ఓటీటీకి భారీ యాక్షన్‌ చిత్రం.. తెలుగులో ఉచితంగా స్ట్రీమింగ్! | Deadpool and Wolverine OTT Release Date Locked In India | Sakshi
Sakshi News home page

OTT release Date: ఓటీటీలో భారీ యాక్షన్‌ చిత్రం.. తెలుగులో ఉచితంగా స్ట్రీమింగ్!

Published Thu, Oct 31 2024 3:25 PM | Last Updated on Thu, Oct 31 2024 3:33 PM

Deadpool and Wolverine OTT Release Date Locked In India

హాలీవుడ్ యాక్షన్‌ చిత్రాలకు ఎక్కడైనా సరే ఫ్యాన్ క్రేజ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటి భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమానే ఇండియన్ ఫ్యాన్స్‌కు అందుబాటులోకి రానుంది. గత జూలై 26న బాక్సాఫీస్ వద్ద రిలీజైన డెడ్‌పూల్ అండ్ వాల్వరైన్ భారీగా వసూళ్లు రాబట్టింది. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కించిన ఈ సినిమా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో  ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీప్లస్, వుడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా ఇండియన్ ఫ్యాన్స్‌ కోసం ఈ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ సినిమా నవంబర్ 12 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో  స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఇండియాలో ఇంగ్లష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తన వీడియోను షేర్ చేస్తూ వెల్లడించింది. ఈ సినిమాను ఉచితంగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ  చిత్రానికి షాన్ లెవీ దర్శకత్వం వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement