ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ | Shakhahaari Movie OTT Telugu Version Details | Sakshi
Sakshi News home page

Shakhahaari OTT: కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు డబ్బింగ్.. ఇప్పుడు ఓటీటీలో

Published Wed, Jul 24 2024 12:42 PM | Last Updated on Wed, Jul 24 2024 12:59 PM

Shakhahaari Movie OTT Telugu Version Details

థ్రిల్లర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. థియేటర్లలో వీటిని పెద్దగా పట్టించుకోపోవచ్చు గానీ ఓటీటీలో మాత్రం విశేషాదరణ దక్కుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పలు భాషల్లో హిట్ అయిన థ్రిల్లర్ మూవీస్‌ని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తుంటారు. అలా రెండు నెలల క్రితం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))

ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నడలో రిలీజైన 'శాఖాహారి'.. అద్బుతమైన సక్సెస్ అందుకుంది. కోటి రూపాయలు పెడితే ఐదు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మర్డరీ మిస్టరీ థ్రిల్లర్ స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇందులో ట్విస్టులు చూస్తే మీ బుర్ర తిరిగిపోవడం గ్యారంటీ. అంతలా ఆకట్టుకుంది. హింసాత్మక సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్త.

'శాఖాహారి' కథ విషయానికొస్తే.. సుబ్బన్న (రంగాయన రఘు).. చిన్న ఊరిలో శాఖాహార హోటల్ నడుపుతుంటాడు. పెళ్లి చేసుకోకపోవడంతో సోలోగానే బతికేస్తుంటాడు. భార్యని హత్య చేసిన వినయ్ అనే కుర్రాడు.. సుబ్బన్న హోటల్‌లో తలదాచుకుంటాడు. వినయ్ కోసం వచ్చిన లోకల్ పోలీస్ (గోపాల్ కృష్ణ దేశ్ పాండే)కు సుబ్బన్న గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఇంతకీ అవేంటి? తన హోటల్‌కి వచ్చిన వాళ్లని సుబ్బన్న ఎందుకు చంపేస్తున్నాడు? అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement