Ayushmann Khurrana Father, Astrologer P Khurana Dies In Mohali - Sakshi
Sakshi News home page

Ayushmann Khurrana: ఆయుష్మాన్ ఖురానా ఇం‍ట్లో తీవ్ర విషాదం..!

Published Fri, May 19 2023 4:05 PM | Last Updated on Fri, May 19 2023 4:31 PM

Ayushmann Khurrana father astrologer P Khurana dies in Mohali - Sakshi

బాలీవుడ్ నటుడు, సింగర్ ఆయుష్మాన్ ఖురానా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆచార్య పి ఖురానా మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.  అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన పంజాబ్‌లోని మొహాలీలో తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  కాగా.. పి ఖురానా జ్యోతిష్య రంగంలో ప్రావీణ్యం సంపాదించారు.  పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన ఆయన జ్యోతిష్యంపై పలు పుస్తకాలు కూడా రాశాడు.

(ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. సోషల్ మీడియాలో వైరల్)

కాగా.. ఆయుష్మాన్ ఖురానా హిందీ చిత్రాల్లో నటించారు. సింగర్‌గా బాలీవుడ్‌లో పలు చిత్రాలకు సాంగ్స్ పాడారు. ఖురానా జాతీయ చలనచిత్ర అవార్డు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. అంతే కాకుండా ఫోర్బ్స్ ఇండియా- 2013, 2019 జాబితాలో సెలబ్రిటీ 100 జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 2020లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా టైమ్స్ లిస్ట్‌లో పేరు సంపాదించారు.

(ఇది చదవండి: త్వరలోనే పవిత్రా లోకేశ్‌ను పెళ్లి చేసుకుంటా: నరేష్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement