హాలీవుడ్ నటి స్కార్లెట్ జొహాన్సన్-డిస్నీల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కాకుండా.. ఓటీటీ(డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్)లో రిలీజ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉల్లంఘన ద్వారా డిస్నీ తనకు భారీ ఆర్థిక నష్టం కలిగించిందంటూ ఆమె కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. సుమారు 50 మిలియన్ల డాలర్లు(సుమారు 350 కోట్ల రూపాయల)నష్టం వాటిల్లిందంటూ లాస్ ఏంజెల్స్ కోర్టులో దావా వేసింది.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో స్కార్లెట్ ‘నటాషా రోమనాఫ్’(బ్లాక్ విడో) క్యారెక్టర్ పోషించిన విషయం తెలిసిందే. అవెంజర్స్ ఎండ్‌గేమ్‌లో ముగిసిన ఈ పాత్రను.. ‘బ్లాక్ విడో’ సిరీస్ పేరుతో ప్రత్యేకంగా కొనసాగించాలని మార్వెల్ నిర్ణయించుకుంది. అయితే ఈ సిరీస్‌లో మొదటి సినిమా ‘బ్లాక్ విడో’ను ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని డిస్నీ సమర్థించుకుంటోంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తుండగా.. భవిష్యత్తులో మార్వెల్ సినిమాల్లో స్కార్లెట్ నటించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. సూపర్ హీరో చిత్రాల విషయంలో మార్వెల్‌కు, డీసీ(డిటెక్టివ్ కామిక్స్)కు మధ్య ఎప్పటి నుంచో పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కార్లెట్‌ను తమ వైపు లాగాలని డీసీ ప్రయత్నాలు ప్రారంభించింది.
సాధారణంగా మార్వెల్ నుంచి బయటకు వచ్చిన నటులకు డీసీ గాలం వేయడం ఎప్పటి నుంచో నడుస్తున్నదే. దర్శకుడు జేమ్స్ గన్‌ను ఇలాగే దొరకబుచ్చుకుంది డీసీ. ఇక ప్రస్తుతం హాలీవుడ్ ఆగ్రతార అయిన స్కార్లెట్‌తో డీల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది డిటెక్టివ్ కామిక్స్. అయితే ఏ రోల్ కోసం డీసీ సంప్రదించింది? ఏం ఆఫర్ చేసింది? అందుకు స్కార్లెట్ అంగీకరించిందా? లేదా? అనే విషయాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పట్టొచ్చు.
చదవండి: హీరో నిఖిల్‌కు సజ్జనార్ సన్మానం
Comments
Please login to add a commentAdd a comment