అస్సాంలో రాహుల్‌.. కాంగ్రెస్‌, బీజేపీ ట్వీట్‌ వార్‌ | Congress, BJP War Of Words Over Rahul Assam and Manipur Tour | Sakshi
Sakshi News home page

అస్సాంలో రాహుల్‌.. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం

Published Mon, Jul 8 2024 12:16 PM | Last Updated on Mon, Jul 8 2024 12:33 PM

Congress, BJP War Of Words Over Rahul Assam and Manipur Tour

గువహతి: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సోమవారం ఉయదం (జులై 8) అస్సాంలో పర్యటించారు. సిల్చార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో  బాధితులను పరామర్శించారు. అస్సాం నుంచి రాహుల్‌గాంధీ మణిపూర్‌కు పర్యటనకు బయల్దేరారు. ఈ సీజన్‌లో వచ్చిన వరదలకు అస్సాంలో కొన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు. 

కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం..
నాన్‌ బయాలజికల్‌  ప్రధాని సోమవారం ఉదయం మాస్కో వెళ్లారని ఎక్స్‌(ట్విటర్‌)లో జైరాంరమేష్‌ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ మాత్రం అస్సాంలో వరద బాధితులను పరామర్శిస్తున్నారన్నారు. 

మణిపూర్‌లో రాహుల్‌ పర్యటించడం ఇది మూడోసారని తెలిపారు. మరోపక్క బీజేపీ ఐటీ అమిత్‌ మాలవ్య జైరాంరమేష్‌ ట్వీట్‌పై స్పందించారు. అసలు మణిపూర్‌లో జాతుల మధ్య వైరానికి కాంగ్రెస్సే కారణమన్నారు. రాహుల్‌గాంధీది ట్రాజెడీ టూరిజం అని విమర్శించారు.  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement