'అవెంజర్స్' కొత్త సినిమా.. సూపర్ విలన్‌గా ఐరన్ మ్యాన్ రీఎంట్రీ | Robert Downey Jr Re Entry Into MCU Avengers Doomsday | Sakshi
Sakshi News home page

Avengers Doomsday: సూపర్ హీరో కాదు.. ఇకపై సూపర్ విలన్

Published Sun, Jul 28 2024 1:01 PM | Last Updated on Sun, Jul 28 2024 1:36 PM

Robert Downey Jr Re Entry Into MCU Avengers Doomsday

మార్వెల్ సినిమాలు చూసేవాళ్లకు ఐరన్ మ్యాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ పాత్ర పోషించడం వల్ల రాబర్డ్ డౌనీ జూనియర్ వరల్డ్ వైడ్ అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమాలో ప్రపంచాన్ని కాపాడుతూ చనిపోయాడు. దీంతో ఆ పాత్రని అభిమానించే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు.

(ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)

కానీ ఇప్పుడు ఐరన్ మ్యాన్ సరికొత్త పాత్రతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్నాళ్లు సూపర్ హీరోగా సాహసాలు చేసిన రాబర్ట్.. రాబోయే 'అవెంజర్స్ డూమ్స్ డే' చిత్రంలో డాక్టర్ డూమ్ అనే విలన్‌గా కనిపించబోతున్నాడు. 'ఎండ్ గేమ్' మూవీకి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్... కొత్త ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ లాంచ్ జరగ్గా.. 2026 మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఏదేమైనా ఐరన్ మ్యాన్ రీఎంట్రీ మాత్రం మార్వెల్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement