ఫాస్ట్‌లో... ఇదే లాస్ట్‌ అవుతుందా? | Director Louis Leterrier Shares Exciting Update On Fast And Furious 11 Movie | Sakshi
Sakshi News home page

Fast & Furious 11: ఫాస్ట్‌లో... ఇదే లాస్ట్‌ అవుతుందా?

Published Tue, May 7 2024 10:49 AM | Last Updated on Tue, May 7 2024 11:56 AM

Director Louis Leterrier Shares Exciting Update On Fast And Furious 11 Movie

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ యాక్షన్‌ ఫ్రాంచైజీ ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా ఫ్రాంచైజీ నుంచి వచ్చిన పది సినిమాలు ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టుకోవడం ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజాగా ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ ఫ్రాంచైజీ నుంచి 11వ చిత్రం రానుంది. ‘ఫాస్ట్‌ ఎక్స్‌’ (‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ పదో చిత్రం) సినిమాకు దర్శకత్వం వహించిన లూయిస్‌ లెటర్రియర్‌ పదకొండవ సినిమానూ తెరకెక్కించనున్నారు. 

కాగా ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు లూయిస్‌. ‘‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 11వ చిత్రం షూట్‌ను ఈ ఏడాదే ఆరంభిస్తాం. ప్రస్తుతం నేనో హారర్‌ మూవీ చేస్తున్నాను. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబరు 15న పూర్తవుతుంది. సెప్టెంబరు 16న ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ 11వ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తాను. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌లో తొలి భాగం 2001లో విడుదలైంది. 

సరిగ్గా పాతికేళ్ల తర్వాత 2026లో ఈ సిరీస్‌లోని 11వ చిత్రం విడుదల చేస్తాం. తొలి చిత్రాన్ని విడుదల చేసిన తేదీనే (జూన్‌ 18) 11వ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని ఉంది. కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ పరంగా కుదురుతుందో లేదో చూడాలి’’ అని చెప్పుకొచ్చారు లూయిస్‌. కాగా ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ ఫ్రాంచైజీలో ఇదే లాస్ట్‌ చిత్రం అవుతుందని హాలీవుడ్‌ టాక్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement