అవును.. అతను విన్ డీసిలే..! | deepika padukone with vin diesel | Sakshi
Sakshi News home page

అవును.. అతను విన్ డీసిలే..!

Published Tue, Dec 8 2015 10:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

అవును.. అతను విన్ డీసిలే..!

అవును.. అతను విన్ డీసిలే..!

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దీపిక పదుకొనే ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఓ భారీకాయాన్ని కౌగిలించుకున్న దీపిక సీరియస్ లుక్తో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ఈ ఫోటో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి ఎవరంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.  ఫైనల్గా ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతను హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీసెల్. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటో లెటెస్ట్ సెన్సేషన్గా మారింది.

అయితే ఈ ఇద్దరు కలిసిన సందర్భం మాత్రం తెలియకపోయినా.. విన్ డీసిల్ హీరోగా తెరకెక్కనున్న ట్రిపులెక్స్ సీరీస్ నెక్ట్స్ పార్ట్ లో దీపిక హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విన్ హీరోగా తెరకెక్కిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రంలోనే దీపిక హీరోయిన్గా నటించాల్సి ఉన్నా, అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు కమిట్ అవడంతో చేయలేకపోయింది. దీంతో ఈ సారి విన్ డీసిల్ సరసన దీపిక నటించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement