చెప్పులు కుట్టినందుకు స్మృతి ఎంతిచ్చారంటే...
చెప్పులు కుట్టినందుకు స్మృతి ఎంతిచ్చారంటే...
Published Sat, Nov 26 2016 8:08 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
కోయింబత్తూర్ : కేంద్రమంత్రులు చెప్పులు కుట్టించుకోవడమా? వారు కో అంటే కోటి చెప్పులు వచ్చి వారి ముందు ఉంటాయి. అలాంటిది కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. తన చెప్పులను రిఫైర్ చేయించుకున్నారు. రిఫైర్ చేయించుకోవడమే కాక, కుట్టినందుకు చెప్పులు కుట్టేవాడికి ఎంతిచ్చారో తెలిస్తే షాక్. తన చెప్పులు మరమ్మత్తులు చేసినందుకు చెప్పులు కుట్టేవాడికి ఏకంగా రూ.100ను చెల్లించారట. అతను కేవలం రూ.10 డిమాండ్ చేస్తూ ఆమె సుహృదయంతో మరో రూ.90 అదనంగా చెల్లించారట. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర జౌళి, చేనేత శాఖా మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ, నేడు ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సెషన్‌కు హాజరయ్యేందుకు వచ్చారు. అయితే ఆమె విమానం దిగుతున్నప్పుడు చెప్పుల పట్టీ ఊడిపోయింది.
ఆ సమయంలో దగ్గర్లో చెప్పులు కుట్టేవాడికోసం ఆమె వెతికారని, ఎయిర్‌పోర్టుకు 16 కిలోమీటర్ల దూరంలో ఇషా ఫౌండేషన్‌కు వెళ్లే మార్గంలో పెరూర్ ప్రాంతంలో ఓ చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించాడని బీజేపీ వర్గాలు చెప్పాయి. వెంటనే తమిళనాడు బీజేపీ జనరల్ సెక్రటరీ వనతి శ్రీనివాసన్‌ను తీసుకుని ఇరానీ వెహికిల్ దిగి చెప్పులు కుట్టించుకునేందుకు వెళ్లారని పేర్కొన్నాయి. చెప్పులు కుట్టేవాడు ఆమె చెప్పులు మరమ్మత్తు చేస్తున్నంత సేపు ఇరానీ అక్కడే ఓ స్టూల్ మీద కూర్చున్నట్టు తెలిపాయి. చెప్పులు కుట్టి ఇచ్చిన అతను రూ.10 డిమాండ్ చేస్తే, ఇరానీ మాత్రం రూ.100ను ఆ వ్యక్తి చేతిలో పెట్టారట.. చిల్లర లేవని చెప్పడంతో, ఆ వ్యక్తి సంతోషంతో స్మృతి ఇరానీ చెప్పులకు అదనంగా ఇంకొన్ని కుట్లు వేసి ఇచ్చాడు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇరానీ చెప్పులు కుడుతున్నంత సేపు అక్కడే కూర్చోవడం, ఆయనకు నేరుగా ఆమెనే డబ్బులు ఇవ్వడం వంటి స్మృతి అభినయను చాటిచెబుతున్నాయంటూ పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
Advertisement
Advertisement