల కొరత మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. -
ఇన్వెస్ట్.. తెలంగాణ బెస్ట్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. పెట్టుబడి పెట్టాలనుకునేవారికి అవసరమైన సమాచారాన్ని అందులో పొందుపర్చింది. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’వెబ్‌సైట్‌ను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో కలిసి గురువారం ఇక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సులభతర వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికిగాను ప్రోత్సాహక విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వక పోటీని కొనసాగిస్తూనే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ పెట్టుబడిదారులకు అవసరమైన సంపూర్ణ సమాచారం అందజేస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వెబ్సైట్లో ఇప్పటికే పలు ప్రభుత్వసేవలకు సంబంధించిన లైవ్‌లింక్‌లు ఉన్నాయని, వీటి ద్వారా పెట్టుబడిదారులు ఆయా సేవలను నేరుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ భాషల్లోనూ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడిదారులకు అవసరమైన సమాచారం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సంపూర్ణ సమాచారాన్ని ఐటీ, పరిశ్రమల శాఖలు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’వెబ్సైట్లో పొందుపరిచాయి. వెబ్‌సైట్‌కు సంబం«ధించిన సమాచారాన్నిగానీ, ఫీడ్బ్యాక్నుగానీ invest-telangana@telangana. gov.inకు పంపాలని పరిశ్రమల శాఖ సూచించింది. https://invest.telan gana.gov.in/ లింక్ ద్వారా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని వెల్లడించింది. -
తెలుగులోనూ ఫిర్యాదుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుచేసిన ‘గ్రీవెన్సెస్ రిడ్రసెల్ సిస్టమ్’ అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే.. వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను (http://bigrs. telangana.gov.in/) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌ను రూపొందించింది. వారంలో తెలుగులోనూ ఫిర్యాదులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. సెలవులు మొదలుకొని పరీక్ష ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్లు, మెమోలు, ఫలి తాలు, వాటిల్లో దొర్లే పొరపాట్లు తదితర 36 రకాల ఫిర్యాదులను స్వీకరించేలా ఏర్పాట్లు చేసింది. అలాగే ఇతర సమస్యలను పేపరుపై రాసి అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఫిర్యాదుల పరిష్కారానికి గడువు విధించింది. సమస్య పరిష్కారమైనదీ లేనిదీ విద్యార్థి తెలుసుకునేందుకు రిఫరెన్స్ నంబర్‌ను (విద్యార్థి మొబైల్‌కు పంపనుంది) ఇవ్వనుంది. ఫిర్యాదుల పరిష్కారంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు రెండు మూడు రోజుల్లో మొబైల్ యాప్ తీసుకురానుంది. వెబ్సైట్లో విద్యార్థి తన మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా వెబ్సైట్లోకి ఎంటర్ అయి ఫిర్యాదు చేయవచ్చు. విద్యార్థి తన ఫిర్యాదును అధికారులు పరిష్కరించలేదని భావిస్తే మళ్లీ ఆన్లైన్లోనే రెయిజ్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఫేస్బుక్, వాట్సాప్, జీమెయిల్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఏ ఒక్క విద్యార్థికీ నష్టం వాటిల్లకుండా చర్యలు: సీఎస్ మార్చిలో జరిగే పరీక్షలకు 9.65 లక్షల మంది హాజరు కానున్నారని, అందులో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సీఎస్ స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తున్నారంటే ప్రభుత్వం విద్యార్థుల విషయంలో ఎంత సీరియస్ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, బోర్డు అధికారులు పాల్గొన్నారు. -
ఐటీబీపీకి పెళ్లిళ్ల వెబ్సైట్
న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ సరిహద్దు దళం (ఐటీబీపీ)లో పనిచేస్తున్న బ్రహ్మచారుల కోసం ఐటీబీపీ ఒక పెళ్లిళ్ల వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఐటీబీపీలో పనిచేసే సిబ్బందికి సరిపడే జీవిత భాగస్వామిని వెతికిపెట్టేందుకే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి. ఐటీబీపీలో ప్రస్తుతం 25 వేల మంది అవివాహిత పురుష, వేయి మంది అవివాహిత మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించాయి. వీరు సరిహద్దులోని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తుండటం వల్ల జీవిత భాగస్వామిని వెతకడం వారి కుటుంబాలకు కష్టంగా మారుతోందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. దళంలో ప్రస్తుతం 333 జంటలు (భార్యాభర్తలు) పనిచేస్తున్నాయి. ఐటీబీపీలో పనిచేసే చాలా మంది సంస్థలోనే పనిచేసే భాగస్వామి కావాలని కోరుకుంటున్నారని, క్లిష్ట పరిస్థితుల్లో వారు పనిచేస్తున్న రీత్యా భాగస్వామితో కలసి పనిచేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందని అనుకుంటున్నారని తెలిపారు. ఈ వెబ్సైట్లో అవివాహిత లేదా భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న, విడాకులు తీసుకున్న సైనికులు నమోదు చేసుకోవచ్చనితెలిపారు. ఇప్పటివరకు ఈ వెబ్సైట్లో 150 మంది నమోదు చేసుకున్నారు. సాయుధ బలగాల్లోని మొత్తం 10 లక్షల మందిలో 2.5 లక్షల మంది అవివాహితులు. -
గురుశిష్యుల అభిప్రాయాల వేదిక
– విద్యాశాఖ సరికొత్త వెబ్సైట్ – ‘ఏపీ సబ్జెక్ట్ ఫోరం’తో పోర్టల్ – సెప్టెంబర్ 4న ప్రారంభం అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కొత్త వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్లో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలు తెలియజేసేందుకు ‘ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ ఫోరం’ పేరుతో కొత్త వెబ్ పోర్టల్‌ను విద్యాశాఖ రూపొందించింది. దీనిద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమవద్ద ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులకు చేరవేయొచ్చు. గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 4న ఈ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోర్టల్‌లో లాగిన్కావడం ఇలా.. జ్టి్టp;//111.93.8.43;8080 లేదా జ్టి్టp;//్చp్ఛజ్ఠు.జీn/ గూగుల్‌లో టైప్ చేస్తే ‘ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ ఫోరం’ అనే పేరుతో వెబ్ పోర్టల్ ఓపన్ అవుతుంది. – వెబ్సైట్ ముఖ చిత్రంలో కనిపించే టీచర్ జోన్ అనే టాబ్ క్లిక్ చేయాలి. – అక్కడ కొత్తగా నమోదయ్యేవారు న్యూటీచర్ రిజిస్ట్రేషన్ వద్ద క్లిక్ చేయాలి. – రిజిస్ట్రేషన్ వద్ద టీచర్ అని టైపు చేయాలి. – కింది కాలంలో సెల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. (ఇటీవల నమోదు చేసిన టీచర్ డేటా సిస్టంలో ఇచ్చిన ఫోన్ నంబర్ మాత్రమే తీసుకుంటుంది.) – అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ అంకెలు ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్ నొక్కాలి. – తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇటీవల టీచర్ డేటాలో నమోదు చేసిన వివరాలతో లాగిన్ అయిన పేజీ కనిపిస్తుంది. – ఆ పేజీలో ఫొటో అప్లోడ్ చేయాలి. తండ్రి పేరు, సబ్జెక్టు వివరాలు, మీరు ఏ అంశంలో నిష్ణాతులో తెలిపి, మీ గురించి పరిచయ వాక్యాలు కంపోజ్ చేసి, సబ్మిట్ బటన్ నొక్కాలి. ఈ ప్రక్రియతో ఈ వెబ్సైట్లో మీ పేరున రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇవీ లక్ష్యాలు : – ఈ వెబ్‌పోర్టల్‌లో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరినీ భాగస్వాములు చేయాలనేది ప్రధాన లక్ష్యం – ఉపాధ్యాయులకు అవసరమైన వృత్తి నైపుణ్యాలు పెంచేందుకు ఎప్పడికప్పుడు సమాచారం అందించాలి – ఇకపై మీ సబ్జెక్టుల్లోగాని ఇతర సబ్జెక్టుల్లోగానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఉపాధ్యాయ మిత్రులు పోస్ట్ చేసిన విద్యా సంబంధిత అంశాలు తెలుసుకోవచ్చు. అనుభవాలు, తరగతి గదిలోని అనుభూతులు పంచుకోవచ్చు. – నమోదైన టీచర్లు ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను కూడా ఈ వెబ్సైట్లో చేర్చాలి. ఇందుకు సంబంధించిన నమోదు కాలం వెబ్సైట్లో పొందుపరిచారు. – ఈవెబ్సైట్లో నమోదైన వారు విద్యా సమాచారంతోపాటు వీడియోలు, చిత్రాలు, పాఠ్య ప్రణాళికలు, ప్రాజెక్ట్‌లు, అనుభవాలు, విద్యార్థుల ప్రతిస్పందనలు తదితర అంశాలు పంచుకునే అవకాశం ఉంటుంది. – విద్యా సంబంధిత నోటిఫికేషన్లు, సెమినార్లు, రూపొందించే ఫోరాలు, ధ్రువీకరణ పత్రాలు వంటివి ఈ సైట్లో అందుబాటులోకి తెస్తారు. – ఈ వెబ్సైట్ ద్వారా ఈ–కాంటాక్ట్‌ను తయారు చేసి, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు అందించొచ్చు. టీచర్లందరూ భాగస్వామ్యులు కావాలి జిల్లాలోని టీచర్లందరూ ఈ వెబ్సైట్లో తమ యూడైస్ ఫోన్ నంబర్ ద్వారా పేర్లను నమోదు చేసుకుని సబ్జెక్టు ఫోరంలలో భాగస్వామ్యులు కావాలి. వచ్చే నెల 4న ప్రభుత్వం అధికారికంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. నమోదులో ఏవైనా సమస్యలు ఎదురైతే చంద్రమౌళి (94405 73989), వజ్ర నరసింహారెడ్డి (95337 41772), ఓబుళరెడ్డి (94917 77766),సోమశేఖర్ (94401 55510), కేశవరెడ్డి (94400 16835) నంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. – లక్ష్మీనారాయణ, ఇన్చార్జ్ డీఈఓ -
సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్ సైట్ ఆవిష్కరణ
న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఒలంపియాడ్.ఇన్ఫో)ను ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ సీఎస్ మమత బినాని ప్రారంభించారు. ఐసీఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ సీఎస్ శ్యామ్ అగర్వాల్, కౌన్సిల్ సభ్యులు, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆధునిక హంగులతో పోలీస్ వెబ్సైట్
హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు అధికారిక వెబ్సైట్ (www.hyderabadpolice.gov.in) రూపుమారుతోంది. సమకాలీన అవసరాలకు తగ్గట్టు ఆధునిక హంగులతో అప్డేట్ చేస్తున్నారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సెల్ తుదిమెరుగులు దిద్దుతున్న కొత్త వెర్షన్ వచ్చే వారం నుంచి ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నగర పోలీసు విభాగం 2008లో ఆన్‌లైన్‌లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై పోలీసు వెబ్సైట్ల స్ఫూర్తితో ఏర్పాటు చేసిన సిటీ పోలీసు అధికారిక వెబ్సైట్ ఆ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి సేవలు ప్రారంభించింది. నాటి పరిస్థితులకు అనుగుణంగా పోలీసు ఠాణాలు, అధికారుల వివరాలతో పాటు ఫోన్ నెంబర్లు తదితరాలను చేర్చారు. ఈ ఏడేళ్ల కాలంలో ప్రజల అవసరాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీనికితోడు గడిచిన ఏడాదిన్నర కాలంలో నగర పోలీసు విభాగం టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటోంది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి అప్లికేషన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా పోలీసు వెబ్‌సైట్‌ను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ బాధ్యతల్ని ఐటీ సెల్‌కు అప్పగించారు. నగర ప్రజలకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఐటీ సెల్ వాటిని క్రోడీకరిస్తూ కొత్త వెర్షన్ డిజైన్ చేసింది. దీన్ని త్వరలో నగర పోలీసు కమిషనర్ ఆవిష్కరించనున్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్సైట్లో అవకాశం కల్పించనున్నారు. -
అంతరిక్షం నుంచి భూభ్రమణాన్ని వీక్షించొచ్చు!
వాషింగ్టన్: భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే అంతరిక్షం నుంచి చూడటం భలే ముచ్చటగా ఉంటుంది కదా! అలాంటి వీడియోనే నాసా పోస్టు చేసింది. ప్రతిరోజూ తన చుట్టూ తాను తిరిగే భూమి సూర్యుడి వెలుగులో ఎలా కనిపిస్తుందో తెలిపే ఫొటోలను ఇక నుంచి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వీక్షకులకు అందించనుంది. ఇందుకోసం నాసా ఓ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. భూమికి సంబంధించిన డజను కలర్ ఫొటోలను ప్రతిరోజూ పోస్టుచేయనుంది. వీటిని సాసాకు చెందిన ఎర్త్ పోలిక్రోమెటిక్ ఇమేజింగ్ కెమెరా (ఎపిక్) తీసింది. రోజు గడిచే క్రమం ప్రకారం ఈ ఫొటోలను పోస్టు చేయడంతో భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఎలా ఉంటుందో ఈ సిక్వెన్స్ చిత్రాలు చూపనున్నాయి. ఈ వెబ్సైట్లో ఎపిక్ తీసిన ఫొటోలకు సంబంధించిన ఆర్కైవ్ కూడా ఉంటుంది. మనకు కావాల్సిన ఫొటోలను తేదీ, కాంటినెంట్ ప్రకారం వెతకవచ్చు. భూమికి పది లక్షల మైళ్ల దూరంలో ఉన్న డీప్ స్పేస్ క్లైమెట్ అబ్జర్వేటరీ నుంచి నాసా కెమెరా ఈ ఫొటోలను తీసింది. ఎపిక్ నాలుగు మెగాఫిక్సెల్ సీసీడీ కెమెరా. ఇందులో టెలిస్కోప్ కూడా ఉంది. ఇది తీసే ఫొటోలను శాస్త్రీయ పరీక్షల కోసం ఉపయోగిస్తున్నారు. -
అరచేతిలో ఆధునిక వ్యవసాయం
నూజివీడు, న్యూస్‌లైన్ : పచ్చని పంటకు తెగుళ్లు సోకితే ఏం చేయూలి.. ఎలాంటి మందులు పిచికారి చేయూలి.. కొత్తరకాల వంగడాలు సాగు చేయాలంటే ఎటువంటి సూచనలు పాటించాలనే సందేహాలు ప్రతి రైతుకూ సహజం. దీనికోసం వ్యవసాయూధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం.. వారు చెప్పినా సరిగ్గా అర్థంకాకపోవడంతో రైతన్నలు సరైన అవగాహన లేక సాగులో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారికోసం సరికొత్త వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఅగ్రీనెట్.జీవోబీ.ఇన్‌లో లాగిన్ అయితే చాలు వ్యవసాయంలో సందేహాలు, సూచనలు పొందవచ్చు. రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు దీన్ని తెలుగులో రూపొందించడం విశేషం. వ్యవసాయ శాఖ సూచనలు, సలహాలు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయశాఖ పథకాలు తదితర అంశాలన్నీ దర్శనమిస్తాయి. తెలుగులోనే ఉండటం వల్ల సాధారణ చదువున్న వారు సైతం సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను చూడటం అలవాటు చేసుకుంటే చాలు రైతులు ఇంట్లో కూర్చునే ఈ-వ్యవసాయంపై అవగాహన పెంచుకోవచ్చు. పంటల సాగులో మరింత ముందుకు వెళ్లడానికి వీలుంది. ఈ-వ్యవసాయంలో ఏం ఉన్నాయంటే.. పంటల యాజమాన్యం, పచ్చిరొట్ట పైర్లు, సేంద్రీయ వ్యవసాయం, అంతర్పంటల సాగు, సమస్యాత్మక భూముల యాజమాన్యం, శ్రీవరి సాగు, అంతర్పంటలు, సమగ్ర సస్యరక్షణ, పంటలలో చీడపీడల నివారణ, ప్రభుత్వ పథకాలు, రైతులకు ఇస్తున్న రాయితీలు, భూసార పరీక్షలు, వ్యవసాయ అనుబంధశాఖలు, వాటర్‌షెడ్, యాంత్రీకరణ, జీవ ఇంధనపు మొక్కలు తదితర అంశాలతో పాటు వాతావరణ సూచనలు కూడా ఈ వెబ్సైట్లో ఉంటారుు. జిల్లాల్లో వ్యవశాయశాఖ, అనుబంధశాఖలకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారి నుంచి మండల వ్యవసాయాధికారి వరకు అందరి ఫోన్ నంబర్లు చూడవచ్చు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు, మార్కెట్ ధరలు, భవిష్యత్‌లో ఊహించదగిన ధరల వివరాలు, ఎరువుల ధరల సమాచారం కూడా ఉంటుంది. వ్యవసాయ అనుబంధశాఖలైన ఉద్యానవన, పశుసంవర్ధక, మార్కెటింగ్, పట్టు పరిశ్రమ, అటవీ, విద్యుత్, నీటిపారుదల, మార్కెట్‌ఫెడ్ తదితర శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. పంటల యాజమాన్యంలో భాగంగా వరి, వేరుశెనగ, పత్తి, మొక్కజొన్న, కంది, ఆముదం, చెరకు, పెసర, పొద్దుతిరగుడు, జొన్న, మిరప, సోయాచిక్కుడు, మినుము, నువ్వులు, సజ్జ, శెనగలు, రాగి, కుసుమ తదితర పంటలకు సంబంధించిన తెగుళ్లు, ఆశించే పరుగులు, నివారణ పద్ధతులు తదితర సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది. -
పెట్టుబడి పదిహేను వందలు టర్నోవర్ కోటి రూపాయలు!
అప్పుడే తాను పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అయిపోయినట్టు భావించడం లేదు అనిమేష్. మరో3 సంవత్సరాల్లోపు కంపెనీని మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడతను. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త వెబ్సైట్ ప్రారంభించేద్దాం అనుకొన్నాడు ఆ యువకుడు. అతడిది అతి విశ్వాసం కాదు. అతడి ఆత్మవిశ్వాసం ఆ స్థాయిలో ఉంది. అయితే ఆలోచించే కొద్దీ గూగుల్.కామ్‌ను చూసేవారికి తన సైట్‌ను చూడాల్సిన అవసరం ఉండదనిపించింది. అయితే ఏదో చేయాలన్న తపన మాత్రం మిగిలింది. ఆ స్ఫూర్తితో అతడు పదిహేను వందల రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. మూడేళ్లలో కోటిరూపాయల టర్నోవర్‌కు దాన్ని తీసుకెళ్లాడు. ఆ యువకుడి పేరు అనిమేష్ సారింగి. భువనేశ్వర్‌కు చెందిన ఆ 20 యేళ్ల కుర్రాడి విజయగాథ ఇది... 12 యేళ్ల వయసు నుంచే ఏదో ఒక వ్యాపారం చేయాలన్న కోరిక ఉందట అనిమేష్‌కి. తను ఒక పెద్ద వ్యాపార వేత్త అయిపోవాలన్నది ఆ వయసులో అతడికి ఉన్న డ్రీమ్. అయితే ఆ డ్రీమ్‌ను అతడు మనసులో దాచేసుకొని దాని గురించి ఫాంటసీల్లో మునిగి తేలుతూ సమయాన్ని గడిపేయలేదు. ఆ కోరికను బయటపెట్టుకొన్నాడు. అలా బయటపెట్టినప్పుడే కదా ఎవరికైనా వాస్తవం అర్థమయ్యేది! అనిమేష్ విషయంలోనూ అదే జరిగింది. తన ఆలోచన గురించి చెబితే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చక్కగా చదువుకొమ్మని హిత బోధ చేశారు. అప్పుడు అనిమేష్ మనసులో ఫాంటసీలు మొదలయ్యాయి. అమ్మానాన్నలు చెప్పినట్టుగా చదువుకొంటూనే వ్యాపారతవేత్తగా ఎదగడానికి సంబంధించిన ప్రయత్నాలను చేయసాగాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత తన ఐడియాలను స్నేహితులతో పంచుకొనే అవకాశం దొరికింది. వారితో సాధ్యాసాధ్యాలను చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ క్రమంలోనే మొదట ఒక సెర్చింజన్‌ను అభివృద్ధి చేయాలని అనుకొన్నాడట. అయితే అది క్లిక్ కావడం కష్టసాధ్యం అని అర్థం చేసుకొని వేరే ఆలోచన మొదలుపెట్టాడు. ఆ సమయంలో ‘అమాజింగ్ యూత్’ అంటూ ఒక సంస్థను రిజిస్టర్ చేయించాడు అనిమేష్. దాని పేరు మీద ఒక వెబ్‌సైట్‌ను స్థాపించాడు. మూడేళ్ల క్రితం ఈ రిజిస్ట్రేషన్ కోసం పెట్టిన ఖర్చు పదిహేను వందలు. స్నేహితులను కలుపుకొని ఆ సంస్థ తరపున ఏవైనా కాంట్రాక్టులు చేయించాలనేది అనిమేశ్ ఐడియా. ఆ క్రమంలో మొదట వారికి వీధి వీధి తిరిగి ఒక కంపెనీకి సంబంధించిన వాల్‌పోస్టర్లను అతికించే కాంట్రాక్టు దక్కింది. అనిమేష్ బ్యాచ్ అంతా ఒక్కరోజు రాత్రిలోనే 2,5000 పోస్టర్లను అతికించారు. ఒక్కోపోస్టర్‌కు పదిరూపాయలు వచ్చిందట. అక్కడ నుంచి తన కంపెనీని విస్తరించే పనిని మొదలుపెట్టాడు. ఆ కాంట్రాక్ట్ అతడికి ఎన్నో సంపాదనా మార్గాలను చూపింది. ఆ ఉత్సాహంతో ఔత్సాహిక యువతకు, కంపెనీల హెచ్ఆర్లకు వారధిగా మారాడు. కాల్‌సెంటర్లు, డాటా ఆపరేటింగ్ ఏజెన్సీలకు ఎంప్లాయీస్‌ను కుదిర్చే పనిని మొదలుపెట్టాడు. అటు కంపెనీల నుంచి కొంత, నిరుద్యోగుల నుంచి మరికొంత కమీషన్ తీసుకొంటూ ఒక ఆదాయమార్గాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. భువనేశ్వర్‌లోని అనేక కంపెనీల మానవ వనరుల అవసరాలకు ‘అమేజింగ్‌యూత్’ వాళ్లు సోర్స్‌గా మారారు. నెలకు 30 నుంచి 40 కంపెనీలతో ఇలాంటి కాంట్రాక్టులు కుదుర్చుకోవడంతో అనిమేష్ స్థాపించిన ఈ కంపెనీ దశ తిరిగింది. ఆదాయం పెరిగింది. బ్రాంచ్‌లు పెరిగాయి. ప్రస్తుతం ఒరిస్సా, పశ్చిమబెంగాల్, చెన్నై, కర్ణాటక, ఢిల్లీ తదిరత చోట్ల ‘అమేజింగ్ యూత్’కు బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పటివరకూ వేలాదిమంది యువతీ యువకులకు ఈ కంపెనీ ప్లేస్మెంట్స్ను ఇప్పించింది. దీంతో 40 నుంచి 50 శాతం ఆదాయంతో ఈ కంపెనీ టర్నోవర్ కోటి రూపాయలకు చేరింది. అమెరికాలో కూడా ఇప్పుడు ఈ ఏజెన్సీ కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే అనిమేష్‌కు అప్పుడే తాను పెద్ద ఎంటర్ ప్రెన్యూర్ అయిపోయినట్టు భావించడం లేదు. మూడు సంవత్సరాల్లోపు కంపెనీని మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడతను. ఇప్పటివరకూ తను సాధించిన విజయంలో తన స్నేహితుల సహకారం మరవలేనిదని అంటాడు అనిమేష్. అమేజింగ్ యూత్‌ను బెటర్ స్థాయి నుంచి బెస్ట్‌కు తీసుకెళ్లాలన్నదే తన ప్రస్తుత లక్ష్యం అని అనిమేష్ చెబుతాడు.