సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) జూన్ 7న కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫిల్లింగ్ పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులకు చిరాకు లేని, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడానికి ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ను ప్రారంభించింది. అయితే, ఈ పోర్టల్ రూపకల్పన పనిని కేంద్ర ప్రభుత్వం రూ.4,242 కోట్లకు ఇన్ఫోసిస్ కు అప్పజెప్పింది. ఇప్పుడు ఈ కొత్త పోర్టల్ లో అనేక బగ్స్ బయట పడుతున్నాయి. దీంతో చాలా మంది కొత్త పోర్టల్ సేవల విషయంలో అసౌకర్యానికి గురి అవుతున్నారు.
మరికొందరు తమ కోపాన్ని మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఆదాయపు పన్ను పోర్టల్ ఇప్పుడు కొత్త జీఎస్ టీ పోర్టల్ గా మారిందని సీఎ రీతు గుప్తా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మరికొందరు పాత ఆదాయపు పన్ను వెబ్ సైట్ ను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. @casansaar అనే వ్యక్తి ఎందుకు టెస్టింగ్ చేయకుండా తీసుకొచ్చారు, అంత అత్యవసరంగా లాంచ్ చేయాల్సిన అవసరం ఏమి ఉంది అని అన్నారు. పాత పోర్టల్ బాగానే పనిచేస్తున్నప్పటికి కొత్త పోర్టల్ అనవసరమని కామెంట్ చేశారు. ఈ పోర్టల్ కి రూ.4200 కోట్లు ఖర్చు చేశారా? అని ఎగతాళి చేశారు. అయితే, ఈ సమస్యలపై కేంద్రం స్పందించింది. జూన్ 22 వీటి విషయంలో ఇన్ఫోసిస్, కేంద్రం మరో సారి సమావేశం కానుంది.
After hearing about the 4200 cr new site, I have ordered 20 men to come and change a light bulb.
— Rakshita Khanna (@Raxita) June 10, 2021
P.S. The light was working just fine. But I had too much time at hand. #4200cr #incometaxnewportal
FM @nsitharaman Ji,
— CA Sansaar (@casansaar) June 9, 2021
Why No testing of the new income tax portal before its launched?
Why so hurry in launching the new portal?
Any penalty clause on developers / officers?@Infosys @NandanNilekani @FinMinIndia @IncomeTaxIndia @ianuragthakur @PMOIndia #incometaxportal #harassment
Comments
Please login to add a commentAdd a comment