Cobbler
-
సలాం రామయ్య అంకుల్..! కంట తడి పెట్టించే వీడియో!
సోషల్ మీడియాలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. పెద్ద మనసుతో చేసే మంచి పని ఏదైనా నెటిజన్లును ఆకట్టుకుంటుంది. బెంగళూరులో రామయ్య మామయ్య స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెప్పులు కుట్టుకొని పొట్టపోసుకునే రామయ్య చేసిన పని లక్షలాది మంది హృదయాలను హత్తుకుంది. తన చిన్న ప్రపంచంలో మూగజీవులకు చోటిచ్చిన అపురూప మనిషిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by 𝕃𝔼𝕀𝔸 ♡ The Golden Indie (@leia_the_golden_indie) బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని డెకాథ్లాన్ షాప్ బైట ఒక చెప్పులు కుట్టుకునే వృత్తిలోఉన్నాడురామయ్య. ఆయన పనిచేసే చిన్న బడ్డీకొట్టులోనే తనతోపాటు మరికొన్నిమూగ జీవాలను ఆశ్రయం ఇచ్చి వాటికి పెద్ద దిక్కయ్యాడు. ఒకటీ రెండూ, కాదు దాదాపు 15 జంతువులు ఆయన చేరదీశాడు. వీటిల్లో రెండు వీధి కుక్కలు, పిల్లి కూన అతని పక్కనే ఆడుకుంటూ ఉంటాయి. వాటి కడుపు నింపడం మాత్రమే కాదు, దెబ్బలు తగిలితే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేంత దయాయుడు. ఈ రామయ్య. అందుకే అతణ్ని అందరూ రామయ్య మామయ్య అని పిలుచుకుంటారట. లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 2023, డిసెంబరులో అతనికి బంధించిన స్టోరీ పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడైనా అక్కడికి వెళితే, ఒక్క క్షణం ఆగండి, నిజమైన ప్రేమ, దయ , దాతృత్వం ఎలా ఉంటుందో కళ్లారా చూడండి.. పాత బూట్లను రిపేర్ చేయడానికి పని చేసే ఆ చిన్న స్థలంలోనే, కనీసం 3 కుక్కలు వెచ్చగా నిద్రపోతూ ఉంటుంది. ఒక బుజ్జి పిల్లి కూన ఆడుకుంటూ ఉంటుంది’’ అని తెలిపారు. అతని కోసం విరాళాలు సేకరణ కూడా చేపట్టారు.దీంతో రామయ్యంకుల్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. మంచి మనసుతో రామయ్య చేస్తున్న పనికి ముగ్దులై అతని సాయం చేయడానికి ముందుకొచ్చారు.రామయ్య అంకుల్ ఫండ్ రైజర్ పేజీ ప్రకారం దేశం నలుమూలలనుండి విరాళాలొచ్చాయి. ‘నీకేమైనా కావాలా అంటే... నాకేమీ అవసరం లేదు..వాటికి అన్నం పెడితే చాలు’ అని చెప్పేవాడట ప్రేమతో. మొత్తం వసూలు చేసిన తర్వాత, చందాదారులందరి పేర్లతో ఒక కార్డు తయారు చేసి గత వారం రామయ్య అంకుల్‌కి అందించారు. ఇందులో సగం వీధిజంతువుల సంక్షేమం కోసం మిగతాసగం ఆయన ఖాతాలోను జమచేశారు. దీంతో సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య. దాతలందరికి కృతజ్ఞతలు తెలిపాడు. నాలుగు నెలల క్రితమే తన భార్య చనిపోయిందని, తన కూతురిని పెంచే బాధ్యత తనపైనే ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దాతలు ఇచ్చిన కార్డును తన దుకాణంలో వేలాడ దీసుకున్నాడు సగర్వంగా. “ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, మనస్ఫూర్తిగా ఇవ్వడం అంటే అంటే ఏమిటో మాకు చూపించినందుకు రామయ్య రామయ్యకు ధన్యవాదాలు. తమ వద్ద ఉన్న సమృద్ధిగా ఉన్నదాంట్లోంచి ఏదో కొద్దిగా ఇవ్వడం గొప్ప కాదు, తనకున్న చిన్నమొత్తంలోంచే ఘనంగా ఇవ్వడంలోనే ఉంది అసలు మానవత్వం అంటూ లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చారు. -
రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు రూ. 10 లక్షల ఆఫర్..
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో పక్షనేత రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు రూ. 10 లక్షలు డిమాండ్ పలుకుతోందట. అయితే వాటిని ఆమ్మేందుకు యజమాని మాత్రం ససేమిరా అంటున్నాడు. అసలు రాహుల్ గాంధీ ఏంటి? చెప్పులు కుట్టడం ఏంటి? అవి అమ్మడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాం..ఇటీవల ఓ కేసు విషయంలో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ కోర్టు హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వస్తూ దారిలో ఉన్న ఓ చెప్పుల దుకాణం వద్ద ఆగాడు. అక్కడ చెప్పులు కుట్టే రామ్ చేత్ వ్యక్తిని కలిసి అతని పని గురించి తెలుసుకున్నాడు. అనంతరం అక్కడే ఓ చెప్పుల జత కుట్టాడు. అతనికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తనను కలిసి మరుసటి రోజే చెప్పులు కుట్టుకునే వ్యక్తికి ఓ షూ స్టిచింగ్ మెషిన్‌ను అందించాడు.ఇప్పుడు ఈ స్లిప్పర్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రాహుల్ గాంధీ రామ్ చేత్నును కలిసి వెళ్లిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పలు శాఖల అధికారులు వచ్చి, ఆయన సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే రాహుల్ కుట్టిన చెప్పులకు ఎన్ని లక్షలు ఇచ్చినా.. అమ్మేది లేదని చెప్పులు కుట్టే వ్యక్తి తేల్చి చెప్పారు. ఆయన కుట్టిన చెప్పులను ఓ గ్లాస్ ఫ్రేమ్‌లో భద్రపరచనున్నట్లు వెల్లడించాడు. రాహుల్ గాంధీ తన వద్దకు రావడం, తన జీవితాన్నే మార్చేసిందని పేర్కొన్నాడు.‘రాహుల్ కుట్టిన చెప్పులను మేము కొంటామంటూ ప్రతి రోజూ నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మంగళవారం ఒక వ్యక్తి ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇస్తాం.. చెప్పులు ఇవ్వాలని అడిగాడు. నేను కుదరదని చెప్పాను. అప్పుడు అతను రూ.10 లక్షలు ఇస్తానన్నాడు. నేను ఇవ్వను అని చెప్పాను. ఈ చెప్పులు నాకు లక్కీ.. వీటికి గాజు ఫ్రేమ్ కట్టించి. నా షాప్ లో పెట్టుకుంటాను’ అని చెప్పాడు. రాహుల్ గాంధీ తన దుకాణంలో కూర్చొని చెప్పు కుట్టడం ద్వారా ఆయన తన పార్ట్నర్ అయ్యారని రామ్ అన్నారు. -
Punjab Assembly Election 2022: ఇరవయ్యోస్సారి!.. తగ్గేదేలే..
చండీగఢ్: అతని పేరు ఓంప్రకాశ్ జఖూ. వయసు 80 ఏళ్లు. పంజాబ్‌లోని హోషియార్పూర్ నివాసి. బూట్లు పాలిష్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయినా తన కోరికను తీర్చుకోవడంలో తగ్గేదేలే అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆయనకి మహా ఇష్టం. ఆయన జీవితంలో సగభాగం ఎన్నికల్లో పోటీకే సరిపోయింది. ఒక్కసారి కూడా గెలవకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ఎన్నికల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలా పోటీ చేయడాన్ని ఆయన గర్వంగా కూడా భావిస్తారు. ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భరతరాష్ట్ర డెమొక్రాటిక్ పార్టీ అని పెద్దగా ఎవరికీ తెలీని పార్టీ తరఫున హోషియార్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా ఎన్నికల్లో పోటీ పడడం ఇది 20వ సారి. కేవలం అసెంబ్లీ ఎన్నికలే కాదు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓంప్రకాశ్ పోటీ చేశారు. ఏ పూట సంపాదన ఆ పూ టకే సరిపోయే దుర్భర దారిద్య్రంలో కూడా ఆయన ఎన్నికలకి దూరం కాలేదు. ఈ విషయంలో ఆయనకి భార్యాబిడ్డల సహ కారం కూడా ఉంది. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో జైలు పా లయ్యారు. ఒకప్పుడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌తో సన్నిహితంగా మెలిగారు. ఎన్నికల్లో పోటీ చేయడమంటే తనకు అత్యంత ఇష్టమైన విషయమని, శ్వాస ఆగేవరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని ఓంప్రకాశ్ చెప్పుకొచ్చారు. చదవండి: (Punjab Assembly Election 2022: మాల్వా చిక్కితే అసెంబ్లీ అందినట్టే) -
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్ర
ముంబై : సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మరోసారి వార్తల్లో నిలిచారు. సృజనాత్మకతను ప్రోత్సహించే ఈ బిజినెస్ టైకూన్.. సుమారు రెండు వారాల క్రితం తన ట్విటర్లో ‘చెప్పుల డాక్టర్’ ఫొటో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫొటో నర్సిరాం అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తిది. అయితే అతని ఫొటోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర.. అతని పూర్తి వివరాలు తెలిస్తే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నెటిజన్ల సాక్షిగా ఇచ్చిన ఆ మాటను ప్రస్తుతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆనంద్ మహీంద్రా. అన్న మాట ప్రకారమే తన సిబ్బందిని పంపించి చెప్పుల డాక్టర్ చిరునామా కనుక్కున్నారు. అందుకు సంబంధించి ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ మళ్లీ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ‘నర్సీజీ గుర్తున్నాడు కదా.. నా టీమ్ హర్యానా వెళ్లి అతన్ని కలిసింది. అలాగే అతడికి ఎలా సాయపడగలమో అని అడగ్గా.. ఆ నిరాడంబర వ్యక్తి.. డబ్బులు అడగకుండా.. తన షాప్ కోసం ఒక మంచి వర్క్‌స్పేస్ ఏర్పాటు చేయమని కోరాడు. అందుకోసం ముంబైలో ఉన్న మా డిజైన్ స్టూడియో టీమ్ ఒక కియోస్క్ (అర వంటిది) ఏర్పాటు చేయనుందని’ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు తమకు తోచిన సలహాలు, సూచనలు చేస్తున్నారు. ‘రోడ్డు మీద అతడి దుకాణం ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్లు వెళ్లగొట్టే ప్రమాదం ఉంది. అందుకే అతని కోసం ఒక మొబైల్ కియోస్క్ ఏర్పాటు చేయమని’ ఓ నెటిజన్ సూచించగా.. ‘అతని కోసం ఒక షాప్ కట్టించమని’ మరొకరు ట్వీట్ చేశారు. కాగా నర్సిరాం అనే వ్యక్తి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి దుకాణం ముందు ఒక ప్రకటన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఈ ప్రకటనలో ‘దెబ్బతిన్న చెప్పుల ఆస్పత్రి, డా. నర్సిరాం, రోగులకు అందుబాటులో ఉండు సమయం’ వంటి వివరాలు ఉన్నాయి. వాట్సాప్‌లో చక్కెర్లు కొట్టిన ఈ ఫొటో ఆనంద్ మహీంద్రను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర.. ‘చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మంచి మార్కెటింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. అవకాశం వస్తే ఇతను ఐఐఎమ్‌లో మార్కెటింగ్ పాఠాలు చెప్పేస్థాయిలో ఉండేవాడంటూ’ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. Recall my tweet about Narseeji,the cobbler?Our team in Harayana met him&asked how we could help.A simple&humble man.Instead of asking for money,he said he needed a good workspace. I asked our Design Studio team from Mumbai to design a kiosk that was functional&yet aesthetic.(1/2) pic.twitter.com/Oefr69yAy1 — anand mahindra (@anandmahindra) April 28, 2018 A suggestion- the kiosk shld be ‘mobile’/ ‘wheeled’ i.e., capable of being wheeled away / pulled behind a rickshaw or motorbike. Municipalities often seize and destroy fixed/immobile kiosks - this will allow him to wheel/ push his kiosk minimising the risk of loosing it all. — Ameet Datta (@DattaAmeet) April 28, 2018 -
చెప్పుల డాక్టర్ : ఐఐఎమ్ ప్రొఫెసర్..?
ముంబై : వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రతిభను ప్రోత్సహించడాన్ని బాగా ఆస్వాదిస్తారు. సృజనాత్మకత ఎక్కడ ఉన్నా స్వాగతిస్తారు ఈ బిజినెస్ టైకూన్. ప్రస్తుతం ఆనంద్ మహీంద్ర తన ట్విటర్లో పోస్టు చేసిన ఒక ఫోటో ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సారి ఈ వ్యాపార వేత్త ఒక ‘చెప్పుల డాక్టర్’ ఫోటోను పోస్టు చేశారు. ఇప్పుడు ఈ పోస్టుకు తెగ పొగడ్తలు లభిస్తున్నాయి. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 8,200లైకులను, 1,900 రీట్విట్లను అందుకుంది. ఈ ఫోటో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి షాపుకు సంబంధించినది. నర్సిరాం అనే వ్యక్తి తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి దుకాణం ముందు ఒక ప్రకటన ఫ్లెక్సిని ఏర్పాటు చేశాడు. ఈ ప్రకటనలో ‘దెబ్బతిన్న చెప్పుల ఆస్పత్రి, డా. నర్సిరాం, రోగులకు అందుబాటులో ఉండు సమయం’ వంటి వివరాలు ఉన్నాయి. ఈ ప్రకటన ఆనంద్ మహీంద్రను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక్కడ రోగులు అంటే దెబ్బతిన్న చెప్పులు, డాక్టర్ అంటే చెప్పులు కుట్టే నర్సిరాం, దుకాణం తెరిచి ఉంచే సమయమే రోగులను అనుమతించే సమయం అని అర్థం. ఈ ఫోటోతో పాటు ఆనంద్ మహీంద్ర ఈ చెప్పులు కుట్టుకునే వ్యక్తికి మంచి మార్కెటింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. అవకాశం వస్తే ఇతను ఐఐఎమ్‌లో మార్కెటింగ్ పాఠాలు చెప్పేస్థాయిలో ఉండేవాడని మెసేజ్ చేశాడు.తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇతను ఇంత మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడని అభినందించడమే కాక ఈ ‘చెప్పుల డాక్టర్’ పూర్తి వివరాలు ఇస్తే తాను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఓర్పు, చిరునవ్వుతో చేసే పని ఎంత చిన్నదయినా దానికి మంచి ఫలితం లభిస్తుందని అన్నారు. -
గుడిసెలో పుట్టి పెరిగా : కేంద్ర మంత్రి
సాక్షి, చెన్నై : గుడిసెలో పుట్టి పెరిగాను...కష్టం అంటే ఏమిటో తెలిసిన దాన్ని అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఈషా యోగా కేంద్రంలో జరిగిన సదస్సులో పలువురు సందించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, తన జీవితంలో ఎదురైన కష్టాలను గుర్తు చేసుకున్నారు. కోయంబత్తూరు పర్యటనకు వచ్చిన స్మృతి ఇరానీ తెగిన చెప్పును కుంటించుకున్న అనంతరం ఈషా యోగా కేంద్రానికి వెళ్లారు. అక్కడ జరిగిన సదస్సులో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ యువకుడు సంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో చిన్నతనంలో పడ్డ కష్టాలను వివరించారు. ఢిల్లీలోని గుడిసె ప్రాంతంలో పుట్టి, పెరిగానని పేర్కొన్నారు. తన తండ్రి కష్ట జీవి అని, తల్లి హోటల్లో పనిచేసి తీసుకొచ్చే ఏదేని పదార్థాలే తన తో పాటుగా ముగ్గురు అక్కలకు ఆహారంగా వ్యాఖ్యానించారు. పుట గడవడమే కష్టంగా ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన తన మీద దేవుడు కరుణ చూపించాడని, కష్ట పడి పైకి వచ్చానని, కష్టం ఏమిటో తెలిసిన వ్యక్తిగా పేర్కొన్నారు. దేవుడు కరుణించి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టాడని, జీవితంలో ఇది చాలు అన్నట్టు స్పందించారు. తాను పుట్టి పెరిగిన గుడిసె ప్రాంతానికి ఎదురుగానే ప్రస్తుతం బంగళాలలో ఉన్నట్టు పేర్కొన్నారు. -
చెప్పులు కుట్టినందుకు స్మృతి ఎంతిచ్చారంటే...
-
చెప్పులు కుట్టినందుకు స్మృతి ఎంతిచ్చారంటే...
కోయింబత్తూర్ : కేంద్రమంత్రులు చెప్పులు కుట్టించుకోవడమా? వారు కో అంటే కోటి చెప్పులు వచ్చి వారి ముందు ఉంటాయి. అలాంటిది కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. తన చెప్పులను రిఫైర్ చేయించుకున్నారు. రిఫైర్ చేయించుకోవడమే కాక, కుట్టినందుకు చెప్పులు కుట్టేవాడికి ఎంతిచ్చారో తెలిస్తే షాక్. తన చెప్పులు మరమ్మత్తులు చేసినందుకు చెప్పులు కుట్టేవాడికి ఏకంగా రూ.100ను చెల్లించారట. అతను కేవలం రూ.10 డిమాండ్ చేస్తూ ఆమె సుహృదయంతో మరో రూ.90 అదనంగా చెల్లించారట. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర జౌళి, చేనేత శాఖా మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ, నేడు ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సెషన్‌కు హాజరయ్యేందుకు వచ్చారు. అయితే ఆమె విమానం దిగుతున్నప్పుడు చెప్పుల పట్టీ ఊడిపోయింది. ఆ సమయంలో దగ్గర్లో చెప్పులు కుట్టేవాడికోసం ఆమె వెతికారని, ఎయిర్‌పోర్టుకు 16 కిలోమీటర్ల దూరంలో ఇషా ఫౌండేషన్‌కు వెళ్లే మార్గంలో పెరూర్ ప్రాంతంలో ఓ చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించాడని బీజేపీ వర్గాలు చెప్పాయి. వెంటనే తమిళనాడు బీజేపీ జనరల్ సెక్రటరీ వనతి శ్రీనివాసన్‌ను తీసుకుని ఇరానీ వెహికిల్ దిగి చెప్పులు కుట్టించుకునేందుకు వెళ్లారని పేర్కొన్నాయి. చెప్పులు కుట్టేవాడు ఆమె చెప్పులు మరమ్మత్తు చేస్తున్నంత సేపు ఇరానీ అక్కడే ఓ స్టూల్ మీద కూర్చున్నట్టు తెలిపాయి. చెప్పులు కుట్టి ఇచ్చిన అతను రూ.10 డిమాండ్ చేస్తే, ఇరానీ మాత్రం రూ.100ను ఆ వ్యక్తి చేతిలో పెట్టారట.. చిల్లర లేవని చెప్పడంతో, ఆ వ్యక్తి సంతోషంతో స్మృతి ఇరానీ చెప్పులకు అదనంగా ఇంకొన్ని కుట్లు వేసి ఇచ్చాడు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇరానీ చెప్పులు కుడుతున్నంత సేపు అక్కడే కూర్చోవడం, ఆయనకు నేరుగా ఆమెనే డబ్బులు ఇవ్వడం వంటి స్మృతి అభినయను చాటిచెబుతున్నాయంటూ పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు. -
కాలపరీక్షలో.. 'పసిడి' పరుగు
ముంబై: ఏ కార్యానికైనా సంకల్ప బలం ప్రధానం. మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు కొండల్ని సైతం పిండి చేయవచ్చని ఓ అమ్మాయి నిరూపించింది. మహారాష్ట్రలోని దాదార్ ప్రాంతానికి చెందిన షూ పాలిష్ చేసుకుంటూ జీవనం సాగించే మంగేష్ కుమార్తె సయలీ హయ్ షున్ కాలపరీక్షలో గెలిచి పసిడి సాధించింది. జిల్లా క్రీడల్లో భాగంగా సోమవారం ప్రియదర్శిని పార్కులో(పీడీపీ) లో జరిగిన ఇంటర్ స్కూల్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో సయలీ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. కనీసం కాళ్లకు షూస్ కొనుక్కోలేని స్థితిలో ఉన్న ఆ అమ్మాయి అండర్ -17 విభాగంలో మూడు వేల మీటర్లు పరుగెత్తి తన లక్ష్యంలో తొలి అడుగును దిగ్విజయంగా అధిగమించింది. అయితే ఆ విషయం తెలిసిన తండ్రి మంగేష్ తొలుత నమ్మలేకపోయాడు. తన కూతురు పసిడితో మెరిసిందని ఆ నోట-ఈ నోట విన్న మంగేష్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన కూతురు చాంపియన్ గా నిలవమేడంటూ తన పేదరికాన్ని గుర్తు చేసుకున్నాడు. తనతో చెప్పిన వారు ఆట పట్టిస్తున్నారేమోనని ఓ చిన్న వెకిలి నవ్వు నవ్వాడు. కానీ అది వాస్తవం. తన కూతురు స్వర్ణాన్ని సాధించింది అని ఉద్వేగానికి గురయ్యాడు. అయితే కూతూరు సాధించిన ఆ ఘనతకు చూడటానికి 'ఆకలి కడుపు' అడ్డొచ్చిందని ఆవేదన చెందాడు. 'నా కూతురు స్కూల్ అథ్లెటిక్స్ మీట్ లో పాల్గొంటుందని తెలుసు. ఆ ఈవెంట్ ను చూడ్డానికి వెళదామనుకున్నా. ఒకవేళ నేను వెళితే నా కుటుంబ పోషణ భారంగా మారుతుంది. నేను చూడ్డానికి వెళ్లడం కంటే కుటుంబ పరిస్థితి ముఖ్యం' అని మంగేష్ ఒకింత గర్వంగా కూతురు ఘనతను గుర్తు చేసుకున్నాడు. తనకు ఇద్దరు కూతుళ్లని, వారిలో పెద్ద కూతురు డిప్లొమోలో ఇన్ ఫర్మమేషన్ టెక్నాలజీ చేస్తుందన్నాడు. తన కూతుళ్లు ఇరువురూ 'బంగారం' అంటూ మురిసిపోయాడు. తన పిల్లలకు చదువునే కానుకగా ఇవ్వాలనేది తన లక్ష్యమని.. ఆ క్రమంలోనే ఒక్కరోజు కూడా పాలిష్ షాపును మూసివేయనన్నాడు. నెలకు మూడు వేల నుంచి పది వేల రూపాయలకు వరకూ తన సంపాదన ఉంటుందన్నాడు. అసలు డబ్బు తీసుకు వెళ్లకుండా ఇంటికి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని మంగేష్ చెప్పుకొచ్చాడు.