సోషల్ మీడియాలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. పెద్ద మనసుతో చేసే మంచి పని ఏదైనా నెటిజన్లును ఆకట్టుకుంటుంది. బెంగళూరులో రామయ్య మామయ్య స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చెప్పులు కుట్టుకొని పొట్టపోసుకునే రామయ్య చేసిన పని లక్షలాది మంది హృదయాలను హత్తుకుంది. తన చిన్న ప్రపంచంలో మూగజీవులకు చోటిచ్చిన అపురూప మనిషిగా ప్రశంసలు దక్కించుకున్నాడు.
బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని డెకాథ్లాన్ షాప్ బైట ఒక చెప్పులు కుట్టుకునే వృత్తిలోఉన్నాడురామయ్య. ఆయన పనిచేసే చిన్న బడ్డీకొట్టులోనే తనతోపాటు మరికొన్నిమూగ జీవాలను ఆశ్రయం ఇచ్చి వాటికి పెద్ద దిక్కయ్యాడు. ఒకటీ రెండూ, కాదు దాదాపు 15 జంతువులు ఆయన చేరదీశాడు. వీటిల్లో రెండు వీధి కుక్కలు, పిల్లి కూన అతని పక్కనే ఆడుకుంటూ ఉంటాయి. వాటి కడుపు నింపడం మాత్రమే కాదు, దెబ్బలు తగిలితే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేంత దయాయుడు. ఈ రామయ్య. అందుకే అతణ్ని అందరూ రామయ్య మామయ్య అని పిలుచుకుంటారట.
లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 2023, డిసెంబరులో అతనికి బంధించిన స్టోరీ పోస్ట్ చేశారు. “మీరు ఎప్పుడైనా అక్కడికి వెళితే, ఒక్క క్షణం ఆగండి, నిజమైన ప్రేమ, దయ , దాతృత్వం ఎలా ఉంటుందో కళ్లారా చూడండి.. పాత బూట్లను రిపేర్ చేయడానికి పని చేసే ఆ చిన్న స్థలంలోనే, కనీసం 3 కుక్కలు వెచ్చగా నిద్రపోతూ ఉంటుంది. ఒక బుజ్జి పిల్లి కూన ఆడుకుంటూ ఉంటుంది’’ అని తెలిపారు. అతని కోసం విరాళాలు సేకరణ కూడా చేపట్టారు.
దీంతో రామయ్యంకుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. మంచి మనసుతో రామయ్య చేస్తున్న పనికి ముగ్దులై అతని సాయం చేయడానికి ముందుకొచ్చారు.
రామయ్య అంకుల్ ఫండ్ రైజర్ పేజీ ప్రకారం దేశం నలుమూలలనుండి విరాళాలొచ్చాయి. ‘నీకేమైనా కావాలా అంటే... నాకేమీ అవసరం లేదు..వాటికి అన్నం పెడితే చాలు’ అని చెప్పేవాడట ప్రేమతో. మొత్తం వసూలు చేసిన తర్వాత, చందాదారులందరి పేర్లతో ఒక కార్డు తయారు చేసి గత వారం రామయ్య అంకుల్‌కి అందించారు. ఇందులో సగం వీధిజంతువుల సంక్షేమం కోసం మిగతాసగం ఆయన ఖాతాలోను జమచేశారు.
దీంతో సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య. దాతలందరికి కృతజ్ఞతలు తెలిపాడు. నాలుగు నెలల క్రితమే తన భార్య చనిపోయిందని, తన కూతురిని పెంచే బాధ్యత తనపైనే ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దాతలు ఇచ్చిన కార్డును తన దుకాణంలో వేలాడ దీసుకున్నాడు సగర్వంగా.
“ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, మనస్ఫూర్తిగా ఇవ్వడం అంటే అంటే ఏమిటో మాకు చూపించినందుకు రామయ్య రామయ్యకు ధన్యవాదాలు. తమ వద్ద ఉన్న సమృద్ధిగా ఉన్నదాంట్లోంచి ఏదో కొద్దిగా ఇవ్వడం గొప్ప కాదు, తనకున్న చిన్నమొత్తంలోంచే ఘనంగా ఇవ్వడంలోనే ఉంది అసలు మానవత్వం అంటూ లియా ది గోల్డెన్ ఇండీ' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment