హత్రాస్‌ ప్రమాదాన్ని రాజకీయం చేయాలని లేదు: రాహుల్‌ గాంధీ | Congress Rahul Gandhi Meets Hathras Stampede Victims In UP, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

హత్రాస్‌ ప్రమాదాన్ని రాజకీయం చేయాలని లేదు: రాహుల్‌ గాంధీ

Published Fri, Jul 5 2024 8:12 AM | Last Updated on Fri, Jul 5 2024 10:46 AM

Congress Rahul Gandhi Meets Hathras Victims In UP

లక్నో: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు హత్రాస్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా హత్రాస్‌ దుర్ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలను రాహుల్‌ పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

కాగా, రాహుల్‌ హత్రాస్‌ పర్యటన సందర్భంగా అలీఘర్‌లోని పిల్ఖానాలో ఛోటే లాల్ భార్య మంజు, ఛోటే లాల్ కుమారుడు పంకజ్, ప్రేమవతి, ప్రమాదంలో మరణించిన విజయ్ సింగ్ భార్య శాంతి దేవి కుటుంబాలను కలుసుకున్నారు. వారిని పరామర్శించారు. అనంతరం, హత్రాస్‌లోని నవీపూర్ ఖుర్ద్, విభవ్ నగర్‌లో ఉన్న గ్రీన్ పార్కుకు చేరుకుంటారు. ఇక్కడ రాహుల్ గాంధీ జుగ్ను, సుభాష్ చంద్, కిషన్ లాల్ కుటుంబ సభ్యులను కలిశారు. 

 

 

అనంతరం, రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ..‘రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘హత్రాస్‌ ఘటనను రాజకీయం చేయాలనుకోవడం లేదు. హత్రాస్‌ ఘటన విషయంతో యూపీ సీఎం యోగి పెద్ద మనసు చేసుకోవాలి. బాధితులకు ఆరేళ్ల తర్వాత పరిహరం చేయడం కాకుండా.. వెంటనే న్యాయం చేయాలి. హత్రాస్‌లో భద్రతా వైఫ్యలం కారణంగా ప్రమాదం జరిగినట్టు బాధిత కుటుంబాల సభ్యులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

 

ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం హత్రాస్‌లో సత్సంగ్‌ కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా 121 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక, ఈ ఘటనపై యూపీలోకి యోగీ సర్కార్‌ న్యాయ విచారణకు ఆదేశించింది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు సాక్ష్యాలను దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఇక, ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ బుధవారం హత్రాస్‌ను సందర్శించి ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement