గుడిసెలో పుట్టి పెరిగా : కేంద్ర మంత్రి
గుడిసెలో పుట్టి పెరిగా : కేంద్ర మంత్రి
Published Sun, Nov 27 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
సాక్షి, చెన్నై : గుడిసెలో పుట్టి పెరిగాను...కష్టం అంటే ఏమిటో తెలిసిన దాన్ని అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఈషా యోగా కేంద్రంలో జరిగిన సదస్సులో పలువురు సందించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, తన జీవితంలో ఎదురైన కష్టాలను గుర్తు చేసుకున్నారు. కోయంబత్తూరు పర్యటనకు వచ్చిన స్మృతి ఇరానీ తెగిన చెప్పును కుంటించుకున్న అనంతరం ఈషా యోగా కేంద్రానికి వెళ్లారు. అక్కడ జరిగిన సదస్సులో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ యువకుడు సంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో చిన్నతనంలో పడ్డ కష్టాలను వివరించారు. ఢిల్లీలోని గుడిసె ప్రాంతంలో పుట్టి, పెరిగానని పేర్కొన్నారు.
తన తండ్రి కష్ట జీవి అని, తల్లి హోటల్‌లో పనిచేసి తీసుకొచ్చే ఏదేని పదార్థాలే తన తో పాటుగా ముగ్గురు అక్కలకు ఆహారంగా వ్యాఖ్యానించారు. పుట గడవడమే కష్టంగా ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన తన మీద దేవుడు కరుణ చూపించాడని, కష్ట పడి పైకి వచ్చానని, కష్టం ఏమిటో తెలిసిన వ్యక్తిగా పేర్కొన్నారు. దేవుడు కరుణించి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టాడని, జీవితంలో ఇది చాలు అన్నట్టు స్పందించారు. తాను పుట్టి పెరిగిన గుడిసె ప్రాంతానికి ఎదురుగానే ప్రస్తుతం బంగళాలలో ఉన్నట్టు పేర్కొన్నారు.
Advertisement