ఓటీటీలు మనకు బాగా అలవాటు అయిపోయాయి. ఎంతలా అంటే కొన్నాళ్ల ముందు వరకు తెలుగు సినిమాలు మాత్రమే మనోళ్లు చూసేవాళ్లు. ఇప్పుడు బాగుందని తెలిస్తే భాషతో సంబంధం లేకుండా ఏ మూవీని వదలట్లేదు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ మూవీస్ తీసేది ఎవరని అడిగితే చాలామంది చెప్పే పేరు కొరియన్. థ్రిల్లర్, డ్రామా, యాక్షన్.. ఇలా ఏ జానర్ చిత్రాలు అయినా కొరియన్స్ బాగా తీస్తారనే పేరుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)
అలా ఇప్పుడు పలు ఓటీటీల్లో ది బెస్ట్ అని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్న కొన్ని కొరియన్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయి. స్టోరీ లైన్ ఏంటనేది దిగువన లిస్టులో చూద్దాం.
ఫర్గాటెన్ (2017) - ఇదో మిస్టరీ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. గతం మరిచిపోయిన ఓ వ్యక్తి.. సొంత తమ్ముడినే కిడ్నాప్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.
మెమొరీస్ ఆఫ్ మర్డర్ (2003) - ఇది మర్డర్ మిస్టరీ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇద్దరు డిటెక్టివ్స్... వరస హత్యల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. వాళ్లకు తెలిసిన నిజమేంటనేదే మెయిన్ స్టోరీ.
ఐ సా ద డెవిల్ (2010) - ఇదో యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ ఊరిలో సంబంధం లేకుండా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఇంతకీ ఎవరు చేస్తున్నారు? సీక్రెట్ ఏజెంట్ కనిపెట్టాడా లేదా అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))
ద గ్యాంగస్టర్ ద కాప్ ద డెవిల్ (2019) - ఇదో యాక్షన్ మూవీ, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ సైకోని.. గ్యాంగస్టర్, పోలీస్ కలిసి ఎలా మట్టుబెట్టారనేదే స్టోరీ.
ట్రెన్ టూ బుసాన్ (2016) - ఇది హారర్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. బుసాన్ అనే ఊరికి వెళ్లేందుకు ఓ వ్యక్తి, కూతురితో కలిసి ట్రైన్ ఎక్కుతాడు. కానీ అందులోని మనుషులు.. జాంబీలుగా మారి అందరినీ చంపేస్తుంటారు. మరి వీళ్లు బతికి బయటపడ్డారా లేదా అనేదే స్టోరీ.
ద ఔట్ లాస్ (2017) - ఇది క్రైమ్ యాక్షన్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. కొరియన్, చైనీస్ గ్యాంగ్స్ మధ్య గొడవ జరిగితే.. ఓ డిటెక్టివ్ దాన్ని ఎలా డీల్ చేసాడనేదే స్టోరీ.
ద హ్యాండ్ మెయిడెన్ (2016) - ఇది రొమాంటిక్ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. 1930ల్లో ఓ రాజకుమారి దగ్గర పనిచేయడానికి ఓ అమ్మాయి వెళ్తుంది. కానీ తర్వాతర్వాత ఊహించని సంఘటనలు జరుగుతాయి. అదే స్టోరీ. 18 ప్లస్ సీన్లు ఉంటాయి. ఒంటరిగానే చూడండి!.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)
పారాసైట్ (2019) - ఆస్కార్ గెలుచుకున్న కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఓ నిరుపేద ఫ్యామిలీ.. మాయమాటలు చెప్పి ఓ ధనవంతుల ఇంట్లో పనికి చేరుతారు. ఆ తర్వాత జరిగే సంఘటనల సమహారమే అసలు కథ.
ద క్లాసిక్ (2003) - ఇది రొమాంటిక్ డ్రామా. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఓ కాలేజీ స్టూడెంట్‌కి పాత డైరీ దొరుకుతుంది. అందులో తన తల్లి ట్రాయాంగిల్ లవ్ స్టోరీ గురించి ఉంటుంది. చివరకు ఆ కుర్రాడికి ఏం తెలిసిందనేదే స్టోరీ.
ఓల్డ్ బాయ్ (2003) - ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఏమి లేనీ ఓ ఖైదీకి అన్ని వసతులు సమకూర్చిన.. లేని పోని గొడవల్లో ఇరుక్కుంటాడు. చివరకు ఏమైందనేదే అసలు కథ.
ద అడ్మైరల్ (2014) - ఇది పీరియాడికల్ యాక్షన్ మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. కేవలం 13 యుద్ధనౌకలు ఉన్న ఓ యోధుడు.. 300 యుద్ధ నౌకలున్న జపాన్ యోధులతో ఎలా తలపడ్డాడనేదే స్టోరీ.
ఏ ట్యాక్సీ డ్రైవర్ (2017) - ఇది యాక్షన్ కామెడీ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. రియల్ లైఫ్ సంఘటనలతో తీసిన ఈ సినిమా ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్, ఊహించని వివాదాల్లో చిక్కుకుంటే ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?)
Comments
Please login to add a commentAdd a comment