ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..! | Tamannaah's Dance Practice For Stree 2 Song Latest | Sakshi
Sakshi News home page

Tamannaah: వయసుతో పాటే తమన్నా అందం కూడా.. గ్రేస్ మాత్రం!

Jul 27 2024 7:55 AM | Updated on Jul 27 2024 9:05 AM

Tamannaah's Dance Practice For Stree 2 Song Latest

తమన్నా మంచి యాక్టర్. కానీ ఈమెలో అంతకు మించిన మంచి డ్యాన్సర్ కూడా ఉంది. ఎంతలా అంటే ఇప్పటివరకు ఈమె చేసిన సినిమాల్లో బెస్ట్ ఏంటో చెప్పమంటే తడబడతారు. కానీ డ్యాన్సర్‌గా తమన్నా చేసిన పాటలు చెప్పమంటే టక్కున చెప్పేస్తారు. ఎందుకంటే సౌత్‍‌లో 'స్వింగ్ జరా', 'కావాలయ్యా' లాంటి సాంగ్స్ వేరే లెవల్ క్రేజ్ తెచ్చిపెట్టాయి.

(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?)

రీసెంట్‌గా 'స్త్రీ 2' అనే హిందీ సినిమా 'ఆజ్ కీ రాత్' అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో తమన్నా వేసిన స్టెప్పులు ఆ మూమెంట్ చూస్తుంటే మళ్లీ 'కావాలయ్యా' సాంగ్ వైబ్స్ వస్తున్నాయి. ఒరిజినల పాటలో ఏమో గానీ తాజాగా ఇదే గీతానికి ప్రాక్టీస్ చేసిన మిల్కీ బ్యూటీ, ఈ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇదైతే ఒరిజినల్ సాంగ్ కంటే బాగుందా అనే రేంజులో ఉంది.

మరీ ముఖ్యంగా తమన్నా చేస్తుంటే ఆ స్టెప్స్‌లో రొమాన్స్ కనిపిస్తోంది. మొన్నటివరకు హీరోయిన్‌గా ఛాన్సులు తగ్గాయి కదా, తమన్నా ఇప్పుడేం చేస్తుందని అనుకున్నారు. కానీ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా స్పెషల్ సాంగ్స్ కూడా అలరిస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉందని గత కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. త్వరలోనే వీళ్ల పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: నాకు తప్పుగా అనిపించలేదు.. ఆ డ్రస్ వేసుకోవడంపై అమలాపాల్ వివరణ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement