మాజీ ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడిన స్టార్‌ హీరో | Actor Vin Diesel Accused Assaulting Of Former Assistant | Sakshi
Sakshi News home page

మాజీ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్టార్‌ హీరో 'విన్ డీజిల్‌'

Published Fri, Dec 22 2023 8:06 AM | Last Updated on Fri, Dec 22 2023 2:54 PM

Actor Vin Diesel Accused Assaulting Of Former Assistant - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు పరిచయమున్న సిరీస్‌ ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’. అందులో నటించిన విన్‌ డీజిల్‌ అంటే అందరికీ పిచ్చి క్రేజ్‌.. తాజాగా ఆయనపై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. విన్ డీజిల్ మాజీ వ్యక్తిగత సహాయకురాలు ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. 2010లో ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ చిత్రానికి సీక్వెల్‌ చిత్రీకరణ సమయంలో తనపై విన్ డీజిల్ లైంగిక దాడి చేశారని తాజాగా ఆమె ఆరోపించింది. సుమారుగా దశాబ్దం క్రితం అట్లాంటా హోటల్ గదిలో తన సహాయకురాలిగా ఉన్న Ms జోనాసన్‌పై విన్‌ డీజిల్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టులో గురువారం వ్యాజ్యం దాఖలైంది.

ఈ దావా అనేది కాలిఫోర్నియాలోని న్యాయస్థానంలో వేయబడింది. విన్ డీజిల్‌పై Ms జోనాసన్‌ వేసిన పిటీషన్‌ను విచారించి చట్టపరమైన చర్య తీసుకునేందుకు కొంత సమయాన్ని పొడిగించింది. ఈలోపు ఆమె ఆరోపణపై విచారించాలని కోర్టు సూచించింది. 2010లో "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్" చిత్రానికి గాను విన్‌ డీజిల్‌కు అసిస్టెంట్‌గా చేరిన తర్వాత ఆ హోటల్‌లో ఏం జరిగిందో ఇలా తెలిపింది.

'ఫాస్ట్ ఫైవ్ చిత్రీకరణ కోసం యూనిట్‌ మొత్తం అట్లాంటాకు వెళ్లాం. అక్కడ షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత అందరం రూమ్‌కు చేరుకున్నాం. మరుసటి రోజు షూట్‌ కోసం రెడీ అయేందుకు విన్‌ డీజిల్‌కు కావాల్సిన ఏర్పాట్లు నేను చేశాను. తెల్లవారుజామున హోటల్ నుంచి బయలుదేరడానికి డీజిల్‌కు సహాయం చేసే బాధ్యత నాకే అప్పగించబడింది. నేను అయన గదిలోకి వెళ్లిన సమయంలో మేమిద్దరమే ఉన్నాం. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న విన్ డీజిల్ నాపై  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నన్ను బలవంతంగా పట్టుకుని నా శరీరంపై అసభ్యంగా ప్రవర్తించాడు.

వద్దని వారించినా పదేపదే తాకుతూ నా దుస్తులు తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. నేను ఆ సమయంలో బయంతో బాత్‌రూమ్‌లోకి పారిపోయాను అక్కడ నన్ను గోడకు అతికించి బలవంతం చేశాడు. ఇదంతా జరిగిన మరుసటి రోజు, విన్ డీజిల్ సోదరి సమంత విన్సెంట్‌కు జరిగిన విషయం చెప్పాను. కానీ ఆమె అవన్నీ ఏమీ పట్టించుకోలేదు. ఆ సమయంలోనే నన్ను ఆ ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఈ విషయంలో నేను ఆమెతో చాలా సేపు గొడవపడ్డాను కూడా.విన్‌ డీజిల్‌ లైంగిక వేధింపులను ఆమె కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది.' అని  Ms జోనాసన్‌ కోర్టుకు సమర్పించిన వ్యాజ్యంలో తెలిపింది.

(ఇదీ చదవండి: Salaar X Review: ‘సలార్‌’మూవీ ట్విటర్‌ రివ్యూ)

విన్‌ డీజిల్, సమంత విన్సెంట్‌ వల్ల తాను ఎంతో కెరియర్‌ కోల్పోయానని ఆమె తెలిపింది. అతని వల్ల తన కెరియర్‌కు జరిగిన నష్టాన్ని  పూరించాలని ఆమె కోరింది. ఆమె వేసిన వ్యాజ్యంపై విన్‌ డీజిల్ ప్రతినిధులు ఇంకా రియాక్ట్‌ కాలేదు. 2017లో వచ్చిన ‘త్రిబుల్‌ ఎక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ గ్జాండర్‌ కేజ్‌’ అనే చిత్రంలో విన్‌ డీజిల్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె నటించిన విషయం తెలిసిందే.. ఆ చిత్రంతో విన్‌ డీజిల్‌ ఇండియాలో మరింత పాపులర్‌ అయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement