హీరో మంచు విష్ణుపై ఓ యూట్యూబర్ దారుణంగా విమర్శలు చేశాడు. సదరు హీరోకి చెందిన నిర్మాణ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని చెబుతూ ఫుల్ ఫైర్ అయిపోయాడు. దీనిపై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. అలా వచ్చే మెయిల్స్‌తో తమకు సంబంధం లేవని, అవన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం ఏంటి? అసలేం జరుగుతోంది?
(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. ఏమైందంటే?)
మంచు విష్ణు ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సెలబ్రిటీలు, వాళ్ల ఫ్యామిలీపై ట్రోల్ వీడియోలు చేస్తున్న చాలా యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే వందలాది ఛానెల్స్‌పై స్టైక్స్ వేసి, వాటిని తొలగించారు. ఈ విషయమై తాజాగా ఓ యూట్యూబర్ స్పందించాడు. తనలానే చాలామందికి చెందిన యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రైక్స్ వేసి, తొలగించారని.. వాటిని తీయమని చెబుతుంటే రాబోయే 'కన్నప్ప' మూవీ గురించి పాజిటివ్ వీడియో చేయాలని మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఫ్రూప్ కూడా చూపించాడు.
దీనిపై ఇప్పుడు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ స్పందించింది. పలువురు యూట్యూబర్స్‌కి మెయిల్స్‌కి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ మెయిల్స్‌తో తమకు భంగం కలిగిస్తున్నారని, ఈ విషయమై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఓ నోట్ రిలీజ్ చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే మంచు విష్ణుపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.
(ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment