హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'పందెం కోడి' సినిమా నుంచి ఇప్పటివరకు అడపాదడపా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడూ వివాదాలని వెంటేసుకునే తిరిగే విశాల్.. గతంలోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్బ్ని, థియేటర్ల మాఫియాని ప్రశ్నించాడు. ఇప్పుడు తమిళ నిర్మాతల మండలితో వాగ్వాదానికి దిగాడు.
(ఇదీ చదవండి: సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!)
గతంలో ఇదే తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా విశాల్ పనిచేశాడు. ఆ సమయంలో దాదాపు రూ.12 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విశాల్‌తో ఎవరూ సినిమాలు చేయొద్దని నిర్మాతల మండలి అల్టిమేటర్ జారీ చేసింది. ఈ క్రమంలోనే విశాల్ ట్విట్టర్ వేదికగా పెద్ద పోస్ట్ పెట్టాడు.
'మనం ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా? మిస్టర్ కథిరేశన్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఖర్చు చేశాం. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి.. ఇండస్ట్రీలో చాలా పని ఉంది.. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కరాలు వెతకాల్సి ఉంది.. విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు.. కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు.. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా?' అని విశాల్ తన ట్వీట్‌తో ఆగ్రహాన్ని అంతా బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: ధనుష్ 'రాయన్' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment