కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో పక్షనేత రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు రూ. 10 లక్షలు డిమాండ్ పలుకుతోందట. అయితే వాటిని ఆమ్మేందుకు యజమాని మాత్రం ససేమిరా అంటున్నాడు. అసలు రాహుల్ గాంధీ ఏంటి? చెప్పులు కుట్టడం ఏంటి? అవి అమ్మడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాం..
ఇటీవల ఓ కేసు విషయంలో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ కోర్టు హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వస్తూ దారిలో ఉన్న ఓ చెప్పుల దుకాణం వద్ద ఆగాడు. అక్కడ చెప్పులు కుట్టే రామ్ చేత్ వ్యక్తిని కలిసి అతని పని గురించి తెలుసుకున్నాడు. అనంతరం అక్కడే ఓ చెప్పుల జత కుట్టాడు. అతనికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తనను కలిసి మరుసటి రోజే చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఓ షూ స్టిచింగ్ మెషిన్‌ను అందించాడు.
ఇప్పుడు ఈ స్లిప్పర్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రాహుల్ గాంధీ రామ్ చేత్‌నును కలిసి వెళ్లిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పలు శాఖల అధికారులు వచ్చి, ఆయన సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే రాహుల్ కుట్టిన చెప్పులకు ఎన్ని లక్షలు ఇచ్చినా.. అమ్మేది లేదని చెప్పులు కుట్టే వ్యక్తి తేల్చి చెప్పారు. ఆయన కుట్టిన చెప్పులను ఓ గ్లాస్ ఫ్రేమ్‌లో భద్రపరచనున్నట్లు వెల్లడించాడు. రాహుల్ గాంధీ తన వద్దకు రావడం, తన జీవితాన్నే మార్చేసిందని పేర్కొన్నాడు.
‘రాహుల్ కుట్టిన చెప్పులను మేము కొంటామంటూ ప్రతి రోజూ నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మంగళవారం ఒక వ్యక్తి ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇస్తాం.. చెప్పులు ఇవ్వాలని అడిగాడు. నేను కుదరదని చెప్పాను. అప్పుడు అతను రూ.10 లక్షలు ఇస్తానన్నాడు. నేను ఇవ్వను అని చెప్పాను. ఈ చెప్పులు నాకు లక్కీ.. వీటికి గాజు ఫ్రేమ్ కట్టించి. నా షాప్ లో పెట్టుకుంటాను’ అని చెప్పాడు. రాహుల్ గాంధీ తన దుకాణంలో కూర్చొని చెప్పు కుట్టడం ద్వారా ఆయన తన పార్ట్‌నర్ అయ్యారని రామ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment