స్టార్‌ హీరోకి పితృవియోగం | Robert Downey Junior Father And Suzzanne Douglas Passed Away Other Hollywood Updates | Sakshi
Sakshi News home page

Hollywood Updates: స్టార్‌ హీరో తండ్రి కన్నుమూత, తల్లీ కాబోతున్న ‘బ్లాక్‌ విడో’

Published Thu, Jul 8 2021 10:42 AM | Last Updated on Thu, Jul 8 2021 10:44 AM

Robert Downey Junior Father And Suzzanne Douglas Passed Away Other Hollywood Updates - Sakshi

హాలీవుడ్‌లో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఐరన్‌మ్యాన్‌ హీరో రాబర్ట్‌డానీ జూనియర్‌ తండ్రి సీనియర్‌ రాబర్ట్‌ డానీ పార్కిన్‌సన్‌ వ్యాధితో కన్నుమూశాడు. మరోవైపు ది పేరెంట్‌హుడ్‌ ఫేమ్‌, నటి సుజ్జాన్నె డౌగ్లస్‌ కన్నుమూసింది. 

హాలీవుడ్‌ నటుడు, ఫిల్మ్‌మేకర్‌ రాబర్ట్‌ డానీ సీనియర్‌ ఇక లేడు. 85 ఏళ్ల రాబర్ట్‌ డానీ.. ఐదేళ్లుగా పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. నటుడిగా కెరీర్‌ ఆరంభించిన రాబర్ట్‌ డానీ సీనియర్‌.. లో బడ్జెట్‌ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన కొడుకు రాబర్ట్‌ డానీ జూనియర్‌ నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మంచి పేరు దక్కించుకున్నాడు.

జెర్రీ పీటర్‌సన్‌ ఇక లేరు
ఇక వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మించిన సిట్‌కామ్‌(సిచ్యుయేషన్‌ కామెడీ) సిరీస్‌ ది పేరెంట్‌ హుడ్‌ తో పాపులారిటీ దక్కించుకుంది నటి సుజ్జాన్నె డౌగ్లస్‌. బుధవారం ఆమె మృతి చెందిందని ఆమె సన్నిహితులు వెల్లడించారు. 1995 నుంచి నాలుగేళ్లపాటు ఈ టీవీ సిరీస్‌లో జెర్రీ పీటర్‌సన్‌ క్యారెక్టర్‌తో ఆమె అలరించింది. ఆమె మృతికి అధికారిక కారణం తెలియనప్పటికీ.. ఆమె క్యాన్సర్‌ సంబంధిత చికిత్స తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు.

తల్లి కాబోతున్న స్కార్లెట్‌
హాలీవుడ్‌ నటి స్కార్లెట్‌ జోహెన్‌స్సన్‌.. తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె తన భర్తతో కలిసి ఆమె పంచుకుంది. కాగా, కిందటి ఏడాది లాక్‌డౌన్‌ నిబంధనల నడుమే ప్రైవేట్‌గా 36 ఏళ్ల స్కార్లెట్‌.. అమెరికన్‌ కమెడియన్‌ కోలిన్‌ జోస్ట్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్‌ యాక్టర్‌గా పేరున్న స్కార్లెట్‌ జోహెన్‌స్సన్‌.. మార్వెల్‌ సినిమాల ద్వారా పాపులారిటీని పెంచుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన  ‘బ్లాక్‌ విడో’ రిలీజ్‌కు రెడీ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement