లక్నో: ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడిన ఘటన యూపీని కుదిపేసింది. ఇది మత కోణానికి సంబంధించిన క్రూర ఘటనగా పేర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మతానికి, మానవత్వానికి ఇది సిగ్గుచేటంటూ స్పందించారు. ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రాహుల్‌కి స్ట్రాంగ్ బదులిచ్చారు.
‘‘రాముడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు. ఆ పాఠం నీకు తెలియదు. నువ్వు జీవితంలో ఎప్పుడూ నిజాలు మాట్లాడవ్. ఈ ఘటనలో పోలీసులు ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా.. నువ్వు అబద్ధపు ప్రచారంతో సొసైటీలో విషం నింపాలని చూస్తున్నావ్. అధికార దాహంతో మానవత్వాన్ని అవహేళన చేస్తున్నావ్. ఉత్తర ప్రదేశ్ ప్రజల్ని అవమానించడం ఇకనైనా ఆపేయ్’’.. అంటూ ట్విట్టర్‌లో యోగి రాహుల్ ట్వీట్ ఫొటోకి ఘాటుగానే బదులిచ్చారు.
प्रभु श्री राम की पहली सीख है-"सत्य बोलना" जो आपने कभी जीवन में किया नहीं।
— Yogi Adityanath (@myogiadityanath) June 15, 2021
शर्म आनी चाहिए कि पुलिस द्वारा सच्चाई बताने के बाद भी आप समाज में जहर फैलाने में लगे हैं।
सत्ता के लालच में मानवता को शर्मसार कर रहे हैं। उत्तर प्रदेश की जनता को अपमानित करना, उन्हें बदनाम करना छोड़ दें। pic.twitter.com/FOn0SJLVqP
జూన్ 5న లోని ప్రాంతానికి చెందిన అబ్దుల్ సమద్ అనే వ్యక్తిని ఓ గ్రూప్ ఎత్తుకెళ్లి.. కత్తులతో బెదిరించడం, పాకిస్తాన్ స్పై అంటూ తిట్టడం, గడ్డం తీసేసిన ఘటన వైరల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇది మతకోణంలోని ఘటన కాదని స్పష్టం చేశారు. ఆ దాడిలో హిందు, ముస్లిం ఇరువర్గాల వాళ్లు ఉన్నారని, తాయెత్తులు అమ్మే సమద్ తీరు బెడిసి కొట్టడంతోనే వాళ్లు ఆ దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.
చదవండి: ఆమె ట్వీట్‌తో ఇరకాటంలో యోగి
Comments
Please login to add a commentAdd a comment