ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-8 మూవీ రివ్యూ | fast and furious-fate of the furious review | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-8 మూవీ రివ్యూ

Published Thu, Apr 13 2017 11:49 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-8 మూవీ రివ్యూ

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-8 మూవీ రివ్యూ

టైటిల్: ఎఫ్‌8 - ది ఫేట్‌ ఆఫ్‌ ఫ్యూరియస్‌ 
జానర్‌: క్రైమ్‌ థ్రిల్లర్‌
తారాగణం: విన్‌ డీజిల్‌, డ్వేన్‌ జాన్సన్‌, జేసన్‌ స్టాథమ్‌, మిషెల్‌ రోడ్రిగెజ్‌, చార్లీజ్‌ థీరన్‌
సంగీతం: బ్రియన్‌ టేలర్‌
దర్శకత్వం: ఎఫ్‌. గ్యారీ గ్యారీ

 

 

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సిరీస్‌ను నుంచి ఎనిమిది చిత్రాలు వచ్చాయంటే అందుకు కారణం వాటికున్న ప్రేక్షకాదరణే. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుడిని చూపు తిప్పుకొనివ్వని యాక్షన్‌ సీన్స్‌తో కట్టిపడేస్తాయి ఈ చిత్రాలు. అచ్చూ అదే తరహాలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చింది ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ - ది ఫేట్‌ ఆఫ్‌ ఫ్యూరియస్‌. ఎఫ్‌-8పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. విన్‌ డీజిల్‌, డ్వేన్‌ జాన్సన్‌, మిషెల్‌ రోడ్రిగెజ్‌ లాంటి హేమాహేమీలు నటించిన ఎఫ్‌-8ను రెండు సంవత్సరాలకు పైగా నిర్మించారు. మరి ఇన్ని భారీ హంగులతో వచ్చిన ఎఫ్‌-8 ప్రేక్షకులను మెప్పించిందా?.



కథ:
కారు రేసర్‌, బృంద నాయకుడైన డామ్‌(విన్‌ డీజిల్‌) ఏడో భాగం చివర్లో హైఫై నేరాలకు బైబై చెప్పేస్తాడు. దీంతో బృందంలోని మిగిలిన సభ్యులు కూడా అతని బాటలోనే నడవాలని నిర్ణయించుకుంటారు. భార్య లెట్టీ(మిషెల్‌ రోడ్రిగెజ్‌)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు డామ్‌. ఇంతలో ఓ రోజు డామ్‌ను ప్రొఫెషనల్‌ హ్యాకరైన సిఫర్‌(చార్లీజ్‌ థీరన్‌) తన అందచందాలతో వలలో వేసుకుంటుంది. అతన్ని మళ్లీ నేర సామ్రాజ్యంలోకి లాగుతుంది. టెర్రరిజం వైపుగా అతన్ని తీసుకెళ్లే యత్నం చేస్తుంది. దీంతో డామ్‌ సహచరులందరూ చిక్కుల్లో పడతారు. మరి డామ్‌ టెర్రరిస్టుగా మారి దేశ విద్రోహశక్తులకు సాయం చేశాడా?. అతని టీంను తిరిగి రక్షించుకున్నాడా? అనే విషయాలను వెండితెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే..
విన్‌ డీజిల్‌, డ్వేన్‌ జాన్సన్‌, జేసన్‌ స్టాథమ్‌లు మరోమారు వెండి తెరపై మ్యాజిక్‌ చేశారు. సిఫర్‌తో కలిసి కుటుంబాన్ని వదిలేసి డామ్‌ వెళ్లిపోయే దగ్గర నుంచి చిత్రం రసవత్తరంగా మారుతుంది. డామ్‌ను మళ్లీ వెనక్కు తీసుకొచ్చుకునేందుకు లెట్టీ ఇతర సభ్యులు చేసిన ప్రయత్నాల్లో యాక్షన్‌ సీన్స్‌ గగుర్పాటుకు గురి చేస్తాయి. అక్కడక్కడా యాక్షన్‌ సీన్స్‌లో కొన్ని లింక్స్‌ మిస్‌ అయినట్లు అనిపించినా.. ఓవరాల్‌గా మంచి యాక్షన్‌ మూవీని చూసిన అనుభూతిని కలిగిస్తుంది ఎఫ్‌-8.

డామ్‌ను టెర్రరిస్టు గ్రూపులో భాగస్వామ్యం చేసేందుకు సిఫర్‌ చేసే యత్నాలు సీన్స్‌ బాగున్నాయి. ముఖ్యంగా మంచు కొండల్లో తీసిన రేస్‌ సీన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. రెండు గంటల నలభై నిమిషాల నిడివి కలిగిన సినిమా ఎక్కడా ప్రేక్షకుడికి బోర్‌ కొట్టించేలా లేదు.  యాక్షన్‌ తరహా చిత్రాలను ఇష్టపడేవారికి ఎఫ్‌-8 బెస్ట్‌ ఆప్షన్‌ టూ వాచ్‌ ఆన్‌ ఏ హాలిడే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement