ఓటీటీలో సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌.. ప్రకటన వచ్చేసింది | Kingdom of the Planet of the Apes OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌.. ప్రకటన వచ్చేసింది

Published Thu, Jul 25 2024 8:01 AM | Last Updated on Thu, Jul 25 2024 9:21 AM

Kingdom of the Planet of the Apes OTT Streaming Date Locked

హాలీవుడ్‌ స్టార్స్‌ ఓవెన్‌ టీగ్, ఫ్రెయా అల్లన్, కెవిన్‌ డురాండ్, పీటర్‌ మకాన్, విలియమ్‌ హెచ్‌. మేసీ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’. వెస్‌ బాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మే 10న థియేటర్స్‌లో విడుదల అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది.

ప్రపంచవ్యాప్తంగా  'కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' సినిమాకు మంచి ఆదరణ ఉంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. విడుదలైన రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది.  ఈ సినిమా ఆగష్టు 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌, తెలుగు,హిందీ, తమిళ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

‘ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ రీ బూట్‌ సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. ఈ సిరీస్‌ నుంచి గతంలో వచ్చిన ‘రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ (2011)’, ‘డ్వాన్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ (2014), ‘వార్‌ ఫర్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ (2017) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమా లిస్ట్‌లో  ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ ఉండటం విశేషం.

రూ. 1350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మొత్తంగా రూ. 3,300 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఐఎండీబీలో కూడా ఈ సినిమాకు 7.2 రేటింగ్ లభించడం విశేషం. ఆగష్టు 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగానే ఈ చిత్రాన్ని చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement