Robert Downey Jr.
-
మరో హాలీవుడ్ అవకాశం?
హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ సిరీస్‌లో తమిళ నటుడు ధనుష్ భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్వెల్ ఫ్రాంచైజీలోని ‘అవెంజర్స్’ సిరీస్‌లో తర్వాతి చిత్రాలుగా ‘అవెంజర్స్: డూమ్స్ డే, అవెంజర్స్: సీక్రెట్ వార్’ రానున్నాయని, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ఈ చిత్రాలను తెరకెక్కించనున్నారని మార్వెల్ సంస్థ ప్రకటించింది.‘అవెంజర్స్: డూమ్స్ డే’లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఓ లీడ్ రోల్లో నటించనున్నారు. మరో లీడ్ రోల్లో ధనుష్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ ఓ లీడ్ రోల్ చేశారు. మరి... ‘అవెంజర్స్: డూమ్స్ డే’లోనూ ఈ ఇండియన్ హీరో నటిస్తారా? వేచి చూడాలి. -
'అవెంజర్స్' కొత్త సినిమా.. సూపర్ విలన్‌గా ఐరన్ మ్యాన్ రీఎంట్రీ
మార్వెల్ సినిమాలు చూసేవాళ్లకు ఐరన్ మ్యాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ పాత్ర పోషించడం వల్ల రాబర్డ్ డౌనీ జూనియర్ వరల్డ్ వైడ్ అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమాలో ప్రపంచాన్ని కాపాడుతూ చనిపోయాడు. దీంతో ఆ పాత్రని అభిమానించే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు.(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)కానీ ఇప్పుడు ఐరన్ మ్యాన్ సరికొత్త పాత్రతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నాళ్లు సూపర్ హీరోగా సాహసాలు చేసిన రాబర్ట్.. రాబోయే 'అవెంజర్స్ డూమ్స్ డే' చిత్రంలో డాక్టర్ డూమ్ అనే విలన్‌గా కనిపించబోతున్నాడు. 'ఎండ్ గేమ్' మూవీకి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్... కొత్త ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ లాంచ్ జరగ్గా.. 2026 మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఏదేమైనా ఐరన్ మ్యాన్ రీఎంట్రీ మాత్రం మార్వెల్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)"New mask, same task.”Robert Downey Jr. surprises Hall H to announce his return to the MCU as Doctor Doom in Avengers: Doomsday, in theaters May 2026. #SDCC#PVRINOX #Doomsday #robertdowneyjr #MarvelStudios pic.twitter.com/HN0oOIrHm8— INOX Movies (@INOXMovies) July 28, 2024 -
స్టార్ హీరోకి పితృవియోగం
హాలీవుడ్లో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఐరన్‌మ్యాన్ హీరో రాబర్ట్‌డానీ జూనియర్ తండ్రి సీనియర్ రాబర్ట్ డానీ పార్కిన్సన్ వ్యాధితో కన్నుమూశాడు. మరోవైపు ది పేరెంట్‌హుడ్ ఫేమ్, నటి సుజ్జాన్నె డౌగ్లస్ కన్నుమూసింది. హాలీవుడ్ నటుడు, ఫిల్మ్‌మేకర్ రాబర్ట్ డానీ సీనియర్ ఇక లేడు. 85 ఏళ్ల రాబర్ట్ డానీ.. ఐదేళ్లుగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. నటుడిగా కెరీర్ ఆరంభించిన రాబర్ట్ డానీ సీనియర్.. లో బడ్జెట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన కొడుకు రాబర్ట్ డానీ జూనియర్ నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మంచి పేరు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by Robert Downey Jr. Official (@robertdowneyjr) జెర్రీ పీటర్సన్ ఇక లేరు ఇక వార్నర్ బ్రదర్స్ నిర్మించిన సిట్కామ్(సిచ్యుయేషన్ కామెడీ) సిరీస్ ది పేరెంట్ హుడ్ తో పాపులారిటీ దక్కించుకుంది నటి సుజ్జాన్నె డౌగ్లస్. బుధవారం ఆమె మృతి చెందిందని ఆమె సన్నిహితులు వెల్లడించారు. 1995 నుంచి నాలుగేళ్లపాటు ఈ టీవీ సిరీస్‌లో జెర్రీ పీటర్సన్ క్యారెక్టర్‌తో ఆమె అలరించింది. ఆమె మృతికి అధికారిక కారణం తెలియనప్పటికీ.. ఆమె క్యాన్సర్ సంబంధిత చికిత్స తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. తల్లి కాబోతున్న స్కార్లెట్ హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహెన్స్సన్.. తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె తన భర్తతో కలిసి ఆమె పంచుకుంది. కాగా, కిందటి ఏడాది లాక్డౌన్ నిబంధనల నడుమే ప్రైవేట్‌గా 36 ఏళ్ల స్కార్లెట్.. అమెరికన్ కమెడియన్ కోలిన్ జోస్ట్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్టర్‌గా పేరున్న స్కార్లెట్ జోహెన్స్సన్.. మార్వెల్ సినిమాల ద్వారా పాపులారిటీని పెంచుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘బ్లాక్ విడో’ రిలీజ్‌కు రెడీ ఉంది. -
‘ఐరన్‌మ్యాన్’కి ఏమైంది?, కారులో ముద్దులతో ‘స్పైడర్‌మ్యాన్’ అలా..
ఐరన్‌మ్యాన్.. మార్వెల్ కామిక్స్‌లో పిల్లలకు ఓ ఫేవరెట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్‌కు తనదైన శైలి నటనతో వెండితెరపై ప్రాణం పోసి.. అశేష అభిమానాన్నిసంపాదించుకున్నాడు నటుడు రాబర్డ్ డానీ జూనియర్. అయితే తాజాగా ఆయన చర్యలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. రాబర్డ్ డానీ.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొందరిని అన్‌ఫాలో అయ్యాడు. అయితే ప్రత్యేకించి మార్వెల్ నటులను అన్ ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. ‘కెప్టెన్ అమెరికా’ క్రిస్ ఎవాన్స్, స్పైడర్ మ్యాన్ ‘టామ్ హాలాండ్’ లాంటి మంచి స్నేహం ఉన్న నటులను సైతం అన్‌ఫాలో కావడం విశేషం. దీంతో అభిమానుల్లో ఏం జరిగిందో అనే ఆత్రుత పెరిగింది. కొంపదీసి మార్వెల్‌కు డానీ గుడ్‌బై చెప్పాడా? ఇక ఐరన్ మ్యాన్‌గా కనిపించడా? అనే వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారు కూడా. అయితే డానీ తన ఇన్‌స్టా వాళ్లతో పాటు మరికొందరిని కూడా అన్‌ఫాలో అయ్యాడు. మొత్తంగా అతని 43 మంది ఫాలోవర్స్‌లో.. ఏ ఒక్క యాక్టర్ లేకుండా చూసుకున్నాడు అంతే. ఇక ట్విటర్లో మాత్రం అందరినీ ఫాలో అవుతున్నాడు 56 ఏళ్ల రాబర్ట్ జాన్ డానీ జూనియర్. ముద్దులతో స్పైడర్‌మ్యాన్ టామ్దయా.. ఇది కొత్తగా ఆ హాలీవుడ్ జంటకు అభిమానులు పెట్టుకున్న పేరు. స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హోలాండ్(25).. తన కో స్టార్ జెన్దయాతో రిలేషన్లో ఉన్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ రిలేషన్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఇద్దరు కారులో ముద్దుపెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. కాగా, ఈ బ్రిటిష్ నటుడు.. 24 ఏళ్ల అమెరికన్ నటి జెన్దయాతో ప్రేమలో ఉన్నాడు. స్పైడర్‌మ్యాన్ హోంకమింగ్(2017) నుంచి పీటర్ పార్కర్-ఎంజే క్యారెక్టర్ జోడిగా వీళ్లిద్దరూ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. I can’t breathe #TOMDAYA #TOMHOLLAND #ZENDAYA pic.twitter.com/bYLEf2YpBM — 🦖 (@8ncvrr) July 2, 2021 -
‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ మళ్లీ వస్తోంది!
మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సూపర్ హీరో సీరిస్‌లో చివరి సినిమా అవెంజర్స్ : ది ఎండ్ గేమ్. దీంతో ఈ సినిమా ముగింపు ఎలా ఇవ్వబోతున్నారు అని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ రావటంతో వసూళ్ల పరంగానూ ఎండ్ గేమ్ సంచలనాలు సృష్టించింది. ఆ ఊపు చూసి అవతార్ రికార్డ్లను అవెంజర్స్ చెరిపేస్తుందని భావించారు చిత్రయూనిట్. కానీ మూడు వారాల తరువాత సీన్ మారిపోయింది. వరల్డ్ కప్ కూడా స్టార్ అవ్వటంతో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో మార్వెల్ సంస్థ కొత్త ప్లాన్ వేసింది. ఒరిజినల్ కంటెంట్ నుంచి మరికొంత ఫుటేజ్‌ను యాడ్ చేసి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అవతార్ రికార్డులు అందుకోవచ్చని భావిస్తున్నారు చిత్రయూనిట్. మరి మార్వెల్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
ఆ నమ్మకం భయపెడుతోంది
విన్ డీజిల్, రాబర్ట్ డౌనీ జూనియర్... ఒకరేమో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ టాప్ స్టార్. మరొకరు అవెంజర్స్‌లో రాక్‌స్టార్. తాజాగా రాబర్ట్ నాకు స్ఫూర్తి ఇస్తుంటాడు అని పొగడ్తల్లో ముంచెత్తారు విన్ డీజిల్. ఈ విషయాన్ని ఆయన పంచుకుంటూ– ‘‘తనకు ఎదురైన ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత స్ఫూర్తినింపుతుంటాడు రాబర్ట్. తను ఎంపిక చేసుకునే పాత్రలు కూడా అలానే ఉంటాయి. ప్రస్తుతం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయినప్పటికీ తను ఎప్పటిలానే ఉన్నాడు. ‘నెక్ట్స్ నీ సినిమా అలానే కలెక్ట్ చేస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరిస్ ఇండస్ట్రీను పెద్ద స్థాయి తీసుకెళ్తుంది’ అని చెబుతున్నాడు. ఆ నమ్మకం నన్ను చాలా భయపెడుతోంది. నీతో ఫ్రెండ్షిప్ దొరికినందుకు సంతోషంగా ఉంది రాబర్ట్’’ అన్నారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ∙విన్ డీజిల్, రాబర్ట్ -
ఆ సినిమా కోసం రూ. 524 కోట్లు తీసుకున్నాడట
ప్రపంచవ్యాప్తంగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ ఫీవర్ పట్టుకుంది. ఈ సూపర్ హీరో సిరీస్‌లో ఇదే లాస్ట్ సినిమా కావడంతో వసూళ్లు కూడా భారీగానే ఉన్నాయ్. ఇప్పటికే ఎండ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 8000 కోట్లు వసూళ్లు సాధించినట్లు సమాచారం. అంతేకాక ఈ సినిమాలో నటించిన వారికి కూడా భారీ పారితోషికాలే అందినట్లు సమాచారం. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వసూళ్ల నుంచి వచ్చే మొత్తంలో వాటా కావాలని రాబర్ట్ డౌనీ జూనియర్ ముందుగానే మార్వెల్ సంస్థ అధినేత కెవిన్ ఫీజ్‌తో ఒప్పందం చేసుకున్నారట. ఇక అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కోసం డౌనీ ఏకంగా 75 మిలియన్ అమెరికన్ డాలర్ల(రూ. 524 కోట్లు) భారీ పారితోషికాన్ని తీసుకున్నట్లు సమాచారం. దాంతో హాలీవుడ్లో ఇంత భారీ పారితోషికం అందుకున్న అతి కొద్ది మంది నటుల్లో రాబర్ట్ డౌనీ ఒకరుగా నిలిచారు. అవెంజర్స్ సిరీస్‌లో రాబర్డ్ డౌనీ ఐరన్ మ్యాన్ పాత్ర పోషించాడు. ఇక ఎండ్‌గేమ్ సినిమాలో కూడా రాబర్డ్ డౌనీయే లీడ్ రోల్ పోషించాడు. అంతేకాక స్పైడర్ మ్యాన్ హోం కమింగ్ సినిమాలో కూడా డౌనీ కూడా కనిపిస్తాడు. అయితే ఈ చిత్రం కోసం కేవలం మూడు రోజులు మాత్రమే పని చేసిన డౌనీ ఒక్క రోజుకు 5 మిలియన్ డాలర్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇక ‘అవెంజర్స్’లో థార్ పాత్రలో నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ సిరీస్ నుంచి ఐదు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ డీల్ నుంచి హెమ్స్‌వర్త్‌కు ముట్టిన మొత్తం 15 మిలియన్ డాలర్ల నుంచి 20(రూ. 139 కోట్లు ) మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. కెప్టెన్ అమెరికా పాత్రలో నటించిన క్రిస్ ఇవాన్స్ కూడా దాదాపు 20 మిలియన్ డాలర్ల మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారు. -
‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ఎలా ఉందంటే!
ప్రస్తుతం ప్రపంచమంతా అవెంజర్స్ ఫీవర్స్ కనిపిస్తుంది. ఎన్నికలు, ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా.. భారత్‌లోనూ ఈ ఫీవర్ గట్టిగానే కనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూ లైన్లు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. ఇతంటి భారీ అంచనాల మధ్య శుక్రవారం ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సూపర్ హీరో సీరిస్‌లో ఈ సినిమా చివరిది కూడా కావటంతో ముగింపు ఎలా ఇవ్వబోతున్నారు అని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇంతటి భారీ సిరీస్‌కు ముగింపు ఎలా ఇచ్చారు.? చివరకు సూపర్ హీరోస్ అంతా ఏమయ్యారో తెలుసుకునేందుకు ప్రపంచమంతా ఎదురుచూసింది. గత చిత్రం ఇన్ఫినిటీ వార్‌ను ఎక్కడ ముగించారో అక్కడి నుంచే ఎండ్ గేమ్ కథను ప్రారంభించారు. ఇన్ఫినిటీ వార్‌లో ఓటమి పాలైన అవెంజర్స్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతారు. తన దగ్గర ఉన్న మణుల శక్తితో విశ్వంలోని సగం ప్రాణికోటిని అంతం చేసిన థానోస్‌ను అంతమొందిస్తారు. ఇది జరిగిన 5 సంవత్సరాల తరువాత అవెంజర్స్‌కు మరో విషయం తెలుస్తుంది. టైం మేషీన్ ద్వారా గతంలోకి వెళ్లి, థానోస్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉపయోగించిన మణులను సాధించగలిగితే.. చనిపోయిన వారందరినీ తిరిగి బతికించగలమని తెలుస్తోంది. ఆ మణులను సాదించేందుకు అవెంజర్స్ ఎలాంటి సాహసాలు చేశారు.? ఈ ప్రయత్నంలో వాళ్లకు ఎదురైన సమస్యలేంటి.? వాళ్లు అనుకున్నట్టుగా ప్రాణికోటిని తిరిగి బతికించగలిగారా..? అన్నదే ఎండ్ గేమ్ కథ. (చదవండి : గూగుల్‌లో 'థానోస్' అని సెర్చ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?) గత చిత్రాలతో పోలిస్తే ఎండ్‌గేమ్‌ను మరింత ఎమోషనల్‌గా రూపొందించారు. ఒక్క హల్క్ మినహా ప్రతీ పాత్రను తమకు ఇష్టమైన వాటిని కోల్పోయిన నేపథ్యం తోనే నడిపించారు. ఈ సిరీస్‌లోని గత చిత్రాలు ఎక్కువగా హీరోయిజం, కామెడీ, యాక్షన్ ప్రధానంగా తెరకెక్కగా.. ఎండ్ గేమ్ మాత్రం అనుబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా తెరకెక్కించారు. అయితే అవెంజర్స్ సినిమాలను ఇష్టపడే అభిమానులను మాత్రం నిరాశపరచలేదు. కామెడీతో పాటు భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ అలరిస్తాయి. ముఖ్యంగా అవెంజర్స్ సిరీస్‌లో కనిపించిన ప్రతీ సూపర్ హీరోను క్లైమాక్స్‌లో భాగం చేసి అభిమానులకు మరింత కనువిందు చేశారు చిత్రయూనిట్. తమకు అలవాటైన పాత్రల్లో హాలీవుడ్ స్టార్స్ ఒదిగిపోయారు. గ్రాఫిక్స్, సెట్స్ సినిమాను విజువల్ వండర్‌గా మార్చేశాయి. తొలి భాగం అంతా పాత్రలను తిరిగి కలిపేందుకు తీసుకున్న దర్శకులు కథను కాస్త నెమ్మదిగా నడిపించారు. ద్వితీయార్థం అంతా ఎమోషనల్ సీన్స్‌తో నడిపించి క్లైమాక్స్ కు వచ్చే సరికి కళ్లు చెదిరే భారీ యాక్షన్‌తో ముగించారు. గత చిత్రాలు చూడని వారికి కాస్త గందరగోళంగా అనిపించినా.. ఓవరాల్‌గా ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ఆడియన్స్‌కు కొత్త అనుభూతినిస్తుందనటంలో సందేహం లేదు. -
థానోస్ అంతం ఎలా?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’. రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ నటì ంచిన ఈ చిత్రంలో క్రిస్ ఇవాన్స్, మార్క్ రఫాలో, క్రిస్ హేమ్స్‌వర్త్, స్కార్లెట్ జాన్సన్ వంటి స్టార్స్ నటించారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘అవెంజర్స్’ సిరీస్ నుంచి వస్తున్న చివరి సూపర్‌హీరో చిత్రం ఇదేన ని హాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. గత చిత్రంలో థానోస్ శక్తితో కనిపించకుండాపోయిన అవెంజర్స్ మళ్లీ తిరిగి ఎలా వచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నదే ఈ చిత్ర కథ. థానోస్ పాత్రకి తెలుగులో రానా డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఏ.ఆర్.రెహమాన్ రూపొందించిన పాట విశేష ప్రేక్షకాదరణ పొందింది. -
ఐరన్ మ్యాన్ కవచాన్ని దొంగలెత్తుకెళ్లారు..
లాస్ ఏంజిల్స్ : సూపర్ హీరో ఐరన్ మ్యాన్ సూట్(ఉక్కు కవచం)ను దొంగలెత్తుకెళ్లారు. బుధవారం లాస్ ఏంజిల్స్‌లోని ఓ ఆధునాతన గదిలో భద్రంగా దాచిన సూట్‌ను దొంగలెత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఎరుపు, బంగారు రంగులో ఉన్న ఈ సూట్ విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల పైమాటేనని పోలీసులు తెలిపారు. 2008లో వచ్చిన ఐరన్‌మ్యాన్ సినిమాలో హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ దీనిని ధరించాడు. ఆ సినిమా అప్పట్లో ఓ చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడమే కాకుండా రాబర్ట్ డౌనీని అభిమానులకు మరింత చేరువ చేసింది. రాబర్ట్ డౌనీ జూనియర్ వచ్చే ఏడాదిలో అవెంజర్స్ సిరీస్‌లోని నాలుగో భాగంలో నటించనున్నారు. -
ఇంటికొస్తున్న స్పైడర్‌మ్యాన్
‘స్పైడర్ మ్యాన్’కు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఉన్నారు. ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళీ భాషల్లో విడుదలై, ఆకట్టుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘స్పైడర్‌మ్యాన్’ సిరీస్‌లో రాబోతున్న కొత్త చిత్రం ‘స్పైడర్‌మ్యాన్ హోమ్ కమింగ్’. స్పైడర్‌మ్యాన్ పాత్రలో థామస్ స్టాన్లే, విలన్‌గా ఆస్కార్ అవార్డ్ విన్నర్, ‘బర్డ్‌మ్యాన్’ ఫేమ్ మిచెల్ కీటన్ చేసారు. ఐరన్‌మ్యాన్ పాత్రలో రాబర్ట్ డౌనీ జూనియర్ నటించారు. ఈ సినిమాను తెలుగులో జూలై 7న విడుదల చేయనున్నారు.