గుట్టు రట్టు చేశాడు! | Vin Diesel Calls Ranveer Singh Deepika Padukone's Boyfriend And Her Smile Just Confirms It! | Sakshi
Sakshi News home page

గుట్టు రట్టు చేశాడు!

Published Mon, Jan 16 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

గుట్టు రట్టు చేశాడు!

గుట్టు రట్టు చేశాడు!

‘ఏమి సేతుర లింగా.. ఏమి సేతు’ – సంక్రాంతికి హరిదాసుల నోట వినిపిస్తుందీ పాట. ఇప్పుడు హాలీవుడ్‌ హీరో విన్‌ డీజిల్‌ని ఉద్దేశించి దీపికా పదుకొనే కూడా ఈ తరహా పాటే పాడుతున్నారు. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న దీపిక ప్రేమాయణాన్ని విన్‌ డీజిల్‌ రట్టు చేసేశారు. దాంతో మళ్లీ మీడియా ముందుకి వచ్చినప్పుడు ఏం చెప్పాలా? అని దీపిక ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకూ దీపికా పదుకొనే పెదవి దాటని మాట ఒకటుంది. అదేంటంటే... రణ్‌వీర్‌ సింగ్‌ ఆమెకి ఏం అవుతాడు? అనే ప్రశ్నకు సమాధానం. రణ్‌వీర్, దీపికల ప్రేమాయణం గురించి ముంబైలో ఎవర్ని అడిగినా కథలు కథలుగా చెబుతారు. ఇద్దరూ విహార యాత్రలకు విదేశాలు వెళ్లి, పలుసార్లు కెమేరా కళ్లకి చిక్కారు. కానీ, ‘రణ్‌వీర్‌ నా బాయ్‌ఫ్రెండ్‌’ అని దీపికా పదుకొనే గానీ... ‘నేను, దీపిక ప్రేమలో ఉన్నాం’ అని రణ్‌వీర్‌ సింగ్‌ గానీ... నోరు విప్పి చెప్పలేదు.

 ఇప్పుడు విన్‌ డీజిల్‌ ఓ ఇంటర్వ్యూలో ‘దీపిక బాయ్‌ఫ్రెండ్‌ రణ్‌వీర్‌ నాకు కాంప్లిమెంట్స్‌ ఇచ్చాడు’ అన్నారు. ‘ట్రిపుల్‌ ఎక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’తో దీపిక హాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ కంటే ఓ వారం ముందు, ఈ నెల 14న ఇండియాలో విడుదలైన ఈ సినిమా ప్రచారం నిమిత్తం విన్‌ డీజిల్‌ ముంబై వచ్చారు. అప్పుడీ వ్యాఖ్యాలు చేశారాయన. విన్‌ డీజిల్‌ ఇలా అనడంతో దీపిక ఖంగు తిన్నారని పరిశీలకులు అంటున్నారు. కానీ, ఆ ఫీలింగ్స్‌ని బయట పెట్టకుండా బయటకు చిరునవ్వులు చిందించారట. ఇలాంటి సమయాల్లో ఏమి సేతుర లింగ.. ఏమి సేతు అనుకోవడం తప్ప ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement