This Website Will Pay You 1000 Dollars To Watch All Fast And Furious Films, Know Why - Sakshi
Sakshi News home page

Fast X: ఆ సినిమా చూడు రూ.82000 గెలుచుకో.. కానీ ఓ ట్విస్ట్‌

Published Wed, May 10 2023 12:00 PM | Last Updated on Wed, May 10 2023 12:40 PM

This Website Will Pay You 1000 Dollars To Watch All Fast And Furious Films - Sakshi

సాధారణంగా మనం వినోదం కోసం డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చూస్తుంటాం. కానీ ఈ సినిమా చూస్తే వాళ్లే డబ్బులు రివర్స్‌ ఇస్తారట. అది కూడా ఏ వందో.. రెండొందలో కాదు. ఏకంగా 82 వేల రూపాయలు. ఇదేంటి..  సినిమా చూస్తేనే అంత డబ్బు ఎలా ఇస్తారు? అనుకుంటున్నారా?. నిజమే ఊరికే వెళ్లి సినిమా చూస్తే ఇవ్వరు.. వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 

హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రాల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానం ఉంది. విన్‌ డీజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటి వరకు తొమ్మిది భాగాల్లో విడుదలై బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక మే 19న ఈ సిరీస్ లో 10వ సినిమాగా ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ X’ విడుదల కానుంది.  ఈ నేపథ్యంలో ఫైనాన్స్‌ బజ్ అనే ఓ ఇంటర్‌నేషనల్‌ వెబ్‌సైట్‌ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.  

(చదవండి: ‘బలగం’వేణుకి బంపరాఫర్‌.. బాలయ్యతో సినిమా!)

ఈ మూవీ చూసి ఓ విషయంలో వాళ్లకు సాయం చేస్తే ఏకంగా 1000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 82,000) ఇస్తామని ప్రకటించింది. ఇంతకీ ప్రైజ్‌ మనీ గెలవాలంటే ఏం చేయాలంటే..  ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ కు సంబంధించి ఇప్పటి వచ్చిన 10 భాగాలను చూడాలి. అందులో ఏ కారు డ్యామేజ్ అయ్యిందో నోట్‌ చేసి వెబ్‌సైట్‌కు అందజేయాలి. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కంపెనీకి ఎంత ఇన్స్యూరెన్స్ భారం పడుతుందనేది ఆ వెబ్ సైట్ వాళ్లే అంచనా వేస్తారు.

(చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్‌ కృతిసనన్‌.. కామెంట్స్‌ వైరల్‌)

వారి అంచనాలకు ఎవరు దగ్గరగా ఉంటారో, వారికి 1000 డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. అంతేకాదు, సినిమా టికెట్స్, స్నాక్స్ కోసం మరో 100 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ కేవలం యూఎస్‌లో ఉన్నవారికే.. అది కూడా 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది.   సినిమా విడుదల తేదీ అంటే మే 19 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. విజేతలను  మే 26 లోగా ప్రకటించనున్నట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement