Scarlett Johansson
-
Black Widow Review: ఓటీటీలో కళ్లు చెదిరే స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
టైటిల్: బ్లాక్ విడోనటీనటులు: స్కార్లెట్ జాన్సన్, ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తదితరులుదర్శకుడు: కేట్ షార్ట్ల్యాండ్నిర్మాత: కెవిన్ ఫీగేసంగీత దర్శకుడు: లోర్న్ బాల్ఫ్సినిమాటోగ్రఫీ: గాబ్రియెల్ బెరిస్టెన్ఎడిటర్: లీ ఫోల్సమ్ బోయ్డ్, మాథ్యూ ష్మిత్ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్(2021లో థియేటర్లలో రిలీజైంది)కథేంటంటే..బ్లాక్ విడో అదే పేరుతో ఉన్న మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన సూపర్ హీరో చిత్రం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిచర్స్లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కేట్ షార్ట్‌ల్యాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్ టైటిల్ పాత్రలో నటించారు. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సంఘటనలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ లేడీ-ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..ఈ మూవీ అంతా కూడా అంతుకుముందు మనకు అవెంజర్స్ సిరీస్‌లాగా ఉన్న స్టోరీలానే అనిపిస్తుంది. రష్యాకు చెందిన ఓ విలన్(డేవిడ్ హార్బర్) ముఖ్యంగా అనాథ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని.. ఒక సైన్యంలా తయారు చేస్తాడు. తాను చెప్పినట్లు నడుచుకునేలా వాళ్ల బ్రెయిన్‌ను మారుస్తాడు. ఆ తర్వాత అమెరికాలోని రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ఫేక్ కుటుంబాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వాళ్లను మొత్తం విడదీస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలను మళ్లీ తన సైన్యంలోనే చేర్చుకుంటాడు. ఆ తర్వాత అందులో ఉన్న స్కార్లెట్ జాన్సన్(బ్లాక్ విడో) బయటికి వచ్చి అతనితో పోరాటం చేస్తుంది. తన మిత్రులు మరికొందరితో కలిసి అతన్ని అంతం చేసేందుకు యత్నిస్తుంది. మరి అసలు అతని నుంచి అనాథ అమ్మాయిలను కాపాడిందా? ఆ విలన్‌ను అంతం చేసిందా? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే బ్లాక్ విడో చూడాల్సిందే.ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు కూడా ఫర్వాలేదనిపించాయి. ఒక్క ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగా ఉంటుంది. అయితే ఈ కథలో స్క్రీన్ ప్లేను అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కేట్ షార్ట్‌ల్యాండ్ విఫలమయ్యాడు. ఆడియన్స్‌కు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కడా కూడా కనిపించవు. విజువల్ పరంగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్. దర్శకుడు కేట్ షార్ట్‌ల్యాండ్ కథను ఇంకా బాగా రాసుకుంటేనే బాగుండేది. కేవలం యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ కోసమైతే ఈ బ్లాక్ విడో మూవీని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..బ్లాక్ విడో పాత్రలో స్కార్లెట్ జాన్సన్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. ఆమె తన సూపర్ హీరో హోదాకు న్యాయం చేశారు. ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తన పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మెప్పించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్..
Jr NTR Samantha Tollywood Most Popular Actors As Per Ormax Media 2022: వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనే టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మోస్ట్ పాపులర్ నటుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటిగా స్టార్ హీరోయిన్ సమంత టాప్ 1 స్థానంలో నిలిచారు. తారక్ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. సామ్ తర్వాత కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఉన్నారు. వీరితోపాటు బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోగా అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఉండగా చివరగా 10వ స్థానంలో వరుణ్ ధావన్ ఉన్నాడు. మోస్ట్ పాపులర్ హిందీ హీరోయిన్గా అలియా భట్ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్, కృతి సనన్ ఉండగా, చివరిగా అనుష్క శర్మ చోటు దక్కించుకుంది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/wxyhPygor6 — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZWDBHowzxE — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular male Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/NgFZDHnbcw — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 Ormax Stars India Loves: Most popular female Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/OwerlKLNgo — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 తమిళంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా ఫస్ట్ ప్లేస్‌లో నయన తార నిలిచింది. తర్వాత సమంత, కీర్తి సురేశ్, త్రిశ, జ్యోతిక, ప్రియాంక మోహన్, తమన్నా, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, హంసిక ఉన్నారు. ఆరో స్థానంలో నిలిచిన ప్రియాంక మోహన్‌ను ఆల్‌టైమ్ హైయెస్ట్ ర్యాంక్‌గా ప్రకటించింది ఓర్మాక్స్ మీడియా. ఇక హీరోల విషయానికొస్తే మొదటి స్థానంలో విజయ్ ఉండగా తర్వాత అజిత్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్, శివకార్తికేయన్, రజినీ కాంత్, విక్రమ్, కమల్ హాసన్, శింబు నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/irsBaQz6K2 — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 All-time highest rank: Priyanka Mohan takes the no. 6 position, her best-ever rank on Ormax Stars India Loves #OrmaxSIL pic.twitter.com/DbTr9eQgIK — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 Ormax Stars India Loves: Most popular male Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZBwaSywyLB — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 హాలీవుడ్ హీరోయిన్లలో స్కార్లెట్ జాన్సన్, ఏంజిలీనా జోలీ, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ లారెన్స్, గాల్ గాడోట్, ఎమ్మా స్టోన్, కేట్ విన్స్లెట్, ఎలిజబెత్ ఓల్సెన్, జెండయా, నటాలీ పోర్ట్మన్ వరుసగా ఉన్నారు. హీరోలలో టాప్ 1 ప్లేస్‌లో టామ్ క్రూజ్ ఉండగా, తర్వాతి స్థానాల్లో రాబర్ట్ డౌనీ జూనియర్, డ్వేన్ జాన్సన్, విల్ స్మిత్, టామ్ హోలాండ్, లియనార్డో డికాఫ్రియో, క్రిస్ హెమ్స్వోర్త్, విన్ డీసిల్, క్రిస్ ఇవాన్స్, జానీ డెప్ నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/7SZQM9GxKE — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 Ormax Stars India Loves: Most popular male Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/zxScetz4bj — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 -
350 కోట్ల నష్టం!.. ఆ ప్రొడక్షన్ హౌజ్‌కు నటి గుడ్‌బై?
హాలీవుడ్ నటి స్కార్లెట్ జొహాన్సన్-డిస్నీల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కాకుండా.. ఓటీటీ(డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్)లో రిలీజ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉల్లంఘన ద్వారా డిస్నీ తనకు భారీ ఆర్థిక నష్టం కలిగించిందంటూ ఆమె కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. సుమారు 50 మిలియన్ల డాలర్లు(సుమారు 350 కోట్ల రూపాయల)నష్టం వాటిల్లిందంటూ లాస్ ఏంజెల్స్ కోర్టులో దావా వేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో స్కార్లెట్ ‘నటాషా రోమనాఫ్’(బ్లాక్ విడో) క్యారెక్టర్ పోషించిన విషయం తెలిసిందే. అవెంజర్స్ ఎండ్గేమ్లో ముగిసిన ఈ పాత్రను.. ‘బ్లాక్ విడో’ సిరీస్ పేరుతో ప్రత్యేకంగా కొనసాగించాలని మార్వెల్ నిర్ణయించుకుంది. అయితే ఈ సిరీస్‌లో మొదటి సినిమా ‘బ్లాక్ విడో’ను ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని డిస్నీ సమర్థించుకుంటోంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తుండగా.. భవిష్యత్తులో మార్వెల్ సినిమాల్లో స్కార్లెట్ నటించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. సూపర్ హీరో చిత్రాల విషయంలో మార్వెల్‌కు, డీసీ(డిటెక్టివ్ కామిక్స్)కు మధ్య ఎప్పటి నుంచో పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కార్లెట్‌ను తమ వైపు లాగాలని డీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. సాధారణంగా మార్వెల్ నుంచి బయటకు వచ్చిన నటులకు డీసీ గాలం వేయడం ఎప్పటి నుంచో నడుస్తున్నదే. దర్శకుడు జేమ్స్ గన్ను ఇలాగే దొరకబుచ్చుకుంది డీసీ. ఇక ప్రస్తుతం హాలీవుడ్ ఆగ్రతార అయిన స్కార్లెట్‌తో డీల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది డిటెక్టివ్ కామిక్స్. అయితే ఏ రోల్ కోసం డీసీ సంప్రదించింది? ఏం ఆఫర్ చేసింది? అందుకు స్కార్లెట్ అంగీకరించిందా? లేదా? అనే విషయాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పట్టొచ్చు. చదవండి: హీరో నిఖిల్‌కు సజ్జనార్ సన్మానం -
స్టార్ హీరోకి పితృవియోగం
హాలీవుడ్లో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఐరన్‌మ్యాన్ హీరో రాబర్ట్‌డానీ జూనియర్ తండ్రి సీనియర్ రాబర్ట్ డానీ పార్కిన్సన్ వ్యాధితో కన్నుమూశాడు. మరోవైపు ది పేరెంట్‌హుడ్ ఫేమ్, నటి సుజ్జాన్నె డౌగ్లస్ కన్నుమూసింది. హాలీవుడ్ నటుడు, ఫిల్మ్‌మేకర్ రాబర్ట్ డానీ సీనియర్ ఇక లేడు. 85 ఏళ్ల రాబర్ట్ డానీ.. ఐదేళ్లుగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. నటుడిగా కెరీర్ ఆరంభించిన రాబర్ట్ డానీ సీనియర్.. లో బడ్జెట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన కొడుకు రాబర్ట్ డానీ జూనియర్ నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మంచి పేరు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by Robert Downey Jr. Official (@robertdowneyjr) జెర్రీ పీటర్సన్ ఇక లేరు ఇక వార్నర్ బ్రదర్స్ నిర్మించిన సిట్కామ్(సిచ్యుయేషన్ కామెడీ) సిరీస్ ది పేరెంట్ హుడ్ తో పాపులారిటీ దక్కించుకుంది నటి సుజ్జాన్నె డౌగ్లస్. బుధవారం ఆమె మృతి చెందిందని ఆమె సన్నిహితులు వెల్లడించారు. 1995 నుంచి నాలుగేళ్లపాటు ఈ టీవీ సిరీస్‌లో జెర్రీ పీటర్సన్ క్యారెక్టర్‌తో ఆమె అలరించింది. ఆమె మృతికి అధికారిక కారణం తెలియనప్పటికీ.. ఆమె క్యాన్సర్ సంబంధిత చికిత్స తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. తల్లి కాబోతున్న స్కార్లెట్ హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహెన్స్సన్.. తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె తన భర్తతో కలిసి ఆమె పంచుకుంది. కాగా, కిందటి ఏడాది లాక్డౌన్ నిబంధనల నడుమే ప్రైవేట్‌గా 36 ఏళ్ల స్కార్లెట్.. అమెరికన్ కమెడియన్ కోలిన్ జోస్ట్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్టర్‌గా పేరున్న స్కార్లెట్ జోహెన్స్సన్.. మార్వెల్ సినిమాల ద్వారా పాపులారిటీని పెంచుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘బ్లాక్ విడో’ రిలీజ్‌కు రెడీ ఉంది. -
జాన్సన్ వెడ్స్ జోస్ట్
హాలీవుడ్ అందాల తార స్కార్లెట్ జాన్సన్, ప్రముఖ కమెడియన్ కోలిన్ జోస్ట్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అతికొద్ది మంది స్నేహితుల మధ్య ప్రైవేట్ వెడ్డింగ్ చేసుకున్నారట. రెండేళ్లుగా జాన్సన్, జోస్ట్ డేటింగ్ చేసుకుంటున్నారు. జూన్ నెలలో ఓ గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుందట ఈ జంట. అయితే కోవిడ్ వల్ల ఆ ప్లాన్‌ను పక్కన పెట్టేసి ఇప్పుడు నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. -
థానోస్ అంతం ఎలా?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’. రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ నటì ంచిన ఈ చిత్రంలో క్రిస్ ఇవాన్స్, మార్క్ రఫాలో, క్రిస్ హేమ్స్‌వర్త్, స్కార్లెట్ జాన్సన్ వంటి స్టార్స్ నటించారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘అవెంజర్స్’ సిరీస్ నుంచి వస్తున్న చివరి సూపర్‌హీరో చిత్రం ఇదేన ని హాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. గత చిత్రంలో థానోస్ శక్తితో కనిపించకుండాపోయిన అవెంజర్స్ మళ్లీ తిరిగి ఎలా వచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నదే ఈ చిత్ర కథ. థానోస్ పాత్రకి తెలుగులో రానా డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఏ.ఆర్.రెహమాన్ రూపొందించిన పాట విశేష ప్రేక్షకాదరణ పొందింది. -
ట్రాన్స్‌జెండర్ పాత్ర నుంచి తప్పుకున్న హీరోయిన్
‘‘టాన్స్‌జెండర్ గ్యాంగ్‌స్టర్’’ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ‘‘రబ్ అండ్ టగ్’’ చిత్రం నుంచి హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ తప్పుకున్నారు. ట్రాన్స్‌జెండర్ ‘‘డాంటె టెక్స్ గిల్’’ పాత్రలో నటించాల్సిన ఆమె విమర్శల దృష్ట్యా వెనకడుగు వేశారు. నటి స్కార్లెట్ జాన్సన్ అవెంజర్స్ సిరీస్, బ్లాక్ విడో వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. స్కార్లెట్ జాన్సన్ మాట్లాడుతూ.. ‘‘ నా శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ట్రాన్స్‌జెండర్స్‌పై మన సమాజంలో మంచి భావన ఉంది. వారి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. వారి మీద నాకు ఎంతో గౌరవం ప్రేమ ఉన్నాయ’’ని ఆమె తెలిపింది. 1970-80ల నాటి ‘‘ట్రాన్స్‌జెండర్ గ్యాంగ్‌స్టర్ ’’ జీన్ మేరీ గిల్ అలియాస్ డాంటె టెక్స్ గిల్ మసాజ్ పార్లర్ల పేరిట వ్యభిచార గృహాలను నడిపేది. ఆమె ఓ మహిళ అయినప్పటికి పురుషుని వేషధారణతో ఉండేది. వ్యభిచారం, డ్రగ్స్ రవాణాతో పిట్స్బర్గ్ నేరసామ్రాజ్యాన్ని ఏలిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి ఏడు సంవత్సరాల పాటు జైలులో ఉంచారు. దీంతో ఆమె నేర సామ్రాజ్యం పతనమైంది. -
హాలీవుడ్ నటికి విడాకులు మంజూరు
ప్రముఖ హాలీవుడ్ నటి స్కారెట్ జోహన్ సన్ కు కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2014లో రొమైన్ డ్యూరియక్ ను స్కార్లెట్ రెండో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రోజ్ డొరథీ అనే కూతురు ఉంది. అయితే కొంత కాలం క్రితం స్కార్లెట్, రొమైన ల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే పాప బాధ్యత ఎవరికి అప్పగించాలన్న విషయం పై ఒక నిర్ణయానికి రాలేకపోవటంతో ఆరునెలలుగా విడాకుల విషయం కోర్టులోనే ఉంది. తాజాగా పాప బాధ్యత పూర్తిగా నాకే వదిలేయాలంటూ స్కార్లెట్ కోరటంతో మ్యాన్‌హట్టన్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కొద్ది రోజులుగా కొలిన్ జోస్ట్ అనే వ్యక్తితో స్కార్లెట్ సన్నిహితం ఉంటుందన్న ప్రచారం జరగుతోంది. అయితే విడాకులు మంజూరు అయిన సందర్భంగా స్పందించిన ఈ హాలీవుడ్ నటి మాత్రం ఇక నాది ఒంటరి జీవితమే అంటూ కామెంట్ చేసింది. -
హీరోయిన్ సంపాదన రూ. 22 వేల కోట్లు!
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్లో ఆల్‌టైమ్ అత్యధిక సంపాదనాపరులు జాబితాలో తన పేరు ఒక్కటే ఉండడం పట్ల హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరింత మంది హీరోయిన్లు పేర్లు ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. హాలీవుడ్లో అత్యధిక సంపాదన కలిగిన నటీమణిగా ఆమె ఘనత సాధించింది. అత్యధిక సంపాదన కలిగిన హీరోహీరోయిన్ల పేర్లతో బాక్సాఫీస్ మొజో వెబ్సైట్ ఇటీవల రూపొందించిన టాప్-10 జాబితాలో స్కార్లెట్ జాన్సన్‌కు మాత్రమే స్థానం దక్కింది. 3.3 బిలియన్ డాలర్ల సంపాదన(దాదాపు రూ. 22245 కోట్లు)తో ఆమె 10వ స్థానంలో నిలిచింది. టాప్-10లో చోటు దక్కించుకున్న మహిళ ఆమె ఒక్కరే కావడం విశేషం. దీనిపై 'ఎక్స్ ట్రా టీవీ' షోలో ఆమె స్పందించింది. 'హయ్యస్ట్ ఎర్నింగ్ నటీనటుల జాబితాలో నాకు చోటు దక్కడం ఉత్సాహకరంగానే ఉంది. ఈ లిస్ట్‌లో ఒక్క మహిళకే స్థానం దక్కడం అసంతృప్తి కలిగించింది. ఇది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింద'ని స్కార్లెట్ జాన్సన్ పేర్కొంది. మరో నటీమని కామెరాన్ డియాజ్ 19వ స్థానంలో నిలిచింది.