స్టార్ హీరోయిన్ మనసులో ఏముంది?
ముంబై: బాజీరావు మస్తానీ భామ దీపికా పదుకొనే, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేం విన్ డీజిల్ జంటగా తెరకెక్కుతున్న హాలీవుడ్ మూవీ 'ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్'. దీపికా మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ విడుదలచేశారు. షూటింగ్ స్పాట్ లో విన్ డీజిల్, దీపికాపై చిత్రీకరిస్తున్న ఓ సీన్లో భాగంగా ఫొటో తీశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టార్ దీపికా పదుకొనే తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బ్యాక్ గ్రౌండ్లో దీపిక ఫోటో స్కెచ్ వేసినట్లు ఉండగా, దాని ముందు మంచి వాళ్లను నేను నమ్మను. నాకు నమ్మకం లేదు అని అర్ధం వచ్చేలా 'ఇ డోంట్ బిలీవ్ ఇన్ గుడ్ గయ్స్' అని పోస్ట్ చేసింది. గతంలో ఈ ఒక్క సినిమా చేసి త్వరగా భారత్ కు తిరిగి వచ్చి, కేవలం బాలీవుడ్ లో కొనసాగుతానని చెప్పిన దీపికా ప్రస్తుతం ఇలాంటి ఫొటో ఎందుకు పోస్ట్ చేసిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో అతనితో పోటీగా నటించేందుకు దీపికా సన్నద్ధమవుతోంది.