అయిదో అంతస్తు... ఏడు కార్లు! | Fast and Furious 8 Video Shows Off Craziest Car Stunt Yet | Sakshi
Sakshi News home page

అయిదో అంతస్తు... ఏడు కార్లు!

Published Tue, Jun 14 2016 2:26 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

అయిదో అంతస్తు... ఏడు కార్లు! - Sakshi

అయిదో అంతస్తు... ఏడు కార్లు!

అదో పెద్ద బిల్డింగ్. అందులో అది అయిదో అంతస్తు. ఆ బిల్డింగ్ బయట 35 నుంచి 45 కార్లు ఆగి ఉన్నాయి. ఆ అయిదో అంతస్తులోని పార్కింగ్ స్పేస్ నుంచి సడన్‌గా ఏడు కార్లు రోడ్డు మీద ఉన్న కార్ల మీద పడి పెద్ద విస్ఫోటనం సృష్టించాయి. ఆ రోడ్డు మీద ఉన్న జనాలందరూ భయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. అసలింత విధ్వంసం ఎక్కడ జరిగిందనేదే కదా మీ అనుమానం. హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఎనిమిదో భాగం ‘ఫాస్ట్ 8’ కోసం ఆ చిత్ర దర్శకుడు ఎఫ్.గ్యారీ గ్రే చిత్రీకరించిన సన్నివేశం ఇది.

అయితే పై నుంచి పడే ఏడు కారుల్లోనూ డ్రైవర్లు లేకుండా ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. అయిదో అంతస్తు నుంచి కార్లను అమాంతంగా పడేయడం కోసం చిత్రబృందం చాలా కష్టాలే పడ్డారట. కార్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఓ క్రమంలో పడితేనే షాట్ ఓకే అవుతుంది. పక్కా ప్లాన్‌తో రీటేక్ లేకుండా ఈ సీన్ తీయడం విశేషం. విన్ డీజిల్, డ్వేన్ జాన్సన్  లాంటి హాలీవుడ్ సూపర్‌స్టార్స్ నటిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి.

ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఈ సినిమా ఇలా ఉంటుంది’ అని శాంపిల్ కూడా చూపిస్తున్నారు. సాధారణంగా సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలను ఆ సినిమా విడుదలయ్యాక యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. కానీ, ‘ఫాస్ట్ 8’ యూనిట్ మాత్రం విడుదలకు ముందే మేకింగ్ వీడియో రిలీజ్ చేసి, అభిమానులను ఊరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement