ఆయన బిడ్డలకు నేను తల్లయ్యా! | Deepika Padukone hints at a relationship with Vin Diesel | Sakshi
Sakshi News home page

ఆయన బిడ్డలకు నేను తల్లయ్యా!

Published Fri, Jan 20 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

ఆయన బిడ్డలకు నేను తల్లయ్యా!

ఆయన బిడ్డలకు నేను తల్లయ్యా!

‘ఆలూ లేదూ.. చూలూ లేదూ.. కొడుకు పేరు సోమలింగం’ అన్నారట వెనకటికెవరో. ఇప్పుడు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె వరుస కూడా అలానే ఉంది. ఇప్పటివరకూ పలువురితో ప్రేమాయణం సాగించి, తాజాగా రణ్‌వీర్‌సింగ్‌తో ప్రేమలో ఉన్న ఈ భామ పెళ్లిపీటలు మాత్రం ఎక్కలేదు. కానీ, ‘నేను హాలీవుడ్‌ నటుడు విన్‌ డీజిల్‌తో పిల్లల్ని కన్నాను’ అంటూ ఓ టీవీ ప్రోగ్రాంలో దీపిక పేర్కొనడం సంచలనమైంది. ఆ తర్వాత ఆమె ఏం చెప్పబోతున్నారో పూర్తిగా వినకుండా, దీపిక గర్భంతో ఉన్నట్లు ఎప్పుడూ కనిపిం చలేదే? ఒకవేళ ‘ట్రిపుల్‌ ఎక్స్‌’ చేస్తూ, అమెరికాలో ఉన్న సమయంలో పిల్లల్ని కన్నారా? అని కొందరు ఊహించుకోవడం మొదలు పెట్టారు.

ఈలోపు అసలు విషయాన్ని దీపిక చల్లగా చెప్పారు. ఆ విషయంలోకి వస్తే.. దీపికా, విన్‌ నటించిన ‘ట్రిపుల్‌ ఎక్స్‌’ ఇండియాలో విడుదలైంది. త్వరలో వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వ్యాఖ్యాత ‘ఎలెన్‌ డిజెనరస్‌’ నిర్వహించిన టీవీ షోలో పాల్గొన్నారు దీపిక. ‘విన్‌కీ, మీకూ మధ్య ఏదో ఉందనే ప్రచారం నిజమేనా?’ అని ఎలెన్‌ అడిగిన ప్రశ్నకు దీపిక » దులిస్తూ.. ‘నిప్పు లేనిదే పొగ రాదు కదా? అది నిజమే. విన్‌ అంటే నాకిష్టం. మేం కలిసి ఉన్నాం. మాకు అందమైన పిల్లలు కూడా పుట్టారు. అయితే ఇదంతా కేవలం నా ఊహల్లోనే’’ అని తెలివిగా సమాధానం చెప్పారు. ఎంతైనా బాలీవుడ్‌ భామ భలే గడుసు కదూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement