బాలీవుడ్ నటి దీపికా పదుకొణే తాజాగా చేసిన ట్వీట్ హల్‌చల్ చేస్తోంది. 'ట్రిపుల్ ఎక్స్' సిరీస్‌లో వస్తున్న తదుపరి చిత్రం 'జాండర్ కేజ్ రిటర్న్స్'లో తాను నటించనున్నట్టు ఆమె సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు 'ట్రిపుల్ ఎక్స్' హీరో విన్ డీసెల్‌తో ఆమె ఓ ఫొటో దిగి ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి ఇతర సోషల్ వెబ్‌సైట్లలోనూ ఈ ఫొటోను పెట్టి 'విన్ డిసెల్' అంటూ నటుడి పేరును రాసింది. ఈ ఫొటోలో వారి వెనుక సినిమా లోగో అయిన 'ట్రిపుల్ ఎక్స్' ఉండటం గమనార్హం.
నిజానికి 2014లో హాలీవుడ్ స్టార్ డిసెల్ నటించిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' సినిమా ఆఫర్ దీపికకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాకు డేట్లు సరిపోకపోవడంతో ఈ ఆఫర్‌ను ఆమె వదులుకున్నట్టు అప్పట్లో భావించారు. అమెరికా యాక్షన్ థ్రిల్లర్ అయిన 'ట్రిపుల్ ఎక్స్' సినిమా మొదట 2002లో విడుదలైంది. ఈ సినిమాలో జాండర్ కేజ్ పాత్రలో సాహసోపేతమైన క్రీడాకారుడిగా, రెబెల్ గూఢచారిగా డిసెల్ నటించాడు. అప్పటినుంచి ఈ సీరిస్‌లో సినిమాలు వస్తూనే ఉన్నాయి.
'ట్రిపుల్ ఎక్స్' సిరీస్‌లో దీపిక నటించనుందా?
Published Sun, Dec 6 2015 4:23 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM
Advertisement
Advertisement