వాషింగ్టన్: భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే అంతరిక్షం నుంచి చూడటం భలే ముచ్చటగా ఉంటుంది కదా! అలాంటి వీడియోనే నాసా పోస్టు చేసింది. ప్రతిరోజూ తన చుట్టూ తాను తిరిగే భూమి సూర్యుడి వెలుగులో ఎలా కనిపిస్తుందో తెలిపే ఫొటోలను ఇక నుంచి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వీక్షకులకు అందించనుంది. ఇందుకోసం నాసా ఓ కొత్త వెబ్సైట్ను ప్రారంభించింది. భూమికి సంబంధించిన డజను కలర్ ఫొటోలను ప్రతిరోజూ పోస్టుచేయనుంది. వీటిని సాసాకు చెందిన ఎర్త్ పోలిక్రోమెటిక్ ఇమేజింగ్ కెమెరా (ఎపిక్) తీసింది.
రోజు గడిచే క్రమం ప్రకారం ఈ ఫొటోలను పోస్టు చేయడంతో భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఎలా ఉంటుందో ఈ సిక్వెన్స్ చిత్రాలు చూపనున్నాయి. ఈ వెబ్సైట్లో ఎపిక్ తీసిన ఫొటోలకు సంబంధించిన ఆర్కైవ్ కూడా ఉంటుంది. మనకు కావాల్సిన ఫొటోలను తేదీ, కాంటినెంట్ ప్రకారం వెతకవచ్చు. భూమికి పది లక్షల మైళ్ల దూరంలో ఉన్న డీప్ స్పేస్ క్లైమెట్ అబ్జర్వేటరీ నుంచి నాసా కెమెరా ఈ ఫొటోలను తీసింది. ఎపిక్ నాలుగు మెగాఫిక్సెల్ సీసీడీ కెమెరా. ఇందులో టెలిస్కోప్ కూడా ఉంది. ఇది తీసే ఫొటోలను శాస్త్రీయ పరీక్షల కోసం ఉపయోగిస్తున్నారు.
అంతరిక్షం నుంచి భూభ్రమణాన్ని వీక్షించొచ్చు!
Published Tue, Oct 20 2015 3:30 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM
Advertisement
Advertisement