Vin Diesel
-
విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల కేసు
లాస్ ఏంజెలిస్: ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ యాక్షన్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ వివాదంలో చిక్కుకున్నారు. 2010లో సహాయకురాలి పనిచేస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించారంటూ మాజీ ఉద్యోగిని అస్టా జొనాస్సన్ తాజాగా ఆయనపై ఆరోపణలు చేశారు. అట్లాంటాలోని ఓ హోటల్లో బస చేసిన సమయంలో విన్ డీజిల్ తనను లైంగికంగా వేధించారంటూ ఆమె గురువారం లాస్ ఏంజెలెస్ కోర్టులో దావా వేశారు. లైంగిక వాంఛను తీర్చలేదనే కోపంతో వెంటనే విన్ డీజిల్‌కు చెందిన వన్ రేస్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనను తొలగించినట్లు ఆరోపించారు. -
Today Headlines: ఇవాళ్టి ముఖ్యమైన వార్తలు
ఇవాళ్టి ప్రధాన వార్తల రౌండప్ 1.నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన 146మంది ఎంపీల సస్పెన్షన్ పై ఆందోళన 2. కొత్త క్రిమినల్ చట్టాలు చరిత్రాత్మకమన్న ప్రధాని మోదీ మసిపూసి మారేడు చేశారంటూ కాంగ్రెస్ కౌంటర్ 3. పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసు విచారణ ఆరుగురు నిందితులకు సైకో అనాలిసిస్ పరీక్షలు 4. పూంచ్ లో కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్ నిన్నటి దాడిలో 5గురు జవాన్లు మృతి 5. ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా ఢిల్లీ, యూపీని కమ్మేసిన మంచు తెర 6. హాలీవుడ్ లో మరోసారి METoo కలకలం విన్ డీసెల్ పై మాజీ అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు -
మాజీ ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడిన స్టార్ హీరో
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు పరిచయమున్న సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. అందులో నటించిన విన్ డీజిల్ అంటే అందరికీ పిచ్చి క్రేజ్.. తాజాగా ఆయనపై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. విన్ డీజిల్ మాజీ వ్యక్తిగత సహాయకురాలు ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. 2010లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రానికి సీక్వెల్ చిత్రీకరణ సమయంలో తనపై విన్ డీజిల్ లైంగిక దాడి చేశారని తాజాగా ఆమె ఆరోపించింది. సుమారుగా దశాబ్దం క్రితం అట్లాంటా హోటల్ గదిలో తన సహాయకురాలిగా ఉన్న Ms జోనాసన్పై విన్ డీజిల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టులో గురువారం వ్యాజ్యం దాఖలైంది. ఈ దావా అనేది కాలిఫోర్నియాలోని న్యాయస్థానంలో వేయబడింది. విన్ డీజిల్‌పై Ms జోనాసన్ వేసిన పిటీషన్‌ను విచారించి చట్టపరమైన చర్య తీసుకునేందుకు కొంత సమయాన్ని పొడిగించింది. ఈలోపు ఆమె ఆరోపణపై విచారించాలని కోర్టు సూచించింది. 2010లో "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్" చిత్రానికి గాను విన్ డీజిల్‌కు అసిస్టెంట్‌గా చేరిన తర్వాత ఆ హోటల్లో ఏం జరిగిందో ఇలా తెలిపింది. 'ఫాస్ట్ ఫైవ్ చిత్రీకరణ కోసం యూనిట్ మొత్తం అట్లాంటాకు వెళ్లాం. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత అందరం రూమ్‌కు చేరుకున్నాం. మరుసటి రోజు షూట్ కోసం రెడీ అయేందుకు విన్ డీజిల్‌కు కావాల్సిన ఏర్పాట్లు నేను చేశాను. తెల్లవారుజామున హోటల్ నుంచి బయలుదేరడానికి డీజిల్‌కు సహాయం చేసే బాధ్యత నాకే అప్పగించబడింది. నేను అయన గదిలోకి వెళ్లిన సమయంలో మేమిద్దరమే ఉన్నాం. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న విన్ డీజిల్ నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నన్ను బలవంతంగా పట్టుకుని నా శరీరంపై అసభ్యంగా ప్రవర్తించాడు. వద్దని వారించినా పదేపదే తాకుతూ నా దుస్తులు తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. నేను ఆ సమయంలో బయంతో బాత్రూమ్లోకి పారిపోయాను అక్కడ నన్ను గోడకు అతికించి బలవంతం చేశాడు. ఇదంతా జరిగిన మరుసటి రోజు, విన్ డీజిల్ సోదరి సమంత విన్సెంట్‌కు జరిగిన విషయం చెప్పాను. కానీ ఆమె అవన్నీ ఏమీ పట్టించుకోలేదు. ఆ సమయంలోనే నన్ను ఆ ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఈ విషయంలో నేను ఆమెతో చాలా సేపు గొడవపడ్డాను కూడా.విన్ డీజిల్ లైంగిక వేధింపులను ఆమె కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది.' అని Ms జోనాసన్ కోర్టుకు సమర్పించిన వ్యాజ్యంలో తెలిపింది. (ఇదీ చదవండి: Salaar X Review: ‘సలార్’మూవీ ట్విటర్ రివ్యూ) విన్ డీజిల్, సమంత విన్సెంట్ వల్ల తాను ఎంతో కెరియర్ కోల్పోయానని ఆమె తెలిపింది. అతని వల్ల తన కెరియర్‌కు జరిగిన నష్టాన్ని పూరించాలని ఆమె కోరింది. ఆమె వేసిన వ్యాజ్యంపై విన్ డీజిల్ ప్రతినిధులు ఇంకా రియాక్ట్ కాలేదు. 2017లో వచ్చిన ‘త్రిబుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ అనే చిత్రంలో విన్ డీజిల్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటించిన విషయం తెలిసిందే.. ఆ చిత్రంతో విన్ డీజిల్ ఇండియాలో మరింత పాపులర్ అయ్యాడు. -
ఆ సినిమా చూడు రూ.82000 గెలుచుకో.. కానీ ఓ ట్విస్ట్
సాధారణంగా మనం వినోదం కోసం డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చూస్తుంటాం. కానీ ఈ సినిమా చూస్తే వాళ్లే డబ్బులు రివర్స్ ఇస్తారట. అది కూడా ఏ వందో.. రెండొందలో కాదు. ఏకంగా 82 వేల రూపాయలు. ఇదేంటి.. సినిమా చూస్తేనే అంత డబ్బు ఎలా ఇస్తారు? అనుకుంటున్నారా?. నిజమే ఊరికే వెళ్లి సినిమా చూస్తే ఇవ్వరు.. వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానం ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటి వరకు తొమ్మిది భాగాల్లో విడుదలై బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక మే 19న ఈ సిరీస్ లో 10వ సినిమాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ X’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ బజ్ అనే ఓ ఇంటర్నేషనల్ వెబ్సైట్ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. (చదవండి: ‘బలగం’వేణుకి బంపరాఫర్.. బాలయ్యతో సినిమా!) ఈ మూవీ చూసి ఓ విషయంలో వాళ్లకు సాయం చేస్తే ఏకంగా 1000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 82,000) ఇస్తామని ప్రకటించింది. ఇంతకీ ప్రైజ్ మనీ గెలవాలంటే ఏం చేయాలంటే.. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ కు సంబంధించి ఇప్పటి వచ్చిన 10 భాగాలను చూడాలి. అందులో ఏ కారు డ్యామేజ్ అయ్యిందో నోట్ చేసి వెబ్‌సైట్‌కు అందజేయాలి. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కంపెనీకి ఎంత ఇన్స్యూరెన్స్ భారం పడుతుందనేది ఆ వెబ్ సైట్ వాళ్లే అంచనా వేస్తారు. (చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్) వారి అంచనాలకు ఎవరు దగ్గరగా ఉంటారో, వారికి 1000 డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. అంతేకాదు, సినిమా టికెట్స్, స్నాక్స్ కోసం మరో 100 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం యూఎస్‌లో ఉన్నవారికే.. అది కూడా 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది. సినిమా విడుదల తేదీ అంటే మే 19 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. విజేతలను మే 26 లోగా ప్రకటించనున్నట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది. -
కో-స్టార్ కూతురి పెళ్లిలో తండ్రిలా నడిచిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో యాక్టర్స్ చేసే సాహసాలు రొమాలు నిక్కబోడిచేలా ఉండడంతో.. ఈ సిరీస్‌లో భారీ స్టాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించి వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు విన్ డీజిల్, పాల్ వాకర్. గత కొన్ని సంవత్సరాల క్రితం పాల్ వాకర్ ఓ యాక్సిడెంట్లో మరణించాడు. అయితే తాజాగా ఆ నటుడిక కూతురు మోడల్ మెడో వాకర్ (22) వివాహం జరిగింది. ఈ పెళ్లికి పాల్‌తో దాదాపు 6 సినిమాల్లో కలిసి నటించిన విన్ డిజిల్ హాజరయ్యాడు. అంతేకాకుండా పెళ్లి కూతురిని డయాస్ వరకూ తీసుకొచ్చాడు విన్. నిజానికి అక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురిని అలా ఆమె తండ్రి తీసుకొస్తాడు. అయితే పాల్ లేని కారణంగా.. ఈ దివంగత నటుడిపై ఉన్న అభిమానంతో విన్ ఆయన కూతురిని పెళ్లి కూతురిలా వేదిక వరకూ తీసుకురావడం ఎంతోమంది అభిమానులు మనసులను గెలుచుకుంది. అంతే కాకుండా దీనిపై ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ స్పందించారు. ఈ వివాహానికి సంబంధించి వీడియోని, ఫోటోలని మెడో వాకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి వైరల్‌గా మారాయి. చదవండి: అబార్షన్ చేయించుకొమన్నందుకు.. మాజీ ప్రియురాలికి క్షమాపణలు తెలిపిన నటుడు View this post on Instagram A post shared by Meadow Walker (@meadowwalker) View this post on Instagram A post shared by Meadow Walker (@meadowwalker) View this post on Instagram A post shared by Meadow Walker (@meadowwalker) -
ఫాస్ట్ అండ్ ప్యూరియస్ 9లో 'అమెరికన్ రాపర్'
ప్రపంచవ్యాప్తంగా 'పాస్ట్ అండ్ ప్యూరియస్' ప్రాంచైజీకి ఉన్న క్రేజ్ మనందరికి తెలిసిందే. ఇందులో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో 8 పార్టులు వచ్చాయి. ఫాస్ట్ అండ్ ప్యూరియస్ 9వ భాగం తెరకెక్కుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ సర్ప్రైజ్ మీద సర్ప్రైస్లు ఇస్తున్నారు . ఇప్పటికే లాటిన్ సింగర్ 'ఒజునా' నటిస్తున్నట్లు మూవీ టీమ్ వెల్లడించి ఒక్కరోజు కాకుండానే స్టార్ హీరో విన్ డీజిల్ మరో ప్రకటన చేశాడు. 'హస్టలర్స్' మూవీ ఫేమ్, అమెరికన్ రాపర్ 'కార్డీ బీ' పాస్ట్ అండ్ ప్యూరియస్ 9లో చిన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలిపాడు. '86వ రోజు రాపర్ కార్డీ ఫాస్ట్ అండ్ ప్యూరియస్ సెట్లో జాయిన్ అవడం, ఆమెతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని' ఇన్స్టాగ్రామ్ వేదికగా విన్ డీజిల్ పేర్కొన్నాడు. 'ఈ సినిమాలో నేను బాగమవడం సంతోషాన్ని కలిగించింది. సినిమాలో నేను పోషించేది చిన్న పాత్రే అయినా అది నా కెరీర్‌కు ఉపయోగపడుతుందనే భావిస్తున్నా' అంటూ కార్డీ బీ స్పందించారు. ఫాస్ట్ అండ్ ప్యూరియస్ మూడు, నాలుగు, ఐదు, ఆరు భాగాలను డైరక్ట్ చేసిన జస్టిన్ లిన్ మరోసారి ఫాస్ట్ అండ్ ప్యూరియస్ 9వ భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. విన్ డీజిల్, క్రిస్ మోర్గాన్, మైఖేల్ ఫోర్టెల్లు సినిమాను నిర్మిస్తున్నారు. విన్ డీజీల్, జోర్డానా బ్రూస్టర్, మైఖేల్ రోడ్రిగ్వేజ్, టైరిస్ గిబ్సన్, హెలెన్ మిర్రెన్ తదితరులు నటిస్తున్నారు. ఈ యాక్షన్ సినిమా 2020,మే22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. View this post on Instagram Last day in the UK! Pa mi Gente... #Fast92020 #Fatherhood A post shared by Vin Diesel (@vindiesel) on Oct 22, 2019 at 10:53am PDT -
ఆ నమ్మకం భయపెడుతోంది
విన్ డీజిల్, రాబర్ట్ డౌనీ జూనియర్... ఒకరేమో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ టాప్ స్టార్. మరొకరు అవెంజర్స్‌లో రాక్‌స్టార్. తాజాగా రాబర్ట్ నాకు స్ఫూర్తి ఇస్తుంటాడు అని పొగడ్తల్లో ముంచెత్తారు విన్ డీజిల్. ఈ విషయాన్ని ఆయన పంచుకుంటూ– ‘‘తనకు ఎదురైన ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత స్ఫూర్తినింపుతుంటాడు రాబర్ట్. తను ఎంపిక చేసుకునే పాత్రలు కూడా అలానే ఉంటాయి. ప్రస్తుతం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయినప్పటికీ తను ఎప్పటిలానే ఉన్నాడు. ‘నెక్ట్స్ నీ సినిమా అలానే కలెక్ట్ చేస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరిస్ ఇండస్ట్రీను పెద్ద స్థాయి తీసుకెళ్తుంది’ అని చెబుతున్నాడు. ఆ నమ్మకం నన్ను చాలా భయపెడుతోంది. నీతో ఫ్రెండ్షిప్ దొరికినందుకు సంతోషంగా ఉంది రాబర్ట్’’ అన్నారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ∙విన్ డీజిల్, రాబర్ట్ -
భూమి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్
బాలీవుడ్లో టాప్ స్టార్‌గా ఉన్నారు దీపికా పదుకోన్. గత ఏడాది హాలీవుడ్‌కి కూడా హాయ్ చెప్పారీ బ్యూటీ. తాజాగా తన కెరీర్లో మరో మైల్స్టోన్ అందుకున్నారామె. తన నటనతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఈసారి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వంద మంది ఇన్ఫ్లూ్యయన్స్ పర్సన్స్ (అత్యంత ప్రభావశీలుర జాబితా) లిస్ట్‌లో నిలిచారు. ఓ ప్రముఖ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మోస్ట్ ఇన్ఫ్లూ్యయన్సియల్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ 2018’ లిస్ట్‌లో దీపిక చోటు సంపాదించుకున్నారు. ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఓన్లీ ఇండియన్ యాక్టర్ దీపికా కావడం విశేషం. ఆ మ్యాగజైన్లో దీపికా ఫ్రొఫైల్‌ను తన హాలీవుడ్ ఫస్ట్ హీరో, ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ కో–స్టార్ విన్ డీజిల్ రాయడం విశేషం. ‘‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా టైమ్‌లో దీపికని కలిశా. తను ఓ స్పెషల్ పర్సన్ అని అప్పుడే నాకు అర్థం అయింది. తన రూమ్‌లోకి ఎంటర్ అవగానే ఒక ఎనర్జీ, కెమిస్ట్రీ కనిపిస్తుంది. అనుకోని కారణాల వల్ల తను ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’లో యాక్ట్ చేయలేకపోయింది. ‘ట్రిప్లెక్స్’లో తనను ఎలాగైనా క్యాస్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం. ‘నేను ఈ సినిమాలో యాక్ట్ చేయాలంటే నువ్వు ఇండియా రావాలి’ అని డీల్ ఫిక్స్ చేసిందామె. ఆ డీల్ ఒప్పుకొని మంచి పని చేశా. అందరూ దీపిక అందాన్ని, కామెడీ టైమింగ్ గురించి మాట్లాడతారు. దీపికా జస్ట్ స్టార్ మాత్రమే కాదు. యాక్టర్స్ యాక్టర్. క్రాఫ్ట్‌కి డెడికేట్ అయిన ఆర్టిస్ట్. ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని మార్కెట్స్‌కు స్టక్ అయిపోతుంటారు. బట్.. దీపిక కేవలం ఇండియాను రిప్రజెంట్ చేయడానికి కాదు.. ఈ ప్రపంచాన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చింది. భూమి మనకు అందించిన బెస్ట్ గిఫ్ట్ దీపిక’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు విన్ డీజిల్. -
భారీ యాక్షన్ మూవీ రిలీజ్ వాయిదా..!
ప్రపంచ వ్యాప్తంగా వరుస విజయాలు సాధిస్తున్న యాక్షన్ సినిమా సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లోని సినిమాలో హాలీవుడ్ తో పాటు ఇతర దేశాల్లోనూ భారీ వసూళ్లు సాధించాయి. ఈ ఏడాది విడుదల అయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 ఘనవిజయం సాధించటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. అయితే 8వ భాగం రిలీజ్ సందర్భంగా తదుపరి భాగాన్ని 2019 ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. సినిమాను ఏకంగా ఏడాది ఆలస్యంగా విడుదల చేయనున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించింది. 2020 ఏప్రిల్ 10న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో 9 వ భాగం విడుదల అవుతుందని అధికారిక సోషల్ మీడియా పేజ్ లో ప్రకటించారు. అయితే ఆలస్యానికి కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. A post shared by The Fate of the Furious (@fastandfuriousmovie) on Oct 4, 2017 at 11:00am PDT -
అతను నాతో ప్రేమలో పడ్డాడు!
ముంబై: 70 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఏం కోరుకుంటారు. ఓ అందమైన కుటుంబం. ప్రశాంతమైన జీవితం. తనకు కూడా అవే కావాలంటోంది బాలీవుడ్ భామ దీపికా పదుకొనే. 70 ఏళ్ల వయస్సులో ఆనందకరమైన కుటుంబం, ప్రశాంతమైన జీవితాన్ని తాను కోరుకుంటున్నట్టు ఆమె తెలిపింది. 70 కేన్స్ చలనచిత్రోత్సవంలో స్టైలిష్‌గా దర్శనమిచ్చి ఈ సుందరి అందరి మతిపోగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్రెంచ్ 24 మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘నాకు 70 ఏళ్లు వచ్చాక అందమైన పరిసరాల్లోని ఓ చిన్ని ఇంటిలో పిల్లలు, మనవలతో ఆనందంగా గడుపాలనుకుంటున్నాను. అప్పుడు ప్రశాంతమైన మంచి జీవితం ఉంటే చాలు’ అని చెప్పుకొచ్చింది. ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాతో హాలీవుడ్లో ఎంటరవ్వడంపై స్పందిస్తూ తన సహనటుడు విన్ డిజిల్ కారణంగానే తాను సినిమాలో నటించినట్టు చెప్పింది. ఈ సినిమా ఎన్నో అద్భుతమైన అనుభవాలను తనకిచ్చిందని తెలిపింది. ‘ఉన్నదున్నట్టు చెప్పాలంటే అతను (విన్ డీజిల్) నాతో ప్రేమలో పడ్డాడు. అతను ఎంతో సౌమ్యుడు. నేను కలిసి వాళ్లలో అద్భుతమైన వ్యక్తి. ఉదార స్వభావం కలవాడు. అతని వల్ల నాకు ఎన్నో అద్భుతమైన అనుభవాలు మిగిలాయి. జీవితకాలానికి అతను నా స్నేహితుడు’ అని బాలీవుడ్ మస్తానీ పేర్కొంది. -
నా ఇంటిని ఎలా మరిచిపోతా!: నటి
న్యూఢిల్లీ: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ బాటపట్టి రాణిస్తున్న వారిలో నటి దీపికా పదుకొనే ఒకరు. హాలీవుడ్ స్టార్ విన్ డిజిల్ తో కలిసి 'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ ఇన్ 2017' లో నటించి హాలీవుడ్లో తొలి మూవీతోనే పేరు తెచ్చుకుంది. అయితే అక్కడే ఉండిపోవాలన్న ఆశ తనకు లేదని అంటోంది. 'ఇది నా ఇల్లు, నేను ఎక్కడి నుంచి వచ్చాను.. నేనేంటి అనే సంగతి బాగా తెలుసు. అందుకే అలాంటి విషయాలను నేను ఎన్నటికీ మరిచిపోను' అని బాలీవుడ్ గురించి దీపికా ప్రస్తావించింది. హాలీవుడ్ అంటే ఓ కొత్త సినీ పరిశ్రమ మాత్రమేనని.. కొత్త వాతావరణంలో మరికొందరితో నటించడేనని అభిప్రాయపడింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఓ ఈవెంట్లో ఎంటర్టైన్మెంట్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్, హాలీవుడ్ యాక్షన్ ఐకాన్ విన్ డిజిల్‌లలో బెస్ట్ అంటే ఎవరిని ఎంపిక చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు అంతే తెలివిగా 'ఇద్దరూ' అని బదులిచ్చింది దీపిక. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్‌సింగ్, షాహిద్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్న పద్మావతి మూవీలో నటిస్తోంది. -
యూపీ సీఎం.. హాలీవుడ్ హీరో!
లక్నో: ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియామకంపై రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతుండగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యూపీ కొత్త సీఎం అచ్చుగుద్దినట్టు హాలీవుడ్ హీరో, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్ విన్ డిసిల్ ను పోలి ఉన్నారని గుర్తు చేశారు. అంతేకాదు వీరిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి కామెంట్లు పోస్టు చేస్తున్నారు. వేర్వేరు దేశాల్లో జన్మించడం మినహా పోలికల్లో వీరిద్దరి మధ్య ఎటువంటి బేధం లేదని పేర్కొన్నారు. సీఎం ‘ఫాస్ట్’ అయితే మీడియా ‘ఫ్యూరియస్’ అవుతోందని ఆదిత్యనాథ్ మద్దతుదారులు కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా జోకులు కూడా పేల్చారు. యూపీ సీఎంగా యోగి ఎంపికైన తర్వాత తానే యోగినని విని డిజిల్ అంటున్నాడని జోక్ చేశారు. యూపీ కొత్త ముఖ్యమంత్రిని ఎవరిన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ను అడగ్గా... విన్ డిజిల్ అని ఆమె సమాధానం ఇచ్చిందని మరొకరు హాస్యామాడారు. యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకులు కూడా ట్విటర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
వెయ్యి కోట్ల క్లబ్లో దీపిక
బాలీవుడ్ హాట్ బ్యూటి దీపిక పదుకొనే రికార్డ్ సృష్టించింది. దీపిక హీరోయిన్గా నటించిన చాలా సినిమాలు ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో సందడి చేయగా, తాజాగా ఈ భామ వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలో భాగమయ్యింది. అయితే దీపిక ఈ రికార్డ్ సృష్టించింది ఇండియన్ సినిమాతో కాదు. తొలిసారిగా హాలీవుడ్లో నటించిన ట్రిపులెక్స్ : రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ సినిమాతో ఈ ఫీట్ సాధించింది. హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీజిల్, నినా డోబ్రేవ్, రూబీ రోజ్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు డిజె కరుసో దర్శకుడు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇండియాలోనూ మంచి విజయం సాధించింది. భారత్‌లో 53 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ట్రిపులెక్స్, ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది. త్వరలో చైనాలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ట్రిపులెక్స్ : రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్, మరిన్ని రికార్డ్ లు సాధించే దిశగా దూసుకుపోతోంది. -
ఆయన బిడ్డలకు నేను తల్లయ్యా!
‘ఆలూ లేదూ.. చూలూ లేదూ.. కొడుకు పేరు సోమలింగం’ అన్నారట వెనకటికెవరో. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె వరుస కూడా అలానే ఉంది. ఇప్పటివరకూ పలువురితో ప్రేమాయణం సాగించి, తాజాగా రణ్‌వీర్‌సింగ్‌తో ప్రేమలో ఉన్న ఈ భామ పెళ్లిపీటలు మాత్రం ఎక్కలేదు. కానీ, ‘నేను హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌తో పిల్లల్ని కన్నాను’ అంటూ ఓ టీవీ ప్రోగ్రాంలో దీపిక పేర్కొనడం సంచలనమైంది. ఆ తర్వాత ఆమె ఏం చెప్పబోతున్నారో పూర్తిగా వినకుండా, దీపిక గర్భంతో ఉన్నట్లు ఎప్పుడూ కనిపిం చలేదే? ఒకవేళ ‘ట్రిపుల్ ఎక్స్’ చేస్తూ, అమెరికాలో ఉన్న సమయంలో పిల్లల్ని కన్నారా? అని కొందరు ఊహించుకోవడం మొదలు పెట్టారు. ఈలోపు అసలు విషయాన్ని దీపిక చల్లగా చెప్పారు. ఆ విషయంలోకి వస్తే.. దీపికా, విన్ నటించిన ‘ట్రిపుల్ ఎక్స్’ ఇండియాలో విడుదలైంది. త్వరలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా వ్యాఖ్యాత ‘ఎలెన్ డిజెనరస్’ నిర్వహించిన టీవీ షోలో పాల్గొన్నారు దీపిక. ‘విన్కీ, మీకూ మధ్య ఏదో ఉందనే ప్రచారం నిజమేనా?’ అని ఎలెన్ అడిగిన ప్రశ్నకు దీపిక » దులిస్తూ.. ‘నిప్పు లేనిదే పొగ రాదు కదా? అది నిజమే. విన్ అంటే నాకిష్టం. మేం కలిసి ఉన్నాం. మాకు అందమైన పిల్లలు కూడా పుట్టారు. అయితే ఇదంతా కేవలం నా ఊహల్లోనే’’ అని తెలివిగా సమాధానం చెప్పారు. ఎంతైనా బాలీవుడ్ భామ భలే గడుసు కదూ! -
అతనితో నాకు పిల్లలు కూడా ఉన్నారు: దీపిక
’ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాతో హాలీవుడ్లో అదరిపోయే ఎంట్రీ ఇచ్చింది దీపిక పదుకొనే. ఇప్పటికే దేశంలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలుకరించబోతున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో హీరో విన్ డీజిల్ తో కలిసి బిజీగా ఉన్న దీపిక ప్రఖ్యాత టీవీ షో ఎలెన్ డిజెనరస్ షోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ’ట్రిపుల్ ఎక్స్’లో తన సహ నటుడు, హాలీవుడ్ సూపర్‌స్టార్ విన్ డీజిల్ పట్ల తనకెంతో క్రష్ ఉందని వెల్లడించింది. అంతేకాదు అతనితో ముద్దుముద్దుగా ఉన్న పిల్లల్ని కూడా కన్నట్టు పేర్కొంది. అయితే, నిజజీవితంలో కాదు తన ఊహాల్లో అని ట్విస్టు ఇచ్చింది. ’ట్రిపుల్ఎక్స్’ సినిమాలో దీపిక, విన్ డీజిల్ మధ్య కెమెస్ట్రీ బాగా పండిందని, దీనివెనుక సీక్రెట్ ఏమిటి? మీ మధ్య రొమాన్స్ ఏమైనా ఉందా? అని టీవీషో వ్యాఖ్యాత ఎలెన్ డిజెనరస్ అడిగింది. దీపిక బదులిస్తూ.. ’నిప్పు లేనిది పొగ రాదు కదా! కానీ ఇదంతా నా ఊహల్లోనే.. మేం కలిసి ఉన్నట్టు, మా మధ్య కెమెస్ట్రీ ఉన్నట్టు నాలో నాకు అనిపిస్తుంది. మేం కలిసి జీవించినట్టు.. మాకు అద్భుతమైన పిల్లలు కూడా పుట్టినట్టు అనిపిస్తుంది. ఇదంతా నా ఊహల్లోనే’ అంటూ దీపిక పేర్కొంది. హాలీవుడ్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న దీపిక.. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో ప్రేమలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్ కోసం భారత పర్యటనకు వచ్చిన విన్ డీజిల్ కూడా దీపిక బాయ్‌ఫ్రెండ్ రణ్వీర్ సింగేనని స్పష్టం చేశారు. -
గుట్టు రట్టు చేశాడు!
‘ఏమి సేతుర లింగా.. ఏమి సేతు’ – సంక్రాంతికి హరిదాసుల నోట వినిపిస్తుందీ పాట. ఇప్పుడు హాలీవుడ్ హీరో విన్ డీజిల్‌ని ఉద్దేశించి దీపికా పదుకొనే కూడా ఈ తరహా పాటే పాడుతున్నారు. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న దీపిక ప్రేమాయణాన్ని విన్ డీజిల్ రట్టు చేసేశారు. దాంతో మళ్లీ మీడియా ముందుకి వచ్చినప్పుడు ఏం చెప్పాలా? అని దీపిక ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకూ దీపికా పదుకొనే పెదవి దాటని మాట ఒకటుంది. అదేంటంటే... రణ్వీర్ సింగ్ ఆమెకి ఏం అవుతాడు? అనే ప్రశ్నకు సమాధానం. రణ్వీర్, దీపికల ప్రేమాయణం గురించి ముంబైలో ఎవర్ని అడిగినా కథలు కథలుగా చెబుతారు. ఇద్దరూ విహార యాత్రలకు విదేశాలు వెళ్లి, పలుసార్లు కెమేరా కళ్లకి చిక్కారు. కానీ, ‘రణ్వీర్ నా బాయ్‌ఫ్రెండ్’ అని దీపికా పదుకొనే గానీ... ‘నేను, దీపిక ప్రేమలో ఉన్నాం’ అని రణ్వీర్ సింగ్ గానీ... నోరు విప్పి చెప్పలేదు. ఇప్పుడు విన్ డీజిల్ ఓ ఇంటర్వ్యూలో ‘దీపిక బాయ్‌ఫ్రెండ్ రణ్వీర్ నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు’ అన్నారు. ‘ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’తో దీపిక హాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. హాలీవుడ్ కంటే ఓ వారం ముందు, ఈ నెల 14న ఇండియాలో విడుదలైన ఈ సినిమా ప్రచారం నిమిత్తం విన్ డీజిల్ ముంబై వచ్చారు. అప్పుడీ వ్యాఖ్యాలు చేశారాయన. విన్ డీజిల్ ఇలా అనడంతో దీపిక ఖంగు తిన్నారని పరిశీలకులు అంటున్నారు. కానీ, ఆ ఫీలింగ్స్‌ని బయట పెట్టకుండా బయటకు చిరునవ్వులు చిందించారట. ఇలాంటి సమయాల్లో ఏమి సేతుర లింగ.. ఏమి సేతు అనుకోవడం తప్ప ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు! -
డిజిల్ హల్చల్.. దద్దరిల్లిన థియేటర్
ముంబై: ప్రపంచంలోని అందరు హీరోల్లోకి డిఫరెంట్‌గా, నున్నటి బోడి గుండునే తన ట్రెండ్ మార్క్‌గా ట్రెండ్ సెట్ చేశాడు హాలీవుడ్ టాప్ యాక్షన్ హీరో విన్ డిజిల్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొన్‌తో కలిసి ఆయన నటించిన ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్’ సినిమా ప్రమోషన్ కోసం మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చిన డిజల్‌కు ఘన స్వాగతం లభించింది. చిత్ర యూనిట్‌తో కలిసి గురువారం ఉదయం ముంబైకి వచ్చిన డిజిల్.. సాయంత్రం జరిగిన ట్రిపుల్ ఎక్స్ ప్రీమియర్ షోలో హల్చల్ చేశారు. తెల్లటి లుంగీ కట్టి.. బాలీవుడ్ హిట్ నంబర్ ‘లుంగీ డ్యాన్స్’కు లయబద్ధంగా స్టెప్పులు వేశారు. దీపిక కూడా లుంగీ కట్టి, అతనితో జత కట్టింది. ఇక చూడాలి, థియేటర్ దద్దరిల్లేలా ఒకటే ఈలలు వేస్తూ గోల చేశారు అభిమానులు! ప్రపంచ వ్యాప్తంగా జనవరి 20న విడుదల కానున్న ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్’.. ఇండియాలో మాత్రం జనవరి 14నే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా జనవరి 17 లేదా 20న విడుదల కావాల్సిఉన్నా, సంక్రాంతి నేపథ్యంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ వెర్షన్లలో రిలీజ్ చేస్తే భారీ వసూళ్లు రాబట్టవచ్చన్న ఆలోచనతోనే సినిమా విడుదల ప్రీ పోన్ చేసినట్లు తెలిసింది. దీపిక కూడా దక్షిణాది అమ్మాయే కావడం మరో సానుకూలాంశం. గురువారం అట్టహాసంగా జరిగిన ప్రీమియర్ షోకు ఈ సినిమా దర్శకుడు డీజె కరుసోతోపాటు బాలీవుడ్ స్టార్లు రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్, కల్కి కొచ్చిన్, నీల్ నితీష్ ముకేష్, ఇర్ఫాన్ ఖాన్, హుమా ఖురేషీ, కృతి సనన్ , రిచా చద్దా తదితరులు హాజరయ్యారు. (విన్ డిసిల్ తండ్రి ఎవరో తెలియదు!) -
దీపిక ‘ట్రిపుల్’... యాక్షన్ అదుర్స్!
సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనేకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. షారుఖ్ ఖాన్ మొదలుకొని పలువురు స్టార్ హీరోలతో నటించారామె. ఒక చిన్న చిరునవ్వుతోనే కట్టిపడేయగల సమర్థత ఆమెది. బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేసినా పాపులారిటీ మాత్రం ప్రాంతీయ భాషలకీ పాకింది. ప్రపంచ దేశాల్లోనూ ఆమెకి అభిమానులున్నారు. ఆ గుర్తింపు, క్రేజ్ వల్లే దీపికాని హాలీవుడ్ ఛాన్స్ వరించింది. ప్రముఖ హాలీవుడ్ హీరో విన్ డీజిల్ కథానాయకుడిగా నటించిన ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’లో దీపిక ఓ కథానాయికగా నటించారు. ‘ట్రిపుల్ ఎక్స్’ అనేది హాలీవుడ్లో విజయవంతమైన ఫ్రాంచైజీ. అందులో దీపిక అవకాశం సాధించడం మామూలు విషయం కాదు. ఇది ఆమెకి దక్కిన అరుదైన గౌరవం అని చెప్పొచ్చు. ఈ చిత్రంతో దీపిక ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. దీపికాపై ఉన్న అభిమానం వల్ల ఇండియాలో ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా మేనియా ఇండియాలో పెద్ద ఎత్తునే కనిపిస్తోంది. ఇతర దేశాలకంటే ముందుగా ఈ సినిమా మన దేశంలో రేపే విడుదలవుతుండడం విశేషం. ‘ట్రిపుల్ ఎక్స్’ హెయిర్ స్టైల్ దీపిక సినిమా మేనియా ఏకంగా ప్రేక్షకుల తలకెక్కింది. ఇండియాలో కొద్దిమంది దీపిక ఫ్యాన్స్ ‘ట్రిపుల్ ఎక్స్’ అని తలపై అక్షరాలు రాయించుకొన్నారు. రెస్టారెంట్లలోనూ, బేకరీల్లోనూ ‘ట్రిపుల్ ఎక్స్’ పేరుతో ఆహార పదార్థాల్ని తయారు చేసి అమ్ముతున్నారు. దీన్నిబట్టి ఈ సినిమాపై మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో చెప్పొచ్చు. యాక్ష¯Œ కి పెట్టింది పేరైన ‘ట్రిపుల్ ఎక్స్’ ఫ్రాంచైజీకి ఇండియాలో పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఇప్పుడీ చిత్రానికి దీపిక కూడా తోడు కావడంతో ఆ అభిమానం పదింతలు పెరిగింది. దీపిక... ఇక యాక్షన్ భామ రొమాంటిక్ చిత్రాలతో యువతరానికి చేరువైన దీపిక ఈ చిత్రంతో ఇక యాక్షన్ భామగా అవతరించనున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని ఆమె యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ఆమె చేసిన స్టంట్లు ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేస్తాయని చిత్రబృందం పేర్కొంది. ‘ప్యారమౌంట్ పిక్చర్స్’, ‘రెవల్యూషన్ స్టూడియోస్’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని భారతదేశంలో ‘వయా కాం 18’ సంస్థ విడుదల చేస్తోంది. తెలుగులోనూ ఈ చిత్రం పెద్ద ఎత్తున రేపే విడుదల కానుంది. -
'ఆ సినిమాకు ఆస్కార్ ఖాయం'
లాస్ ఏంజెలెస్: 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' 8వ సీక్వెల్ కు ఆస్కార్ అవార్డు గెలుచుకుంటుందని హీరో విన్ డీజిల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఎఫ్. గ్యారీ గ్రేకు వచ్చే సంవత్సరం ఆస్కార్ అవార్డు ఖాయమని అభిప్రాయపడ్డాడు. 'ఈ సినిమా మొత్తాన్ని గ్యారీ తన భుజాలపై వేసుకున్నాడు. ఇందులో నేను కూడా నా వంతు పాత్ర పోషిస్తున్నాను. గ్యారీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది. అతడికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. ఏంజరుగుతుందో వేచి చూద్దామ'ని విన్ డీజిల్ పేర్కొన్నాడు. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' 8వ సీక్వెల్ లో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చెప్పాడు. అంతకుముందు సినిమాతో పోలిస్తే తన పాత్ర సంక్లిష్టంగా ఉంటుందని, అందరినీ ఆశ్చర్య పరిచేలా ఎమోషన్స్ ఉంటాయని వెల్లడించాడు. అమెరికాలో ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకానుంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణేతో కలిసి విన్ డీజిల్ నటించిన 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అదరగొట్టే స్టంట్లతో దుమ్మురేపింది!
స్టన్నింగ్ లుక్స్, అదరగొట్టే స్టంట్స్ తో తన తొలి హాలీవుడ్ సినిమాలో దీపికా పదుకొణే దుమ్మురేపింది. 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' సినిమాతో ఆమె హాలీవుడ్ కు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి అంతర్జాతీయ ట్రైలర్ లో దీపిక కనిపించింది కొంతసేపే కానీ, భారతీయ ప్రేక్షకుల కోసం ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసిన ట్రైలర్ ఆసాంతం దీపిక అదిరే విన్యాసాలు ఉండటం గమనార్హం. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లో హీరో విన్ డీజిల్ (జాండర్ కేగ్) కన్నా దీపికనే ఎక్కువ కనిపించడం గమనార్హం. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దీపిక నటించిన యాక్షన్ సీన్స్ ను ఎక్కువగా దట్టించి ట్రైలర్ రూపొందించినట్టు అర్ధమవుతోంది. అంతర్జాతీయంగా సూపర్ హిట్ అయిన హాలీవుడ్ సినిమా ట్రిపుల్ ఎక్స్ సీరిస్ లో ఇది మూడో సినిమా కాగా.. విన్ డీజిల్ లీడ్ రోల్ లో నటించిన రెండో సినిమా. ఇందులో సెరెనాగా వీన్ డీజిల్ కు పోటాపోటీగా స్టంట్స్ చేస్తూ దీపిక అదరగొట్టింది. ఆమె స్టంట్స్ భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. హిందీలో.. తమిళంలో.. -
అదరగొట్టే స్టంట్లతో దుమ్మురేపింది!
-
ఈ స్టార్ హీరోను గుర్తుపడతారా?
అతని తల్లి జ్యోతిష్కురాలు. నలుగురికి జాతకం చెబితేనే నోట్లోకి నాలుగు ముద్దలు. అమెరికా కాలిఫోర్నియాలోని అలామెడా కౌంటీలో నివసిస్తుండా.. పెళ్లి కాకుండానే ఆమె మగ కవలలకు జన్మనిచ్చింది. వారిలో ఒకడిపేరు మార్క్ సింక్లెయిర్. వయసుతోపాటే మార్క్ జీవితంలో సందిగ్థాలూ పెరిగాయి. నావి బ్రిటిష్, జర్మన్, స్కాటిష్ మూలాలని చెప్పే తల్లి.. తండ్రి పేరు మాత్రం చెప్పకపోయేది. మార్క్ ఇప్పటివరకు తనకు జన్మనిచ్చిన తండ్రిని కలుసుకోలేదు. న్యూయార్క్ లోని తన పిన్ని ఇంట్లో పెరిగిన మార్క్.. సందిగ్ధాల నుంచి బయడపడేందుకు సోషల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ అయ్యాడు. స్కూల్లో నాటకాలు వేశాడు. కాలేజీలోనూ వాటిని కంటిన్యూ చేశాడు. స్టేజ్ ఆర్టిస్టుగా తన పేరును విన్ డీజిల్ గా మార్చుకున్నాడు. నాటకాల ద్వారా కాస్తోకూస్తో పాపులర్ అయ్యాక సినిమాలవైపు నడిచాడు. కష్టానికి తోడు అదృష్టం కలిసొచ్చింది. విన్ డీజిల్ ఇప్పుడు హాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు. వాన్ డమ్, ఆర్నాల్డ్ స్వార్జ్ నెగర్, బ్రూస్ విల్లీస్ ల శకం ముగుస్తున్న తరుణంలో హాలీవుడ్ తెరకు లభించిన అద్భుత యాక్షన్ హీరో అతను. ఇవ్వాళ (జులై 18- అమెరికన్ కాలమానం ప్రకారం) అతని బర్త్ డే. 49వ పడిలోకి అడుగుపెడుతోన్న ఈ హీరో ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 సినిమాల్లో నటిస్తున్నాడు. 2017 జనవరిలో విడుదల కానున్న ట్రిపుల్ ఎక్స్ లో బాలీవుడ్ నటి దీపిక పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బర్త్ డే సందర్భంగా విన్ డీజిల్ ను మనసారా పొగుడుతూ శుభాకాంక్షలు చెప్పింది దీపిక. జులై 20న ట్రిపుల్ ఎక్స్ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. (రెండ్రోజుల ముందే దీపికను చూస్తారా?) ఇదిలా ఉంటే 1990లో హాలీవుడ్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి విన్ డీజిల్ హెయిర్ స్టైల్ లో మార్పు చోటుచేసుకోలేదు. గడిచిన 26 ఏళ్లుగా అతను బోడి గుండులోనే తప్ప జుట్టు పెంచుకోలేదు. విన్ డిజిల్ అనగానే గుండు, కండలు తిరిగిన శరీరం తప్ప మరో రూపాన్ని ఊహించుకోలేం. డీజిల్ అభిమానులు కొందరు తీవ్రంగా గాలించి హీరో హెయిర్ కట్ తో ఉన్న ఫొటోను సంపాదించారు. పై ఫొటో న్యూయార్క్ లోని ఆంగ్లో అమెరికన్ స్కూల్లో విన్ సీనియర్ క్లాస్ లో దిగినప్పటిది. చిన్ననాటి అనుభవాల వల్లనో ఏమోగానీ విన్ డీజిల్ కుటుంబానికి, మరీ ప్రధానంగా తన పిల్లలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తాడు. క్షణం తీరిక దొరికినా వాళ్లతో ఆటలాడతాడు. అన్నట్లు ట్రిపుల్ ఎక్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో విన్ డీజిల్ హీరోనే కాదు వాటి నిర్మాతకూడా! -
స్టార్ హీరోయిన్ మనసులో ఏముంది?
ముంబై: బాజీరావు మస్తానీ భామ దీపికా పదుకొనే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేం విన్ డీజిల్ జంటగా తెరకెక్కుతున్న హాలీవుడ్ మూవీ 'ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్'. దీపికా మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ విడుదలచేశారు. షూటింగ్ స్పాట్ లో విన్ డీజిల్, దీపికాపై చిత్రీకరిస్తున్న ఓ సీన్లో భాగంగా ఫొటో తీశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టార్ దీపికా పదుకొనే తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ గ్రౌండ్లో దీపిక ఫోటో స్కెచ్ వేసినట్లు ఉండగా, దాని ముందు మంచి వాళ్లను నేను నమ్మను. నాకు నమ్మకం లేదు అని అర్ధం వచ్చేలా 'ఇ డోంట్ బిలీవ్ ఇన్ గుడ్ గయ్స్' అని పోస్ట్ చేసింది. గతంలో ఈ ఒక్క సినిమా చేసి త్వరగా భారత్ కు తిరిగి వచ్చి, కేవలం బాలీవుడ్ లో కొనసాగుతానని చెప్పిన దీపికా ప్రస్తుతం ఇలాంటి ఫొటో ఎందుకు పోస్ట్ చేసిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో అతనితో పోటీగా నటించేందుకు దీపికా సన్నద్ధమవుతోంది. -
హాలీవుడ్ సీక్వెల్లో దీపిక
కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ స్టార్ విన్ డీసిల్తో కలిసి దీపికా పదుకొనే దిగిన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రానుందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే దీపిక మాత్రం తనతో సినిమాపై ఇప్పట్లో ఏం చెప్పలేనంటూ దాటవేసింది. గతంలోనే విన్ డీసిల్ లీడ్ రోల్లో నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో దీపిక నటించాల్సి ఉన్నా... డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. విన్ డీసిల్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ xxx సీక్వెల్లో దీపిక నటించనుందట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు స్వయంగా ప్రకటించాడు. ఫ్యాన్స్‌తో చాట్ సెషన్ సందర్భంగా దర్శకుడు డిజె కరుసో 'మేం జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తున్నాం, ఆమె (దీపిక) ఫిబ్రవరిలో షూటింగ్లో జాయిన్ అవుతుంది' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది. -
దీపికా పదుకొనేను టీజ్ చేశారు
ఈ మధ్య దీపిక పదుకొనే హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీసిల్తో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. సీరియస్ లుక్‌లో ఓ గుండు వ్యక్తిని హగ్ చేసుకున్న దీపిక, ఒక్క ఫోటో తో తన హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఈ ఫోటో ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోలే ఈ ఫోటోకు స్పూఫ్ చేయటంతో మరోసారి దీపిక మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ లాంటి అక్షయ్ కుమార్ దీపిక పదుకొనే ఫోటోకు స్పూఫ్ చేశాడు. ప్రస్తుతం హౌస్‌ఫుల్ 3 షూటింగ్లో బిజీగా ఉన్న అక్షయ్ తన కోస్టార్స్ రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి విన్ డీసిల్లా అనిపించే బొమ్మతో. దీపికా దిగినట్టుగానే ఫోటో దిగారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ పేజ్‌పై పోస్ట్ చేసిన అక్షయ్, 'విన్ డీసిల్ దీపికతో బిజీగా ఉన్నాడు అందుకే హౌస్‌ఫుల్ 3ని విన్ పెట్రోల్‌తో చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు. Since Vin Diesel is busy with @deepikapadukone, we at #Housefull3 are making do with Vin Petrol 😛 pic.twitter.com/AlPSPPv006— Akshay Kumar (@akshaykumar) December 8, 2015 -
అవును.. అతను విన్ డీసిలే..!
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దీపిక పదుకొనే ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఓ భారీకాయాన్ని కౌగిలించుకున్న దీపిక సీరియస్ లుక్‌తో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ఈ ఫోటో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి ఎవరంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్‌గా ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతను హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీసెల్. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటో లెటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ ఇద్దరు కలిసిన సందర్భం మాత్రం తెలియకపోయినా.. విన్ డీసిల్ హీరోగా తెరకెక్కనున్న ట్రిపులెక్స్ సీరీస్ నెక్ట్స్ పార్ట్ లో దీపిక హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విన్ హీరోగా తెరకెక్కిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రంలోనే దీపిక హీరోయిన్గా నటించాల్సి ఉన్నా, అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు కమిట్ అవడంతో చేయలేకపోయింది. దీంతో ఈ సారి విన్ డీసిల్ సరసన దీపిక నటించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
'ట్రిపుల్ ఎక్స్' సిరీస్‌లో దీపిక నటించనుందా?
బాలీవుడ్ నటి దీపికా పదుకొణే తాజాగా చేసిన ట్వీట్ హల్చల్ చేస్తోంది. 'ట్రిపుల్ ఎక్స్' సిరీస్‌లో వస్తున్న తదుపరి చిత్రం 'జాండర్ కేజ్ రిటర్న్స్'లో తాను నటించనున్నట్టు ఆమె సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు 'ట్రిపుల్ ఎక్స్' హీరో విన్ డీసెల్‌తో ఆమె ఓ ఫొటో దిగి ట్విట్టర్లో పోస్టు చేసింది. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వంటి ఇతర సోషల్ వెబ్సైట్లలోనూ ఈ ఫొటోను పెట్టి 'విన్ డిసెల్' అంటూ నటుడి పేరును రాసింది. ఈ ఫొటోలో వారి వెనుక సినిమా లోగో అయిన 'ట్రిపుల్ ఎక్స్' ఉండటం గమనార్హం. నిజానికి 2014లో హాలీవుడ్ స్టార్ డిసెల్ నటించిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' సినిమా ఆఫర్ దీపికకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాకు డేట్లు సరిపోకపోవడంతో ఈ ఆఫర్‌ను ఆమె వదులుకున్నట్టు అప్పట్లో భావించారు. అమెరికా యాక్షన్ థ్రిల్లర్ అయిన 'ట్రిపుల్ ఎక్స్' సినిమా మొదట 2002లో విడుదలైంది. ఈ సినిమాలో జాండర్ కేజ్ పాత్రలో సాహసోపేతమైన క్రీడాకారుడిగా, రెబెల్ గూఢచారిగా డిసెల్ నటించాడు. అప్పటినుంచి ఈ సీరిస్‌లో సినిమాలు వస్తూనే ఉన్నాయి. -
మరో మూడు సీక్వెల్స్‌తో పుల్ స్టాప్!
రయ్‌మంటూ దూసుకెళ్లే కార్లు... ఒక విమానం గాల్లో ఎగురుతుండగా... కొన్ని కార్లు ప్యారాచూట్స్ సాయంతో రోడ్డు మీద ల్యాండ్ కావడం... ఖరీదైన ఫెరారీ కారు రెండు ఎత్తై బిల్డింగ్స్ మధ్య నుంచి దూసుకుంటూ వెళ్లడం...ఈ దృశ్యాలన్నీ తలుచుకుంటే ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ సినిమా గుర్తుకువస్తుంది. ఇప్పటివరకూ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాలూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాయి. ఇందులోని పోరాట సన్నివేశాలు ఈ చిత్రాలకు ప్లస్ పాయింట్. ‘ఎఫ్-7’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎనిమిదో భాగం మీద పడింది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర కథానాయకుల్లో ఒకరైన విన్ డీజిల్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ఈ ఫ్రాంచైజ్కి మరో మూడు సీక్వెల్స్‌తో పుల్‌స్టాప్ పెట్టేస్తామని ఆయన తెలిపారు. ఈ ఎనిమిదో భాగాన్ని తెరకెక్కించి, 2017 ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, దర్శకుడు దొరక్క పోవడంతో ఈ చిత్రం షూటింగ్ సైతం ఇంకా ఆలస్యం కానుంది. -
వసూళ్ళలోనూ ఫాస్ట్ అండ్... ఫ్యూరియస్!
మన సినిమాలు తొలి వారంలో ఇక్కడ పదుల కోట్లు వసూలు చేయడం కొత్త కాదు. అదే గనక ఒక హాలీవుడ్ చిత్రం ఇక్కడకు వచ్చి, బాక్సాఫీస్ దుమ్ము దులిపితే? తాజా హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ ఆ రకంగా వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 2న వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజులకే మన దేశంలో బాక్సాఫీస్ వద్ద రూ. 49 కోట్ల మేర నికర వసూళ్ళు సాధించింది. విన్ డీసెల్, డ్వానే జాన్సన్, కీర్తిశేషులు పాల్ వాకర్ నటించిన ఈ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లోని 7వ సినిమా ఆ రకంగా ఇప్పుడు చరిత్రకెక్కుతోంది. భారతదేశంలో రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించిన అతికొద్ది హాలీవుడ్ సినిమాల్లో ఒకటి అవుతోంది. ఇదే ఊపు గనక కొనసాగి, రాగల కొద్దివారాల్లో ఈ సినిమా గనక మరొక్క రూ. 30 కోట్లు వసూలు చేస్తే, మన దేశంలో ఇప్పటి దాకా అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటి దాకా జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలోని ‘అవతార్’ చిత్రం రూ. 78 కోట్ల వసూళ్ళతో భారతదేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ సినిమా అన్న ఘనత సాధించింది. కాగా, మన దేశంలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ చిత్రం ఇటు ఇంగ్లీషులోనూ, అటు డబ్బింగ్ వెర్షన్లోనూ కలిపి దాదాపు 1800 నుంచి 2000 స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, క్రేజీ ఫైట్లు, పంచ్ డైలాగులతో ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. 2013లో అనుకోకుండా జరిగిన కారు ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూసిన పాల్ వాకర్ నటించిన ఆఖరు చిత్రం కావడం కూడా ఈ సినిమాకు క్రేజు పెంచింది. సినిమాలోని కథ, కథనాలతో పాటు మార్కెటింగ్ కూడా తోడవడంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ప్రస్తుతం భారత్‌లోనే కాక, ప్రపంచమంతటా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.