వెయ్యి కోట్ల క్లబ్లో దీపిక | Deepika XXX: Return of Xander Cage Collects Rs 1000 Crs | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్ల క్లబ్లో దీపిక

Published Fri, Feb 10 2017 1:50 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

వెయ్యి కోట్ల క్లబ్లో దీపిక

వెయ్యి కోట్ల క్లబ్లో దీపిక

బాలీవుడ్ హాట్ బ్యూటి దీపిక పదుకొనే రికార్డ్ సృష్టించింది. దీపిక హీరోయిన్గా నటించిన చాలా సినిమాలు ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో సందడి చేయగా, తాజాగా ఈ భామ వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలో భాగమయ్యింది. అయితే దీపిక ఈ రికార్డ్ సృష్టించింది ఇండియన్ సినిమాతో కాదు. తొలిసారిగా హాలీవుడ్లో నటించిన ట్రిపులెక్స్ : రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ సినిమాతో ఈ ఫీట్ సాధించింది.

హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీజిల్, నినా డోబ్రేవ్, రూబీ రోజ్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు డిజె కరుసో దర్శకుడు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇండియాలోనూ మంచి విజయం సాధించింది. భారత్లో 53 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ట్రిపులెక్స్, ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది. త్వరలో చైనాలో రిలీజ్కు రెడీ అవుతున్న ట్రిపులెక్స్ : రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్,  మరిన్ని రికార్డ్ లు సాధించే దిశగా దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement