
అదరగొట్టే స్టంట్లతో దుమ్మురేపింది!
స్టన్నింగ్ లుక్స్, అదరగొట్టే స్టంట్స్ తో తన తొలి హాలీవుడ్ సినిమాలో దీపికా పదుకొణే దుమ్మురేపింది. 'ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్' సినిమాతో ఆమె హాలీవుడ్ కు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి అంతర్జాతీయ ట్రైలర్ లో దీపిక కనిపించింది కొంతసేపే కానీ, భారతీయ ప్రేక్షకుల కోసం ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసిన ట్రైలర్ ఆసాంతం దీపిక అదిరే విన్యాసాలు ఉండటం గమనార్హం.
యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లో హీరో విన్ డీజిల్ (జాండర్ కేగ్) కన్నా దీపికనే ఎక్కువ కనిపించడం గమనార్హం. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దీపిక నటించిన యాక్షన్ సీన్స్ ను ఎక్కువగా దట్టించి ట్రైలర్ రూపొందించినట్టు అర్ధమవుతోంది. అంతర్జాతీయంగా సూపర్ హిట్ అయిన హాలీవుడ్ సినిమా ట్రిపుల్ ఎక్స్ సీరిస్ లో ఇది మూడో సినిమా కాగా.. విన్ డీజిల్ లీడ్ రోల్ లో నటించిన రెండో సినిమా. ఇందులో సెరెనాగా వీన్ డీజిల్ కు పోటాపోటీగా స్టంట్స్ చేస్తూ దీపిక అదరగొట్టింది. ఆమె స్టంట్స్ భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.
హిందీలో..
తమిళంలో..