Louis
-
చరిత్ర సృష్టించిన గాజు కిటికీ
దూరం నుంచి చూస్తే నల్లని వస్త్రంపై చిత్రకారుడి కలం నుంచి జాలువారిన అద్భుత చిత్రరాజం అనిపించకమానదు. కానీ దగ్గరికెళ్లి తరచిచూస్తే సప్తవర్ణశోభితమై ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఒక అద్దం కిటికీ అని వెంటనే తెలుస్తుంది. అపురూప కళాఖండంగా దశాబ్దాల క్రితమే ఘన కీర్తిని మూటగట్టుకున్న ఈ గాజు కిటీకి మళ్లీ రెండు పుష్కరాల తర్వాత కొచ్చింది. 24 ఏళ్ల క్రితం రూ.16 కోట్లకుపైబడి ధర పలికి ఔరా అనిపించిన ఈ గాజు కిటికీ తాజాగా సోమవారం ఏకంగా రూ.105 కోట్లకు అమ్ముడుపోయి తన విశిష్టతకు ఏ అద్దమూ సాటిరాదని నిరూపించుకుంది. 20వ శతాబ్దానికి చెందిన అమెరికన్ కళాకారుడు లూయిస్ కంఫర్ట్ టిఫానీ ఈ గాజు కిటికినీ తయారుచేశారు. అలంకార, సౌందర్య కళల్లో లూయిస్‌ది అందె వేసిన చేయి. స్టెయిన్ గ్లాస్‌తో ఆయన చేసిన కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిపొందాయి. ఓహియో రాష్ట్రంలోని క్యాంటన్ సిటీలో తొలి బాప్టిస్ట్ చర్చి వ్యవస్థాపకుల్లో ఒకరైన జాన్ థెరిసా డ్యానర్ గౌరవార్థం లూయిస్ ఈ కిటికీని తయారుచేశారు. అందుకే దీనిని ‘డ్యానర్ మెమోరియల్ విండో’అంటారు. 16 అడుగుల కళాఖండం సోమవారం న్యూయార్క్‌లోని సోత్బే వేలంసంస్థ నిర్వహించిన వేలంలో కేవలం ఆరున్నర నిమిషాల్లో ఊహించినదానికంటే నాలుగు రెట్లు అధిక ధరకు ఇది అమ్ముడుపోవడం విశేషం. బిలియనీర్ అలెన్ గెర్రీ దీనిని విక్రయించగా ఒక గుర్తు తెలియని వ్యక్తి దీనిని కొనుగోలుచేశారని సోత్బే సంస్థ ప్రకటించింది. టిఫానీ రూపొందించిన కిటీకీల్లో ఇంతవరకు ఇంత భారీ ధరకు అమ్ముడుపోయిన తొలి గాజు కిటికీ ఇదే. వాస్తవానికి చర్చి కోసం దీనిని తయారుచేసినా చివరకు వినియోగించకుండా వదిలేశారు. గలగలపారే సెలయేరుకు ఇరువైపులా విరగగాసిన ఫలాలతో అలరారుతున్న వృక్షాలు ఊసులాడుకుంటున్నట్లు ఎంతో రమ్యంగా రంగులద్దారు. డిజైన్ ఆగ్నిస్ నార్త్రోప్ ఈయనకు సాయపడ్డారు. 1913లో దీని తయారీ పూర్తయింది. ‘‘టిఫానీ రూపొందించిన గాజు కిటికీలు ఇన్నేళ్లు గడిచినా మార్కెట్లో తమ హవా కొనసాగిస్తున్నాయనడానికి ఈ కిటికీ వేలమే నిదర్శనం’’అని సోత్బే చైర్మన్ జోడీ పొల్లాక్ అన్నారు. లూయిస్ టిఫానీ వాళ్ల నాన్నకు అమెరికాలో టిపానీ అండ్ కో. పేరిట స్టెయిన్ గ్లాస్ తయారీ కర్మాగారం ఉండేది. అందులో పనిచేస్తూనే టిఫానీ ఎన్నో కళాఖండాలను సృష్టించారు. గాజు దీపాలు, పుష్పలంకరణ వస్తువులను తయారుచేశారు. అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్ సొంత స్టోర్లలో ఈయన కళారూపాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. పెన్సిల్వేనియా, మసాచు సెట్స్, న్యూయార్క్‌లోని చాలా చర్చిల్లో ఈయన గాజు కిటీకీలే మనకు దర్శనమిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫాస్ట్‌లో... ఇదే లాస్ట్ అవుతుందా?
హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా ఫ్రాంచైజీ నుంచి వచ్చిన పది సినిమాలు ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టుకోవడం ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీ నుంచి 11వ చిత్రం రానుంది. ‘ఫాస్ట్ ఎక్స్’ (‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ పదో చిత్రం) సినిమాకు దర్శకత్వం వహించిన లూయిస్ లెటర్రియర్ పదకొండవ సినిమానూ తెరకెక్కించనున్నారు. కాగా ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు లూయిస్. ‘‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11వ చిత్రం షూట్‌ను ఈ ఏడాదే ఆరంభిస్తాం. ప్రస్తుతం నేనో హారర్ మూవీ చేస్తున్నాను. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబరు 15న పూర్తవుతుంది. సెప్టెంబరు 16న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ 11వ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తాను. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో తొలి భాగం 2001లో విడుదలైంది. సరిగ్గా పాతికేళ్ల తర్వాత 2026లో ఈ సిరీస్‌లోని 11వ చిత్రం విడుదల చేస్తాం. తొలి చిత్రాన్ని విడుదల చేసిన తేదీనే (జూన్ 18) 11వ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని ఉంది. కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కుదురుతుందో లేదో చూడాలి’’ అని చెప్పుకొచ్చారు లూయిస్. కాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీలో ఇదే లాస్ట్ చిత్రం అవుతుందని హాలీవుడ్ టాక్. -
అద్దం విలువ ఏడున్నర లక్షలా..!?
లండన్: రోజు లేవగానే బ్రష్ చేసుకుంటూ ముఖం చూసుకునే తమ బాత్రూం అద్దం వెనక ఎంతో చరిత్ర ఉందని ఆ కుటుంబానికి తెలియదు. ఆ అద్దాన్ని ఇప్పుడు వేలం వేస్తే 8 వేల పౌండ్లు(7,68,590.90 రూపాయలు) ఖరీదు చేస్తుందని తెలిసి వారు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. ఒక అద్దానికి అంత ఖరీదు ఎందుకు అంటే.. అది ఫ్రాన్స్ చివరి రాణి మేరీ ఆంటోనిట్టేకు చెందినది కావడమే కారణం. 19, 15 అంగుళాల కొలత గల ఈ అద్దం 18వ శతాబ్దానికి చెందినదిగా తూర్పు బ్రిస్టల్ వేలం కంపెనీ గుర్తించింది. దీని చుట్టూ ఉన్న నగిషీలను 19వ శతాబ్దంలో చెక్కినట్లు గుర్తించారు. ఇక ఫ్రేమ్‌లోని వెండి ఫలకం మీద ఈ అద్దం తొలుత మేరీ ఆంటోనిట్టే వద్ద ఉండేదని తరువాత దాన్ని మూడవ నెపోలియన్ భార్య ఎంప్రెస్ యూజీని కొనుగోలు చేసిందని ఉంది. ఇదే కాక మేరీ ఆంటోనిట్టే ఎస్టేట్ నుంచి ఎంప్రెస్ యూజీని అనేక వస్తువులను కొనుగోలు చేసిందని సమాచారం. (చదవండి: 60 లక్షలు పలికిన లింకన్ వెంట్రుకలు) ఇక ప్రస్తుతం విషయానికి వస్తే ఒక కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. ‘మా అమ్మమ్మ నుంచి ఈ అద్దాన్ని వారసత్వంగా పొందాము. అయితే దాని నిజమైన విలువను గ్రహించకుండా మా బాత్రూంలో వేలాడదీశాము’ అని తెలిపాడు. ఈస్ట్ బ్రిస్టల్ వేలం ఐడెన్ ఖాన్ మాట్లాడుతూ.. "ఈ అద్దానికి ఎంతో అద్భుతమైన చరిత్ర ఉంది. కానీ పాపం ఇంతకాలం బాత్రూంలో పడి ఉంది. ఇది చరిత్ర నిజమైన భాగం- పద్దెనిమిదవ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ వ్యక్తులకు దీనితో దగ్గరి సంబంధం ఉంది" అన్నారు. మేరీ ఆంటోనిట్టే ఫ్రాన్స్ చివరి రాణి. లూయిస్ 16ని ని వివాహం చేసుకున్నారు. ఆమె 1774 -1792 మధ్య పాలన సాగించారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆమె ఉరితీయబడ్డారు.. -
మనుషుల్లా నడవటం నాకూ తెలుసు
ఫిలడెల్ఫియా : గొరిల్లాలు మనుషుల్లా రెండు కాళ్ల మీద నడవటం పెద్ద విశేషం ఏం కాదు. అయితే అది అరుదుగా జరగాలే తప్ప.. అదే పనిగా ఉంటే మాత్రం చర్చనీయాంశమే. అమెరికా ఫిలడెల్ఫియాలోని ఓ జూలో ఉన్న లూయిస్ అనే మగ గొరిల్లా చాలా ప్రత్యేకం. రోజులో దాదాపు సమయం అది రెండు కాళ్ల మీద అది నడుచుకుంటూ వెళ్తుంది. అయితే అది అలా చేయటానికి కారణం ఉందని చెబుతున్నారు జూ నిర్వాహకులు. ‘లూయిస్‌కు బురద అంటే చికాకు. దానిని చూసేందుకు వచ్చే వాళ్లే వేసే తిండిని అది మట్టి పాలు కానివ్వదు. శుభ్రత ఎక్కువ. నిర్వాహకులు పెట్టే తిండిని కూడా అది చేతిలో పట్టుకునే దాని బోనులోకి వెళ్లి అది తింటుంది. ఆ సమయంలో అది రెండు కాళ్ల మీద నడుస్తూనే ఉంటుంది’ అని నిర్వాహకులు చెబుతున్నారు. 18 ఏళ్ల లూయిస్ ఆ మధ్య ఓ సందర్భంలో ఠీవీగా తిప్పుకుంటూ పోతుంటే.. దానిని వీడియో తీసిన జూ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేయటంతో వేలలో కామెంట్లు వచ్చిపడుతున్నాయి. Although gorillas occasionally walk on two legs (bipedal), it is less common. Not for Louis though - he can often be seen walking bipedal when his hands are full of snack or when the ground is muddy (so he doesn't get his hands dirty)! pic.twitter.com/6xrMQ1MU9S — Philadelphia Zoo (@phillyzoo) 5 March 2018 -
లూయీస్ 176 రిటైర్డ్‌హర్ట్
లండన్: వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయీస్ మెరుపు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లండ్‌తో ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో వన్డేలో లూయీస్ (130 బంతుల్లో 176 రిటైర్డ్‌హర్ట్; 17 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి భారీ శతకం సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ డబుల్ సెంచరీకి చేరువలో అతను రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. జేక్ బాల్ వేసిన 47వ ఓవర్ రెండో బంతిని లూయీస్ తన కాలి మడమపైకి షాట్ ఆడుకున్నాడు. నొప్పితో విలవిల్లాడుతూ అతను మైదానం వీడాల్సి వచ్చింది. చివర్లో కెప్టెన్ జేసన్ హోల్డర్ (62 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడటంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. కడపటి వార్తలు అందే సమయానికి ఇంగ్లండ్ 34 ఓవర్లలో 5 వికెట్లకు 245 పరుగులు చేసింది. -
సెయింట్ లూయిస్‌లో వైఎస్ఆర్ 7వ వర్థంతి
సెయింట్ లూయిస్: మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఏడవ వర్థంతి కార్యక్రమాన్ని అమెరికాలోని సెయింట్ లూయీస్‌లో ఘనంగా నిర్వహించారు. శనివారం మయూరీ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ కన్వినర్ రత్నాకర్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో పేదలు, రైతులకు వైఎస్ఆర్ అందించిన సేవలను ఈ కార్యక్రమంలో కొనియాడారు. మహానేత ఆశించిన విధంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ సెంయింట్ లూయిస్ కన్వినర్ శేఖర్ రెడ్డి దండు, భార్గవ రెడ్డి, అశోక్ రెడ్డి, సురేష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.