‘‘లెవల్ క్రాస్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ కళాశాలలో జరిగిన ఈవెంట్‌లోపాల్గొన్నాను. ఆ ఈవెంట్‌కి నేను వేసుకుని వెళ్లిన డ్రెస్ నాకు చాలా సౌకర్యంగా అనిపించింది. ఆ దుస్తుల్లో ఆ ఈవెంట్‌కు వెళ్లడం నాకు తప్పుగా అనిపించలేదు’’ అని హీరోయిన్ అమలా΄ాల్ అన్నారు. ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం ‘లెవల్ క్రాస్’ శుక్రవారం (జూలై 26) విడుదలైంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేరళలోని ఎర్నాకులంలో ఓ కాలేజ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లోపాల్గొన్నారు అమలాపాల్. అయితే ఈ కార్యక్రమంలో ఆమె వేసుకున్న డ్రెస్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పొట్టి దుస్తుల్లో కాలేజ్‌కి వెళ్లి విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? విద్యా సంస్థల్లో జరిగే కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు పద్ధతిగా వెళితే బాగుంటుంది? అంటూ అమలాపాల్‌ను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు పలువురు నెటిజన్లు.
ఈ విమర్శలపై అమలాపాల్ స్పందిస్తూ– ‘‘కాలేజ్‌లో జరిగిన ఈవెంట్‌లో నేను ధరించిన డ్రెస్ నాకు సౌకర్యంగా అనిపించింది. ఆ డ్రెస్‌లో నన్ను చూడటం విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంగా అనిపించలేదు. నిజానికి నా దుస్తులను కెమెరాలు ఎలా చూపిస్తాయన్నదే అసలు సమస్య. కాలేజ్‌కి నేను ఆ డ్రెస్ వేసుకుని వెళ్లడం వెనక ఉన్న ఉద్దేశం విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే. నేను మోడ్రన్ డ్రెస్సులతోపాటు సంప్రదాయ దుస్తులు కూడా ధరిస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment