fast and furious
-
ఫాస్ట్‌లో... ఇదే లాస్ట్ అవుతుందా?
హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా ఫ్రాంచైజీ నుంచి వచ్చిన పది సినిమాలు ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టుకోవడం ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీ నుంచి 11వ చిత్రం రానుంది. ‘ఫాస్ట్ ఎక్స్’ (‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ పదో చిత్రం) సినిమాకు దర్శకత్వం వహించిన లూయిస్ లెటర్రియర్ పదకొండవ సినిమానూ తెరకెక్కించనున్నారు. కాగా ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు లూయిస్. ‘‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11వ చిత్రం షూట్‌ను ఈ ఏడాదే ఆరంభిస్తాం. ప్రస్తుతం నేనో హారర్ మూవీ చేస్తున్నాను. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబరు 15న పూర్తవుతుంది. సెప్టెంబరు 16న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ 11వ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తాను. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో తొలి భాగం 2001లో విడుదలైంది. సరిగ్గా పాతికేళ్ల తర్వాత 2026లో ఈ సిరీస్‌లోని 11వ చిత్రం విడుదల చేస్తాం. తొలి చిత్రాన్ని విడుదల చేసిన తేదీనే (జూన్ 18) 11వ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని ఉంది. కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కుదురుతుందో లేదో చూడాలి’’ అని చెప్పుకొచ్చారు లూయిస్. కాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీలో ఇదే లాస్ట్ చిత్రం అవుతుందని హాలీవుడ్ టాక్. -
విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల కేసు
లాస్ ఏంజెలిస్: ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ యాక్షన్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ వివాదంలో చిక్కుకున్నారు. 2010లో సహాయకురాలి పనిచేస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించారంటూ మాజీ ఉద్యోగిని అస్టా జొనాస్సన్ తాజాగా ఆయనపై ఆరోపణలు చేశారు. అట్లాంటాలోని ఓ హోటల్లో బస చేసిన సమయంలో విన్ డీజిల్ తనను లైంగికంగా వేధించారంటూ ఆమె గురువారం లాస్ ఏంజెలెస్ కోర్టులో దావా వేశారు. లైంగిక వాంఛను తీర్చలేదనే కోపంతో వెంటనే విన్ డీజిల్‌కు చెందిన వన్ రేస్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనను తొలగించినట్లు ఆరోపించారు. -
ఆ సినిమా చూడు రూ.82000 గెలుచుకో.. కానీ ఓ ట్విస్ట్
సాధారణంగా మనం వినోదం కోసం డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చూస్తుంటాం. కానీ ఈ సినిమా చూస్తే వాళ్లే డబ్బులు రివర్స్ ఇస్తారట. అది కూడా ఏ వందో.. రెండొందలో కాదు. ఏకంగా 82 వేల రూపాయలు. ఇదేంటి.. సినిమా చూస్తేనే అంత డబ్బు ఎలా ఇస్తారు? అనుకుంటున్నారా?. నిజమే ఊరికే వెళ్లి సినిమా చూస్తే ఇవ్వరు.. వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానం ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటి వరకు తొమ్మిది భాగాల్లో విడుదలై బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక మే 19న ఈ సిరీస్ లో 10వ సినిమాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ X’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ బజ్ అనే ఓ ఇంటర్నేషనల్ వెబ్సైట్ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. (చదవండి: ‘బలగం’వేణుకి బంపరాఫర్.. బాలయ్యతో సినిమా!) ఈ మూవీ చూసి ఓ విషయంలో వాళ్లకు సాయం చేస్తే ఏకంగా 1000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 82,000) ఇస్తామని ప్రకటించింది. ఇంతకీ ప్రైజ్ మనీ గెలవాలంటే ఏం చేయాలంటే.. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ కు సంబంధించి ఇప్పటి వచ్చిన 10 భాగాలను చూడాలి. అందులో ఏ కారు డ్యామేజ్ అయ్యిందో నోట్ చేసి వెబ్‌సైట్‌కు అందజేయాలి. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా కంపెనీకి ఎంత ఇన్స్యూరెన్స్ భారం పడుతుందనేది ఆ వెబ్ సైట్ వాళ్లే అంచనా వేస్తారు. (చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్) వారి అంచనాలకు ఎవరు దగ్గరగా ఉంటారో, వారికి 1000 డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. అంతేకాదు, సినిమా టికెట్స్, స్నాక్స్ కోసం మరో 100 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం యూఎస్‌లో ఉన్నవారికే.. అది కూడా 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది. సినిమా విడుదల తేదీ అంటే మే 19 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. విజేతలను మే 26 లోగా ప్రకటించనున్నట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది. -
కో-స్టార్ కూతురి పెళ్లిలో తండ్రిలా నడిచిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో యాక్టర్స్ చేసే సాహసాలు రొమాలు నిక్కబోడిచేలా ఉండడంతో.. ఈ సిరీస్‌లో భారీ స్టాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించి వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు విన్ డీజిల్, పాల్ వాకర్. గత కొన్ని సంవత్సరాల క్రితం పాల్ వాకర్ ఓ యాక్సిడెంట్లో మరణించాడు. అయితే తాజాగా ఆ నటుడిక కూతురు మోడల్ మెడో వాకర్ (22) వివాహం జరిగింది. ఈ పెళ్లికి పాల్‌తో దాదాపు 6 సినిమాల్లో కలిసి నటించిన విన్ డిజిల్ హాజరయ్యాడు. అంతేకాకుండా పెళ్లి కూతురిని డయాస్ వరకూ తీసుకొచ్చాడు విన్. నిజానికి అక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురిని అలా ఆమె తండ్రి తీసుకొస్తాడు. అయితే పాల్ లేని కారణంగా.. ఈ దివంగత నటుడిపై ఉన్న అభిమానంతో విన్ ఆయన కూతురిని పెళ్లి కూతురిలా వేదిక వరకూ తీసుకురావడం ఎంతోమంది అభిమానులు మనసులను గెలుచుకుంది. అంతే కాకుండా దీనిపై ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ స్పందించారు. ఈ వివాహానికి సంబంధించి వీడియోని, ఫోటోలని మెడో వాకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి వైరల్‌గా మారాయి. చదవండి: అబార్షన్ చేయించుకొమన్నందుకు.. మాజీ ప్రియురాలికి క్షమాపణలు తెలిపిన నటుడు View this post on Instagram A post shared by Meadow Walker (@meadowwalker) View this post on Instagram A post shared by Meadow Walker (@meadowwalker) View this post on Instagram A post shared by Meadow Walker (@meadowwalker) -
సెప్టెంబర్ మొదటి వారం రిలీజ్‌కు రెడీ అయిన సినిమాలివే
ప్రేక్షకులకు వినోదం పంచేందుకు అటు థియేటర్లు, ఇటు ఓటీటీలు రెండూ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఓటీటీలు కేవలం సినిమాల మీదే ఆధారపడకుండా వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ పేరిట సొంత కంటెంట్‌ను అందిస్తూ యువతకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే థియేటర్లో రిలీజైన సినిమాలను వారం తిరిగేలోగా డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. ఎప్పటిలాగే ఈవారం కూడా జనాలను ఎంటర్టైన్ చేసేందుకు కొత్త సరుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలేంటో చూసేద్దాం.. 101 జిల్లాల అందగాడు బట్టతలతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడానికి వచ్చాడు నటుడు అవసరాల శ్రీనివాస్. ఆయన హీరోగా నటించిన చిత్రం 101 జిల్లాల అందగాడు. రుహానీ శర్మ హీరోయిన్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. డియర్ మేఘ మేఘా ఆకాశ్, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా డియర్ మేఘ. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ది కిల్లర్ కార్తీక్ సాయి, నేహా దేశ్‌పాండే, డాలీ షా ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ది కిల్లర్. చిన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యాదవ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసుదేవరావు నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలవుతోంది. అప్పుడు ఇప్పుడు సుజన్, తనీష్క్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అప్పుడు ఇప్పుడు. శివాజీ రాజా, పేరుపురెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. చలపతి పువ్వల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఉషారాణి కనుమూరి, విజయ్ రామకృష్ణంరాజు నిర్మించారు. ఇది సెప్టెంబర్ మూడో తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అశ్మీ రుషికా రాజ్, రాజ నరేంద్ర, కేశప్ దీపకప్, ఇందు కుసుమ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం అశ్మీ. శేష్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా సైతం సెప్టెంబర్ 3వ తేదీనే థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 యాక్షన్ ప్రియులు ఎంతగానో ఇష్టపడే సిరీస్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు సినిమాలు రిలీజై కాసుల పంటను కురిపించాయి. తాజాగా తొమ్మిదో సిరీస్ భారత ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. సెప్టెంబర్ 3న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. విన్ డీజిల్, టైరీ గిబ్సన్, మిచెల్లీ రోడ్రిగోజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇవి కాకుండా ఓటీటీలో వస్తున్న మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. అమెజాన్ ప్రైమ్ వీడియో ♦ సిండ్రెల్లా - సెప్టెంబర్ 3 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ♦ బ్లాక్ విడో - సెప్టెంబర్ 3 ♦ షాంఘ్ చి అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్ - సెప్టెంబర్ 3 నెట్‌ఫ్లిక్స్ ♦ స్పార్కింగ్ జాయ్ - ఆగస్టు 31 ♦ గుడ్ గర్ల్స్ - ఆగస్టు 31 ♦ మనీ హెయిస్ట్ 5వ సీజన్ - సెప్టెంబర్ 3 జీ5 ♦ హెల్మెట్ - సెప్టెంబర్ 3 -
తేదీలు తారుమారు
ఎటు చూసినా మాస్కులు తొడుక్కున్న ముఖాలే. ఏ నలుగురి సంభాషణ విన్నా సారాంశం అదే. దీనంతటికీ కారణం.. ‘కరోనా వైరస్’. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రశాంతంగా బయట తిరగనివ్వడం లేదు. రాకపోకలు తగ్గిపోయాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. కరోనా ప్రభావం అన్ని పరిశ్రమల మీదా పడింది. చిత్రపరిశ్రమ మీద కూడా పడింది. షూటింగులు, రిలీజ్లు, ప్రమోషన్లను కరోనా చిత్రవిచిత్రంగా ఇబ్బంది పెడుతోంది. రిలీజ్‌కు రెడీ అయిన సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యేలా చేస్తోంది. రెవెన్యూ దెబ్బ తీస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకుల భద్రత, సినిమా భద్రతను (కలెక్షన్లు) ఆలోచించి నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని చోట్ల థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ తలకిందులయ్యాయి. కోవిడ్ 19 ఎఫెక్ట్ ఇది. ‘క్యా కరోనా?’ అనుకోవడం మినహా ఏమీ చేయలేం. ఇక తారుమారైన సినిమాల పరిస్థితి తెలుసుకుందాం. పోలీస్ నహీ ఆ రహా హై సూపర్ పోలీస్‌ల పాత్రలతో బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంటారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. అజయ్ దేవగన్‌తో ‘సింగం’, రణ్వీర్ సింగ్‌తో ‘సింబా’ సినిమాలు తీశాక అక్షయ్ కుమార్‌ను ‘సూర్యవన్షీ’గా మార్చారు రోహిత్. ‘పోలీస్ ఆ రహా హై’ అన్నది క్యాప్షన్ (పోలీస్ వస్తున్నాడని అర్థం). కానీ టైమ్‌కి రావడంలేదు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణ్వీర్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 24న ఈ సినిమా విడుదలవ్వాలి. ‘‘ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘సూర్యవన్షీ’ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం. సరైన టైమ్ వచ్చినప్పుడు ‘సూర్యవన్షీ’ వస్తాడు’’ అని చిత్రబృందం పేర్కొంది. సింహం వాయిదా? మోహన్ లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన భారీ పీరియాడికల్ చిత్రం ‘మరక్కార్: అరబికడలింటె సింహం’. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 26న ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే కేరళలో మార్చి 31 వరకూ థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఈ సినిమా ఏప్రిల్ నెలకు వాయిదా పడుతుందని టాక్. హాలీవుడ్లో... అటు హాలీవుడ్‌కి వెళితే నాలుగైదు సినిమాల విడుదల ప్రస్తుతానికి ఆగింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో 9వ సినిమా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ని ఈ ఏడాది మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మా కొత్త చిత్రం కోసం మీ అందరూ (ఫ్యాన్స్) ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. అలాగే డిస్నీ సంస్థ భారీ వ్యయంతో తెరకెక్కించిన ‘ములాన్’ చిత్రం మార్చి 27న థియేటర్స్‌లోకి రావాలి. 2018లో సూపర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ ‘ఎ క్వయిట్ ప్లేస్’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ఎ క్వయిట్ ప్లేస్ 2’ చిత్రం మార్చి 18న విడుదల కావాలి. అయితే ఈ రెండు చిత్రాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త విడుదల తేదీలను ఇంకా ప్రకటించలేదు. పోయిన వారమే జేమ్స్ బాండ్ కొత్త చిత్రం ‘నో టైమ్ టు డై’ విడుదల తేదీని నవంబర్‌కి మార్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కరోనా ప్రభావం ఇంకా చాలా సినిమాల రిలీజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అనుకున్న టైమ్‌కి సినిమాని రిలీజ్ చేయకపోతే సినిమా నిర్మాణానికి తీసుకున్న డబ్బుకి ఇంట్రస్ట్ పెరుగుతుంది.. ఆడియన్స్‌లో ఆ సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇప్పుడు విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదా పడితే.. ఆ తర్వాతి నెలల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న చిత్రాల రిలీజ్‌కు క్లాష్ ఏర్పడు తుంది. మొత్తం మీద కరోనా ఇండస్ట్రీని బాగానే కలవరపెడుతోంది. కోబ్రాకు బ్రేక్ 7 విభిన్న పాత్రల్లో విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను రష్యాలో ప్లాన్ చేసి, కొన్ని రోజులుగా అక్కడ షూటింగ్ జరుపుతున్నారు. అయితే విదేశీ రాకపోకలను తగ్గించేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాకముందే ‘కోబ్రా’ టీమ్ ఇండియా వచ్చేయాల్సి వస్తోందని దర్శకుడు ట్వీట్ చేశారు. థియేటర్లు క్లోజ్ కరోనా తీవ్రత పెరుగుతున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో థియేటర్స్‌ను స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆల్రెడీ కేరళలో కొన్ని రోజులుగా థియేటర్స్‌లో ప్రదర్శనను ఆపేశారు. తాజాగా కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, ఒడిస్సాలో థియేటర్స్‌ను ఈ నెల 31 వరకూ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. టాలీవుడ్ పై ప్రభావం? పలు తెలుగు చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై కరోనా ప్రభావం పడినప్పటికీ ప్రస్తుతానికి రిలీజ్ తేదీల్లో ఇప్ప టివరకూ ఏ సినిమా వాయిదా పడలేదు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూసివేస్తున్నట్టు ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. – గౌతమ్ మల్లాది -
పాల్‌పై డాక్యుమెంటరీ
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ హాలీవుడ్ మూవీ సిరీస్ ద్వారా అందులో ఒక హీరో పాల్ వాకర్ సుపరిచితుడే. 2013లో జరిగిన కార్ యాక్సిడెంట్లో పాల్ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో మీద ఓ డాక్యుమెంటరీ రూపొందించింది హాలీవుడ్ సంస్థ పారామౌంట్ పిక్చర్స్. ‘ఐ యామ్’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందిస్తుంటుంది పారామౌంట్ సంస్థ. ఈ సిరీస్‌లో భాగంగానే పాల్ వాకర్‌పై కూడా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులో పాల్ బాల్యంలోని కొన్ని వీడియోలను చూపించనున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో పాల్‌తో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్, డైరెక్టర్స్‌తో ఇంటర్వ్యూలను కూడా పొందుపరిచారట. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే రిలీజ్ చేసింది పారామౌంట్. ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్ 11న ప్రసారం కానుంది. -
అతను నటిస్తే నేను తప్పుకుంటా..!
హాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లో ప్రధాన పాత్రధారి టైరెస్ గిబ్సన్ చిత్ర నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చాడు. త్వరలో ఈ సిరీస్‌లో 9వ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్న నేపథ్యంలో గిబ్సన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాజా ఎడిషన్ లో హాలీవుడ్ యాక్షన్ హీరో డ్వేన్ జాన్సన్ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందన్న వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే తాను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు. ఈ 9వ ఎడిషన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా చిత్రయూనిట్ సినిమాను ఏడాదిపాటు వాయిదా వేశారు. వాయిదా విషయాన్ని ప్రకటించిన సమయంలో కూడా గిబ్సన్ అసహనం వ్యక్తం చేశారు. జాన్సన్‌ను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ యూనిట్ తప్పకుండా తీసుకోవాలని భావిస్తే అది ఈ చిత్రం నుంచి నేను తప్పుకొని తనకు మరిన్ని కొత్త పాత్రలు చేయడానికి వారు ఇచ్చిన అవకాశం గా భావిస్తానన్నారు. ఈ వివాదంపై ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. -
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8 మూవీ రివ్యూ
టైటిల్: ఎఫ్8 - ది ఫేట్ ఆఫ్ ఫ్యూరియస్ జానర్: క్రైమ్ థ్రిల్లర్ తారాగణం: విన్ డీజిల్, డ్వేన్ జాన్సన్, జేసన్ స్టాథమ్, మిషెల్ రోడ్రిగెజ్, చార్లీజ్ థీరన్ సంగీతం: బ్రియన్ టేలర్ దర్శకత్వం: ఎఫ్. గ్యారీ గ్యారీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌ను నుంచి ఎనిమిది చిత్రాలు వచ్చాయంటే అందుకు కారణం వాటికున్న ప్రేక్షకాదరణే. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుడిని చూపు తిప్పుకొనివ్వని యాక్షన్ సీన్స్‌తో కట్టిపడేస్తాయి ఈ చిత్రాలు. అచ్చూ అదే తరహాలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చింది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ - ది ఫేట్ ఆఫ్ ఫ్యూరియస్. ఎఫ్-8పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. విన్ డీజిల్, డ్వేన్ జాన్సన్, మిషెల్ రోడ్రిగెజ్ లాంటి హేమాహేమీలు నటించిన ఎఫ్-8ను రెండు సంవత్సరాలకు పైగా నిర్మించారు. మరి ఇన్ని భారీ హంగులతో వచ్చిన ఎఫ్-8 ప్రేక్షకులను మెప్పించిందా?. కథ: కారు రేసర్, బృంద నాయకుడైన డామ్(విన్ డీజిల్) ఏడో భాగం చివర్లో హైఫై నేరాలకు బైబై చెప్పేస్తాడు. దీంతో బృందంలోని మిగిలిన సభ్యులు కూడా అతని బాటలోనే నడవాలని నిర్ణయించుకుంటారు. భార్య లెట్టీ(మిషెల్ రోడ్రిగెజ్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు డామ్. ఇంతలో ఓ రోజు డామ్‌ను ప్రొఫెషనల్ హ్యాకరైన సిఫర్(చార్లీజ్ థీరన్) తన అందచందాలతో వలలో వేసుకుంటుంది. అతన్ని మళ్లీ నేర సామ్రాజ్యంలోకి లాగుతుంది. టెర్రరిజం వైపుగా అతన్ని తీసుకెళ్లే యత్నం చేస్తుంది. దీంతో డామ్ సహచరులందరూ చిక్కుల్లో పడతారు. మరి డామ్ టెర్రరిస్టుగా మారి దేశ విద్రోహశక్తులకు సాయం చేశాడా?. అతని టీంను తిరిగి రక్షించుకున్నాడా? అనే విషయాలను వెండితెరపైనే చూడాలి. ఎలా ఉందంటే.. విన్ డీజిల్, డ్వేన్ జాన్సన్, జేసన్ స్టాథమ్లు మరోమారు వెండి తెరపై మ్యాజిక్ చేశారు. సిఫర్తో కలిసి కుటుంబాన్ని వదిలేసి డామ్ వెళ్లిపోయే దగ్గర నుంచి చిత్రం రసవత్తరంగా మారుతుంది. డామ్‌ను మళ్లీ వెనక్కు తీసుకొచ్చుకునేందుకు లెట్టీ ఇతర సభ్యులు చేసిన ప్రయత్నాల్లో యాక్షన్ సీన్స్ గగుర్పాటుకు గురి చేస్తాయి. అక్కడక్కడా యాక్షన్ సీన్స్‌లో కొన్ని లింక్స్ మిస్ అయినట్లు అనిపించినా.. ఓవరాల్‌గా మంచి యాక్షన్ మూవీని చూసిన అనుభూతిని కలిగిస్తుంది ఎఫ్-8. డామ్‌ను టెర్రరిస్టు గ్రూపులో భాగస్వామ్యం చేసేందుకు సిఫర్ చేసే యత్నాలు సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా మంచు కొండల్లో తీసిన రేస్ సీన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. రెండు గంటల నలభై నిమిషాల నిడివి కలిగిన సినిమా ఎక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించేలా లేదు. యాక్షన్ తరహా చిత్రాలను ఇష్టపడేవారికి ఎఫ్-8 బెస్ట్ ఆప్షన్ టూ వాచ్ ఆన్ ఏ హాలిడే. -
'ఆ సినిమాకు ఆస్కార్ ఖాయం'
లాస్ ఏంజెలెస్: 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' 8వ సీక్వెల్ కు ఆస్కార్ అవార్డు గెలుచుకుంటుందని హీరో విన్ డీజిల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఎఫ్. గ్యారీ గ్రేకు వచ్చే సంవత్సరం ఆస్కార్ అవార్డు ఖాయమని అభిప్రాయపడ్డాడు. 'ఈ సినిమా మొత్తాన్ని గ్యారీ తన భుజాలపై వేసుకున్నాడు. ఇందులో నేను కూడా నా వంతు పాత్ర పోషిస్తున్నాను. గ్యారీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది. అతడికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. ఏంజరుగుతుందో వేచి చూద్దామ'ని విన్ డీజిల్ పేర్కొన్నాడు. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' 8వ సీక్వెల్ లో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చెప్పాడు. అంతకుముందు సినిమాతో పోలిస్తే తన పాత్ర సంక్లిష్టంగా ఉంటుందని, అందరినీ ఆశ్చర్య పరిచేలా ఎమోషన్స్ ఉంటాయని వెల్లడించాడు. అమెరికాలో ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకానుంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణేతో కలిసి విన్ డీజిల్ నటించిన 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అయిదో అంతస్తు... ఏడు కార్లు!
అదో పెద్ద బిల్డింగ్. అందులో అది అయిదో అంతస్తు. ఆ బిల్డింగ్ బయట 35 నుంచి 45 కార్లు ఆగి ఉన్నాయి. ఆ అయిదో అంతస్తులోని పార్కింగ్ స్పేస్ నుంచి సడన్‌గా ఏడు కార్లు రోడ్డు మీద ఉన్న కార్ల మీద పడి పెద్ద విస్ఫోటనం సృష్టించాయి. ఆ రోడ్డు మీద ఉన్న జనాలందరూ భయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. అసలింత విధ్వంసం ఎక్కడ జరిగిందనేదే కదా మీ అనుమానం. హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఎనిమిదో భాగం ‘ఫాస్ట్ 8’ కోసం ఆ చిత్ర దర్శకుడు ఎఫ్.గ్యారీ గ్రే చిత్రీకరించిన సన్నివేశం ఇది. అయితే పై నుంచి పడే ఏడు కారుల్లోనూ డ్రైవర్లు లేకుండా ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. అయిదో అంతస్తు నుంచి కార్లను అమాంతంగా పడేయడం కోసం చిత్రబృందం చాలా కష్టాలే పడ్డారట. కార్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఓ క్రమంలో పడితేనే షాట్ ఓకే అవుతుంది. పక్కా ప్లాన్‌తో రీటేక్ లేకుండా ఈ సీన్ తీయడం విశేషం. విన్ డీజిల్, డ్వేన్ జాన్సన్ లాంటి హాలీవుడ్ సూపర్‌స్టార్స్ నటిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఈ సినిమా ఇలా ఉంటుంది’ అని శాంపిల్ కూడా చూపిస్తున్నారు. సాధారణంగా సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలను ఆ సినిమా విడుదలయ్యాక యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. కానీ, ‘ఫాస్ట్ 8’ యూనిట్ మాత్రం విడుదలకు ముందే మేకింగ్ వీడియో రిలీజ్ చేసి, అభిమానులను ఊరిస్తున్నారు. -
బుల్లెట్ రాణి, బుల్లెట్ రాజాల సాహసయాత్ర
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై దర్జాగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఇద్దరినీ ఎక్కడో చూసినట్లనిపిస్తోందికదా! అవును. ఆయన 'సుత్తి'తో దుష్టులను అంతం చేసే 'థోర్' హీరో క్రిస్ హేమ్స్ వర్త్ కాగా, ఆవిడ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' హీరోయిన్ ఎల్సా పాట్కీ. వీళ్లిద్దరూ భార్యభర్తలుగా కంటే గొప్ప స్నేహితులుగా, ఒకరికోసం ఒకరన్నట్లు జీవించే ప్రేమపక్షులుగా ప్రసిద్ధి. ఆ బంధాన్ని మరింత దృఢపర్చుకునేందుకు ఈ వాలెంటైన్స్ డేనాడు ఇద్దరూ కలిసి మరో సాహసకృత్యానికి సిద్ధమయ్యారు. సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చి.. అడ్వెంచర్ టూరిస్టులకు అడ్డాగా మారిన ఇండియాకు కుటుంబంతోసహా విచ్చేసిన ఈ హాలీవుడ్ జంట ఇప్పటికే గోవా, లడాఖ్ ప్రాంతాలను చుట్టేశారు. వారి తర్వాతి గమ్యం హిమాలయాల్లో ట్రెక్కింగ్. సరిగ్గా ప్రేమికులరోజునాడే హిమాలయ సాహసయాత్రను ప్రారంభించనున్నారీ ప్రేమజంట. స్పెయిన్ కు చెందిన 'ప్లానెటా ఛలేజా(ప్లానెట్ ఛాలెంజ్)' అనే అడ్వెంచర్స్ అంస్థ వీరి టూర్ ను గైడ్ చేస్తోంది. -
అవును.. అతను విన్ డీసిలే..!
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దీపిక పదుకొనే ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఓ భారీకాయాన్ని కౌగిలించుకున్న దీపిక సీరియస్ లుక్‌తో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ఈ ఫోటో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి ఎవరంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్‌గా ఆ వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. అతను హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీసెల్. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటో లెటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ ఇద్దరు కలిసిన సందర్భం మాత్రం తెలియకపోయినా.. విన్ డీసిల్ హీరోగా తెరకెక్కనున్న ట్రిపులెక్స్ సీరీస్ నెక్ట్స్ పార్ట్ లో దీపిక హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విన్ హీరోగా తెరకెక్కిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రంలోనే దీపిక హీరోయిన్గా నటించాల్సి ఉన్నా, అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు కమిట్ అవడంతో చేయలేకపోయింది. దీంతో ఈ సారి విన్ డీసిల్ సరసన దీపిక నటించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
ఇతనెవరు?
సన్నగా, తీగలా ఉండే దీపికా పదుకొనే బొద్దుగా బందరు లడ్డూలా ఉన్న ఓ వ్యక్తిని హత్తుకున్నారు. ఆ ఫొటోను ప్రపంచానికి చూపించాలనుకుని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇంతకీ దీపికా హత్తుకున్న ఆ వ్యక్తి ఎవరో ఆ ఫొటో బయటపెట్టలేదు. ఎందుకంటే, అతని బ్యాక్ మాత్రమే ఫొటోలో కనిపిస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలు ‘ ఏజెంట్ త్రిబుల్ ఎక్స్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫేమ్ విన్ డీజిల్ అతను. ఇంతకీ ఇతగాణ్ణి దీపికా ఎప్పుడు హగ్ చేసుకున్నారు? అనే విషయంలోకి వస్తే.. హాలీవుడ్ చిత్రం ‘ఏజెంట్ త్రిబుల్ ఎక్స్’ సీక్వెల్లో హీరోయిన్గా నటించే అవకాశం ఆమెకు వచ్చిందట. ఆ చిత్రానికి సంబంధించిన ఆడిషన్స్‌లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. ఈ చిత్రంలో విన్ డీజిల్ హీరోగా నటించనున్నారు. అమెరికాలో విన్, దీపికా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే.. గతంలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఏడో భాగంలో కథానాయికగా అవకాశం వచ్చినా డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ సినిమా ఆఫర్‌ను దీపిక తిరస్కరించారు. ఇప్పుడు ‘ఏజెంట్ త్రిబుల్ ఎక్స్’ సీక్వెల్ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. మరి.. ఈ చిత్రానికి ఒప్పందం చేసుకున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
మరో మూడు సీక్వెల్స్‌తో పుల్ స్టాప్!
రయ్‌మంటూ దూసుకెళ్లే కార్లు... ఒక విమానం గాల్లో ఎగురుతుండగా... కొన్ని కార్లు ప్యారాచూట్స్ సాయంతో రోడ్డు మీద ల్యాండ్ కావడం... ఖరీదైన ఫెరారీ కారు రెండు ఎత్తై బిల్డింగ్స్ మధ్య నుంచి దూసుకుంటూ వెళ్లడం...ఈ దృశ్యాలన్నీ తలుచుకుంటే ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ సినిమా గుర్తుకువస్తుంది. ఇప్పటివరకూ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాలూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాయి. ఇందులోని పోరాట సన్నివేశాలు ఈ చిత్రాలకు ప్లస్ పాయింట్. ‘ఎఫ్-7’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎనిమిదో భాగం మీద పడింది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర కథానాయకుల్లో ఒకరైన విన్ డీజిల్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ఈ ఫ్రాంచైజ్కి మరో మూడు సీక్వెల్స్‌తో పుల్‌స్టాప్ పెట్టేస్తామని ఆయన తెలిపారు. ఈ ఎనిమిదో భాగాన్ని తెరకెక్కించి, 2017 ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, దర్శకుడు దొరక్క పోవడంతో ఈ చిత్రం షూటింగ్ సైతం ఇంకా ఆలస్యం కానుంది. -
పాస్ట్ అండ్ ఫ్యూరియస్!
ఇటీవలే విడుదలైన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లోని 7 వ చిత్రం ప్రపంచ ప్రేక్షకుల్ని ఊపిరాడనివ్వడం లేదు. అదే స్థాయిలో ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దేశాలను ఉర్రూతలూగిస్తున్న చిత్రం ‘బ్యాటిల్ ఫర్ సెవస్టోపుల్’. మునుపటి సోవియట్ యూనియన్‌లో భాగమైన రష్యా, ఉక్రెయిన్ల సంబంధాలు బాగా క్షీణించి ఉన్న ప్రస్తుత తరుణంలో ‘బ్యాటిల్ ఫర్ సెవస్టోపుల్’ను ఇరు దేశాల ప్రజలూ ఒకేలా ఆదరిస్తున్నారు! అయితే ఉక్రెయిన్ సరిహద్దు సినిమా హాళ్లలో మాత్రం ఈ చిత్రాన్ని ‘ఇన్డిస్ట్రక్టబుల్’ అనే పేరుతో ప్రదర్శిస్తున్నారు! రెండు దేశాల సంబంధాలు దెబ్బతినకముందు ఇరు దేశాల నిర్మాణ సంస్థలు కలిసి బ్యాటిల్ ఫర్ సెవస్టోపుల్ ను నిర్మించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో ‘లేడీ డెత్’గా ఖ్యాతిగాంచిన రెడ్ ఆర్మీ సైనికురాలు ల్యుడ్మిలా పావ్లిఛెంకో జీవితకథ ఆధారంగా డెరైక్టర్ సెర్గీ మోక్రిత్స్కీ ఈ సినిమా తీశారు. 1941లో ఫ్రంట్‌లైన్ సైనికురాలిగా యుద్ధంలోకి దిగిన పావ్లిఛెంకో... సెవస్టోపుల్ నగరం నాజీల హస్తగతం కాకుండా భీకరంగా పోరాడుతున్న క్రమంలో ఏడాదిలోపే 309 మంది నాజీ సైనికులను తన రైఫిల్‌తో హతమార్చారు! అంతటి చరిత్రాత్మకమైన సెవస్టోపుల్ ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పంలో ఉంది. ఆ క్రిమియా ఇప్పుడు రష్యా అధీనంలో ఉంది. బహుశా అందుకే కావచ్చు.. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఘర్షణకు ప్రధాన కారణమైన క్రిమియాలోని సెవస్టోపుల్పై వచ్చిన ‘బ్యాటిల్ ఫర్ సెవస్టోపుల్’.. రెండు దేశాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ప్రమోషన్ కు అలీ ఫజల్ దూరం
న్యూఢిల్లీ: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోయే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ప్రమోషన్ నుంచి హాలీవుడ్ నటుడు అలీఫజల్ నిష్క్రమించాడు. దీనికి కారణం లేకపోలేదు. అదేమిటంటే సోనీ రజ్దాన్ దర్శకత్వంలో ఆయన ''లవ్ అఫైర్'' అనే సినిమా చేయబోతున్నాడు. ఈ కారణంతోనే అతడు ప్రమోషన్ కు హాజరుకావటంలేదని అలీఫజల్ సన్నిహితులు తెలిపారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ కు మాత్రం ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 సినిమా ప్రీమియర్ కు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని అలీఫజల్ తెలిపారు. ఇదిలాఉండగా ఫాస్ట్ అండ్ ప్యూరియస్ 7 సినిమాలో అలీఫజల్ మూడు సీన్లలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ కూడా నటించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 భారత్ లో ఏప్రిల్ 2 వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ్ లోనూ విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' ట్రైలర్