
సాక్షి, ముంబై: భారత్‌పే వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా మాజీ ఇన్వెస్టర్అష్నీర్ గ్రోవర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి అశోక్ గ్రోవర్ (69)బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అష్నీర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన తండ్రికి వీడ్కోలు పలుకుతూ ‘‘బై పాపా.. లవ్ యూ...నాన్నను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ స్వర్గంలో ఉన్న కుటుంబ సభ్యులు (తాతయ్య నానమ్మ, పెద్దమ్మ) ను కోరుతూ ఇన్‌స్టాలో ఒక ఫోటో షేర్ చేశారు.
(ఇదీ చదవండి: ‘పాపం..చేప! నా బాధ వారికే తెలుస్తుంది’ ఎయిరిండియాపై పెట్ లవర్ ఫిర్యాదు వైరల్)
అశోక్ గ్రోవర్ కన్నుమూతపైకమెడియన్ సునీల్ గ్రోవర్ సహా పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు. ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన అశోక్‌కు కుమారుడు అష్నీర్‌తోపాటు కూతురు ఆషిమా ఉన్నారు. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు)
Comments
Please login to add a commentAdd a comment