
యూపీ సీఎం.. హాలీవుడ్ హీరో!
లక్నో: ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియామకంపై రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతుండగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యూపీ కొత్త సీఎం అచ్చుగుద్దినట్టు హాలీవుడ్ హీరో, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్ విన్ డిసిల్ ను పోలి ఉన్నారని గుర్తు చేశారు.
అంతేకాదు వీరిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి కామెంట్లు పోస్టు చేస్తున్నారు. వేర్వేరు దేశాల్లో జన్మించడం మినహా పోలికల్లో వీరిద్దరి మధ్య ఎటువంటి బేధం లేదని పేర్కొన్నారు. సీఎం ‘ఫాస్ట్’ అయితే మీడియా ‘ఫ్యూరియస్’ అవుతోందని ఆదిత్యనాథ్ మద్దతుదారులు కామెంట్ చేశారు.
అక్కడితో ఆగకుండా జోకులు కూడా పేల్చారు. యూపీ సీఎంగా యోగి ఎంపికైన తర్వాత తానే యోగినని విని డిజిల్ అంటున్నాడని జోక్ చేశారు. యూపీ కొత్త ముఖ్యమంత్రిని ఎవరిన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ను అడగ్గా... విన్ డిజిల్ అని ఆమె సమాధానం ఇచ్చిందని మరొకరు హాస్యామాడారు. యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకులు కూడా ట్విటర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.