ఆ నమ్మకం భయపెడుతోంది | Vin Diesel Praises Avengers Co-Star Robert Downey Jr | Sakshi
Sakshi News home page

ఆ నమ్మకం భయపెడుతోంది

Published Mon, May 13 2019 3:39 AM | Last Updated on Mon, May 13 2019 3:39 AM

Vin Diesel Praises Avengers Co-Star Robert Downey Jr - Sakshi

విన్‌ డీజిల్, రాబర్ట్‌ డౌనీ జూనియర్‌... ఒకరేమో ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సిరీస్‌ టాప్‌ స్టార్‌.  మరొకరు అవెంజర్స్‌లో రాక్‌స్టార్‌. తాజాగా రాబర్ట్‌ నాకు స్ఫూర్తి ఇస్తుంటాడు అని పొగడ్తల్లో ముంచెత్తారు విన్‌ డీజిల్‌. ఈ విషయాన్ని ఆయన పంచుకుంటూ– ‘‘తనకు ఎదురైన ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత స్ఫూర్తినింపుతుంటాడు రాబర్ట్‌. తను ఎంపిక చేసుకునే పాత్రలు కూడా అలానే ఉంటాయి.

ప్రస్తుతం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయినప్పటికీ తను ఎప్పటిలానే ఉన్నాడు. ‘నెక్ట్స్‌ నీ సినిమా అలానే కలెక్ట్‌ చేస్తుంది. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సీరిస్‌ ఇండస్ట్రీను పెద్ద స్థాయి తీసుకెళ్తుంది’ అని చెబుతున్నాడు. ఆ నమ్మకం నన్ను చాలా భయపెడుతోంది. నీతో ఫ్రెండ్‌షిప్‌ దొరికినందుకు సంతోషంగా ఉంది రాబర్ట్‌’’ అన్నారు. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.
∙విన్‌ డీజిల్, రాబర్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement