గురుశిష్యుల అభిప్రాయాల వేదిక | new website in educational department | Sakshi
Sakshi News home page

గురుశిష్యుల అభిప్రాయాల వేదిక

Published Sun, Aug 28 2016 11:55 PM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

గురుశిష్యుల అభిప్రాయాల వేదిక - Sakshi

గురుశిష్యుల అభిప్రాయాల వేదిక

విద్యాశాఖ సరికొత్త వెబ్‌సైట్‌
‘ఏపీ సబ్జెక్ట్‌ ఫోరం’తో పోర్టల్‌
సెప్టెంబర్‌ 4న ప్రారంభం

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కొత్త వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌లో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలు తెలియజేసేందుకు ‘ఆంధ్రప్రదేశ్‌ సబ్జెక్ట్‌ ఫోరం’ పేరుతో కొత్త వెబ్‌ పోర్టల్‌ను విద్యాశాఖ రూపొందించింది. దీనిద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమవద్ద ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులకు చేరవేయొచ్చు. గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌ 4న ఈ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పోర్టల్‌లో లాగిన్‌కావడం ఇలా..
జ్టి్టp;//111.93.8.43;8080 లేదా జ్టి్టp;//్చp్ఛజ్ఠు.జీn/ గూగుల్‌లో టైప్‌ చేస్తే ‘ఆంధ్రప్రదేశ్‌ సబ్జెక్ట్‌ ఫోరం’ అనే పేరుతో వెబ్‌ పోర్టల్‌ ఓపన్‌ అవుతుంది.
– వెబ్‌సైట్‌ ముఖ చిత్రంలో కనిపించే టీచర్‌ జోన్‌ అనే టాబ్‌ క్లిక్‌ చేయాలి.
– అక్కడ కొత్తగా నమోదయ్యేవారు న్యూటీచర్‌ రిజిస్ట్రేషన్‌ వద్ద క్లిక్‌ చేయాలి.
– రిజిస్ట్రేషన్‌ వద్ద టీచర్‌ అని టైపు చేయాలి.
– కింది కాలంలో సెల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. (ఇటీవల నమోదు చేసిన టీచర్‌ డేటా సిస్టంలో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ మాత్రమే తీసుకుంటుంది.)
– అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్‌ అంకెలు  ఎంటర్‌ చేసి, సబ్మిట్‌ బటన్‌ నొక్కాలి.
– తర్వాత ఒక విండో ఓపెన్‌ అవుతుంది. ఇటీవల టీచర్‌ డేటాలో నమోదు చేసిన వివరాలతో లాగిన్‌ అయిన పేజీ కనిపిస్తుంది.
– ఆ పేజీలో ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. తండ్రి పేరు, సబ్జెక్టు వివరాలు, మీరు ఏ అంశంలో నిష్ణాతులో తెలిపి, మీ గురించి పరిచయ వాక్యాలు కంపోజ్‌ చేసి, సబ్మిట్‌ బటన్‌ నొక్కాలి. ఈ ప్రక్రియతో ఈ వెబ్‌సైట్‌లో మీ పేరున రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.
ఇవీ లక్ష్యాలు  :
– ఈ వెబ్‌పోర్టల్లో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరినీ భాగస్వాములు చేయాలనేది ప్రధాన లక్ష్యం
– ఉపాధ్యాయులకు అవసరమైన వృత్తి నైపుణ్యాలు పెంచేందుకు ఎప్పడికప్పుడు సమాచారం అందించాలి
– ఇకపై మీ సబ్జెక్టుల్లోగాని ఇతర సబ్జెక్టుల్లోగానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఉపాధ్యాయ మిత్రులు పోస్ట్‌ చేసిన విద్యా సంబంధిత అంశాలు తెలుసుకోవచ్చు. అనుభవాలు, తరగతి గదిలోని అనుభూతులు పంచుకోవచ్చు.
– నమోదైన టీచర్లు ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను కూడా ఈ వెబ్‌సైట్‌లో చేర్చాలి. ఇందుకు  సంబంధించిన నమోదు కాలం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
– ఈవెబ్‌సైట్‌లో నమోదైన వారు విద్యా  సమాచారంతోపాటు వీడియోలు, చిత్రాలు, పాఠ్య ప్రణాళికలు, ప్రాజెక్ట్‌లు, అనుభవాలు, విద్యార్థుల ప్రతిస్పందనలు తదితర అంశాలు పంచుకునే అవకాశం ఉంటుంది.
– విద్యా సంబంధిత నోటిఫికేషన్లు, సెమినార్లు, రూపొందించే ఫోరాలు, ధ్రువీకరణ పత్రాలు వంటివి ఈ సైట్‌లో  అందుబాటులోకి తెస్తారు.
– ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఈ–కాంటాక్ట్‌ను తయారు చేసి, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు అందించొచ్చు.  

టీచర్లందరూ భాగస్వామ్యులు కావాలి
జిల్లాలోని టీచర్లందరూ ఈ వెబ్‌సైట్‌లో తమ యూడైస్‌ ఫోన్‌ నంబర్‌ ద్వారా పేర్లను నమోదు చేసుకుని సబ్జెక్టు ఫోరంలలో భాగస్వామ్యులు కావాలి. వచ్చే నెల 4న ప్రభుత్వం అధికారికంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. నమోదులో ఏవైనా సమస్యలు ఎదురైతే చంద్రమౌళి (94405 73989), వజ్ర నరసింహారెడ్డి (95337 41772), ఓబుళరెడ్డి (94917 77766),సోమశేఖర్‌ (94401 55510), కేశవరెడ్డి (94400 16835)  నంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
–  లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జ్‌ డీఈఓ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement